31, అక్టోబర్ 2010, ఆదివారం

ఆహ్లాద దీపావళి

















"దిబ్బూ, దిబ్బూ, దీపావళి
మళ్ళీ వచ్చెను నాగుల చవితి"

పండుగలు, భగవంతుని లీలలూ
భక్తి వాఙ్మయములో, సూఫీ కవితలలో
మేలిమి కాంతులీనాయి.
ఆబాల గోపాలమునూ అలరించే "దీపావళి" హుషారు గొలిపే పండుగ.
అందుకే, జాన పద గీతాలలో ఈ పబ్బము గుబాళించింది.
"దీపావళీ" అంటే 'దీపాల వరుసలు' అని అర్ధము.
ఈ పబ్బము నాడు, టపాసులు, బాణసంచాలు, మతాబాలు,
సీమ టపాసులు, చిచ్చుబుడ్లు , సరంజామాతో
ఇలా అనేక రకాల వెలుగులతో "జగమంతా కాంతి మయము" గా చేసి
తన పేరునకు సార్ధకత ను కలిగించుకున్నట్టి అపురూపమైన పండుగ.
అందుకే, దాదాపుగా ప్రపంచములో అన్ని దేశాలలోనూ
ఈ పండుగ ఆచరించ బడుతూన్నది.
ఆ యా దేశాలలో దీపావళి విభిన్నమైన నామ ధేయములతో ఉన్నది.

గౌతమ బుధ్ధుని అవతరణ సందర్భము గా .......
బర్మా(మియన్మార్) లో నవంబరు లో ...." తంగీజు"
బీహారు రాష్ట్ర వాసులు, నేపాల్ దేశీయులు
వరుసగా,...... ఐదు రోజులు ...
జపాను దేశములో -" తోరా నగీషి" పర్వ దినమును చేసు కుంటారు.
జపనీయులు మొదటి రోజున దీపాల వేడుకను జరుపుకుంటారు.
మర్నాడు బంధు,మిత్రులను కలుస్తారు.
మూడవ రోజునాడు " బోటు షికార్లు చేస్తూ" ఆనందముగా గడుపుతారు.

నవంబరు 5 వ తేదీన _ ఇంగ్లండు లో _ "గై ఫాల్సు డే"

ఫ్రెంచి విప్లవము _ ఫ్రాన్సు దేశములో, ఫ్రెంచి వారు దేదీప్య మానముగా
తమ స్వాతంత్ర్య దినమునే వేడుకగా చేసుకుంటారు.

జూలై 4 వ తేదీ _ అమెరికాలో అద్భుతమైన బాణసంచాల వేడుకలు జరుగుతాయి.
ఎందుకంటే, జూలై 4 ననే, అమెరికా, 13 రాష్ట్రాల కూటమి గా ఏర్పడెను,గనుక!!!!!

ఇజ్రాయెల్ లో _ 21 శతాబ్దముల క్రితము,
" మోకాబిన్స్" అనే గాయకులు స్వాతంత్ర్య సమరం చేసారు.
జ్వాలకు విముక్తిని కలిగించిన రోజుగ, ఇజ్రాయిలీలు వేడుకలు జరుపుకుంటారు.
విభిన్న నామాలు ఉన్నప్పటికిన్నీ పండుగ పేరు ఏదైనా 9 - 8 - 2008
ఎల్లరి ఉల్లములకు ఉల్లాసాన్ని కలిగించే ఈ పండగ , కడు వేడుకయే!!!
హిందువులు విదేశాలలో ఏ రీతిగా పండుగలు చేసుకుంటున్నారో
( ఈ వీడియోలో) చూడండి

"దీపావళి" అనగానే ఎంత సందడి. ఎన్ని కేరింతలు, ఎన్నెన్ని జే జేలు!!!
అందరికీ దీపావళి శుభా కాంక్షలు!!!!!!

29, అక్టోబర్ 2010, శుక్రవారం

తుమ్మెదల మెట్ట దాకా పరుగు
















"సింహాచలము మహా పుణ్య క్షేత్రము,
శ్రీ వరాహ నర సింహుని దివ్య ధామము."
వీర భాను దీపుడు, కిమిడి ప్రభువు,
వల్లభాసావాస మల్లుడు, కొండ వీటి రెడ్డి రాజులు,
శ్రీ కృష్ణ దేవ రాయలు గారి పట్ట మహిషి, మున్నగు వారు
సింహాచల స్వామికి విలువైన కానుకలను సమర్పించారు.
స్వామిని అర్చించి, పలువురు అనేక శిల్ప, మండప,
సోపానాది నిర్మాణాలను వెలయించారు.
18 వ శతాబ్ద ఆరంభం నాటికి సింహాచల క్షేత్రము
కటకము పరిపాలకుల ఆధ్వర్యంలో ఉండేది;
కాల క్రమేణా
పూసపాటి విజయ నగర ప్రభువులు నిర్వహణలోనికి వచ్చినది.
నేటికీ ఇక్కడ ఉన్న అసంఖ్యాక శాసనాలు,
దేవళమునకు భక్తులు సమర్పించిన భూ దానములు వగైరాలు,
చక్రవర్తుల బహుమతులు – మున్నగునవి .
ఎన్నిటికో శిలా, శాసన రూపాదులలో ఉండి,
History Reaserch చేసే వారికి
అమూల్య వరములుగా ఒనగూడుతునాయి.
చైత్ర శుద్ధ ఏకాదశి మొదలు పౌర్ణమి వఱకు జరిగే
“శ్రీ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు”
భక్త జనులకు నయన పర్వములు చేస్తున్నాయి.
సింహాచల క్షేత్ర మహిమలను కీర్తిస్తూ
శతకములు, సాహిత్యము వెలువడినవి.
విజయ రామ రాజు గజపతి అధికారములో ఉన్నప్పుడు
ఒక విశిష్ట సంఘటన జరిగినది.
మొగలాయీ సైన్యము దండ యాత్రలతో దేశము అల్ల కల్లోలముగ ఉన్నది.
తురుష్క సైన్యం దేవాలయాలను ధ్వంసం చేసే వారు.
సింహాచల క్షేత్రము కొండను ఎక్కాయి.
కొంత మేర కళ్యాణ మండప స్థంభాలను పగల గొట్టారు.
కోవెల తలుపులను కూడా విరగ్గొట్టి, లోనికి ప్రవేశించబోయారు.
అప్పటికే లోపల ఇద్దరు భక్తులు ఉన్నారు.
ప్రాణ త్యాగానికైనా సిద్ధ పడిన
ఆ భక్తుల పేర్లు గోకుల పాటి కూర్మ నాథ కవి, హరి హర దాసు.
వారిరువురు తలుపులు మూసుకుని
స్వామి మీద ఆశువుగా శతకమును చెప్ప సాగారు.
కూర్మ నాథ కవి పద్యాలను చెప్తూంటే,
హరి హర దాసు వ్రాయ సాగాడు.
వేద వ్యాసుని నుడువులుగా
“మహా భారతము” అనే నామముతో ప్రసిద్ధికెక్కిన
హిందువుల ఇతిహాసము ఐన “జయం” ను
తన దంతముతో వినాయకుడు రాసి పెట్టిన
మహత్తర సంఘటనకు సామ్యముగా ఇచ్చట జరిగినది.
“ వై రి హర రంహ సింహాద్రి నర సింహ” అనే మకుటముతో
సీస పద్య హారము వెలసినది.
బయట ముష్కరుల సైన్యము
ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ముట్టడి చేసారు.
అప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగినది.
వేలాది తేనెటీగల దండు ఒక్కుమ్మడిగా ఆ ముష్కరులపై దాడి చేసాయి.
గుంపులు గుంపులుగా ఆ తేనెటీగలు దుష్ట బుద్ధి కల ఆ దుర్మార్గులను తరిమికొట్టాయి.
విశాఖ పట్టణములోని “తుమ్మెదల మెట్ట” దాకా
శత్రువులను పార ద్రోలినాయి.
పూసపాటి విజయ రామరాజు పరిపాలనా కాలంనాటికి
దేవాలయమునకు విశిష్ట సాంప్రదాయములు సమకూడినవి.
“శ్రీ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు” ,
వైశాఖ శుద్ధ తదియ నాటి “స్వామి వారి నిజ రూప దర్శనము” లబ్ధిని
ప్రజా కోటి పొందుతున్నారు.
ఆ నాడు వలిచిన “సింహాచల స్వామి వారి ” చందనము తో
కలిపిన దివ్య తీర్థము లభిస్తుంది.
అక్షయ తృతీయ ఉత్తరాది నుండి దిగుమతి ఐ,
ఇప్పుడు మన దక్షిణ భారత సీమలలో కూడా
ప్రాచుర్యంలోనికి వచ్చిన పండుగ.
సింహాచలములో
క్రీస్తు శకము 1293 నుండి ఒక ఆచారము ఏర్పాటు ఐనది.
గంధము, హరి చందనము, కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యాలను నూరుట –
ఒక పవిత్ర కార్యక్రమముగా మొదలు పెడ్తారు.
పురూరవ మహా రాజుకు ఆకాశ వాణి ఇచ్చిన ఆదేశము మేఱకు
" అక్షయ తృతీయ నాడు, చందన వలుపు ఉత్సవము జరుగుటకు
బీజము పడినదని పౌరాణిక గాథ.
ఆ రోజు శ్రీ వరాహ నరసింహ మూర్తి నిజ రూప దర్శనము అందరికీ లభిస్తూన్నది.
3 రోజులు ముందు నుండి "జల ధారలను" విగ్రహముపై చిలకరిస్తూ ఉంటారు.
ఇందు చేత గట్టిగా ఉన్న చందనము మెత్త బడి, వలవడానికి అనువుగా మారుతుంది.
కప్ప స్తంభము ఇచ్చటి ప్రత్యేకత.
"సంతాన వేణు గోపాల స్వామి" అనుగ్రహము లభించి,
"దంపతులకు సంతానము కలుగును.
"కప్పస్తంభము"ను తాకి, వరములు కోరుట ఇచ్చటి విశిష్టత.

;;;;;;; అక్షయ తృతీయ (‘చందనొత్సవం’)

27, అక్టోబర్ 2010, బుధవారం

అయస్కాంతము చెట్టు; " శివానంద లహరి"లోని 61,













అంకోలం నిజ బీజ సంతతిః
అయస్కాంతో ఫలం సూచికా ||
అమోఘ ప్రతిభా శాలి శ్రీ ఆది శంకరాచార్య రచించిన
"శివానంద లహరి" లోని 61 వ శ్లోకంలో
ఇలాగ - ఊడుగ చెట్టు అనగా అంకోలం తరువును గురించిన ప్రస్తావన ఉన్నది .
తాత్పర్య :
" Eranzhil tree / azhinjil (Tamil) /అంకోలం విత్తనములు
తన మాతృ వృక్షమునకు అతుక్కుంటాయి.
ఆ వృక్షమునకు గల ఇనుము వంటి గుణము కల
ఆ చెట్టు ముళ్ళకు అయస్కాంతము పట్ల ఆకర్షిత గుణమును కలిగి ఉన్నాయి
లతలు/ తీగ పాదపము మ్రాను చుట్టూతా పెనవేసుకుంటుంది.నది సముద్రములో కలుస్తుంది.పశుపతి నాధుని, మహేశుని చరణ పద్మములకు భక్తి భావనలు లీనమౌతాయి."
అంటూ శ్రీ కంచి పీఠాధిపతి ఈ మహత్తర శ్లోకానికి వివరణను ఇచ్చారు.

Kanchi Mahaperiyavar, Sri Chandrasekharendra Sarasvathi Swami:
భక్తి మార్గము యొక్క విశిష్టతను
" శివానంద లహరి"లోని 61వ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని చేసిన వర్ణన ఆణి ముత్యమే కదా!
తమిళ నాడులో "అంకోల గణపతి దేవళము" ఉన్నది.
స్వయం భూ గణపతి అంకోల పాదపము వద్ద వెలసెను;
అందు చేత ఆ సైకత వినాయకుడు - అంకోల గణపతి గా వాసి కెక్కెను.
తెలుగులో అనేక వ్యవహార నామాలు కలవు;
Udaga, Uduga, Ooduga, Ankolamu, Urgu, Nalludugu, Nalla ankolamu chettu, Nallankolamu, Nallauduga, Nallaukolamu, Udugachettu, Uru

గజేంద్రుల “కుంద గ్రామము”














గజ రాజు వదనమును కలిగి ఉన్న "వినాయకుడు" ను,
మొట్ట మొదట పూజ చేసి,
అర్చన కార్యక్రమాలను కొనసాగిస్తారు మన భారతీయులు.
కంబోడియా, థాయ్ లాండ్, మియన్మార్ (బర్మా), శ్రీ లంక మున్నగు
అనేక ఆసియా దేశాలలో "ఏనుగు" ఆరాధ్యనీయమైన జంతువు.
లగ్జాండర్ హిందూ దేశముపై దండెత్తినప్పుడు,
పురుషోత్తమ మహా రాజు/ పోరస్ ఎదిరించి, నిలువరించాడు.
ఆ గ్రీకు వీరునికి
"గజ దళములను యుద్ధ రంగంలో వాడ గలుగుతూన్న
భారతీయుల రణ చాతుర్యానికి" అబ్బుర పడ్డాడు.
అప్పటి దాకా యుద్ధములలో
కేవలం అశ్వములనూ, కాల్బలములను నేర్చుకుని ఉపయోగిస్తూన్న పాశ్చాత్యులు.
ఆ నాటి నుండే యూరోపులో పోరులో ఏనుగులను కూడా వాడటము మొదలు పెట్టారు.
కేరళలోనూ, గోవా నుండీ, అండ మాన్ దీవులూ, శ్రీలంక వఱకూ
సముద్రములోనే ఏనుగులు ఈదుకుంటూ వెళ్ళ గలవు;
ఇలాగ గజ రాజులకు శిక్షణను ఇచ్చిన ఘనత
ప్రపంచములోనే _
మన భారత దేశములోని మావటి వాళ్ళకే దక్కుతూన్నదీ -
అని మనం ఘంటా పథంగా చాట గలము.
రాజ స్థాన్లో గజేంద్రుల సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు.
మత్తేభాల పోషణ,సంరక్షణ,అజమాయిషీ చేయడం మావటి వాళ్ళ విధులు .
అలాంటి 51 మావటీల కోసమూ, వారి ఏనుగుల కోసమూ
“కుంద గ్రామము” ను నెలకొల్పారు.
”భారత దేశంలోని ప్రప్రథమ హస్తి గ్రామం”గా సంబరాలను జరుపుకుంటూ,
యాత్రా సందర్శకులకు ఈ గ్రామము ప్రత్యేక ఆకర్షణగా మారింది.
రాజ స్థాన్లో గజేంద్రుల సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు.
రాష్ట్ర ఉత్తర ప్రాంతంలో భూమిని కేటాయించారు.
చారిత్రక ప్రాముఖ్యత కలిగిన “ అమర్ కోట “ కు దగ్గరలో
ఈ mahouts village ని, రాజస్థాన్ స్టేట్ గవర్నమెంటు ఏర్పరచింది.
ఈ పల్లె రాష్ట్ర రాజధాని “జైపూర్”కు సమీపం లో ఉన్నది .
“ జంతు ప్రపంచానికి ఇది గొప్ప వరము.
ప్రస్తుతము 51 ఏనుగులకు ఇచ్చట వసతి సౌకర్యాలను కల్పిస్తున్నాము,
తక్కిన వానికి కూడా త్వరలోనే ఈ సదుపాయాలను ఏర్పాటు చేస్తాము.” అంటూ,
Rajasthan Tourism Minister Bina Kak అభిభాషించారు
“నాకు వర్ణించ లేనంతా ఆనందంగా ఉంది.
మావటి వారి యొక్క 40 సంవత్సరాల కల ఈ నాడు సాకారం పొందింది. "
అని “ గజ సంరక్షకుల అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ రషీద్ చెప్పాడు.
అమర్ దుర్గంలోని 113 ఏనుగులు టూరిస్టులను అలరిస్తూంటాయి.
వైస్ ప్రెసిడెంట్ శ్యాం గుప్త
“ ఇటు స్వదేశీయులకూ, అట్టి విదేశీ టూరిస్టులకూ
ఏనుగు సవారీ ముఖ్య ఆకర్షణ, ప్రత్యేకించి,
ఇందుకోసమే డిమాండు ఉంటూన్నది కూడా!” అని వివరించారు.
జంతువుల కోసం నీటి కొలనును, వెటెర్నరీ క్లినిక్ నూ నిర్మించారు.
“ ఒక ఏనుగు రోజూ నాలుగు రౌండ్లు సవ్వారీలను తిప్పుతుంది.
ఇందుకు 20 డాలర్లు ఆదాయం, అంటే 20 డాలర్లు లభిస్తాయి.
అందులో నుండి 200 రూపాయలు జంతు సంక్షేమానికై చేర్చ బడతాయి. "
అని శ్యాం గుప్త చెప్పారు.
ప్రతి ఏటా 1.4 million tourists అమర్ దుర్గాన్నీ, పల్లెటూరునూ దర్శిస్తారు.
ఏనుగుల నెక్కి, సవారీ చేసే అవకాశమే ప్రధాన ఆకర్షణ కదా మరి!
కాస్త భూత దయకు మనసులో కూస్తంత జాగాను
మానవుడు ఇవ్వాలి.
రాజస్థాన్ రాష్ట్రం బాటలో
ఇతర రాష్ట్రాలు అడుగులు వేస్తే,
అటు జంతు సంరక్షణా దృక్పథంతో పాటు ఆదాయమూ,
ప్రజలకు వివిధ ఉపాధి మార్గాలూ ఏర్పడతాయి కదూ! ఔనా మరి!

*********************************************
మన కేంద్ర ప్రభుత్వం “ జాతీయ వారసత్వ జంతువుగా -ఏనుగు”ను గుర్తించినది.
ఆగస్టు 31, 2010 న భారత కేంద్రం “Elephant Task Force” ను నియమించింది.
మన దేశంలో నిర్దాక్షిణ్యంగా ఏనుగుల వధ జరుగుతూన్నది.
ఈ దుర్మార్గాన్ని నివారించే దిశగా
ఇండియన్ గవర్నమెంటు 12 మంది సభ్యులతో కూడిన
“ ఎలిఫంట్ టాస్క్ ఫోర్సు” ను నియమించింది.
కమిటీ సభ్యులు కొన్ని సూచనలను చేస్తూ
ఒక నివేదికను తయారు చేసారు.
“గజ రాజులకు ప్రత్యేక గుర్తింపును కల్పించడం ద్వారా
హస్తి సంపదను కాపాడ గలమని చెబుతూ,
వానిని సంరక్షించే మార్గాలను వివరించారు.
పర్యావరణ మంత్రి జై రాం రమేష్ తన ప్రకటనలో ఇలా అన్నారు
“ఏనుగులు ఎన్నో ఏళ్ళుగా మన సంస్కృతిలో భాగం.
పులుల మాదిరిగానే వీటిని కూడా సంరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.”
2010 August 13 న “వన్య ప్రాణుల బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశం లో
కీలక అంశాలను చర్చించినారు.
ఎలిఫంట్ టాస్క్ ఫోర్స్ ప్రతిపాదనను అనుసరించి,
కేంద్ర ప్రభుత్వం “వన్య ప్రాణ సంరక్షణ చట్టము”ను
సవరించేందుకు ఉద్యుక్తమైనది.
రాబోయే శీతా కాల పార్లమెంట్ మీటింగులలో ఈటాస్క్ ఫోర్సు,
కమిటీల ప్రపోజల్సుకు అనుగుణంగా బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నది.

25, అక్టోబర్ 2010, సోమవారం

తూలిక చమత్కారం














ఈ ఫొటోను జాగ్రత్తగా గమనించండి.
దీనిలో అంతర్లీనంగా ఉన్న బొమ్మలోపలి బొమ్మలోని నిగూఢ భావం
చిత్రకారుని తూలిక నుండి వెలువడిన చమత్కారం..........

1. కను బొమ్మల క్రిందుగా ఉన్న చిత్రణ -> ఒక యువతి, ఒక యువకుడు ;
జీవితపు దశల గురించిన
నిగూఢ విచిత్రములను ద్యోతకము చేస్తూన్నది .
Artist ప్రజ్ఞకు నిదర్శనం ఈ బొమ్మ.
~~~~~



















పాఠక మిత్రులారా! కొన్ని యోచనల వ్యక్తీకరణలను,
"Classic definition & Cool Meanings innew dictionary "
1. Cigarette: A pinch of tobacco rolled in paper with fire at one end
& a fool at the other.

2. Love affairs : Something like cricket
where one-day internationals are more popular than a five day test.

3. Marriage : It's an agreement in which a man loses his bachelor degree
and a woman gains her master .

4. Divorce : Future tense of marriage .

5. Lecture : An art of transferring information from
the notes of the lecturer to the notes of the students
without passing through "the minds of either".

6. Conference : The confusion of one man multiplied by the number present.

7. Compromise : The art of dividing a cake in such a way
that everybody believes he got the biggest piece.

8. Tears : The hydraulic force by which masculine will-power is defeated
by feminine water-power. ..

9. Dictionary : A place where divorce comes before marriage.

10. Conference Room : A place where everybody talks,
nobody listens & everybody disagrees later on.

11. Ecstasy : A feeling when you feel
you are going to feel a feeling you have never felt before.

12. Classic: A book which people praise, but do not read.

13. Smile : A curve that can set a lot of things straight.

14. Office : A place where you can relax after your strenuous home life.

15. Yawn : The only time some married men ever get to open their mouth.

16. Etc .: A sign to make others believe
that you know more than you actually do.

17. Committee : Individuals who can do nothing individually
and sit to decide that nothing can be done together.

18. Experience : The name men give to their mistakes.

19. Atom Bomb : An invention to end all inventions.

20. Philosopher : A fool who torments himself during life,
to be spoken of when dead.

21. Diplomat : A person who tells you to go to hell in
such a way that you actually look forward to the trip.

22. Opportunist : A person who starts taking bath
if he accidentally falls into a river.

23. Optimist : A person who while falling
fromEiffel Tower says in midway "See I am not injured yet."

24. Pessimist : - A person who says that O is the last letter in ZERO,
Instead of the first letter in word OPPORTUNITY .

25. Miser : A person who lives poor so that he can die rich.

26. Father: A banker provided by nature. (Now and Then)

27. Criminal: A guy no different from the rest...
except that he got caught.

28. Boss : Someone who is early when you are late
and late when you are early.

29. Politician : One who shakes your hand before elections
and your Confidence after.

30. Doctor : A person who kills your ills by pills, and kills you with his bills.

31. GROUP MODERATOR : One who gets paid for reading such mails.

24, అక్టోబర్ 2010, ఆదివారం

గాంధీ పాదుకా పట్టాభిషేకము

















మహాత్మా గాంధీజీ తో సన్నిహిత అనుబంధం ఉన్నవారిలో ముఖ్యుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకడు.
బాపూజీ south Africaలో ఉన్నప్పూడు
తన జీవితాన్ని ఆదర్శ ప్రాయంగా నిలపగలిగేందుకు ఉన్న పునాదులను
బలిష్ఠంగా చేసుకునే దిశలో ఆయన తన ప్రవర్తనను మలుచుకున్నారు.
ఆ టైమిలో దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వ ప్రెసిడెంటుగా Smutts ఉన్న ఆ టైములో
గాంధీజీ అక్కడ నివసించారు.అప్పుడు గాంధీ చెప్పులూ, బూట్లూ చేయడం నేర్చుకున్నారు.
స్మట్స్ నియంతగా వ్యవహరించే వాడు.భారతీయుల పట్ల
నిరంకుశ ధోరణి విపరీతంగా ఉండే వాడు స్మట్స్.
ఆ క్రమంలో గాంధీజీ కూడా చెరసాల పాలయ్యారు.
బాపూజీ కారాగారంలో ఉన్నప్పుడు కూడా వృధా కాలయాపన చేసే వారు కాదు.
తాను అభ్యసించిన పాదుకా కళా ప్రావీణ్యాన్ని సద్వినియోగ ప్-అరుచుకున్నారు.
జైలులో బూట్ల జతను కుట్టారు. సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు తిరిగి వచ్చేటప్పుడు
“తాను తయారించిన ఆ pair of shoesను General Smutts కు బహుమతిగా ఇచ్చారు
ఇలాంటి సౌజన్యతకు ముగ్ధుడైన స్మట్స్
ఆ షూస్ ను 24 సంవత్సరాల పాటు తన వద్ద భద్రంగా దాచుకున్నాడు,
తర్వాత 60 వ జన్మ దిన ( షష్ఠి పూర్తి) సందర్భంగా మహాత్మా గాంధీజీ కి మరల ఇచ్చేసారు.
అప్పుడు స్మట్సు ఒక చిన్న లేఖా వాక్యాన్ని దానికి జత చేసారు .
“I don't suppose I have the right to step on the footwear
presented by a Mahatma like you”.
లెట్టర్తో జత చేసి వినయంగా పంపించాడు మిష్టర్ స్మట్స్.
ఇలాంటి సంఘటన మరోటి కూడా జరిగింది.
Yerawada Jailలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు.
"ఉక్కు మనిషి”అని బిరుదు పొందిన వల్లభాయ్ పటేలు,
ఎరవాడ జైలు లోని ఇతర స్వాతంత్ర్య పోరాట యోధులు అందరితో బాపూజీ స్నేహంగా ఉండే వారు.
sardar vallabhay patel చెప్పులు అరిగి పోయి,
శిధిలావస్థలో ఉన్నాయి. చివికి, జీర్ణమై పోయిన ఆ pair of chappalను గమనించారు గాంధీ.
“ వల్లభాయ్ పటేల్జీ! మీకు చెప్పులను కుట్టి ఇస్తాను. “అన్నారు.
అందుకు బదులు ఇచ్చారు సర్దార్ పటేల్
"బాపూజీ! అది మహద్ భాగ్యం . మీరు స్వయంగా చేసిన ఆ చెప్పులలో నా కాళ్ళు పెట్ట లేను,
కానీ వాటిని నా తలపై పెట్టుకుంటాను.
శ్రీరాముని పాదుకలను భరతుడు తల దాల్చినట్లు,
నేను నా శిరస్సుపై పెట్టుకుంటాను.
దయ చేసి, నా చెప్పుల కోసం అంత శ్రమ తీసుకోకండి మహాత్మా!”
“పాదుకా పట్టాభిషేకము” వంటి సంఘటన ద్వారా
ఉన్నత మానవీయ సంబంధ బాంధవ్యాలను నిరూపించిన
ఐతిహాసిక సంఘటనల పరంపర సౌహార్ద్ర కోణంలో తటస్థ పడటం –
బహుశా ప్రపంచ చరిత్రలో మన భారత దేశంలోనే జరిగిందని చెప్ప వచ్చును
బాపూజీ south Africaలో ఉన్నప్పుడు
తన జీవితాన్ని ఆదర్శ ప్రాయంగా నిలపగలిగేందుకు ఉన్న పునాదులను
బలిష్ఠంగా చేసుకునే దిశలో ఆయన తన ప్రవర్తనను మలుచుకున్నారు.
ఆ టైమిలో దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వ ప్రెసిడెంటుగా Smutts ఉన్న
ఆ టైములో గాంధీజీ అక్కడ నివసించారు.అప్పుడు గాంధీ చెప్పులూ, బూట్లూ చేయడం నేర్చుకున్నారు.
స్మట్స్ నియంతగా వ్యవహరించే వాడు.భారతీయుల పట్ల నిరంకుశ ధోరణి విపరీతంగా ఉండే వాడు స్మట్స్.
ఆ క్రమంలో గాంధీజీ కూడా చెరసాల పాలయ్యారు.
బాపూజీ కారాగారంలో ఉన్నప్పుడు కూడా వృధా కాలయాపన చేసే వారు కాదు.
తాను అభ్యసించిన పాదుకా కళా ప్రావీణ్యాన్ని సద్వినియోగ ప్-అరుచుకున్నారు. జైలులో బూట్ల జతను కుట్టారు.
సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు తిరిగి వచ్చేటప్పుడు
“తాను తయారించిన ఆ pair of shoesను General Smutts కు బహుమతిగా ఇచ్చారు.
ఇలాంటి సౌజన్యతకు ముగ్ధుడైన స్మట్స్ ఆ షూస్ ను
24 సంవత్సరాల పాటు తన వద్ద భద్రంగా దాచుకున్నాడు,
తర్వాత 60 వ జన్మ దిన ( షష్ఠి పూర్తి) సందర్భంగా మహాత్మా గాంధీజీ కి మరల ఇచ్చేసారు.
అప్పుడు స్మట్సు ఒక చిన్న లేఖా వాక్యాన్ని దానికి జత చేసారు .
“I don't suppose I have the right to step on the footwear presented by a Mahatma like you”. లెట్టర్తో జత చేసి వినయంగా పంపించాడు మిష్టర్ స్మట్స్.
ఇలాంటి సంఘటన మరోటి కూడా జరిగింది.
Yerawada Jailలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు.”ఉక్కు మనిషి”అని బిరుదు పొందిన వల్లభాయ్ పటేలు, ఎరవాడ జైలు లోని ఇతర స్వాతంత్ర్య పోరాట యోధులు అందరితో బాపూజీ స్నేహంగా ఉండే వారు.
sardar vallabhay patel చెప్పులు అరిగి పోయి, శిధిలావస్థలో ఉన్నాయి.
చివికి, జీర్ణమై పోయిన ఆ pair of chappalను గమనించారు గాంధీ.
“ వల్లభాయ్ పటేల్జీ! మీకు చెప్పులను కుట్టి ఇస్తాను. “అన్నారు.
అందుకు బదులు ఇచ్చారు సర్దార్ పటేల్
” బాపూజీ! అది మహద్ భాగ్యం .
మీరు స్వయంగా చేసిన ఆ చెప్పులలో నా కాళ్ళు పెట్ట లేను,
కానీ వాటిని నా తలపై పెట్టుకుంటాను.
శ్రీరాముని పాదుకలను భరతుడు తల దాల్చినట్లు,
నేను నా శిరస్సుపై పెట్టుకుంటాను.
దయ చేసి, నా చెప్పుల కోసం అంత శ్రమ తీసుకోకండి మహాత్మా!”
“పాదుకా పట్టాభిషేకము” వంటి సంఘటన ద్వారా
ఉన్నత మానవీయ సంబంధ బాంధవ్యాలను ని రూపించిన
ఐతిహాసిక సంఘటనల పరంపర సౌహార్ద్ర కోణంలో తటస్థ పడటం –
బహుశా ప్రపంచ చరిత్రలో మన భారత దేశంలోనే జరిగిందని చెప్ప వచ్చును

[Gandhi, the shoe maker:]

17, అక్టోబర్ 2010, ఆదివారం

శ్రీ ఈశుని పార్వతి దేవి
















రావి చెట్టు, వేప చెట్టు
పెళ్ళి సంబరాలు ;
అరటి తోట, నారికేళం
తోటల దోబూచుల ఆటలు ;

అరటాకుల కల కండలు,
వెన్న ముద్ద, కొబ్బరి ముక్కల్లు ;
క్రిష్ణయ్యా! పదవోయీ!
అమ్మ వారి కోవెలకు

చెరకు గడలు మీళాయించి
ప్రసాదాల వైభోగం
శ్రీ ఈశుని పార్వతి దేవి
మనకొసగును అనుగ్రహం

16, అక్టోబర్ 2010, శనివారం

"అమర కోశము" నిఘంటువు - (“Dictionaries Day” )
















అక్టోబర్ 16 వ తేదీ “Dictionaries Day” గా నిర్వహించబడుతూన్నది.
Espiranto language” ప్రయోగానికి
18 వశతాబ్దం ద్వితీయార్ధంలో ప్రప్రధమంగా శ్రీకారం చుట్టారు.
(Esperanto = widely spoken constructed international auxiliary language)
అన్ని భాషలలోనీ ఉపయుక్త అంశాలతో ఒక “ప్రపంచ భాష - ను నిర్మించే బృహ ప్రయత్నమే" ఇది.
ఐతే ఇది ఇంకా పూర్తిగా సాకారం అవలేదు.
హిందూ దేశంలో ఇలాంటి ప్రయత్నం క్రీస్తు పూర్వమే మొదలైనది.
ఆ ప్రయత్నం సక్సెస్ ఐనది కూడా!
ఆ విజయవంతమైన కార్యక్రమ సౌందర్య రూపమే “ సంస్కృత భాష”.
అలనాటి భాషా విద్వాంసుల కృషియే మన సంస్కృత భాష.
“దేవతల భాష’అనీ, “గీర్వాణ భాష” అనీ వినుతికెక్కినది.
“పాణిని” వంటి మేధావులు రూపొందించిన వ్యాకరణ పట్టిక – “న భూతో న భవిష్యతి"
అమర కోశము'' అనే సంస్కృత భాషా నిఘంటువును
4, 5 శతాబ్దాల నడుమ అమరసింహుడు రచించాడు.
వేలాది పదములను శ్లోకములుగా సౌందర్య భరితం చేసాడు మహా మేధావి అమర సింహుడు.
(1940 సంవత్సరములో కాకినాడ నుండి శ్రీ పతి ముద్రణాలయము ముద్రణ జరిగినది.
తర్వాత వావిళ్ళ వారు, జయ లక్ష్మీ పబ్లికేషన్ మున్నగు వారు
ఎందరో మహానుభావులు ఇట్టి అమూల్యమైన మన ఆర్ష విజ్ఞానాన్ని,
పురాతన సారస్వతాన్ని ఈ నాటి మనకు అందుబాటులో ఉన్నదీ అంటే - అట్టి వారి కృషియే కారణం.)
ఇందులో మూడు కాండలు అనగా (=భాగములు)ఉన్నవి.
అమర కోశములో
ప్రథమ కాండము లో ;;;;;
1."స్వర్గ వర్గము" -(మొత్తము 12) మొదలు "వారి వర్గము" వరకున్నూ ;;;

ద్వితీయ కాండములో ;;;;;
భూ వర్గము మొదలు శూద్ర వర్గము వరకున్నూ(10) ;

తృతీయ కాండము లో;;;;;
విశేష్య నిఘ్న వర్గము , సంకీర్ణ వర్గము ,
నానార్థ వర్గము , నానార్థావ్యయ వర్గము,
అవ్యయ వర్గము, లింగాది సంగ్రహ వర్గము (7) ఉన్నాయి..

శాశ్వతకోశము (నానార్ధములు),
అభిదారత్నమాల (పర్యాయపదములు),
ఏకాక్షర కోశము - ఇత్యాదిగా అనేక సంస్కృత నిఘంటువులు వెలువడినవి.

తెలుగులో ఈ నిఘంటు రచనకు కవి చౌడప్ప(17 వ శతాబ్దము)శ్రీకారం చుట్టాడు.
పైడిపాటి లక్ష్మణ కవి రచన ''ఆంధ్రనామ సంగ్రహము'',
అడిదము సూరకవి యొక్క ''ఆంధ్రనామ శేషము'' మున్నగు
(పద్య రూపంలో ఉన్న)దాదాపు 29 నిఘంటువులు
ఆంధ్ర మాతృ భాషా సేవకులకు లబ్ధములు ఐనాయి.

నేడు అ పరిమితమైన టెక్నికల్ , విజ్ఞానమువలన
సంఘములో పరిశ్రమలు, పత్రిక్తీసినిమాలూ ,రాజకీయములు,
పెను మార్పులతో ఆవిష్కరించబడిన ప్రపంచ సామాజిక చిత్రపటము మన ఎదుట ఉన్నది.
ఇందులో తప్పని సరిగా ప్రతి వ్యక్తీ భాగస్వామి అవవలసి వస్తూన్నది.
తత్ఫలితంగా, భాషకు అనేక కొంగ్రొత్త పదములు వాడుకలో అవసరం ఔతూన్నాయి.
అందువలననే డిక్షనరీలు అగణిత శాఖా కోణాలలో నిర్మితము ఔతూన్నాయి.
జర్నలిస్టులు, పత్స్టువార్తలు, ఇంజనీరు, లా, వైద్యము,ఖనిజములు ఇత్యాది శాఖలుగా
విసృతముగా డిక్షనరీలు మార్కెట్టులో ఉన్నాయి.
సాహిత్య చరణ మంజీరాలు అగణితముగ సంవృద్ధి చెంది , హృదయోల్లాసాన్ని కలిగిస్తూన్నాయి.
ఈ నాటి Dictionaies Day సందర్భముగా
మన "అమర కోశము" కర్త ఐన అమర సింహునికి జేజేలు పలుకుదాము.

"అమర సింహునికి జేజేలు.
"అమర కోశము" నిఘంటువు
పద రత్నాకరమ్ము;
ఆ శ్లోకమయ ఉద్గ్రంధము
మన జాతికే గర్వ కారణము."

12, అక్టోబర్ 2010, మంగళవారం

విజయ రాఘవ నాయకుని కొలువులో "శారదా ధ్వజము"

















తంజా వూరు మహా రాజు విజయ రాఘవ నాయకుని కొలువులో ఉన్న
చెంగల్వ కాళ కవి -
తనను వ్రాసిన "రాజ గోపాల విలాసము" నందు -
"శారదా ధ్వజము "ను సీస పద్యాలలో చేసిన వర్ణన ఇది .
మూలా నక్షత్రములో, దుర్గా దేవికి "శ్రీ సరస్వతీ దేవి అలంకారము"ను చేస్తున్నారు.
ఈ సందర్భముగా ఈ పద్యాన్ని పరికిద్దాము.
“ ఒక్కొక్క యెడ చీని చక్కెర పానకం
బానిన ట్లాహ్లాద మావహిల్ల

నొక్కొక్క యెడ తావి నెక్కొన విరజాది
సరము లెత్తిన రీతి పరిమళింప

నొక్కొక్క యెడ చల్వ లుప్పతిల్లంగ మంద
మారుతంబులు మించు మహిమ చెలగ

నొక్కొక్క యెడ మేన చొక్కు సంపాదించు
వెలది వెన్నెల తేట విధము మించ

కవిత రచియింప విజయ రాఘవ విభుండె
నేర్చు నని వాణి నర్తించు నేర్పు మీఱ
చామరానిల కందళ చలిత మగుచు
తనరు సభ యందు నల “ శారదా ధ్వజంబు "

చెంగల్వ కాళయ కవి "రాజ గోపాల విలాసము"ను రచించెను.
అయిదు ఆశ్వాసముల ఈ శృంగార కావ్యంలో
నాల్గు వందల డెబ్భై (470) పద్యాలు ఉన్నాయి.

"చంపకారణ్య మాహాత్మ్యము" అనే స్థల పురాణం నుండి ఈ కథను గ్రహించి,
చెంగల్వ కాళయ కవి విరచించెను.
చంపక వనమునందు తపసు చేసిన –
గోప్రళయ ముని కోరికను తీర్చుటకై
శ్రీ కృష్ణుడు ఆ చంపక వనములో వెలసెను.

సౌరాష్ట్ర దేశాధిపతి కథను జొప్పించిన "హరిద్రా నది మాహత్త్వము " ను
కొన్ని పద్యాలలో వర్ణించినాడు చెంగల్వ కవి.
చంపక వన క్షేత్రమున వెలసిన " రాజ గోపాల స్వామి " భక్తుడు - విజయ రాఘవ నాయకుడు .
"దక్షిణ ద్వారక"గా పేరొందిన ఈ క్షేత్రమును కేంద్రముగా గైకొని,
విజయ రాఘవ నాయకునికి అంకితమిచిచిన కావ్యమే ""రాజ గోపాల విలాసము".

సహ్యజా తీరమును బృందావనమనమునకు సమానము అనే దృష్టితో సాగిన
ఈ పద్య సంపుటిలో నిదే "శారదా ధ్వజము"ను తెలిపిన పై పద్యము.
[చెంగల్వ కాళ కవి వివరములు :::::
వీరు పాక నాటి నియోగి బ్రాహ్మణులు, శ్రీ వత్స గోత్రుడు,
అతని తాత కాళయ మంత్రి; పితా మహి ( నాయనమ్మ) గంగమాంబ ;;;;
చెంగల్వ కాళ కవి యొక్క తల్లి దండ్రుల నామ ధేయాలు కృష్ణమాంబ,వేంకటయ్య .
వేంకటయ్య రచించిన కావ్యము “ పార్వతీ పరిణయము మంత్రి వద్ద ”,
ఈయన “ రణ రంగ గంధ వారణ” అనే బిరుదు కలిగి ఉన్నట్టి
“ శ్రీ కంఠ భూపతి ” వద్ద మంత్రి .]

ఆనంద రూపిణీ!





















హరుని హృదయేశ్వరీ! ఆనంద రూపిణీ!
సురుచిర హాసినీ! చిన్మయ రూపిణీ!
గోముగ మా పూజలందుకోవమ్మా! ||

నీదు వాత్సల్యమున
నవ నవోన్మేషమౌ హర్ష సుధలను గ్రోలు
నీ బిడ్డలము మేము
గోముగ మా పూజలందుకోవమ్మా! ||
ఏ వేళనందైన
నీదు భావమ్ముల మావి చివురుల మెసవు
గాన కోకిలము మేము!
గోముగ మా పూజలందుకోవమ్మా! ||

10, అక్టోబర్ 2010, ఆదివారం

kandahar - మలయాళ భాష సినిమా













మలయాళ భాషలో వస్తూన్న “కాందహార్” సినిమా
వార్తలలో చోటు చేసుకుంటూన్నది.
మోహన్ లాల్ ఇందులో ముఖ్య పాత్రను ధరిస్తున్నాడు.
మేజర్ రవి దర్శకత్వంలో శర వేగంతో నిర్మాణమైన ఈ మూవీని
అతి శీఘ్రంగా , త్వరలో ( 2010 December - వచ్చే ఏడాది 2011 జనవరి నాటికి )
విడుదల చేయాలనే దృఢ సంకల్పంతో నిర్మాతలు ఉన్నారు.
గణేశ్ వెంకట్రామన్ మున్నగు వారు నటిస్తూన్నారు.
Major Ravi దర్శకునిగా
బహుశా ప్రపంచ సినిమా చరిత్రలోనే విశిష్ట స్థానాన్ని ఆర్జించాడని చెప్ప వచ్చును,
ఎందుకని అంటే ఆతడు
”Indian Army”- లో వీర జవాన్ గా 1975 లో జాయిన్ ఐ,
పదవీ కాలంలో ప్రతిష్ఠాత్మకమైన అనేక అవార్డులను పొందారు.
సినీ చరిత్రలో తన స్వీయ అనుభవాలే
మూల ధాతువులుగా చలన చిత్ర సారధ్యం వహించడము గొప్ప విశేషమే కదా!
సరే!
'నిఖిల్ కుంత డైరెక్టర్'గా నటుడు గణేష్ వెంకట్రామన్
ఇత్యాదిగా హేమా హేమీలు ఈ బృహత్తర కార్యంలో భాగస్వాములు.
(2006లో release అయిన
The Angrez లో నటుడు గణేష్ వెంకట్రామన్.
“ది అంగ్రేజ్ “ పూర్తిగా నిర్మించ బడినది మన ఆంధ్ర రాజధాని హైద్రా బాద్ లోనే.
భాగ్య నగరాన్నే నేపథ్యంగా movie లోని కథను అల్లుకున్నారు.)

అన్నిటి కంటే గొప్ప సంగతి, అతి ప్రముఖ విశిష్టత “kandahar” కు ఉన్నది.
అది ఏమిటో అందరికీ అర్ధమైనదనే అనుకుంటూన్నాను.
అమితాబ్ బచ్చన్ ఇందులో ఉన్నారు.
Big B నటించిన ఈ మలయాళ భాషా చిత్రం –
ఎప్పుడెప్పడు వెండి తెర మీద కన్నుల పండుగ చేస్తుందా ..........
అని ప్రేక్షక లోకం ఉత్కంఠతో ఎదురు చూస్తూన్నది.
అన్నట్టు నేడే, ఈ నాడే .........
బిగ్ బీ - Amitabh Bachchan (11 October 1942)) పుట్టిన రోజు కదండీ!

” Happy Bith Day to you!
Happy Bith Day to you!
Happy Bith Day Dear Amitab!
Happy Bith Day to you!"

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...