23, అక్టోబర్ 2008, గురువారం

भट्टू मूर्ति ,'तलंब्रालु 'वर्णन

తలంబ్రాలు >>>
..........
రామరాజ భూషణుడు అద్భుత పద్య కావ్యము "వసు చరిత్రము ".
అందలి పద్యము ఇది .
గిరిక ,వసు దేవుడు ఒండొరులపై 'తలంబ్రాలు 'పోసుకునే దృశ్యమును ,
కళ్ళకు కట్టినట్లుగా చిత్రించెను 'భట్టు మూర్తి ' బిరుదాంకితుడు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
"శుక్తిమతీ కుమారి కర శుక్తుల ముత్తెపు సేస జల్ల ,నా :::
రక్త సరోజ పాణి మయి రమ్య గుణాబ్ధియు నట్లె నించె , త :::
న్మౌక్తికముల్ వధూ కచ సమాజ కరాంబుజ కాయ కాంతి సం :::
సక్తి ననేక వర్ణ మణి జాలములై విభవంబు దెల్పగన్ . "

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
శుక్తిమతి యొక్క దోసిళ్ళు 'స్వాతి చిప్పలు వంటివి,ముత్యములను నింపి నాయకునిపై పోయు చున్నది.
వరుని కెంపు తామరల వంటి హస్తములతో తలంబ్రాలు ఆమెపైన పోసెను. ఆ ఆణి ముత్యాలు , నాయిక యొక్క జుట్టు ,శరీరము పయిన పడి జారుచూ, అనేక వర్ణ సమామ్నాయములు అగుపడ సాగెను. "
.............................................

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...