28, జులై 2010, బుధవారం

"Bengal Tiger" పాద రక్షలు















అశుతోష్ ముఖర్జీ (1864-1924)"బెంగాల్ టైగర్"గా వినుతి చెందాడు.
నిర్భయత్వానికి మారుపేరు ఈ "Bengal Tiger".
ఇంగ్లీష్ వారు పాలిస్తూన్న ఆ రోజులలో, భారతీయులను ఆంగ్లేయులు
హీనభావంతో చులకన చేసేవారు.
ఒకసారి trainలో అశుతోష్ ప్రయాణం చేస్తున్నాడు.
అతను తన చెప్పుల జతను బెర్త్ కిందపెట్టి, నిద్ర పోసాగాడు.
కొంతసేపటికి ఒక European అదే బోగీలోనికి ఎక్కాడు.
ఆ యూరోపియన్ మనిషికి - సీటు మీద ఒక ఇండియన్ నిద్ర పోవడం -
చాలా ఆగ్రహం కలిగించింది.
ఆ తెల్ల వాడు ముఖర్జీ పాదరక్షల జతను కిటికీలో నుంచి బైటికి విసిరివేసాడు.
పిమ్మట అతడు తన కోటును విప్పి, berth మీద పెట్టి, కునుకు తీయసాగాడు.
Asutosh Mukharji కి మెలకువ వచ్చింది.
తన చెప్పులు కనబడలేదు.
"ఎదుటి సీటు మీద ఉన్న ఇంగ్లీషు వాడు చేసిన పని"అని గ్రహించాడు.

వెంటనే అశుతోష్ అక్కడ కనబడుతున్న తెల్లదొర కోటును
కిటికీలో నుండి విసిరేసాడు.
నిద్ర లేచిన తెల్ల వాడు తన coatను వెతుక్కుంటూ,
"Here! where is my coat?"అంటూ అడిగాడు.
"నీ కోటు నా స్లిప్పర్లను వెదకడానికి వెళ్ళింది." అని బదులిచ్చాడు ముఖర్జీ.


By kadambari piduri,
Jul 27 2010 10:03AM

25, జులై 2010, ఆదివారం

వేద వ్యాస అక్షరాభ్యాసము

















ఎక్కిరాల వేద వ్యాస I.A.S. ,USCEFI సంస్థను స్థాపించిన వ్యక్తి;
నిష్కల్మష సిద్ధాంతాలతో తన జీవన పథమును నిర్మించుకుని, పయనించిన ధీర శాంతుడు.
వేద వ్యాసకు తండ్రి అనంతాచార్యులు
“The King’s Reader” అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని కొన్నారు.
మంచి ఖరీదైన book, ఫారిన్ నుండి తెప్పించిన ఆ పొత్తము అందమైన బొమ్మలతో ఆకర్షణీయ పద్ధతిలో ఉన్నది.
ఒక నెలలో ఆట పాటలతో చిన్నారి వేద వ్యాస పూర్తి చేసేసాడు.
“నాన్నా! మీరు కొని ఇచ్చిన బొమ్మల పుస్తకం అయి పోయింది.”
“అయి పోవడమేమిటిరా? ఒకటో తరగతి వరకూ
నీ చదువులకు ఇదే వాచకము కదా!!??”
చివరి పేజీ. అట్ట మాత్రమే మిగిలిన ఆ ఆంగ్ల పుస్తకాన్ని చూపించగానే,
పితృ దేవులు ఉలిక్కి పడ్డారు.
“తతిమ్మా పేజీలన్నీ ఏవిరా? ఏమైనాయి?”
“అవన్నీ ఐ పోయాయి కదా...... పాత pagesను చించేసాను.”
ఆయుర్వేద వైద్యులైన జనకులు,
patients కి మందులను అమ్మి, ఆ బిల్లును చించి, వాళ్ళకు ఇచ్చే వారు.

బాల వేద వ్యాస కూడా “అదే పంథా”ను అనుసరించాడు.
తాను చదవగానే, English book లోని ఆ పుటలను కాస్తా చించేసి,
గాలి పటంకి మల్లే గాలిలోకి ఎగిరేసే వాడు”అయి పోయిందీ!” అంటూ.
“బంగారం లాంటి పుస్తకాన్ని హూనం చేసావు, ఇప్పుడెలాగ ఆ పాఠాలు నీకు వస్తాయిరా???”
“అన్నీ వచ్చేసాయి,నాన్నా!కావాలంటే చూసుకోండీ!” అంటూ
మొదటి పాఠం నుండి కొస వరకూ అన్నీ కంఠతా పట్టినట్లుగా, గడ గడా అప్ప జెప్పేసాడు.
“ఐతే నీకింకో వాచకం కొని పెడతా!పద!బజారుకెళదాం!” అన్నారు పితృ దేవులు
పుత్రుని బుగ్గలు పుణికి, ముద్దుగా చూస్తూ.
నేరుగా విజయ వాడ రైల్వే స్టేషన్ కు వెళ్ళారు.
Higgin badam’s book shopలో
2,3,4 వ తరగతి వరకూ పుస్తకముల సెట్టును కుమారునికి కొని పెట్టారు.
“ఇందులో పేజీలు చించ కూడదు, తెలిసిందా!
పుస్తకం పూర్తి చేసే దాకాఆ అన్ని పేజీలూ ఉండాలి,గుర్తుంచుకో!”
3 నెలలలో ఇంగ్లీషు 5 - వ ఫారం(= 9 class) దాకా చదివేసాడు.
అనంతాచార్యులు ‘తన కొడుకు ఒక్క ఏడాదిలో మెట్రిక్యులేషన్ పరీక్షకు తయారు అవ గలడ'ని ధీమాతో అనుకునారు.
దాంతో కాశీ కృష్ణమాచార్యుల వారి సంస్కృత వాచకములను జనకుడు ఇచ్చారు;
అంచెలంచెలుగా పఠించడమూ పూర్తి ఐ పోయింది.
ఆ క్రమంలో చిన్న చిన్న వాక్యాలతో గీర్వాణ భాషలో మాట్లాడడం కూడా ఒచ్చేసింది.ఆ తర్వాత “మను స్మృతి”లో నుండీ పాతిక శ్లోకాలు, బాల రామాయణము లోని 60 శ్లోకాలు, భగవద్గీతలోని 18 అధ్యాయాలు – 10 నెలలలోనే వ్యాస పూర్తి చేసేసాడు.
అప్పటి దాకా వేద వ్యాస కు కలం పట్టి, పేపరుపై
ఒక్క అక్షరం ముక్క కూడా రాయడం చేత కాదు.
ఎక్కిరాల వేదవ్యాస విద్యాభ్యాసము 1947 లోమొదలైనది.
పలక పైన సుద్ద ముక్కతో రాయించారు.
ముందే పఠనము, తదుపరి లేఖనము .........
ఇలాటి తిరకాసు ఆచరణతో , కలిగిన తికమలూ.... కొన్ని విచిత్ర అనుభవాలు సంభవించాయి.
వేద వ్యాసకు భాషా భేదం తెలిసేది కాదు.
ఫలితంగా ఒక వాక్యం రాసేటప్పుడు
అందులోని అక్షరములను కలగా పులగంగా రాసే వాడు.
అంటే ఇంగ్లీషువీ, సంస్కృతంవీ,తెలుగువీ అన్నిటినీ కలగలుపుగా రాసే వాడు.
ఒక నాడు అనంతాచార్యులు డిక్టేషన్ చెప్పారు.
“ పిల్లి” అని తండ్రి చెప్పగా, వేద వ్యాస ,
”Pల్లి” అంటూ పలకపై రాసాడు.
అలాగే అన్ని పదాలూ, పంచ కూళ్ళ కషాయంగా అవతరించాయి.
Bడి (= బీడి)
ఈ పద్ధతిలో కనపడిన అక్షర చిత్ర ప్రసూనములను చూడగానే, తండ్రి అదిరి పడ్డారు.
“ఇదేమిటిరా ఇలా రాసావు?”
“అన్నీ ఒక్కటే కదా అని రాసేసాను నాన్నారూ!”
చిన్నారుల మనస్సులలో ఆ యా శబ్దాలూ, ఆకారాలూ మాత్రమే రికార్డు అవుతూంటాయి.
వారి జ్ఞాపక శక్తిలో అన్ని అక్షరముల వర్ణ క్రమమూ,
విడి విడిగా బోధించనందు చేత, కలగలుపుగా నిక్షిప్తమైన విపర్యాస ప్రహసనాలు ఇట్లాంటివే!!!!!
వేద వ్యాసకు రాళ్ళూ, బియ్యమూ విడ దీసినట్టు ఏరుకోవడానికే
ఎక్కువ సమయం, అనగా ఏడాది పట్టింది.
అన్ని పాఠాలూ వాక్కుతో, కంఠస్థం చేయడం అత్యంత స్వల్ప వ్యవధిలో జరిగింది;
కానీ రాత, లిపి వ్యవహారం మాత్రం చాలా వ్యవధిని తీసుకోవడం గమనార్హమైన ముఖ్య విశేషమే!
టీచర్లు, అధ్యాపకులు దృష్టిలో ప్రధాన కోణంలో పరిశీలించి అవగాహనతో
పిల్లలకు బోధన చేయడానికి ఈ అంశాలు ఉపకరిస్తాయి కదూ!!!!!

21, జులై 2010, బుధవారం

నంది ఘోష


















ఒరిస్సా రాష్ట్రములోని పూరీ పుణ్య క్షేత్రమునకు దగ్గరలోని రఘు రాజ్ పూర్ లో "పాట చిత్ర కళా సాంప్రదాయనకు కేంద్రముగా నిల దొక్కుకుని ఉన్నది. "చిత్ర కార"అని వీరికి పేరు .
పూరీ పుణ్య క్షేత్రములోని 45 అడుగుల ఎత్తు ఉన్న జగన్నాధ స్వామి ,"పాట చిత్ర కళా వైభవానికి" తార్కాణము.
(sandalwood festival) చందన ఉత్సవము సందర్భములో నరేంద్ర రిజర్వాయర్ వద్ద ఉన్న చిన్న దేవళమునకు వీరు రంగులు అలంకరిస్తారు.
పాట చిత్ర కారుల నైపుణ్యము "పూరీ"లోని జగన్నాధ దేవాలయములో ప్రత్యక్షమౌతూనే ఉన్నది.
జగన్నాధ స్వామి రథము పేరు " నంది ఘోష".
45 అడుగుల ఎత్తున్న ఈ తేరు చక్రములు 14 ;ఒక్కొక్కటీ 7 మీటర్ల వ్యాసార్ధము ; ఎరుపు,పసుపు రంగుల వలువలతో నీండుగా అవి అలంకరించ బడుతాయి.
బల భద్రుని రథము ( chariot)44అడుగులు( 44 feet), 14 చక్రములను కలిగి ఉంటుంది.
నీలి రంగు వస్త్రము చుట్ట బడును.
ప్రతి యుగములోని 14 మన్వంతరములకు ఇది ప్రతీక.
సుభద్ర యొక్క chariotది నల్ల రంగు ;12 నెలలకు గుర్తుగా, 12 wheels కలిగినది.
మొదట కాటన్ పేజీల షీట్ ల పైన బొమ్మలకు రూప కల్పన చేస్తారు.
భూమి పైన చేనేత - కాటన్ వస్త్రాన్ని పరుస్తారు. చింత పండు పిక్కలు( = గింజలు) నుండి తయారు చేసిన జిగురు పదార్ధాన్ని పై పూతగా ఒక సారి పూస్తారు.
దీని పైన మరొక గుడ్డను పెట్టి,ఇంకొక లేపనముగా చింత గింజల బంకను అలదుతారు.
వాటిని ఎండలో ఎండ బెడతారు.దాని పైన , తాము మలిచిన బొమ్మలను కావలసిన సైజులలోనూ, కావాల్సిన పద్ధతిలోనూ కత్తిరించుకుని , వివిధ రసాయనాలతో, రంగులతో, వర్ణ సమ్మేళనములతో తీర్చి దిద్దుతారు.
ఆ "పట వస్త్రము" ఎండిన తర్వాత, బొమ్మలకు ఫైనల్ టచెస్సును ఇస్తారు.
గంగ ,సూర్య్త వంశ చక్రవర్తులు ఈ కళకు బీజం వేసారు.
కూర గాయలు, ఆకు పసరులు, రాళ్ళు,లోహాదులు, మొదలైన ప్రాకృతిక వనరుల నుండి రంగులను చేసి, వాడుట సాంప్రదాయము!
నేడు ఇతర ఆధునిక paintsని కూడా ఉపయోగిస్తున్నారు.
చిత్ర లేఖనము పూర్తి ఐన తర్వాత,a coat of lacquer తో కవరు చేస్తారు.
బ్యాక్ గ్రౌండు కలరుగా, సాధారణంగా ఎర్ర రంగు వాడుకలో ఉన్నది.
1990 సం||ల నుండి, తెలుపు,ఆకు పచ్చ, గులాబీ పింక్ - మున్నగునవి కూడా యూజ్ అవుతున్నాయి.
దేవతా మూర్తులకు
కొన్ని విశ్వాసాలను సాంప్రదాయానుసారంగా పాటిస్తూ , నిర్దేశించ బడిన కలర్లు వాడుతూన్న్నారు.
నీలం వన్నె(blue colour) - శ్రీ కృష్ణ
తెల్ల రంగు/శ్వేత వర్ణము (white) _ బల రముడు
పసుపు పచ్చ వన్నె _ రాధ దేహ ఛాయ,గోపికలు
ఆకు పచ్చ వర్ణము - శ్రీ రామ చంద్రుడు

*************************************



18, జులై 2010, ఆదివారం

మనిషి చేసిన అడవి


















ఇవాళ టి.వి. లో "వేడుక" అనే సినిమా వచ్చింది.
Jitender Y ఈ తెలుగు సినిమాకు దర్శకుడు.
"ఆనంద్"ఫేం 'రాజా' హీరోగా నటించిన ఈ picture - 31 May 2007న రిలీజ్ ఐంది.
ఇందులోవిలన్ "దంబుల్ల సుబ్బును నేను"అంటూ గర్జనలు చేస్తూంటాడు.
ఇంతకీ తమాషా ఏమిటంటే, నాకు " శ్రీ లంకలోని "దంబుల అభయారణ్యం" గుర్తుకు వచ్చినది.
ప్రపంచంలోనే తొలి మానవ నిర్మిత కృత్రిమ కాననము - గా ఇది చారిత్రక రికార్డును సాధించింది.
అందుకే, దంబుల్ల వనము గురించి కొన్ని వివరాలతో మన మాటా మంతీ !
[8 వ శతాబ్దిలో శ్రీ లంకలో అభివృద్ధి పరచ బడిన నామల్ ఉయన అనే అభయారణ్యం,
బొటనీ శాస్త్రజ్ఞుల గ్రంధాలలో చోటు చేసుకున్న పురాతన అభయారణ్యము
ఈ సంఘటనకు ఒక అపూర్వ చారిత్రక సంఘటన ప్రేరణగా, మూలాధారముగా నిలిచినది.
====================================
8 వ శతాబ్ది ప్రారంభంలో శ్రీలంకలో అభివృద్ధిపరచబడిన
"నామల్ ఉయన" అనే అభయారణ్యం ,
బొటనీ శాస్త్రజ్ఞుల గ్రంధాలలో చోటు చేసుకున్న పురాతన అభయారణ్యము
ఇది ఉష్ణ ప్రాంతాలలో ఇచ్చటనే "శీతల సీమల తరువు జాతి ఐనట్టి ".
దంబుల్లా అటవీ ప్రాంతంలో "తిస్సా" చక్రవర్తి జింకలను, సాధు జంతువులను, పక్ష్యాదులను వేటాడ సాగాడు.
అప్పుడు king Tissa" ను Arahat Mahinda's అనే బౌద్ధ బిక్షువు వారించాడు.
"మహారాజా! గాలిలో స్వేచ్ఛగా ఎగిరే విహంగాలకూ,
భూ మండలముపై సంచరించే జంతు జాలములకూ,
నీకు వలెనే జీవించే హక్కు ఉన్నది.
వానిని వధించకూడదు.
అవి ఈ సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే! విహరించవచ్చును.
ఈ ధరణీతలములోని సమస్త జీవరాసులూ,
మనుషులతో సమానంగా బ్రతికే హక్కును కలిగిఉన్నవి.
వాటి అన్నిటికీ ప్రభువైన నువ్వు, సంరక్షకునిగా మాత్రమే వ్యవహరించాలి సుమా!"

చిత్రంగా మహాప్రభువు ఆ పలుకులను పెడచెవిని పెట్టకుండా,
వినయంగా అంగీకరించాడు.
ఆ అటవీసీమలను, అంటు తొక్కి, నాటిన మొక్కలను,
ప్రజలు ప్రత్యేక శ్రద్ధా భక్తులతో, అభయారణ్యంగా ఇను మిక్కిలిగా పెంచారు.
గౌతమ బుద్ధుని ప్రవచనములు ప్రజలను అంతగా ప్రభావితం చేసాయి;
అందరినీ ప్రకృతి ప్రేమికులుగా, శాంత మూర్తులుగా తీర్చిదిద్దాయి.
రాజులకూ, సైనికులకూ అక్కడ నివాసాలు ఏర్పరచుకున్న బౌద్ధ బిక్షుకులు ఆతిథ్యం ఒసగేవారు.
అందువలన విశ్రాంతి కుటీరములుగా విలసిల్లినవి.

King Devanampiya Tissa (307-267 B.C);
Mesua ferrea ; Dambulla forest ;;;;;;;
"గల్కిరియాగమ"అనే ప్రాంతాన్ని
"నామాల్ ఉయన అభయారణ్యము"
ప్రాచీనతతో, ప్రాకృతిక పరి రక్షణా కవచంగా వ్యాపించి,హరితదనంతో
శ్రీలంక దేశానికే గర్వ కారణంగా విలసిల్లుతూన్న్నది.
కనుకనే 2005 ,మే 8 వ తేదీన - Prime Minister Mahinda Rajapaksa
"జాతీయ రక్షిత అరణ్య సంపద"గా (a National Forest Reserve.)ప్రకటించాడు .
ప్రపంచ వింతలను, ఆధునీకరించే ఆలోచనతో చేసిన ప్రయత్నంలో ,
ఈ దంబుళ్ళ అభయారణ్యము, తొలి విడత జాబితాలో చేర్చగా, ప్రజలకు ఆనందం కలిగింది.

Wow - Wonders Of The World

మనిషి చేసిన అడవి ;

By kadambari piduri,
Feb 5 2010 2:30AM

15, జులై 2010, గురువారం

మాటా మంతి - Juggernaut

















కపిలేంద్ర మహారాజు "భగవంతుడు శ్రీ జగన్నాధస్వామి సేవకుని"గా తనను ప్రకటించుకున్నాడు.
ఆనాటి నుండీ జగన్నాథ రథ మహోత్సవము" నాడు ఒక ఆచారము పాటించబడసాగినది.
రాజవంశీకులు బంగారు చీపురుతో స్థలాన్ని శుభ్రము చేస్తారు.
ఈ సాంప్రదాయ పర్వమును "chhehra panhara" అని పిలుస్తారు.
జగన్నాధ దేవళము, రథములు అన్నీ అతి పెద్దవి.
అలాగే ఇచ్చట ప్రసాదములను తయారు చేసే వంటిల్లు చాలా పెద్దది.
పూరీ దేవాలయ సింహద్వారమునకు ఎడమవైపు ఉన్న kitchen సముదాయంలో
32 గదులు, 752 స్టవ్వులు కలవు.
500 మంది పాకశాస్త్ర ప్రవీణులు, 300 మంది అసిస్టెంటు వంటవాళ్ళు నిత్యము బిజీగా ఉంటారు.
ఇక్కడ 100 రకములైన ఆహారపదార్ధాలను వండుతారు. భగవంతునికి, .
కేవలము మట్టితో చేసినట్టి (అంటే బట్టీలో కుమ్మరి ఆవము కాల్చనివి) కుండలలో వండుతారు,
నాలుగు, ఐదు గంటలసేపు ఆ కుంభములలోని వంటకములు
వేడిగానూ, మిక్కిలి రుచిగానూ ఉంటాయి. ప్రసాదములకు మహాప్రసాద / అభద అని పేర్లు.
దేవతామూర్తులకు ప్రతిరోజూ 6 సార్లు నైవేద్య నివేదనలు జరుగుతాయి .
Juggernaut అనే పదము ఆ నాడు వాడుకలోనికి తమాషాగా వచ్చినది.
"జగన్నాథ్" అనే మాటకు వికృతి ఇది.
ఆనాటి పాలకులైన బ్రిటీష్ వారు ఉత్కళ రాష్ట్రములోని పూరీని వీక్షించారు.
నయనానందకరమైన వేడుకలను తిలకించి అచ్చెరువందారు.
చూడటానికి వేయి కన్నులు చాలని రీతిగా జరుగుతూన్న
ఇచ్చటి ఘనమైన గుడులూ, రథములూ, ఊరేగింపులూ వారిని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాయి.
అప్పటి నుండీ "రాసిలోనూ, వాసిలోనూ, అలాగే ఇతర వ్యవహారాలనూ -
" అతి ఘనమైన వాటిని" - ఆంగ్లేయులు "జగన్నాథ్"అని వ్యవహరించ సాగారు.
వారికి సరిగ్గా నోరు తిరగక, ఉచ్ఛారణలో అది కాస్తా " జగనాట్"(juggernaut)గా మారిపోయింది.
అదన్న మాట ఆ "మాట" యొక్క సంగతి.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Wow - Wonders Of The World


By kadambari piduri,
Jul 14 2010 8:57AM


juggernaut

Jug·ger·naut   [juhg-er-nawt, -not] Show IPA
–noun
1.
( often lowercase ) any large, overpowering, destructive force or object, as war, a giant battleship, or a powerful football team.
2.
( often lowercase ) anything requiring blind devotion or cruel sacrifice.
3.
Also called Jagannath. an idol of Krishna, at Puri in Orissa, India, annually drawn on an enormous cart under whose wheels devotees are said to have thrown themselves to be crushed.
Origin:
1630–40; <>

—Related forms
Jug·ger·naut·ish, adjective

13, జులై 2010, మంగళవారం

రంగుల కాఫీ





















ఆర్.కె.నారాయణ్ “మాల్గుడి డేస్ ” రచయిత. ఆయన pet name” కుంజప్ప.
కుంజప్ప ఉరఫ్ R.K.Narayan స్ట్రాంగ్ కాఫీని like చేస్తారు,
ప్రత్యేక రుచితో స్పెషల్ గా ఉంటేనే తాగగలుగుతారు.

ఆర్.కె. ఫ్రెండు - నట్వర్ సింగ్ చెప్పిన సంఘటన, U.N.లో ఎదురైన విశేషం ఇది;

ఒకసారి విందులో నారాయణన్ పాల్గొన్నారు.
Lunch పూర్తి ఐంది.
కాఫీ ప్రియుడైన ఆర్.కె.
“a cup of coffee! కావాలని” అన్నారు.

ఆయన కోరిక మేరకు,
కాఫీ ఏర్పాట్లకై ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సర్వర్ వచ్చాడు.
ఆ waiter వినయంగా అడిగాడు
"Black or white, sir?"

భారతీయ పౌరుడైన మన కుంజప్ప చాలా పొలైట్ గా ఇచ్చిన సమాధానం
“ బ్రౌన్ (=brown coffee) ”

పాశ్చాత్య దేశాలలో black Tea , black coffee లను ఇష్టంగా సేవిస్తారు.
మన దేశంలో డికాషన్ లో పాలు, చక్కెరలను మిక్స్ చేసి తాగుతాము;
అందువలన నారాయణ్ “ నిజాయితీగా , సీరియస్ గా “ వెలి బుచ్చిన కోరికను విని,
అర్ధం కాక ఆ సర్వరు వాడు బుర్ర గోక్కున్నాడు;
ఆనక అతనికి బోధ పరచి, ఎలాగో తిప్పలు పడి,
స్ట్రాంగైన, special BROWN Coffee ని చేయించి తెచ్చి ఇచ్చారనుకోండి.

Pramukhula Haasyam


By kadambari piduri,
Jul 8 2010 7:54PM

8, జులై 2010, గురువారం

ఆర్ కె లక్ష్మణ్
















లోక ప్రసిద్ధుడైన కార్టూనిస్టు ఆర్. కె. లక్ష్మణ్
(Rasipuram Krishnaswamy Laxman) పై
ఆయన అన్న గారైన R.K.Narayan యొక్క ప్రభావం ఉన్నది.

చిన్నప్పటి నుండీ అన్న అంటే హీరో వర్షిప్ ,
ఎంతో గౌరవం. ఐనప్పటికీ కొన్ని విషయాలలో చిరు కినుకలు కూడానూ!!!

“ నేనెప్పుడూ చిన్న వాడిగానే అగుపిస్తాను.
బుద్ధిమంతుడు ఐన బాలునిగా
నన్ను తీర్చిదిద్దాలనే నిత్యమూ ప్రయాస పడుతూండే వాడు.
అలాగ గోళ్ళు కొరకకూడదు ; చెట్లను ఎక్కకు;
సైకిల్ ని అలాగ BAR మీద సవారి చేయకు;....
ఇలాగ ప్రతీదీ వివరంగా నొక్కి, వక్కాణిస్తూ
ఆదేశాలు జారీ చేస్తూండే వాడు; మీరే చెప్పండి.
లోకంలో ఏ పిల్ల వాడైనా........
ఇలాంటి తిక్క రూల్సును, పిచ్చినీ,
వీటన్నిటినీ అనుసరించ గలుగుతాడా??!!”నవ్వుతూ అనేవాడు.

లక్ష్మణ్ అతి సున్నిత మనస్కుడు.
అతని భార్య కమల ఇలాగ వివరించింది
“ వారికి ఇట్టే కళ్ళలో నీరు ఉబుకుతుంది.
బోంబే యూనివర్సిటీలో
ఇటీవల ఒక convocation జరిగింది.
(The President of India) అబుల్ కలాం లక్ష్మణ్ని
ఆప్యాయంగా హత్తుకున్నారు.
తటాలున మా శ్రీ వారు ఆనందబాష్పాలతో
ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
ఏడుపును ఆపుకోలేకపోయారు.

అప్పుడు కలాం అన్నారు కదా

“ లక్ష్మణ్! ప్రతీ ఉషోదయమునాడు
మీరు ప్రపంచాన్ని నవ్విస్తున్నారు;
ఇప్పడు ఇట్లాగ ఎలాగ శోకిస్తున్నారు?”

Bombay University ఆడిటోరియం లో హర్షధ్వానాలు చెలరేగాయి.
“ఇలాంటి సంఘటనలు తటస్థ పడుతూంటాయి.
రెండేళ్ళ క్రితం మా వారికి ”పద్మ విభూషణ్” బిరుదు ప్రదానం జరిగింది.
ఆ Padma Vibhushan ceremony లో
నేను నాల్గవ వరుసలో కూర్చున్నాను.
అక్కడి నుండి లక్ష్మణ్ గారికి నేను కనపడను.
నన్ను చూడగానే కన్నీరు కట్టలు తెంచుకుంటుంది –
అనే ఉద్దేశ్యంతో, అల్లాగ ఒక పక్కగా ఆయనకు అగపడకుండా ఆసీనురాలినయ్యాను.
ఆత్మీయులను చూడగానే ఆనందంతో, కన్నీటిపర్యంతమౌతారు.
అందుకనే ఆయనకు కనపడకుండా వెనుక కూర్చున్నాను.
పద్మ విభూషణ్ ఉత్సవం బాగా జరిగింది. Tears ఘట్టాలు ఎదురవ లేదు;
హమ్మయ్య! అనుకుంటూ' నిట్టూర్పు విడిచాను." అన్నది,
స్వయంగా రచయిత్రి కూడా ఐనట్టి కమలా
లక్ష్మణ్ హాస్యస్ఫూర్తితో.
ముంబయిలోని Worli Seaface లో common man" బొమ్మ ప్రతిష్ఠించ
బడినది.
ఒక కార్టూనిస్టు సృజించిన "సామాన్య మనిషి" విగ్రహంగా ప్రపంచములో
,ఇక్కడ ప్రప్రథమంగా నెలకొల్పబడినది.
ఈ హేతువు చేత " ముంబై లోని వర్లీ సముద్ర సీమ "
చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని పొందినది.

ఆర్.కె. లక్ష్మణ్ గారికి ఘన నివాళిని ఇస్తూ ఆ " కామన్ మాన్ "
పర్యాటకులను అలరిస్తూనే ఉంటాడు కదా!!!!!


Pramukhula Haasyam


By kadambari piduri,
Jun 26 2010 11:55PM

6, జులై 2010, మంగళవారం

తాంబూలాలిచ్చేసాం!


















"చేటీ భవన్ నిఖిల భేటీ .....
పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరి పాటీం
ఆగాధిప సుతా! ఘోటీ ఖురా దధిక ధాటీ ముదార
ముఖ వీటీ రసేన తనుతాం."

శ్రీ కాళిదాసు „ దేవీ స్తుతి శ్లోక త్రయోదశి“లో ప్ర ప్రధమ శ్లోకములోని నాలుగవ పంక్తి.

"కడిమి చెట్లు కల కదంబ ఉద్యాన వనములలో సమస్త దేవతా వనితలూ చెలికత్తెలై, వయ్యారంగా ఆమెను అనుసరిస్తూన్నారు.స్వర్గ లోక నివాసులైన దేవతా సమూహములు ధరించిన కిరీటాలకు చెందిన మిక్కిలి మనోజ్ఞమైన మణుల కిరీట కాంతులు,దేవీ పద పద్మముల పైన వ్యాప్తి చెందినవి.

నగాధిపుని కుమార్తె ఐన పార్వతీ దేవి తాంబూలమును సేవించినది.
ఆ వీటీ రసముము వలన పరిసరాలు అన్నీ పరిమళ భరితమౌతూన్నాయి.
అట్టి మహిమోపేతమైన తాంబూల రసము అశ్వ ధాటిని మించిన ఆశు కవితా శక్తిని నాకు ప్రసాదించును గాక!"
అని కాళిదాసు ప్రార్ధన చేసాడు.
ఘోటీ ఖురాత్ = " ఆడు గుఱ్ఱముల గిట్టల కంటే ఎక్కువ వడి, ధాటి గల కవిత్వ పరి పాటిని వృద్ధి చేయ వలె"నని
మహా కవి కాళి దాసు మనసారా తల్లి గిరిజా దేవిని వేడుకున్నాడు.
తన కవిత్వము సర్వ జన ఆమోదం పొందాలని వాంఛిస్తున్న కాళిదాసు ఉపమానము,
తల్లి పార్వతీ దేవి సేవించిన వీటికామోదము!
మహా కవి రచనలలో ప్రముఖ స్థానము గడించిన ఈ తాంబూలము
క్రీస్తు పూర్వము నాటి నుండియే భారత దేశములో ప్రజల నిత్య వాడుకలో ఉండేది.

తాంబూలంలో రవంత సున్నము రాసి, వక్కాలను చేర్చి నమిలితే ,
" నోరు ఎర్రగా పండుతుందని" కనిపెట్టినారు;
ప్రతి రోజూ భోజనానంతరం తమల పాకులను వేసుకునే భారతీయులు భోజనమును కళగా మలిచారు!

@త్యాగరాజు ఒక సాంప్రదాయ భజనలో అంటారు.....

"శ్వేతనాగవల్లీ దళసంయుత పూగీఫల సకలం రుచిరం
కర్పూరాంచిత చూర్ణసమన్విత తాంబూలం స్వీకురు వరదా
జయజయ దేవాదిదేవవిభో జయ గోపాలకృష్ణ కృపాజలధే......."

"తాంబూల చర్వణంబులన్ పుణ్య కథా శ్రవణంబులన్ పొందుచు"రని‚
"కాశీ ఖండము"లోని వర్ణన.

ఎక్కువ సేపు నమిలే కొద్దీ తాంబూల రసము యొక్క రుచి అధిక తమమౌతుంది.
అందులకే అది"తాంబూల చర్వణము" గా నుడికెక్కినది.
మన దేశములో తాంబూలం తయారీ అద్భుత కళగా వృద్ధి గాంచినది.

కస్తూరి, ముత్యాల పొడి, లవంగము, గంధము ఇత్యాదులు జత చేర సాగాయి .

1. పండుటాకుల కర్పూర భగములను చొక్కమౌనట్టి – మౌక్తిక చూర్ణమమర (గయోపాఖ్యానము)
2. ఖండిత పూణీ నాగర ; _ ఖండంబుల ఘన శశాంక ఖండంబులచే;
- హిండితమగు _ తాంబూలము (ఆముక్త మాల్యద);;;;;;;
శ్రీ నాధుడు తన రచనలలో ప్రజలు తినే ఆహార పదార్ధములలోని
ప్రతి చిన్న అంశాన్నీ విపులంగా వర్ణిస్తూ,
చదువరుల నోళ్ళలో లాలాజలము ఊరేటట్లు చేసాడు.

"తమ్ములము సేయుచో నొక్క తలిరు బోణి " (శ్రీ నాధ నైషధము)

క్రమ క్రమముగా తమల పాకులకు (betle leaves) సంఘంలో ప్రముఖోన్నత స్థానం లభించింది.
కేవలం భోజనానంతర సేవనమునకు మాత్రమే పరిమితం అవ్వలేదు;
గౌరవ మర్యాదలకు ప్రతీకా స్వరూపిణిగా రూపు దాల్చినది మన తాంబూల విడియం గారు.

అగ్ర తాంబూలం, తాంబూలం పుచ్చు కొనుట ఇత్యాదిగా
నిజ జీవిత మర్యాదా మన్ననల పాటవముతో పెన వేసుకున్నది.
చక్ర వర్తులు, ప్రతిభా పాటవములను వెలువరిచిన కవి పండితులకు,సైనికులకు, ఉద్యోగులకు
బిరుదులను ప్రదానం చేస్తూ సత్కరించేటప్పుడు
"తాంబూలములో దక్షిణ పెట్టి మరీ ఇచ్చే వారు.
ఈ సంప్రదాయము నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతూన్నది కదా!
"అగ్ర తాంబూలం ఇవ్వడము" ప్రత్యేక గౌరవ స్థానాన్ని ఇచ్చుట అని అర్థము.

తాంబూలాలు పుచ్చుకున్నారు -
“ ఇరు కుటుంబాలలోని అబ్బాయికీ, అమ్మాయికీ పరిణయమును ఖాయం చేయుట – అని ఇట్టే అర్థమౌతుంది.
"నిశ్చయ తాంబూలాలు" అనగా,"ఫలానా యువతీ యువకులకు/ పిల్ల, పిల్ల వాడికీ వివాహం జరుగుతుంది." అంటూ పది మంది ఎదుట ప్రకటన చేసే సందర్భంలో, చేసుకునే వేడుక; ఫలానా తేదీన జరగ బోయే పెళ్ళికి
ఇది శుభారంభము అన్న మాట.
అందరి ఎదుట, మగ పెళ్ళి వాళ్ళూ, ఆడ పెళ్ళి వారూ పరస్పరమూ వక్కలను ఉంచిన తాంబూలమును ఇరు పక్షముల వారు ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం విశిష్టంగా ఆచరణలో ఉన్నదే కదా!

ఇంత విపులంగా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు;
" తాంబూలాలు పుచ్చు కున్నారు" అనగానే,
ఈ యావత్తు సీనూ, మన మనో నేత్రంలో చిటికెలో సాక్షాత్కరిస్తుంది,
అంటే ఈ మహోన్నత సాంప్రదాయం యొక్క విలువ అమోఘమైనదే కదా!

తొలి ప్రబంధము "మను చరిత్రము"లో
కవి అల్లసాని పెద్దన ఈ "బీటిల్ లీవ్సు బొత్తుల" సంరంభాన్ని మిళాయించాడు.
"మృగ మద సౌరభ విభవ - ద్విగుణీకృత ఘన సార సాంద్ర వీటీ గంధ స్థగితేతర పరిమళమై;
మగువ పొలుపు తెలుపు నొక్క మలయ మారుత మొలసెన్.“

వరూధినీ ప్రవరాఖ్య ఘట్టములో
తాంబూల పరిమళాలను లాలిస్తూ, మోసుకు వచ్చిన "చిరు గాలి" ధన్యమైనదే!

ఆకులలో కెల్లా మేలైన ఆకు ఇది.
"ప్రోక మ్రాకుల సొంపు మురువు కొనగ........" అన్నది "కాశీ ఖండము" .

తాంబూల విడెపు తయారీలో పాలు పంచుకున్న వస్తువులు –
అనేక పర్యాయ పదాలతో శోభిల్లుతున్నాయి.

కావ్యాలలోనూ, నిఘంటువులలోనూ నవ రత్న మణులలాగా అనేక పద గుచ్ఛాలతో శోభిల్లుతూన్న
ఆ వైనాన్ని పరికించుదాము.

@ తమలపాకు = „ఆకు వక్క – అంటే తాంబూలము అనే భావము. ఆకు, తెల్లనాకు,
నాగ వల్లి, దళము, ఫణాధర వల్లీ దళము,వెలియాకు,తమాల పల్లవము

@ వక్క = పోక, పోక చెక్కలు, వక్క, వక్కలు, వక్క పలుకులు, వక్క పొడి, వీతి, సిగినాలు, పోఢము, అడ , చికినము, చికిని ( అడ కత్తెరలో పోక చెక్క వలె – అని సామెత)

@ కాచు = కవిరి, కాచు వడియము, కైర వడి, ఖాదిరము, ఖదిర సారము, ఖాదిర ఘటిక, అద్భుత సారము

@కస్తూరి = సారంగ నాభి, కురంగ నాభి, జింక పొక్కిలి, ఏణ మదము, ఇట్టి గోరోజనము,
సహస్ర వేధి, లత, మోదిని

@కస్తూరి మృగ నాభి నుండి లభించే పరిమళ ద్రవ్యము కస్తూరి.

@ కర్పూరము = తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తా ఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, ఘన రసము, గంబుర, గంబూరము, గంబురా, భూతికము, లోక తుషారము, శీత కరము, శీత ప్రభము, శుభ్ర కరము, హిమ కరము, హిమ వాలుక, హిమాంశువు, సోమము, సోమ స్యంజ్ఞ

**************************************

ఇక వక్కతో పాటు, జంట కవులలాగా తప్పని సరిగా ఉపయుక్తమయ్యే కిళ్ళీ ద్రవ్యము “సున్నము“.

సున్నము = చూర్ణము, చుర సుధ
"చూర్ణ కారుడు" అని ,సున్నము ప్రోడక్టు చేసే వానికి గల పేరు.

@ జాపత్రి = జాతి పత్రి, జాపత్తిరి, జాతి కోశము, కోశి

@ లవంగము = కరం పువు, దివ్యము, దేవ కుసుమము, వశ్యము, ముఖ ప్రియము, శ్రీ సంజ్ఞము

@ ఏలక్కాయ = ఏలకి, ఏలకులు, ఏలక్కాయలు, నిష్కుటి, మాలేయము, మేష పృధ్వీక


"భోజనము చేయుట" మన భారత దేశములో ఒక కళా సాంప్రదాయముగా పరిఢవిల్లుతూన్నది. విందు కుడిచిన పిమ్మట తాంబూల సేవనము చేస్తేనే సుఖ భోజనము చేసినట్లు.

కేవలం వక్కతో సరి పెట్టు కోకుండా
జాపత్రి, కరక్కాయ, లవంగాలు, ఏలకులు, కస్తూరి, కర్పూరము
ఇత్యాది దినుసులు కూడా తాంబూల విడియములో అంతర్భాగాలు ఐనవి.
కరక్కాయ, కాచు మిన్నగునవి ఆయుర్వేద వైద్య విధానములో
అనూచానముగా ఊపయుక్తమౌతూన్నవి;
కనుకనే తాంబూలములో ఇవి అదనపు కానుకలు;
ఇవి దంతములకు, చిగుళ్ళకూ ఆరోగ్యాన్నీ, దృఢత్వాన్నీ పరిపోషించే ఆహార పదార్ధాలే!

ఇలాగ ఇన్ని రకాల మేళవింపులతో మనము తయారు చేసుకుంటున్నదే తాంబూలము.
కిళ్ళీ _ నేడు కిళ్ళీలలో గులాబీ రేకులను తేనెలో కలిపి సిద్ధము చేసిన “గుల్కందా“ను కూర్చుతున్నారు.
వీధి వీధినా కిళ్ళీ డబ్బాలు/ pan shop లు ఉంటున్నాయి.
కిళ్ళీ కొట్లు, పాన్ మసాలాల అంగడి ల వలన లక్షలాది మందికి జీవనోపాధి దొరుకుతూన్నది .

మరి ఇప్పుడు "కిళ్ళీ" కి కల నామ ధేయాల తోరణాలను తిలకించుదామా!

తాంబూలము = విడియము, వక్కాకు, తాంబూల విడియము, విడియ, వీడ్యము, వీటి, వీటిక , తము, తమ్ములము, తములము, ముఖ భూషణము

@ వక్కలకు ఉన్న నామావళిని వీక్షించాము కదా!

అలాగే, పోక చెక్కలు - కు గల నామములను అవలోకిద్దామా!!?

పోకలు = నెల వత్తి, పూగ భాగములు, పోక చెక్కలు, పోక పలుకులు, భాగాలు

ఈ రీతిగా తాంబూలమేనా- దానితో పాటే "తాంబూల విడెము"లోని ఇతరేతర దినుసులు కూడా "మాన్య పండిత ప్రకాండుల విద్వత్తు"చే నానా విధ నామ ధేయములతో సంభావింప బడినవి.
„సున్నపు కాయ, కత్తెరయు జొక్కడ కొత్తును ;
వక్క లాకులున్ వన్నెగ జాల వల్లిక , లవంగము లాదిగ కూర్చి........ "
తమాల వల్లరుల వర్ణనలతో మన కావ్యాలలో సుగంధములు వెద జల్లినాయి.
లక్షలాది మందికి బతుకు తెరువును కల్పిస్తూ, కోట్లాది జనుల జిహ్వలను రంజింప జేస్తూన్న కిళ్ళీ మీద పాటలుsuper hit లు ఐ, ప్రేక్షక ప్రజావళి కూని రాగాలకు ఆలవాలమైనాయి.

విభిన్న భాషలలో తాంబూలము పేర్లు ;;;;
_________________________

క్రీస్తు పూర్వము 600 సంవత్సరములో వెలువడిన "సుశ్రుత సంహిత" లో "నాగ వల్లి/ తాంబూలము" పేర్కొన బడినది. దీనిని బట్టి ఎంతటి ప్రాచీన సాంప్రదాయ విశిష్టతను , దాని మూలంగా చారిత్రక వైశిష్ట్యతనూ కలిగి ఉన్నదని, తాంబూలము ప్రాముఖ్యత ద్యోతకమౌతూన్నది.

“నాగూర్ వేల్ “ అని గుజరాతీ భాషలో పిలుపు.

మన తెలుగు దేశములో జరుగుతూన్న పెళ్ళి వేడుకలలో „ నాగ వల్లీ సదస్యము“ ఎల్లరకూ కన్నుల పండుగయే!

నాగ వల్లి, తమాలము, తాంబూలము, అనేవి దాదాపు అనేక భరతీయ భాషలలో వాడుకలో ఉన్నది.
అరబ్బులు, పర్షియన్ భాషలలో "తాంబన్" అనే పదం ఉన్నది, తాంబూలము నకు సోదరీ పదమే ఇది.
క్రీస్తు పూర్వము నుండీ వ్యాపార స్థాయిలో "తాంబూల తీగలను" చెట్ల నీడలలో పెంచుట ఆరంభమైనది. హిందూ స్థాన్ లో వాణిజ్య స్థాయిలో ఆవిష్కరించ బడిన తమలపాకులు క్రమంగా ప్రపంచ దేశాలకు పరిచయం ఐనాయి.

నాలుకలను ఎర్రని రంగుల పూవులుగా సుందరంగా చేస్తూన్న "కిళ్ళీ" వెరసి "తాంబూలము"నకు జేజేలు!

Share My Feelings


By kadambari piduri,
Jul 3 2010 1:54AM


ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...