10, జూన్ 2017, శనివారం

ఆ దారి ఇదేనా!?

 విశ్వనాధ సత్యనారాయణ - S.R.R. కాలేజీలో లెక్చరర్ ; 
విజయవాడ, మారుతీనగర్ 3 వ వీధిలోనివసించారు. 
కొత్తగ college లో జాయిన్ ఐన విద్యార్ధి ఆ రోడ్డుకు వచ్చాడు, 
విశ్వనాధ గారి అడ్రస్ వెతుక్కుంటూ.
తనకు ఎదురైన వ్యక్తిని అడిగాడు ఆ స్టూడెంట్.
"సార్! ఇక్కడ కాలేజీలో తెలుగు మాస్టారు పని చేస్తున్నారు,
ఆయన మారుతీనగర్ 3 వ వీధిలో ఉంటున్నారుట!
ఆ మాస్టారు ఇల్లు ఎక్కడో చెబుతారా?"
 "ఇట్లాగ పైకి వెళ్ళండి." చూపుడు వేలితో ఆ గృహాన్ని చూపించి,
చకచకా నడిచి వెళ్ళిపోయడు ఆ పాదచారి.
 గేటు దగ్గర నిలబడి ఉన్నది గృహిణి, రమణమ్మ.
"ఏమండీ! ఇల్లు ఇదేనా అమ్మా!?"
"ఔను, ఇదే!"
"లెక్చరర్ సార్ ఉన్నారా? అమ్మా?"
ఆ అబ్బాయి ప్రశ్నకు - రవంత ఆశ్చర్యపడుతూ
సమాధానం చెప్పింది ఆమె
"అదేమిటి? మీకు ఆయన ఎదురు పడ్డారుగా,
ఆయనతో మీరుఏదో మాట్లాడారుగా!?"
;
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

ఆ దారి, అడ్రస్ ఇదేనా!? ] ;-
photo ;- రిక్షాలో కవి రాజు ;-

చల్లపూర్తి రామాయణం సరిపోదేమో 
ప్రశ్నకొద్దీ జవాబు,అడిగినదానికి మాత్రమే సమాధానం.

అసలే పెద్దాయన,time waste చేసుకుంటారా ఏమిటి.!

25, ఏప్రిల్ 2017, మంగళవారం

ఛాన్సు ఇవ్వకుండానే..!

పార్లమెంటు ఉభయ సభలలో వాదోపవాదాలు , 
వాడిగా- వేడిగా సాగుతూండేవి.
నియంత గా ప్రసిద్ధి కెక్కిన రష్యా దేశ నేత స్టాలిన్ .
ఆ నిరంకుశ నాయకుని కుమార్తె స్వెత్లానా ( Stalin’s daughter Svetlana ) ఆమె ఒక భారతీయుని ప్రేమించి, పెళ్ళి చేసుకున్నది. 
ఆ ప్రేమ వివాహము సహజంగానే, 
రష్యాలో స్వకుటుంబీకుల నుండి వ్యతిరేకత ఎదురైనది.
అందుచేత ఆ ప్రేమ జంటకు మన దేశములో 
"రాజకీయ ఆశ్రయము ( asylum ) లభించినది".

ఈ విషయములో వారిరువురికీ 
డాక్టర్ రామ మనోహర్ లోహియా ( Dr. Ram Manohar Lohia ) 
ఎంతో చేయూతను ఇచ్చారు.
రష్యా తో మన దేశమునకు గల రాజకీయ స్నేహము వలన 
స్వెత్లానా పరిణయమును సపోర్టు చేసే వారు, 
వ్యతిరేకించేవారు ఉండే వారు.
ఉభయ సభలలో దీనిపై వివాదాలు చెల రేగేవి.

లోహియాతో , తారకేశ్వరి వాగ్యుద్ధం చేయ సాగినది.
"పెళ్ళి పెటాకులూ తెలియని రామ మనోహరు లోహియా గారికి పరిణయము , దానికి సంబంధించిన సమస్యలు ఎలా అర్ధమౌతాయి."
ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా 
వెంఠనే లోహియా అనేసారు ఇలా,
"తారకేశ్వరీజీ! మీరేమైనా (ప్రణయము - పరిణయము)
నాకు అలాంటి ఛాన్సును ఎప్పుడూ ఇవ్వనే లేదు కదా!?!"
లోక్‌సభ యావత్తు నవ్వుల సందడే సందడి .
&
14, సెప్టెంబర్ 2009, సోమవారం

7, మార్చి 2017, మంగళవారం

గూఢ మణి క్రీడ = చుక్ చుక్ పిల్ల చూరేడు పుల్ల

మన సాహిత్య ప్రపంచం అగణిత మణి ప్రభా సంపదల గనులు.
ఆనంద సాహితీ విహారములో 
మహాకవి కాళిదాసు విరచిత శ్లోకం చూద్దామా! 
మేఘ సందేశం ;- 
మందాకిన్యాః సలిల శిశిరైః సేవ్యమానా మరుద్భిః|
మందారాణా మనుతట హరుమ్ , ఛాయయా వారితోష్ణాః| 
అన్యేష్టవ్యైః, కనకసికతా ముష్టి నిక్షేప గూడః|
సంక్రీడన్తే మణిభి రమర ప్రార్ధితా యత్ర కన్యాః||

దేవతలకు కూడా ఆరాధనీయత కలిగిన - సొగసుతో - యక్ష కన్యకలు - 
గగన గంగా తీరమున, మందార తరు ఛాయలలో
సలిల శీతలములైన పిల్ల తెమ్మెరలు వీచుచూ ఉండగా 
గూఢ మణి క్రీడను ఆడుచున్నారు. 
చుక్ చుక్ పిల్ల చూరేడు పుల్ల...... 
అంటూ ఇసుకలో పుల్లా పుడకలను దాచి పిల్లలు ఆడే ఆటయే 
ఈ కాళిదాసు కాలం నాటి గూఢ మణి క్రీడ్రీ. 
;
- & ;- ప్రాచీన కాలంలో మన హిందూ దేశం వైభవము స్థాయి 
అంతటి అత్యున్నత దశను అందుకున్నది. 
అలనాటి ప్రజలు - నవ రత్నాలను, మణులను 
ఆటలలో ఉపయోగించారన్నమాట!
& + :- [ చేతన - మంత్లీ 26 page; 2011 సెప్టెంబర్ ] ;
[ ఆనంద సాహిత్య  ] ;
;  ==============;
guuDha maNi krIDa ;-   

   mEGa samdESam ;
;
mamdaakinyaa@h salila SiSirai@h sEwyamaanaa marudbhi@h|
mamdaaraaNA manutaTa harumm , CAyayaa wAritOshNA@h| 
anyEshTawyai@h, kanakasikataa mushTi nikshEpa gUD@h|
samkreeDan tE maNibhi ramara praardhitaa yatra kanyA@h||

dEwatalaku kUDA aarAdhaneeyata kaligina - sogasutO - yaksha kanyakalu - gagana gamgaa teeramuna, mamdaara taru CAyalalO
  - salila Siitalamulaina pilla temmeralu weechuchuu umDagA guuDha maNi krIDanu ADuchunnaaru. 
;
[ chEtana - mantlee #26 page; mantlii2011 septembar - ] ; 

23, నవంబర్ 2016, బుధవారం

కిరీట ధారిణి

అవలీలగా గుర్తు కొస్తూండేవి ప్రతి ఒక్కరికీ తమ తమ తీపి బాల్య అనుభవాలు:
తర తమ భేదాలు లేకుండా  
చిన్ననాటి జ్ఞాపకముల చిరు లేఖనాలను 
మనసు పుటలలో ఏదో ఒక మారుమూలలలో అచ్చుఅయి ఉంటాయి.
ఇందుకు విపర్యాసమేమీ లేదు,
వసారాలో పడక కుర్చీలో కూర్చుని
సుహాసిని కూడా అప్పుడప్పుడూ
తన చిన్ననాటి తలపులలో ఓలలాడుతూంటుంది.
****
మహా రాజు, మహా రాణి ఆటలను ఎక్కువగా క్రియేట్ చేస్తుంది తన కోసమనే! 
వాటిలో తనేమో పట్టమహిషి, చక్రవర్తిగా సైతమూ తానే! 
తతిమ్మావాళ్ళంతా మంత్రి, సైన్యాధిపతి పరిచార సమూహ, వంది మాగధీ గణమన్న మాట! ఫిబ్రవరి, చలి ఛాయలు వీడ లేదు.
మంచు తెరలలో జగతి – మేలిముసుగు ధరించిన పడతి లాగా ఉన్నది 
“చిత్రంగా ఉన్నది ఈ యేల.” 
“కన్నె మనసులు” సినిమా పాటను హమ్ చేస్తూ రిలాక్స్ ఔతూన్నది ఆమె.
మనసు విహంగంలాగా ఆనంద సీమలలో విహారములు చేస్తూన్నది.
సుహాసిని సృజనాత్మక శక్తి మిక్కుటం!
“సినిమా రీలులాగా ఇలాగ గత స్మృతులు అలలు అలలుగా 
మేధస్సులో వర్తమానపు తీరాన్ని ఒరుసుకుంటూ రావడమనేది 
భలే అనుభవం కదూ!” సుహాసిని తనలో లో లోన నవ్వుకున్నది. 
ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇంటి పనిలో దూరింది సుహాసిని.

****

ఆరావముదుని కన్నతల్లి ప్రవీణమ్మ.
ఆరావముదుని వెంటబెట్టుకుని, 
ఆమె కట్టుబట్టలతో ఈ సీమకు వచ్చింది.
తల్లి సౌజన్యతను అతను పుణికి పుచ్చుకున్నాడు.
సుహాసిని – ఆరావముదు.
ఈ ఇరువురి గమనములూ -బ్రతుకు బాటలో 
అనేక ఒడిదుడుకులను చూసినవే!
శ్రీరామ చంద్రునికి సుగ్రీవుని మైత్రీ బంధము చందంగా 
ఆరావముదువీ, సుహాసినివీ అనుస్పందనలు ఒకటే అవడంతో 
సఖ్యమ్ సాప్తపదీనమ్ అనే ఆర్యోక్తిని 
అనతి కాలంలోనే ఋజువు చేసారు,
గృహ సామ్రాజ్యపు సింహద్వారాన 
“సుహాసినీ ఆరావముదు” నేమ్ ప్లేట్ వెలిసింది. 
సుహాసినీ దంపతులకు ఆణిముత్యాల లాంటి ముగ్గురు పిల్లలు 
ప్రదీప్, అనురాగ్, తనూజ 
పిల్లలతో, హాయిగా రోజులు గడుస్తున్నాయి.

****
సుహాసిని మామగారికి జరాభార సమస్యలు! 
పెంచిన కొడుకులు ఆస్థిని రాయించుకున్నారు.
ఆనక నాన్నను చిన్నాయనలు ఆయనను పట్టించుకోకుండా గాలికి వదిలేసారు.
సుహాసిని తల్లి అడిగింది 
“సుహాసినీ! మీ తాతయ్యని ఇక్కడికి తీసుకు వద్దాము. ”
” అమ్మా! మనం కష్టాలపాలైనప్పుడు నిర్లక్ష్యంగా వదిలేసిన వాళ్ళు 
మూడు తరాలు క్రోధాన్ని మనసులలో నిండా పేరుకున్న వాళ్ళు వాళ్ళు: 
ప్చ్! వద్దు! కుదరదు లేమ్మా! ” 
కూతురి జవాబు విని ఇక ఆ విషయాన్ని రెట్టించలేదు ఆమె.

****

కానీ” నర్సు ఉద్యోగిని “గా అలవాటైన పరోపకార భావనా ​​సంస్కారం 
సుహాసినిని నిర్లిప్తంగా ఊరకే చేతులు ముడుచుకు కూర్చోనివ్వలేదు. 
నాలుగైదు రోజులు అంతర్మధనం. ఫలితం …..
సుహాసిని తాతగారిని తమ ఊరికి తెచ్చి, 
ఆసుపత్రి సదుపాయాలను సమకూర్చింది. 
భర్త, అత్తగారూ మొదట 
“ఎందుకు, లేని పోని బాధ్యతలు లంపటాలు వద్దు” 
అని వ్యతిరేకించారు. కానీ తర్వాత
“సరే! ఎంతోమంది బాధలను మన చేతులతో నయం చేసాము, 
ఫర్వా లేదు, మీ తాతక్కూడా స్వస్థత చేకూర్చుదాము, 
తీసుకు రామ్మా! ” అంటూ అంగీకరించారు.

**** 
నర్స్ జాబ్ ను యాంత్రికంగా కాక మనస్ఫూర్తిగా చేస్తుంది సుహాసిని.
కనుకనే అందరికీ తలలో నాలుక అయి మెలగినది. 
సుహాసినికి రాష్ట్ర స్థాయిలో పురస్కార, బహుమానాలూ, 
పదవీ ఉన్నతులూ లభించినవి సుహాసిని యొక్కతాతకూ నాయనమ్మకూ -. 
అంతే కాదుఆయన కుటుంబీకులకు సైతం 
“నర్సు ఉద్యోగము” అంటే ఏహ్యభావం . 
సుహాసిని, ఆరావముదులు ఆఫీసుకు వెళ్ళాక
ఆయనకు టైమ్ పాస్ అయ్యేది కాదు.
సుహాసిని తల్లి, అత్తగార్లు గుడికి వెళ్ళినప్పుడో 
లోపల పనిలో ఉన్నప్పుడో
సుహాసిని తాత అవకాశాన్ని దొరకబుచ్చుకునేవాడు.
సుహాసిని యొక్క పిల్లలను చేరబిలిచేవాడు.
"మీ అమ్మ మిమ్మల్ని సరిగా పెంచడం లేదు.
ఫనికిమాలిన ఉద్యోగం చేస్తూన్నది.
ఉద్యోగం పేరు చెప్పి, బైట జల్సాగా షికార్లు చేస్తున్నది.
పాపం! మీరెంత చిక్కి పోయారు."
ఇలాగ తాత -. మనుమల మనసులలో చేదును పంచుతూ వచ్చాడు

****
కొద్ది కొద్దిగా చిన్నారుల అలోచనలను అల్లకల్లోలం ఔతూన్నవి
సుహాసిని కూతురు తనూజ - తన అన్నయ్య, తమ్ముని కంటె 
ఎక్కువ కలవరపడసాగింది.
“అమ్మ ఇలా ఎందుకు చేస్తూన్నది?”
ఇలాగ భావాందోళితమౌతూన్నది తనూజ.

****

ముంబై మామయ్య నుండి ఫోన్ వచ్చింది .
“సుహాసినీ! మా కుటుంబానికి నువ్వు చేసిన మేలు మరువలేనిది.
ఈ నాడు మేము, మా పిల్లలమూ జీవితాలలో నిలద్రొక్కుకోగలిగామంటే 
అంతా నీ చేతి చలువయే!
మా అనిరుద్ధ్ పెళ్ళికి సకుటుంబ సపరివార సమేతంగా వస్తావు కదూ!"
లెటర్ రాసి, శుభలేఖను పంపించారు.
ఫోన్ చేసి, సుహాసిని భర్తనూ ఇంటిల్లిపాదినీ పేరు పేరునా పిలిచారు. 

*****

మారేజ్ ఫంక్షన్ సందర్భంగా దుస్తులు సామానులను కొనడానికి 
ఆంధ్రాకు వచ్చి, సుహాసిని ఇంటికి వచ్చారు ముంబై పెళ్ళివాళ్ళు.
మనుమని పెళ్ళి పిలుపులను ఇంకా ఎవరెవరు 
పిలవాల్సిన ముఖ్యమైన వాళ్ళెవరైనా,
మనము మరిచిపోయిన వాళ్ళు ఉన్నారా -? 
అంటూ సుహాసినిని సలహా అడిగారు. 
ప్రతి పనికీ ఆమెను సంప్రదించేవారు. 
అడుగడుగునా ఆమెను సంప్రదించేవారు. 
సుహాసిని లోకానుభవమూ, కార్య నైపుణ్యాలూ – 
ప్రతి ఒక్కరికీ ఉపయోగమయ్యేవి 
అవే సమయాలలో ముంబై మామయ్య మనుమలూ, మనుమరాళ్ళూ
ఉన్నత్, ఉత్పల్ అనిరుధ్ లు కలుపుగోలు, 
చలాకీ పిల్లలు సుహాసిని కుమారులు, 
ముఖ్యంగా తనూజకూ సన్నిహితులైనారు..
వారందరి అనుభవాలూ తనివి తీరా 
అచ్చ తెలుగు భాషలో – వీరితో పంచుకున్నారు.
అందులో ఎక్కువగా దొర్లినవి 
‘సుహాసిని ఔన్నత్యాన్ని గురించే!’ 

తనూజకు నిమ్మళంగా తెలిసివచ్చింది –
‘తాను తాత మాటలలను నమ్మి,
తన కన్న తల్లినే కించపరుస్తున్నాను అనిఅర్ధం చేసుకుంది.

“ఇంకా నయం! అమ్మను తూస్కరించే ప్రలోభానికి గురి అయి , 
దూషించలేదు. తొందరపాటుతో అమ్మను నిందించి ఉంటే, 
ఆమెకే కాదు తండ్రికీ, నానమ్మకూ, 
అందరికీ మానసికంగా దూరమయ్యేది.
ఇంకా నయం!
భగవంతుడు తాను త్వరపడే అక్కర రానీకుండా 
ఈ ముంబై తాత గారి ఫ్యామిలీ రూపంలో 
సురక్షిత తీరాన ఆసీన అయ్యేటట్లు చేసాడు” 
కుమార్తె మనసులో కొద్దిరోజులుగా జరిగిన సంఘర్షణను 
సుహాసిని గమనించ లేదు.
ఆమె మొలకెతిన ధాన్యం గింజలను బౌల్ లో వేసి ఇచ్చింది 
“తనూజా! తాతగారు వరండాలో కూర్చుని ఉన్నారు, ఇవ్వు! ”

 సుహాసిని గుర్తించని తనూజలోని పెను సంచలన మార్పుల్ని 
స్పష్టంగా గమనించిన మనిషి ఒక్కడున్నాడు,
అతడే సుహాసిని మామగారు, అండ్ తాతగారు! 
మరి తనూజ రోజూ మాదిరిగా ఆప్యాయతతో 
చేతికి ప్లేటును ఇవ్వకుండా ,
మంచం పట్టె మీద కొసన పెట్టేసి, 
గిరుక్కున వెనుదిరిగింది కదా మరి!!!!!!!!!!

సడన్ గా ఫోన్, హాస్పిటల్ నుంచి భర్త, లైనులో ఉన్నాడు. ఆరావముదు 
“సుహాసినికి ఫోన్ ఇవ్వండి” ఫోన్ ఎత్తిన తల్లికి చెప్పాడు.
భర్త హాస్పిటల్ నుండి చేసాడు,
“గుండె ఆపరేషన్ జరుగుతూన్నది, అర్జంట్ గా నువ్వు రావాలి! 
“తన బిబ్, ఏప్రాన్, కాలర్ కఫ్స్ డ్రస్సునూ ధరించింది
ఆదరా బాదరాగా, హడావుడిగా డ్రెస్సు వేసుకుంటూన్న 
తల్లి దగ్గరకు వెళ్ళింది తనూజ
” అమ్మా! ఈ తెల్ల కిరీటాన్ని (cap) మరిచిపోతున్నావు!"
అంటూ చేతికి ఇవ్వబోయి తానే ఆమె కొప్పులో పువ్వులాగా 
సున్నితంగా సుకుమారంగా అమర్చి,
తల్లి బుగ్గపైన గట్టిగా ముద్దు పెట్టుకున్నది తనూజ. 
కుమార్తె కళ్ళలోని ఒక వింత మెరుపుని చూసి 
సుహాసిని కించిత్ సంభ్రమాశ్చర్యాలకు లోనౌతూ,
బయల్దేరుతూ అనురాగంతో చేయి ఊపింది.
“అమ్మా! ఈ కిరీటం చాలా బాగుంది.” 
కుమార్తె పసిడి పలుకులు అవి.
నాన్నమ్మ, అమ్మమ్మ తనూజ మాటలు వింటూ 
ఆమె చుబుకాన్ని ప్రేమతో పుణికారు.

– కాదంబరి

కీరిట ధారిణి / కిరీట ధారిణి ;- 
 01/03/2013  విహంగ మహిళా పత్రిక

18, నవంబర్ 2016, శుక్రవారం

గురుమణి - Mani Madhava Chakyar

గురుమణి - అని ప్రజల ప్రశంసాత్మక బిరుదు, 
అతను "మాధవ చక్యర్ [ 1899 - 1990]; 
రసాభినయం లో 'సాత్వికాభినయం ' లో 
సర్వ కాలములకూ అగ్రపీఠం మాధ చక్యర్ దే! - అని 
నాట్య, కళా వేదులు వక్కాణించారు.
నేత్రాభినయం - నకు జనాకర్షణ కలిగించిన ఘనత ఆయనదే!
1] గురుమణి - అని ప్రజల ప్రశంసాత్మక బిరుదు, 
అతను "మాధవ చక్యర్ [ 1899 - 1990]; కే
రళలో ప్రాచీన సంస్కృత రంగ సాంప్రదాయాన్ని, 
వెలికి తీసి, ప్రాచుర్యానికి తెచ్చాడు. 
చాక్యర్ కూత్తు, కూడియాట్టం - కేరళ నాట్యకళామ తల్లికి 
ఆయన అందించిన అమూల్య అలంకారములు. 
Chakyar Koothu and Koodiyattam 
          (ancient Sanskrit drama theatre tradition) 
నాట్య శాస్త్రమ్ ను ఆమూలాగ్రం ఔపోసన పట్టిన వ్యక్తి మాధవ చాక్యార్. 
ఆయన ఏర్పరచిన నిబంధనలను నేడు పాటిస్తున్నారు.  

కథకళి, కూడియాట్టం మున్నగు  
ఇతర నృత్య సంప్రదాయ కళాకారులు సైతం - 
ఈ నిబంధనలను అనుసరిస్తున్నారు.
కోవెల ముందు ఆవరణలో  కేరళ డాన్స్ శిక్షణ పొందేవారు కూడా 
మాధవర్ నియమావళిని తు చ తప్పకుండా అనుసరిస్తూ ఉన్నారు. 
చక్యర్ రచించిన "నాట్య కల్ప ద్రుమమ్" 
నర్తనశాల లకు అనుసరణీయ విజ్ఞాన సర్వస్వము. 
కనుకనే 'నాట్యాచార్య", "విదూషక రత్నం", "పద్మశ్రీ", 
"సంగీత నాటక అకాడమీ అవార్డు", అనేక బిరుదులు వరించినవి. 
సంస్కృత చంపూ కావ్యాలను అనుసరించి, మాధవ చాక్యర్ - 
రూపొందించిన అభినయ నర్తనం "చాక్యర్ కూత్తు". 
అరంగేట్రం - అనగా రంగ స్థలం పైన ఇచ్చు తొలి ప్రదర్శన. 
మాధవ 14 వ ఏట అరంగేట్టం ను ఉత్తర కొట్టాయం జిల్లాలోని 
త్రిక్కైకున్ను కోవెల వద్ద చేసాడు .
మణి వర్గమునకు చెందిన వ్యక్తి Guru Mani Madhava Chakyar.
కేరళలో ప్రాచీన సంస్కృత రంగ సంప్రాదాయాన్ని, వెలికి తీసి, 
ప్రాచుర్యానికి తెచ్చాడు Guru  Madhava Chakyar . 
చాక్యర్ కూత్తు, కూడియాట్టం - కేరళ నాట్యకళామ తల్లికి 
ఆయన అందించిన అమూల్య అలంకారములు.
;
Guru Mani Madhava Chakyar (15 February 1899 – 14 January 1990)
# rasaabhinayam lO 'saatwikaabhinayam ' lO 
sarwa kaalamulakuu agrapiiTham maadha 
చక్యర్ dE! - ani nATya, kaLA wEdulu wakkaaNimchaaru.
nEtraabhinayam - naku janaakarshaNa 
kaligimchina ghanata aayanadE!
1] gurumaNi - ani prajala praSamsaatmaka birudu, atanu 
"maadhawa chakyar [ 1899 
- 1990]; kEraLalO praacheena samskRta ramga saampraadaayaanni, 
weliki teesi, praachuryaaniki techchADu. 
chaakyar kUttu, kuuDiyaaTTam - kEraLa nATyakaLAma 
talliki aayana amdimchina amuulya alamkaaramulu. 
#Chakyar Koothu and Koodiyattam 
(ancient Sanskrit drama theatre tradition) #
naaTya SAstramm nu aamuulaagram 
aupOsana paTTina wyakti maadhawa chaakyaar. 
aayana Erparachina nibamdhanalanu nEDu pATistunnAru.  
kathakaLi, kUDiyATTam 
munnagu  itara nRtya sampradaaya kaLAkaarulu saitam - 
ii nibamdhanalanu 
anusaristunnaaru.
kOwela mumdu aawaraNalO  
kEraLa DAns SikshaNa pomdEwaaru kUDA maadhawar 
niyamaawaLini tu cha tappakumDA anusaristuu unnaaru. 
/ rachimchina "nATya kalpa drumamm" 
nartanaSAla laku anusaraNIya wij~naana 
sarwaswamu. kanukanE 'nATyAchArya", 
"widUshaka ratnam", "padmaSrI", "samgIta 
nATaka akADamI awArDu", anEka birudulu warimchinawi. 
samskRta champuu kaawyaalanu anusarimchi, 
maadhawa chaakyar - ruupomdimchina abhinaya nartanam "chaakyar kUttu". 
aramgETram - anagaa ramga sthalam paina ichchu toli pradarSana. 
maadhawa 14 wa ETa armgETTam nu 
uttara koTTAyam jillaalOni trikkai kunnu kOwela wadda 
chEsaaDu .maNi wargamunaku chemdina wyakti Madhawa chakkiyar.
;;

18, అక్టోబర్ 2016, మంగళవారం

శ్రీవిద్య as అంబ

మలయాళము నుండి తెలుగునకు వచ్చిన film        "అంబ అంబిక అంబాలిక " 
డబ్బింగ్ సినిమాను చూసాను. 
అక్కాచెల్లెళ్ళు, వారి మధ్య సంఘటనల వెల్లువ - 

అంతస్సూత్రంగా తీసిన పిక్చర్ 
అంబ అంబిక అంబాలిక . నాటక, టెలివిజన్, చలనచిత్ర దర్శకులు - మహాభారతములోని 
("జయం" - అసలు పేరు) ప్రతి అంశాన్నీ, ఒక్కొక్క పాత్ర యొక్క దృక్కోణంలో తీశారు, తీస్తూవస్తున్నారు, ఇంకా అనేక తెర రూపములను నిర్మిస్తూనే ఉన్నారు.
********************************, 
శ్రీవిద్య సోయగాలు :- అంబ అంబిక అంబాలిక - లో అంబ పాత్రను పోషించినది శ్రీవిద్య . పదహారేళ్ళ వయసు లో అంబగా శ్రీవిద్యవిశాలనయనాలు, హావభావాలు, చూపరులను ఆకట్టుకున్నవి. 
సినిమా మువ్వురు సోదరీమణుల నాట్యంతో ప్రారంభంఔతుంది. 
;
నాట్య గీతం :-
;
తలపులు తెలిపేటి ; 
వలపులు కలిసేటి ; 
పరవశం మెరిసేటి ఉద్యానం ||
;
ప్రాయముతో నేను ; 
పరవశ సంగీతం ; 
మనసులు కొసిరేను ; 
ప్రియస్నేహం ||
;
ఎవరో వరుడని - విరహములో ; 
మానసవీణలు మ్రోగెనులే! ||
;
వయసులు మనసార ; 
మనలను పిలిచేను ; 
స్వయంవర 
      శుభసమయమాసన్నము ;
ఒకరికి ముగురము ; 
మన మిలలో ; 
వీడని బంధము ; 
అతి మధురం ||
;
********************************, 
ఈ పాటచిత్రీకరణ బాగున్నది.
Indian Video Guru  [ link ]
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦
- by -[ సుమదళాలు ]
Amba Ambika Ambalika Telugu Full Movie | Srividya | P Subramaniam | 
Indian Video Guru  ; 

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! 
ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి!
రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ;  ||
శ్రీ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి 
శ్రీ లలితేశ్వరి శివకామ సుందరి పాలయమాం! 
సరోజ నేత్రీ! శ్రీ కల్పవల్లీ!  ఓమ్ కార రూపిణి! 
జగదేకమాతా! పాలయమాం! ;   ||  
;
కంచి కామాక్షి కదంబ వన వాసిని ; 
కాషాయాంబర ధారిణి పాలయమాం! ;
వీణాపాణి! విమల రూపిణీ! 
వేదాంత రూపిణి పాలయమాం! ;   ||  
;
మణి మయ ధారిణి మాధవ సోదరి 
సింహ వాహిని దేవి దుర్గా పాలయమాం! ; 
శ్రీ చక్ర వాసిని! త్రిపురసుందరీ! 
శ్రీ లలితేశ్వరి! పాలయమాం! ;   || 
;
 శ్రీ జగదేకమాతా! జగన్నాయకీ! 
జగద్రక్షణీ! కరుణ హాసినీ!
కామిత వర ప్రదాయిని!
విశ్వ జననీ! కృపానుగ్రహ వర్షిణీ! 
పాలయమాం!  పాలయమాం!  పాలయమాం! ;   || 
;
===========================;
;
amba paramESwari akhilaamDESwari! 
aadi parASakti paalayamaam! tribhuwanESwari 
raajarAjESwari aanmdarUpiNi paalayamaam! ;  || 
;
sarOja nEtrI! SrI kalpawallii!  
Omm kaara rUpiNi!jagadEkamaatA! 
Sree jagadeeSwari annapuurNESwari chAmumDESwari 
SrI lalitESwari SiwakAma sumdari paalayamaam! ;   || 
;
kamchi kaamaakshi kadamba wana waasini ; 
kaashaayaambara dhaariNi paalayamaam! ;
weeNApANi! wimala rUpiNI! 
wEdaamta rUpiNi paalayamaam! ;   ||   
;
maNi maya dhAriNi mAdhawa sOdari 
sim ha waahini dEwi durgA paalayamaam! ; 
SrI chakra wAsini! tripurasumdarI! 
SrI lalitESwari! paalayamaam! ;   || 
;
శ్రీ జగదేకమాతా! jagannaayakI! 
jagadrakshaNI! karuNa haasinI!
kaamita wara pradaayini!
wiSwa jananI! kRpAnugraha warshiNI!  

6, అక్టోబర్ 2016, గురువారం

అనులోమ-విలోమ పద్యాలు

మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటునుండి చూసినా ఒకేలా ఉండే అనులోమ, విలోమ, పద్య భ్రమకం, పాదభ్రమకం, ఇలా ఎన్నో ఎన్నెన్నో…..

బమ్మెర పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షం కథలో 
వృత్యనుప్రాసాలంకారం (ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తి అవడం) ఉపయోగించి 
సర్వలఘు కందం ;- రాసి మనలనలరించాడు.

అడిగెద నని కడువడి జను
నడిగిన దను మగడు నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ !!
;
] ఇంకో వింత చూద్దామా! ఒకే హల్లుతో వాక్యాలు, పద్యాలు ఎలా రాసారో చూద్దాం. 
‘క’ గుణింతంతో.. 
“కాకీక కాకికి కోక కాక కేకికా?”- 
కాకి ఈక – కాకికి – కోక కాక – కేకికా (నెమలికా)?”
 అని దీనర్ధం. 
;
అలాగే న గుణింతంతో ఓ పద్యం:
;
నానా నన నా నున్న న
నూనను నిన్ననెను నేను నున్ను ని నిననై
నానీ నను నానా నను
నానూన యనంగ నొంటి యక్షరమయ్యెన్!!
;
అని లక్షణకారుడు చెబితే మరో 'తుంటరి నూనె' అనే 
ఒక్క మాటతో గిలిగింతలు పెట్టాడు . 
ఇలా…”నా నూనె నీ నూనా? 
నీ నూనె నా నూనా? 
నా నూనె నీ నూనని నేనన్నానా”
;
మరి శ్రీశ్రీగారు ఊరకుంటారా. 
మ,న,స ;- అనే మూడక్షరాలతోనే 
"త్యక్షర కందం" రసవత్తరంగా అందించారు.
;
] అజ్ఞాత కవిగారు సప్తస్వరాలతో కంద పద్యాన్ని చెప్పి 
రసజ్ఞుల నలరించారు.

మా పని నీ పని గాదా
పాపను మా పాప గారి పని నీ పనిగా
నీ పని దాపని పని గద
పాపని పని మాని దాని పని గానిమ్మా!!
;
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
;
అనులోమ-విలోమ పద్యాలు ;- 
;
పద్యాలు మొదటినుండి చివరకు చదివితే ఒక అర్థం. 
చివరనుండి మొదటి వరకు చదివితే ఇంకో అర్థం వస్తుంది.

దామోదర సామ తనధ
రామా సరసాకర దశరధ హరి రాధా
కామా సదయాతి పరమ
ధామా వర యాదవకుల దారక రాసా!!
;
దామోదర సామ తనధ
రామా సరసాకర దశరధ హరి రాధా
కామా సదయాతి పరమ
ధామా వర యాదవకుల దారక రాసా!!

ఇప్పుడు క్రింది విధంగా చదివితే ఇంకో అర్థం వస్తుంది.

సారాకర దాల కువద
యారవ మాధామ రపతి యాదస మాకా
ధారా రిహ ధర శదరక
సారస మారా ధన తమసారద మోదా!!

పాద భ్రమకంలో ప్రతి పాదాన్ని 
మొదటి నుండి చివరకు, 
చివరి నుండి మొదటికి చదివితే 
ఒకేలా ఉంటాయి. ఇది చూడండి.
;
ధీర శయనీయ శరధీ
మార విభాను మత మమత మను భావి రమా
సారస వన నవ సరసా
దారద సమతార తార తామస దరదా!!
;
ఇక పద్య భ్రమకంలో ఐతే మొత్తం పద్యాన్ని 
ఎటునుండి చదివినా ఒకేలా ఉంటుంది. చూడండి. 
(ఈ ప్రక్రియను ఇంగ్లీషులో ఫలింద్రొమె అంటారు)

రాధా నాధా తరళిత
సాధక రధ తా వరసుత సరస నిధానా
నాధాని సరసత సురవ
తాధర కధ సా తళిరత ధానా ధారా!!

పింగళి వెంకట కృష్ణారావు కవిగారు ఒక సభలో 
తెనాలి రామకృష్ణుడికి వికట కవిత్వమెలా అబ్బిందో 
"క - భాష" లో ఇలా చమత్కారంగా చెప్పారు.
;
తే.గీ. కవి కక కట కక కవి కగ కన కను క
దీ కవ కన కలి కడి కకా కళి కక
కజ కన కని కవో కలె కక కని కక
కర కము కన కజూ కచి కన కపు కడె!!
;
ఈ పద్యంలో క లు తీసివేసి చదివితే ;-
" వికట కవిగ నను దీవన లిడి 
కాళిక జనని వోలె కనికరమున జూచి నపుడె ” 
అనే వాక్యం వస్తుంది.
;
ఇలా ఎందరో కవులు అక్షరాలతో పద్యాలాటలు ఎన్నో ఆడారు. 
కాని కొందరు ఇటువంటివి కవులు చేసే గారడీలని, కసరత్తులని, సర్కసులని ఎద్దేవా చేసారు. 
అసమర్థులకి అల్లరి, విమర్శలు చేయడం ఎక్కువే కదా. 
కాబట్టి వారిని పట్టించుకోకపోవడం బుద్ధిమంతుల లక్షణం.

అల్లంరాజు రంగశాయిగారు ;- 
"మ - గుణింతం" తో ఓ అందమైన కంద పద్యాన్ని అందించారు.
;
మామా మోమౌ మామా
మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా
మే మోమ్మము మి మై మే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!
;
ఈ పద్యానికి అర్థం చూద్దామా.
;
మా = చంద్రుని
మా = శోభ
మోమౌ = ముఖము గల
మామా = మా యొక్క
మా = మేథ
మిమ్ము, ఒమ్ము = అనుకూలించును
మామ మామా = మామకు మామా
ఆము = గర్వమును
ఏమి+ఒమ్మము = ఏమి ఒప్పుకోము
మిమై = మీ శరీరము
మేము ఏమే = మేము మేమే
మమ్ము,ఓముము+ఓముము =కాపాడుము, కాపాడుము
ఇమ్ము+ఔము = అనుకూలమగుమా
;
చంద్రుని వంటి ముఖముగల దేవా! 
మా బుద్ధి మీకు అనుకూలించును. 
గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము. 
సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. 
ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు. 
కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.;
;
శ్రీకృష్ణదేవరాయల భువన విజయ సాహిత్య సభ లోని 
తెనాలి రామలింగడు /తెనాలి రామకృష్ణుడు  ;-
రాయలవారి కీర్తిని వర్ణిస్తూ అక్షర సౌందర్యంతో గంభీరంగా చెప్పిన ఈ పద్యం.
;
నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిద్గిరిభి
త్కరి కరిభిద్గిరి గిరిభి
త్కరిభిద్గిరి భిత్తు రంగ కమనీయంబై!!
;
నరసింహరాయల కుమారుడైన శ్రీకృష్ణదేవరాయల కీర్తి – 
కరిభిత్ = గజాసుర సంహారియైన శివునిలా, 
గిరిభిత్కరి = ఇంద్రుని ఏనుగైన ఐరావతంలా, 
కరిభిద్గిరి =కైలాసంలా, గిరిభిత్ = వజ్రాయుధంలా, 
కరిభిద్గిరిభిత్తురంగ = శివేంద్రుల వాహనాలైన 
       నంది, ఉచ్చైశ్రవం (తెల్ల గుర్రం) లలా అందంగా తెల్లగా ఉందని భావం. 
;
షడ్జ మడ్జ ఖరాడ్జ వీడ్జ వసుధాడ్జ లాంశ్చ మడ్ఖాఖరే
జడ్జ ట్కి ట్కి ధరాడ్జ రేడ్ఘన ఘనః ఖడ్జోత వీడ్య భ్రమా
వీడ్యాలుడ్ భ్రమ లుట్ప్ర యట్ట్రి యపదా డడ్గ్రడ్గ్ర డడ్గ్రడ్గ్రహా
పాదౌటే త్ప్రట తట్ప్రట ట్ప్రట రసత్ప్రఖ్యాత సఖ్యోదయః !!
;
********************************************************;
;
-వలబోజు జ్యోతి గారి వ్యాసం ఇది . 
వలబోజు జ్యోతి , poddu , essay ;  LINK 
;
అనులోమ-విలోమ పద్యాలు ;- 

2, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ఆస్వాల్డ్ జెన్నింగ్స్ కూల్డ్రే - Thames and Godaveri

చిత్రకళ ;-  రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజిలో ఆస్వాల్డ్ కూల్డ్రే అనే ఆంగ్లేయుడు 
ప్రిన్సిపాలుగా ఉండేవాడు. ... 
ఆస్వాల్డ్ కూల్డ్రే (ఆంగ్లం: Oswald Couldrey) (1882-1958) 
ఆధునిక ఆంధ్ర చిత్రకారులకు ఆదిగురువు

&&&&&&&&&&&&&&&&&

ఆస్వాల్డ్ కూల్డ్రే (ఆంగ్లం: Oswald Couldrey) (1882-1958) '-

ఆధునిక ఆంధ్ర చిత్రకారులకు ఆదిగురువు. 
ఆధునిక చిత్రకళా ఉద్యమాన్ని ఆరంభించినవాడు, 
ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కు దేశంలో ఒక విశిష్ట స్థానాన్ని సాధించిన 
తొలి చిత్రకారుడు దామెర్ల రామారావు అయితే, 
దామెర్ల రామారావు teacher - Oswald Jenning Couldrey.
ఆయనకు, దామెర్ల రామారావును అనుసరించిన తొలితరం చిత్రకారులకు 
గురువు ఆస్వాల్డ్ జెన్నింగ్ కూల్డ్రే.

జీవితం ;-

1882 సెప్టెంబరు,17 వ తేదీన ఇంగ్లండులో ఆక్స్‌ఫర్డ్ సమీపాన గల అబింగ్టన్ లో జన్మించిన కూల్డ్రే , 1909 లో రాజమండ్రికి వచ్చి, 
అప్పుడే ప్రారంభించిన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 
ప్రిన్సిపల్ గా పదవీబాధ్యతలు చేపట్టాడు. 
జీవితమంతా అవివాహితుడుగానే వుండి, 1958 జూలై, 24 వ తేదీన దివంగతుడైనాడు. 
రాజమండ్రిలో నివసించిన తొమ్మిదేళ్ళ కాలంలో
కూల్డ్రే ఆంధ్రదేశానికి చేసిన సేవ మరువరానిది. 
కూల్డ్రేతో పరిచయమయ్యే నాటికి, 
దామెర్ల రామారావు వయస్సు పధ్నాలుగేళ్ళు. 
ఆ బాలునిలోని చిత్రకళా ప్రతిభను, పిపాసను గుర్తించి, 
అతడికి ప్రేరణ యిచ్చి, ప్రోత్సాహం అందించి, 
ఒక ఉత్తమ పరిణత చిత్రకారునిగా తీర్చిదిద్దాడు కూల్డ్రే. 
;
పాశ్చాత్య చిత్రకళా ప్రభావంతో భారతదేశంలో సంప్రదాయక చిత్రకళ శైలులు మరుగున పడిపోతున్న సమయంలో, 
1920 దశాబ్దంలో భారతీయ చిత్రకళ పునరుద్ధరణకు ఉద్యమాలు బయలు దేరాయి. అవనీంద్రనాథ్ ఠాగోర్, నందలాల్ బోస్ వంటి 
బెంగాలీ చిత్రకారులు బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ను స్థాపించగా, 
ట్రినడే, శారదా వకీల్, ధురంధర్, చుగతాయ్ వంటి బొంబాయి చిత్రకారులు 
బాంబే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ను నెలకొల్పారు. 
కూల్డ్రే నాటిన జాతీయతా భావబీజాలతో దామెర్ల రామారావు, 
ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ స్థాపించాడు. 
కూల్డ్రే కేవలం విద్యాధికారే కాక, గొప్ప చిత్రకారుడు. 
అంతకు మించి గొప్ప సంస్కార హృదయుడు. 
భారతదేశంలో ఉన్నంత కాలం ఆయన జాతీయ జీవనవిధానంతో మమేకం చెందాడు. ఇంగ్లండు తిరిగి వెళ్ళాక రచించిన
సౌత్ ఇండియన్ అవర్స్ (దక్షిణభారత స్మృతులు) లో 
తనకు భారతదేశంలో గడిపిన కాలమంతా, 
మధురస్మృతిగా మిగిలిపోయిందని పేర్కొన్నాడు. 
కూల్డ్రే చిత్రాలు ఎంతో పొందికగా, జీవం ఉట్టిపడుతూ, 
ఫోటోగ్రాఫిక్ ప్రెసిషన్ తో ఉంటాయి. పల్లె జీవితపు అందాలను తన రచనలలోనే కాక, చిత్రాలలో కూడా అందంగా చూపించాడు. 
కుప్పనూర్పిళ్ళు,మోటబావి నుండి నీళ్ళు తోడడం, 
చెట్టు కింద పశువులు విశ్రమించడం, 
గోదావరి గట్టు, దేవాలయాలు, వాటి పరిసరాలు - 
యివన్నీ అతనికి ప్రియమైన దృశ్యాలు. 
;
అతడు ఒక్క దామెర్ల రామారావుకే కాదు, 
వరదా వెంకటరత్నం, అడవి బాపిరాజు, కవికొండల వెంకటరావు, 
దామెర్ల వెంకటరావు వంటి పలువురికి మార్గదర్శకుడైనాడు. 
అతని ప్రేరణతోనే అడవి బాపిరాజు అజంతా చిత్రాలను, 
అమరావతి శిల్పాలను అధ్యయనం చేసి, 
తన కళకు మెరుగులు దిద్దుకున్నాడు. 
ఆదివారాలలో సెలవు దినాల్లో కూల్డ్రే సాహిత్య, చిత్రకళాభిమానులను 
తన బంగళాకు ఆహ్వానించి, అనేక విషయాలపై చర్చలు జరిపిస్తూ వుండేవాడు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో అప్పుడు జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్న
సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఆ చర్చల్లో పాల్గొనేవాడు. 
కూల్డ్రే తన పుస్తకంలో ఆంధ్రదేశంలోని తోలుబొమ్మలాటను ఎంతగానో మెచ్చుకొన్నాడు. అది ఎంతో సృజనాత్మకమైన కళా ప్రక్రియ అని అతడు పేర్కొన్నాడు. 
ఆంధ్ర చిత్రకళారంగ పునరుజ్జీవనానికి 
ఎంతో దోహదం చేసిన కూల్డ్రేకు ఆంధ్రులు ఎంతో ఋణపడి ఉంటారు.

నీటి వర్ణ చిత్రాలు:-

ఇతడు సృష్టించిన కొన్ని నీటి వర్ణ చిత్రాలు :

The Mistaken Fury (1914)
Thames and Godaveri (1920)
South Indian Hours (1924)
Triolets and Epigrams (1948?)
The Phantom Waterfall (1949)
Sonnets of East and West (1951)
Verses over Fifty Years (1958).
;
**********************************,
;
1]  Thames and Godaveri (1920) ;- LINK ; te.wikipedia.org/wiki
;
-   [ by ;- కోణమానిని ]  ;-  11:39 AM 7/4/2016; fb ;- మన గ్రూపు fb

20, ఆగస్టు 2016, శనివారం

ధార్ పుర ఆకారం - నాటి ఓరుగల్లు plan

ఆంధ్ర వాస్తు శిల్పులను అనుసరించిన ప్రభువులు, 
ఉత్తరభారతదేశములో చేసిన కట్టడములు ఉన్నవి, తెలుసునా!!!!? 
మధ్యప్రదేశ్ లోని ధార్ ప్రాంతం పారమార్ రాజుల పాలనలో 
చారిత్రక ప్రసిద్ధి   గాంచినది.
ప్రాచీన ధార్ [धार ] ఉపరితలమును గమనించి, 
తదనుసారంగా - రాజ్యపాలకులు నగరనిర్మాణానికి పూనుకున్నారు.
భూమిలో చీలికలు, పల్లపుప్రాంతాలను గుర్తించి 
అనుసరించిన ప్రభువులు, పుర రూపురేఖలను తీర్చిదిద్దారు.
నీటి నిల్వలను ఉంచగల ప్రదేశాలను ఎంచుకున్నారు. 
ఆ మీదట ఏలికలు - పశ్చిమ, దక్షిణ దిశలకు నగర విస్తరణను నిర్దేశించారు.
19వ శతాబ్ద ఆరంభమున ఈ చారిత్రక సంఘటన జరిగినది.
# [ series of tanks and moats. #] 
ప్రజాసంక్షేమానికై, నిత్యావసర సామగ్రి, 
అందులో 'నీరు ' యొక్క ప్రాముఖ్యతను గమనించిన - 
పారమారుల దూరదృష్టికి నిదర్శనం 
ధార్ చక్రవర్తులు కోటను, ప్రహరీగోడలు, కందకములను నిర్మించారు.
దుర్గ నిర్మాణాలను పటిష్ఠంగా నిర్మించారు.
సరే! ఇంతకీ మనం ప్రత్యేకంగా గమనించదగిన అంశం 
ఇక్కడ ఒకటి ఉన్నది.
పారమార చక్రవర్తులు దుర్గ నిర్మాణాలకై ఒక శైలిని అనుసరించారు.
అది ఏమిటంటే - 
దక్కన్ ప్రాంతమునందు నెలకొని ఉన్న 
"ఓరుగల్లు పుర" నిర్మాణతా రీతులను నమూనాగా స్వీకరించారు.
ధార్ పుర ఆకారం - నాటి ఓరుగల్లు [= వరంగల్ టౌన్] పద్ధతిని పోలి ఉండడం, 
దక్షిణాది శిల్పుల ప్రతిభా నైపుణ్యతలకు లభించిన గుర్తు కదా!

@@@@@@@@@

15, జులై 2016, శుక్రవారం

सुर संगम - శంకరాభరణం

शिशुर्वेत्ति पशुर्वेत्ति वेत्ति गानरसं फणिः|| 
కనుకనే ఇటు తెలుగు "శంకరాభరణం", 
అటు హిందీ " "सुर संगम" " (1986) - 
'సంప్రదాయసంగీత సుధా కలశములను' ప్రజలకు అందించినవి. 
శ్రీమద్ రామాయణము తమిళములో రచించిన కవి Kambar. 
"కంబన్ ఇంటిలోని తిరగలి, రోకలి కూడా - 
శ్రీమద్రామాయణమును గానం చేస్తాయి." 
అని తమిళ నానుడి. 
"శంకరాభరణము" సినిమాలో 
'సోమయాజి ఇంటిలోని మెట్లు, 
ద్వారబంధములనుండి కూడా - 
సరిగమ పదనిస ఆలాపనలు వినిపిస్తూ ఉన్నవని 
అద్భుత చిత్రీకరణ , ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకున్నది.
శంకరశాస్త్రి పాత్రలో సోమయాజులు ని తప్ప వేరెవరినీ ఊహించలేము.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&

"सुर संगम"- "శంకరాభరణము" :- 
సుర్ సంగం - హిందీలో తీసిన సినిమా. గిరీష్ కర్నాడ్, జయప్రద నటించారు. 
"శారదా!" అంటూ సోమయాజి చేసిన గర్జన పుణ్యమా అని, 
ఆ పాత్ర పేరు శారద , - అని అందరికీ గుర్తు ఉండిపోతుంది. 
'సామజ వరగమనా! ..... " అను కీర్తన ; 
అందరికీ వెండితెర పై బంగారు సంగీత చిత్రణలు ఐ, గుర్తు ఉన్నవి.
ఏరియల్ శాస్త్రి, కూతుకొళ్రి, అని స్వాగతం పలికే అల్లురామలింగయ్య, 
[ వచ్చిన పార్టీ - 'మా నాన్నకు ఇద్దరు భార్యలు ........ ' 
అంటూ కంఫ్యూజన్ ఐ, పారిపోయేఆ చేసిన ఘట్టం, 
ప్రేక్షకులకు నవ్వులను పంచిపెట్టింది.] 
మంజుభార్గవి, 
నీళ్ళలో నిలబడి, సంగీత సాధన చేయాల్సి వచ్చిన చిన్నారి రాజ్యలక్ష్మి - 
'రిషభం, వృషభం, చంద్రమోహన్, 
మరచెంబు ఇంపార్టెన్సును పదే పదే చెబ్తూండే నిర్మలమ్మ ..................
ఇట్లాగ , అన్ని పాత్రలు, 
సంగీతకచేరీలో ఝాన్సీ, స్నేహితుడు కచేరీని నిర్లక్ష్యపరుస్తూ, 
కుర్చీని బర్రున చప్పుడు చేస్తూ లాగి కూర్చున్న సన్నివేశము, 
ప్రేక్షకుల హృదయ కుటీరములలో చిరస్థాయిగా ఉన్నవి.

&&&&&&&&&&&&&&&&

सुर संगम -సుర్ సంగం - గా నిర్మించారు. 
సుర్ సంగం - హిందీలో తీసిన సినిమా. 
పండిట్ శివ శంకర్ శాస్త్రి గా గిరీష్ కర్నాడ్, 
జయప్రద [as - tulasi] నటించారు. 
శారద - పాత్ర, తెలుగులో రాజ్యలక్ష్మి, 
సుర్ సంగమ్ లో సాధనాసింగ్ నటించారు. 
సాధన సింగ్ - శారద - గా ; Sadhana Sing;as - Sharda ;
@] 
सुर संगम - గీతాలు శ్రవణానందాన్ని కలిగించినవి. 
సుర్ సంగమ్ లో శుద్ధ రాగములైన భైరవ్ రాగం [ Bhairav, Chandrakauns ] 
;
సూరదాసు కృతులు, భజన్స్ కృష్ణ భక్తి కుసుమాలు.

సూరదాసు శైలికి ఒక ఉదాహరణ:-
"
కైధేరీ బస్ బేలి కహు; తుమ దేఖీ హై నంద నందన్ ; 
బూఝుహు మాలతి కిధే తై పాయే హై తను చందన్ ;; 
కైధే కుంద కదంబ ఆకుల వట చంపక లతాల మాల్ ;; 
కైధే కమల కహో కమలా పతి సుందర నయన విసాల్ ;;;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

" ఓ లతా,వృక్షములారా! మీరెక్కడైనా శ్రీ కృష్ణుని చూచితిరా?
ఓ మాలతీ! చందన చర్చిత గాత్రుని నీ వెచటనైనా జాడలు అరసితివా?
ఓ కమలమా! కమలా కాంతుని నీ వెచట నైనా పొడ గాంచినావా?

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఇది "సూరదాసు " రచన!
మన ఆంధ్ర మధురకవి పోతన - శైలిని పోలుస్తూ, చిన్న ఎగ్జాంపుల్ :-

"నల్లని వాడు ,పద్మ నయనంబుల వాడు, కృపా రసంబు పై ;
చల్లెడి వాడు, మౌళి పరి సర్పిత పింఛము వాడు , నవ్వు రా ; 
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మాన ధనంబు దెచ్చెనో ;
మల్లియలార! మీ పొదల మాటున లేడు గదమ్మ ,చెప్పరే! "

&&&&&&&&&&&&&&&&&&

सुर संगम - గీతాలు :-
@) Prabhu More Avgun Chit Na Dharo - Sant Surdas Ji 
s. జానకి గానంచేసిన హిందీ సూరదాసు గీతము మధురం. మాధుర్యభరితం.
@) Aayo prabhat sab mil gao, Jaau tore charan kamal per wari, Dhanya bhag sevaka ausar paya 
@) (naad chhipa tan mein, laya man mein); 
@) Maika Piya Bhulave - ;
@) sadho aisa hi gur bhaave, Pandit Shivshankar Shastri (Girish Karnad) ;
@) Song - "Hey Shiv Shankar Hey Karunakar "
ప్రభు మోరే అవగుణ్ ; చిత్ న ధరో .... " 
ఈ పాటను ఎస్. జానకి గానం చేసింది. ఇదీ ప్రత్యేక విశేషం.  

8, జులై 2016, శుక్రవారం

అర్సియా వర్ష దేవత

అర్సియా :- భూమి మీద మనుషులు, జంతు, 
పక్షిజాలాలూ, మొక్కలు, చెట్లు అగణితంగా ఉన్నవి. 
ఐతే,వానికి పరిశుభ్రమైన 
నీళ్ళు తాగటానికి దొరకడం లేదు.
అర్సియా అనే యక్షకన్య కృపామయి. 
ఆమె మనసు నవనీతం. ప్రాణికోటి మంచినీరు  
లేక అల్లలలాడుతూడడం చూసి విలవిలలాడింది అర్సియా.
ఆమె పర్వతదేవత వద్దకు, వర్ష దేవత వద్దకు వెళ్ళింది. 
"కల్తీ లేనిజలములను ప్రజలకు అందిద్దాము. 
ఇందుకోసం మీరు నాకు సాయాన్ని చేయగలరా?" 
అని అర్సియా అడిగింది. 
ఇరువురూ ఆమె ప్రార్ధనను విన్నారు. 
అర్సియా జాలిగుండె వారిని కదిలించింది. 
వెంటనే వారు అర్సియాకు తమ అంగీకారమును తెలిపారు.
కొండల మీద నుండి కరిగి వస్తున్న మంచు రాశులనీ, 
వానదేవత ఒసగుతూన్న జలములను 
అర్సియా జాగ్రత్తగా సేకరించసాగింది. 
ఆ నీటిని మడుగులు, బావులు, ఏరు, 
సెలయేళ్ళు, నదులుగా మలచి, భద్రపరిచింది. 
అర్సియా అనుసరించిన పద్ధతి వలన, 
ప్రజలకు త్రాగు నీరు కావలసినంత లభించసాగింది.
ఐతే కొన్నిసార్లు అర్సియాకు మనసు వికలమైతే, 
నీరు - వెల్లువగా - వరదలౌతుంది. 
అందుకనే జనులు 'అర్సియా దేవతకు కోపం రాకూడదని" 
వేడుకుంటూ వేడుకలు చేస్తూంటారు. 

పిల్లల కోసం... పిల్లల కోసం... పిల్లల కోసం... పిల్లల కోసం... పిల్లల కోసం... :-

#arsiyaa :- bhuumi meeda manushulu, jamtu, 
pakshijaalaaluu, mokkalu, cheTlu agaNitamgaa unnawi. 
aitE,waaniki pariSuBramaina 
nILLu taagaTAniki dorakaDam lEdu.
arsiyaa anE yakshakanya kRpaamayi. 
aame manasu nawaneetam. prANikOTi mamchiniiru  
lEka allalalADutUDaDam chuusi wilawilalaaDimdi arsiyaa.
aame parwatadEwata waddaku, 
warsha dEwata waddaku weLLimdi. 
"kaltii lEnijalamulanu prajalaku amdiddaamu. 
imdukOsam meeru naaku saayaanni chEyagalaraa?" 
ani arsiyaa aDigimdi. aame praardhananu winnaaru iruwuruu. 
arsiyaa jaaligumDe waarini kadilimchimdi. 
wemTanE waaru arsiyaaku tama amgeekaaramunu telipaaru.
komDala meeda numDi karigi wastunna mamchu raaSulanii, 
waanadEwata osagutuunna jalamulanu 
arsiyaa jaagrattagaa sEkarimchasaagimdi. 
aa niiTini maDugulu, baawulu, Eru, selayELLu, 
nadulugaa malachi, bhadraparichimdi. 
arsiyaa anusarimchina paddhati walana , 
prajalaku traagu neeru kaawalasinamta labhimchasaagimdi.
aitE konnisaarlu arsiyaaku manasu wikalamaitE, niiru - 
welluwagaa - waradalautumdi. amdukanE janulu 
'arsiyaa dEwataku kOpam rakUDadani" 
wEDukumTU wEDukalu chEstuumTAru.
;
పిల్లల కోసం... పిల్లల కోసం... పిల్లల కోసం... పిల్లల కోసం... పిల్లల కోసం...
***************************************************************, 
;
Jana the Goddess , rain and Harvest :