జలములలో విహంగముల విహారములు ::::::
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
1) వరాహ మిహిరుడు " నదులలో ,సరస్సులలో , దీర్ఘికలలో
'హంసాది పక్షులు సదా ఉండుట శుభ ప్రదము.' అని
నుడివెను.
2) "స్యందికా నది ' నెమలి, హంస మున్నగు పక్షులతో కళ కళ లాడుచున్నది."
అని వాల్మీకి 'శ్రీమద్రామాయణము 'నందు వర్ణించెను।
3)'పారిజాతాపహరణము 'లో ,'తామ్ర పర్ణీ నదీ ' జలములతో చెమ్మగిల్లిన
మలయ మారుతములలో పిట్టల కువ కువారావములతో నిండిన పరిసరాల వర్ణన
ఆహ్లాద భరితమైనది.
4)'స్వరోచి ప్రభువు ,తన సతులతో గూడి , సలిపిన విహారములు ,
"మసృణ బిసాహార మాంసల హంసికా :::
సంసదా సార కాసార తటుల...."
ఇది ,అల్లసాని పెద్దన 'మను చరిత్రము 'లోనిది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పద్య రత్నము :::::
~~~~~~~~~
" కను పట్టె నొక చోట ఘన ఘనా ఘన రంగ, విద్యు న్నటీ నాట్యవిలసనములు :::
చూపట్టె నొక చాయ 'వాపికా జల జాత ,జాలనా చాల హంస వ్రజంబు :::
తల చూపె నొక వంక తరళ త్సేవంతి కా గంధి నీహార కరణ భరములు :::
పొడ సూపె నొక చక్కి పుష్పిత ఫల నీలి ,వంగ వాసిత శైత్య వైభవములు :::
" నెరసె నొక యెడ 'తామ్ర పర్ణీ 'జలార్ద్ర :::
చందనా చల పవమాన కందళములు :::
మొనసె నొక కడ సామి సంఫుల్ల మల్లి :::
పాటిల చంపకోత్పల ప్రౌఢిమములు ."
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి