30, జూన్ 2009, మంగళవారం

బొమ్మ 'లో'లోపలి బొమ్మ !

కాటుకలు 2 రకములుగా ,ఎలా తయారు చేయాలో,చదివారు కదా!
సరే!ఒక కవితను చదివేసి ఆనక

ఇక్కడ ప్రచురించిన ఒక బొమ్మను చూడండి.
అలాగ,ఊరికే చూసి,ఊరుకుంటే ఎలాగ?!
అలాగే దీర్ఘంగా చూస్తూనే ,ఉండండి!
హమ్మయ్య!ఇందులో దాగున్న
"తిరకాసు"ను కనుక్కున్నారన్నమాట!
అదేనండీ!ఈ "పిట్ట గోడ"కథ,కమామిషున్నూ!
***********************************************************************************

లిపి,,,వారధి ;
========
అక్షరాలుగా రాలు తున్నాయి
స్వప్నాలు !!!!!
స్వప్నాలుగా వర్షిస్తున్నాయి
మరల, మరల ఈ రాలు గాయి అక్షరాలు.
అందుకే నేను
ఈ నాటి యువతిని
అక్షరమై మెరుస్తాను.
అక్షరాలు
ఆశలను మోస్తాయి !
ఆశయాలను ధరిస్తాయి !
ఆలోచనలను సంభావిస్తాయి !
ఆవేదనల శకలాలను
శకటములై మోస్తాయి.
అందుకే ,
అక్షరాలలో
నేను భావనగా హసిస్తాను!
అక్షరాలు క్రాంతికి దోసిలి ఒగ్గుతాయి.
విప్లవాలకు తల లొగ్గుతాయి!
చైతన్యానికి "మొగ్గు" వేస్తాయి.
వినూత్న పరిణామానికి
" మొగ్గ " తొడుగుతాయి.
అందుకే నేను
అక్షరానికి గొడుగు పడతాను.
అక్షరానికి హారతి పడతాను.
అనంతానంత సుప్త ,సుషుప్త
జాగృత్ హృదంతరాళ
అంతర్మధనాల ఘన వార్ధికి
'రూప కల్పన 'నొసగే
"విరించి" అక్షరమే గదూ!
అనంత కాల దిగంతాప్త చరిత్రాలయాన
ప్రతిష్ఠించ బడే దేవత ఈ అక్షరము!
చరిత్ర పెదవుల వంపులను
చిరు నవ్వు గానూ తీర్చి దిద్ద గలదు !
వికటాట్ట హాసం గానూ మలచ గలదు.
అక్షరము ఒక "ఉలి"!
అక్షరమే
స్వయంభువు ఐన 'శిల్పి" కూడా!
అందుకే ,నేనంటాను
అక్షరమే మదీయ కల్పనా రధ సారధి!
అక్షరమే విభిన్న విశిష్ట వారధి!
*****************************************

29, జూన్ 2009, సోమవారం

చందన కాటుక తయారీ




Recipes
చందన కాటుక తయారీ

By kadambari piduri,

కావలసిన వస్తువులు;

==============

కర్పూర కాటుక తయారు చేసేటందుకు కావలసినవే ,

చందన - కాటుక - తయారీకి అవసరము.

1)వెడల్పాటి మట్టి ప్రమిదలు

(2)ప్రత్తి వత్తి , పురి పెట్టకుండా, మందంగా ,అర చేతిలో పరచి,

మధ్యలో కరక్కాయ పొడిని చల్లి ఉంచి, వత్తి ఆకారంలో మెలిపి,మలచాలి.

ఈ వత్తిని ఆముదములో నానబెట్టాలి.

(3)వెడల్పైన ఇత్తడి పళ్ళెము

(పెళ్ళిలో వరుని కాళ్ళు కడిగే పళ్ళెము సరి పోతుంది.)

(4)సాన రాయి మీద గంధపు చెక్కను, అరగ దీసి తీసిన గంధము

(5)ఇత్తడి పళ్ళెము అడుగున,

ఈ గంధమును మూడు పొరలుగా మందముగా పూత పూయాలి.

(6) ఆవు నెయ్యి;

)తాటాకు రేకు ;
తయారు చేసే పద్ధతి ;

=============
మూడు రాళ్ళు పేర్చి వాని పైన ,ఇత్తడి పళ్ళాన్ని పెట్టాలి.

దానిలో నీళ్ళు పోయాలి. కింద సెగ తగిలేటట్టుగా

ప్రమిదలో నిండా ఆముదం పోసి, నానిన వత్తిని వేసి వెలిగించాలి.

వత్తి వెలుగుకు జానెడు ఎత్తున ఇత్తడి పళ్ళాన్ని అమర్చాలి.

గాలి విసురు లేని చోట, గదిలో ఒక మూలగా ఇలా అమర్చాలి.

(గాలి తగిలితే ,ప్రమిద వెలుగు కదులుతుంది. సెగ సరిగా లేనిచో కాటుక తయారవదు)

ప్రమిదలోని ఆముదము ఐపోయేదాకా, కదల్చ కుండా అలాగే ఉంచాలి.

అంటే మర్నాటికి పళ్ళెము అడుగున ఉన్న గంధము మసి ఏర్పడుతుంది.
అప్పుడు ఈ ఇత్తడి పళ్ళాన్ని తిరగ వేసి, అక్కడి గంధపు మసిని నూరాలి.

రాగి చెంబు(తో శ్రేష్ఠము.)తో గానీ, ఇత్తడి చెంబుతో గానీ ,నూరాలి .

ఆవు నెయ్యిని వేస్తూ, నెమ్మదిగా నూరాలి.

బాగా మెత్తగా నూరిన తర్వాత, మంచి నీటిని 'ధార' వలె, నెమ్మదిగా,

ధారాళంగా(ఇంచు మించి రెండు కడవల నీరు)పోయాలి.
అలాగ తయారైన కాటుకను

'రాగి కాటుక కాయ' లోనికి తీసుకుని, భద్ర పరచుకోవాలి.
'కర్పూర - కాటుక 'కొంచెమే తయారు అవుతుంది

కానీ ఈ చందన కాటుక ఎక్కువ తయారౌతుంది.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

27, జూన్ 2009, శనివారం

కాటుక తయారు చేయుట


కాటుక చేసే విధానం
By kadambari piduri,

కావలసిన వస్తువులు
==============
పత్తి వత్తి(పురి పెట్టకుండా)వట్టి దూదిని ; లావుగా అరచేతిలో పరచుకునాలి.
దీనిలో ,కరక్కాయ పొడిని చల్లి,ముడిచి ,అరచేతుల్తో మళ్ళీ మలుస్తూ
" ఉండ వత్తి"లా లావుగా తయారించాలి.
కరక్కాయ పొడి(పైన చెప్పినదే!)
ముద్ద
కర్పూరము (లేదా/మంచి గంధమును,
గంధపు చెక్కను సాన రాయి మీద అరగ దీస్తూ,తయారించుకోవాలి.)
వెడల్పు ఇత్తడి పళ్ళెము; వంటాముదము;ప్రమిదలు;
ఆవు; నెయ్యి/లేక - వెన్న;
ధారాళంగా;
నీళ్ళూ(భాగ్య నగరము; మున్నగు చోట్ల నివసించే వారికి
ఈ అంశాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది కదా!)
1)ముద్ద కర్పూరముతో కాటుక తయారీని ముందుగా తెలుసు కుందాము.
ముందస్తుగా వత్తిని , మంచి ఆముదములో
కాస్సేపు నాన బెట్టి ఉంచుకోవాలి.
2)ఒక గుంట గరిటెను కాస్త 'వాల్చినట్లుగా,
ప్రమిదకు బాగా దగ్గరగా బోర్లించి పట్టుకోవాలి.
3)కర్పూరమును వెలిగించాలి.
5) అప్పుడు గుంట గరిటలోనికి "కప్పురపు మసి"ఏర్పడుతుంది.
"తాటాకు రేకులతో " ఆ కాటుక మసిని ,గీకి తీయాలి.
6)ఆ మసిని రాగి పళ్ళెమునూ (ఐతే శ్రేస్ఠము . కానిచో ఇత్తడి/ కంచు పళ్ళెములను బోర్లించి పెట్టి,నూరాలి.)
ఆవు నేతితో గానీ, వెన్నతో కానీ ,
ఆముదమును gaanii
(బొట్లు; బొట్లుగా )వేసి,నూరుతూండాలి.
8)నూరి,ముద్దగా ఏర్పడేటప్పుడు,
ధారగా నీళ్ళు పోస్తూండాలి.
ఇలాగ బిందేడు నీళ్ళు పోయాలి.
9)రెడీ ఐన 'కాటుక'ను, రాగి భరిణలలోనికి తీసి జాగ్రత్త చేసు కోవాలి.

26, జూన్ 2009, శుక్రవారం

నాయుడమ్మ,గంగాధర గౌరి

Pramukhula Haasyam
అమ్మ, గౌరి
By
kadambari piduri,

నాయుడమ్మ ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు.

ఒక సభకు మిత్రులు కూడా వచ్చి ఉన్నారు.

వారిలో ఒకరు గంగాధర గౌరి.సభలో నాయుడమ్మను ప్రసంగించమని అడిగారు.

కొంతసేప మాట్లాడారు నాయుడమ్మ.

ముక్తాయింపుగా ఇలాగ చెప్పి సభాసదులలో నవ్వులను విరబూయించారు.

"ఈ సభలో ఆడ పేర్లు గల ఇద్దరు మగవాళ్ళము ఉన్నాము.

ఆడ పిల్లలు లేని కారణంచేత,

మా అమ్మమ్మ నా నామధేయము కొసన 'అమ్మ'ను తగిలించింది.

మిత్రులు గంగాధర గౌరి లోని గౌరి కూడా స్త్రీ నామమే!"

నాయుడమ్మ గారు ఆడది కాదు,మగ వాడేనని

మీకందరికీ ఇప్పుడు అర్ధమైంది కదా !

యలవర్తి నాయుడమ్మ గుంటూరు జిల్లాలోని ఎల వర్రులో

1922,సెప్టెంబరు 10వ తేదీన జన్మించారు.

చెన్నైలో,లెదర్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుఅభివృద్ధికి ఈయనే మూల స్తంభము.

భారత దేశమునకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ప్రముఖ సైంటిస్టు.

24, జూన్ 2009, బుధవారం

తప్పక చూడండి!


నా "కోణమానిని.బ్లాగు"లో మూడు వీడియో క్లిప్పింగులను చేర్చాను,చూసారా?వీటిలోని విశేషాలు కొన్ని!;;; అలాగే,వ్రేళ్ళతో,జంతువుల బొమ్మల సృజన సేకరణలను,

http://akhilavanitha.blogspot.com

లో ఉంచాను.

1)మన జాతి పిత మహాత్మ గాంధీజీ బొమ్మను చేతులతో ఆర్టిస్తు వేస్తున్నాడండీ!

ఆహా!అక్షరాలా అఱ చేతితోనూ,వ్రేలి ముద్రలతోనూ

అతను "బాపూజీబొమ్మను"వేస్తున్నాడండీ!

అతను ఎలా వేస్తున్నాడో కన్నులారా తిలకిస్తే,

మీరు కూడా "తంబు ఇంప్రెషనిస్టులు " అయ్యే ఛాన్సు ఉన్నది కదూ!

కాబట్టి,ఒకసారి ఈ "గాంధీ పెయింటు"ను వీక్షించండీ!

2)వ్రేళ్ళకు తాడు/రిబ్బను/దారమును తగిలించుకుని,"చిన్న మ్యాజిక్కును" చూపిస్తున్నాడు అబ్బాయి.ఈ వీడియోను,చూసి,ఇంచక్కా మీరూ కొన్ని చిట్కాలను నేర్చుకుని,మీ స్నేహితుల దగ్గర ప్రయోగించి,అందరినీ వినోదమును చేకూరుస్తారు కదూ!

3)ఈ వీడియో,డాన్సులలో,నాట్యాలలో, వాడుకొనేవే! క్యాండిలును వెలిగించీ/టార్చ్ లైటును పెట్టుకొనీ,

గోడ మీద నీడలతో బొమ్మలను సృష్టించడము ఎలాగో తెలుసా?

ఈ వీడియో క్లిప్పింగులో అదే కదా సాక్షాత్కరిస్తూన్నది!

పెద్దలతో పాటుగా,పిల్లలు కూడా చూసి,

ఈ "త్రి వీడియో మ్యాజిక్కులతో,"మెదడులకు మేతను పెట్టే,చమత్కారాలు" ఇవి!

అందుకే చెబుతున్నాను,తప్పక చూడండి.

23, జూన్ 2009, మంగళవారం

డప్పుల సుబ్బారావు





Pramukhula Haasyam
డప్పుల సుబ్బారావు
By
kadambari piduri,

దుర్గాబాయి దేశ్ ముఖ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న రోజులలో,

అనేక చిరస్మరణీయ సంఘటనలను,

"మన ఆంధ్ర దేశ చరిత్ర"లో పదిల పరుచుకొన దగినవి జరిగినాయి.

పైడా వెంకటా చలపతి గారు, మహర్షి సాంబ మూర్తి మున్నగు

వారు కాకినాడ టౌను హాలులో కాంగ్రెస్ సభను నిర్వ హించారు.

అప్పుడు జరిగిన లాఠీ ఛార్జిలో మహర్షి సాంబమూర్తి గాయాల పాలయ్యారు.హాలులో 4 అంగుళాల మందముతో రక్తము గడ్డ కట్టింది. వారము రోజుల దాకా ప్రజలు వచ్చి చూస్తూండేవారు.

బాయపు నీడి సుబ్బారావు సబ్ ఇనస్పెక్టరు.

సభలు, సమావేశాలను చెదరగొట్టడానికి

ఆయన అనుసరించిన ఒక పద్ధతి వార్తలలోనికి ఎక్కింది.

ప్రజా సమూహములను చెదరగొట్టడనికై, ఆయన చాలా డప్పులను తెప్పించి, వాయింపించేవాడు.

అందువలన ఆయనను అందరూ "డప్పుల సుబ్బారావు" అనే వారు.

ఇలాగ, ఈ సరికొత్త నామధేయం (నిక్ నేమ్) కలిగిన వ్యక్తి,

బహుశా "డప్పుల సుబ్బారావు మాత్రమే నేమో!"

22, జూన్ 2009, సోమవారం

తెల్ల వాళ్ల తిక్కకుదిరిందా,మరి?!

Chitra Varta
కుంచె కదిలింపే కాదు!

By kadambari piduri

బాపు
స్నేహితులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు.

ఆ మిత్రుల్లో ఒకాయన అన్నాడు
"మన డాక్టరు వివేకానంద మూర్తి ఇంగ్లండుకు వెళ్ళాడట!
లండనులో ప్రాక్టీసు పెట్టాడట కదా!?"

"ఏం? తెల్ల దొరలు మన దేశంలో తిష్ఠ వేసి,
రెండొందల ఏళ్ళు పాటు మనల్ని రాచిరంపాన పెట్ట లేదా?" అన్నాడు
సినీ దర్శక, చిత్రకారుడు బాపు.
"కుంచె కదిలింపే కాదు,
మాట విదిలింపు కూడా తెలుసును బాపుకి"
అని అందరూ నవ్వుకున్నారు.

17, జూన్ 2009, బుధవారం

చిన్ని మాజిక్

ఇళ్ళు కట్టుకోలేని రాజులు


ఇళ్ళు కట్టుకోలేని రాజులు
By
kadambari piduri,



పశ్చిమ గోదావరి జిల్లాలో "పెనుగొండ"ఉన్నది.

అక్కడ "రాజులు ఇళ్ళు కట్టుకోరు.

వీలైతే ఆ పట్టణ పరిధికి ఆవల నిర్మించుకుంటారు.

కారణం???

"వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి"కథ అందరికీ తెలిసినదే!

కుసుమ శ్రేష్ఠి పిల్లలు కవల పిల్లలు విరూపాక్షుడు, వాసవి.

వీరి కులగురువు భాస్కరాచార్యుడు.

18 పరగణాలకు అధిపతి కుసుమ శ్రేష్ఠి.

వేంగీ దేశపు సామ్రాట్టు "విష్ణు వర్ధనుడు"

(=విమలాదిత్యుడు ఇతని కుమారుడే సుప్రసిద్ధ "రాజరాజనరేంద్రుడు).

*******************************************************

విరూపాక్షుని పెళ్ళికి వచ్చిన చక్రవర్తి, ఆతని చెల్లెలైన వాసవిని చూసి,

"నీ కుమార్తెను పెళ్ళాదతానని" కుసుమశ్రేష్ఠుని అడిగాడు.

"నేను యోగినిగానే జీవిస్తాను. కనుక 'కన్యక'గానే ఉంటాను." అని ఆమె పలికినది.

"కుల గౌరవమును కాపాడుటకై ఆమె తీసుకున్న దృఢనిశ్చయము(అగ్ని ప్రవేశము),

ఆమెను "దేవత"గా నిరూపించెను.

సేనలతో దండయాత్ర చేసిన విమలాదిత్యుడు,ఆ వార్త వినగానే మరణించాడు.

##########################################


ఆనాటి నుండీ,"రాజుల పెనుగొండలో ఇళ్ళు నిర్మించుట లేదు.

ఈ సంప్రదాయమును నేటికీ ప్రజలు గౌరవిస్తున్నారు.

***********************************************************

15, జూన్ 2009, సోమవారం

సరస్వతీ మహల్


సరస్వతీ మహల్

తంజావూరులోని "సరస్వతీ మహల్"సాహితీ అభిమానులకు గొప్ప చలివేందిరము.
ఇచ్చట ప్రాచీన పుస్తకములు,తాళ పత్రములూ ఉన్నాయి.
52వేల సాహితీ సేకరణలు,5వేల కళా ఖండాలు లెక్కకు మిక్కిలిగా ఉన్న సరస్వతీ ధామము అది.
దేవనాగరి, తెలుగు ఇత్యాది భారతీయ భాషలతో బాటు
డానిష్, ఫ్రెంచి, ఇంగ్లీషు భాషలలోని గ్రంధాలు కూడా ఉన్నాయి.
ఇంతటి మహత్తర కృషి చేసిన సాహితీ రసజ్ఞుడు శారభోజీ మహా రాజు.
అతని తండ్రి తుల్జాజీ కాలము చేసిన పిమ్మట,
శర్ఫోజీ(/శరభోజీ)రాజ్యాన్ని సేనాధిపతి అమర సింహుడు ఆక్రమించాడు.
శరభోజీ కి ఆంగ్ల విద్య నేర్పిన మిషనరీ టీచరు C.F.Schwartz
అత్యంత ప్రయత్నముతో 10 సంవత్సరముల తర్వాత
శరభోజీని సింహాసనమును అధిష్టింప జేయగలిగాడు.
ఆపై రెండు ఏళ్ళకు ష్వెట్జ్ మరణించాడు.
రాజ్య కాంక్షతో సాగే అంతర్గత కుట్రల వలన శరభోజీ విసిగిపోయాడు.
దాంతో అతను బ్రిటీషు వారు భరణంగా ఇచ్చిన ధనమును తీసుకుని
ప్రశాంత జీవనమును ఎంచుకుని,
రాజ్యాధికార కాంక్షను వదలి, మనుగడను సాగించాడు.
ఆ సాహితీ సామ్రాట్టు,కళా పోషకుడు చేసిన సాహిత్య
సేవలు తర తరాల వారికీ లభించిన అమూల్య నవరత్న నిధులు.
దక్షిణ భారత దేశములో "దేవ నాగరి ప్రింటింగు ప్రెస్సు"
ను నెల కొల్పిన ఘనత శరభోజీ మహా రాజుదే!
ఇతర రాజులలాగా తనకు లభించిన
సొమ్మును దుర్వ్యసనాలకూ, విలాసాలకూ కరిగించలేదు.
సారస్వత సేవకై వినియోగించిన ఉదార బుద్ధి శరభోజీది.
దేశ, విదేశాలకు పండితులను
పంపించి ఇంగ్లీషు,డ్యానిషు,ఫ్రెంచి,పాశ్చాత్య భాషల లిటరేచరును కూడా సేకరించాడు.
స్వంత డబ్బును ఖర్చుపెట్టి, రమారమి 45వేల పుస్తకములను సేకరించాడు.
అనేక కళాఖండాలు మన జాతీయ వారసత్వ సంపదలుగా లభించాయీ అంటే
అది శరభోజీ చేతి చలువయే!
సరస్వతీ మహలు నేడు 52వేలు పై చిలుకు గ్రంధాలకు ఆలవాలము.
ఆ అముల్య సాహిత్య రత్నాకరము ముంగిట శరభోజీ యొక్క పాల రాతి విగ్రహము ఉన్నది.
మీరెప్పుడైనా అటు వెళితే
ఆ సాహిత్యప్రియునికి అభినందనాంజలని ఘటిస్తారు కదూ!
*********************************************

12, జూన్ 2009, శుక్రవారం

"విజయ చిత్ర" సంపాదకుడు


రావి కొండలరావు సినీ రంగములో అనేక సంవత్సరములుగా ఉన్నారు.
"వెండి తెర"గమ్మత్తులూ,ఆ రంగములోని సాధక బాధకాలనూ
తెలిసి ఉన్న వ్యక్తి,నటుడున్నూ!
సినీ రంగాన్ని గూర్చి కూలంకషంగా అర్ధం చేసుకున్న ఆయన;
రచయితగా ఆ యా భోగట్టాలతో సాధికారంగా రాయ గలుగుతున్నారు.
"విజయ చిత్ర"గత రెండు దశాబ్దాల క్రితం వరకూ
వెలుగులీనిన గొప్ప ప్రఖ్యాత సినీ మాస పత్రిక.
రావి కొండలరావు విజయ చిత్రకు సంపాదకునిగా ఉండే వారు.
వెండి తెర భోగట్టాను ఆమూలాగ్రమూ ,ఆకర్షణీయమైన శైలిలో
చదువరులకు అందించే వారు.
తనకు సహజ ప్రవృత్తి ఐనట్టి "హాస్య రసము"నకే అగ్ర తాంబూలము !
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

"ముఖా ముఖీ" గా,పాఠకులు వేసే ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చే వారు.
ఒకసారి ,
ఒకానొక పాఠక మహాశయుడు చమత్కారంగా నొక్కిన ఒకానొక కొశ్చెనుకు,
సంపాదక పండితులు ఒకే ఒక్క వాక్యములో జవాబునిచ్చిన ఈ తీరును కనుంగొనుడు! బ్లాగ్మిత్రులారా!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
(ప్రశ్న )
"విజయ చిత్ర ముఖ చిత్రముగా నా ముఖమును వేస్తే ఎలాగుంటుంది?ఎడిటరు గారూ!"
(ఆన్సరు) ;;;;;

"నీ ముఖము వలెనే
...ఉండును! నేస్తమా!"


***************************************


11, జూన్ 2009, గురువారం

గమ్మత్తు 'షో'

ఈ వీడియో క్లిప్పింగును చూసారా?!

మన సాంప్రదాయక నృత్యాలైన

"భరత నాట్యము","కూచిపూడినాట్యము" మున్నగు వానిలో,

ఆంగికాభినయములలో,అనాదినుండీ వాడుకలో ఉన్న

అంగుళుల,హస్త విన్యాసములే!
ఈ సారి ఈ దృక్కోణముతో,

మన సంప్రదాయ నాట్య భంగిమలనుతిలకిస్తూ,

ఆస్వాదిస్తూ,

ఆనందిస్తారు కదూ !

======================================================

కె.బాల చందర్ దర్శకత్వములో విడుదల ఐన చలన చిత్రము

"గుప్పెడు మనసు" సినిమాలో ఈ చమత్కారము ఉన్నది.

వెండి తెరపైన ,కథా నాయకురాలైన సరిత

ఈ వేళ్ళ 'గమ్మత్తు షో'ను ,చేస్తూండగా,

టైటిల్సు అగుపడుతూంటాయి.




Finger Shadow - Funny bloopers are a click away

10, జూన్ 2009, బుధవారం

నీ తల మాసిందయ్యా!









Pramukhula Haasyam

నీ తల మాసిందయ్యా!

By kadambari piduri,


మల్లవరపు విశ్వేశ్వర రావు "మధు కీల" అనే తన పద్య కావ్యాన్నిప్రచురించారు.
ఆ పుస్తకానికి ముందుమాటను దేవులపల్లి రాసారు.

"విశ్వేశ్వర రావూ!
నీ రచనలన్నీ పుస్తక రూపంలో రావాలయ్యా!
నువ్వు కవివయ్యా!
ఎవ్వరితోటీ ఇట్లా అనను
విశ్వేశ్వర రావు నిజంగా కవి!"

********************************************

దీనికి ప్రఖ్యాత పేరడీ కవి జరుక్ శాస్త్రి (జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి) ఇలాగ రాసేసారు.

"సుబ్బారావూ!
నువ్వింక క్షవరం చేయించు కోవాలయ్యా!
నీ తల మాసిందయ్యా!
నేను ఎవ్వరి తోటీ ఇట్లా అనను-
సుబ్బారావు తలకు మాసిన వాడు అని"


++++++++++++++++++++++++++++++++++++++++++++

మట్టి దిబ్బల కింద మహా నగరము








కోటి లింగాల "
==========
కరీం నగరు జిల్లాలో ,కోటి లింగాల "అనే మహా నగరము ఉన్నట్లుగా త్రవ్వకములలో బయల్పడినది.
"మునుల గుట్ట"వద్ద శాత వాహనుల కాలము నాటి అమూల్య వస్తువులు లభించినవి.
అపురూప నాణెములు ,టెర్రకోట పూసలు ,పాత్రలు,నగలు దొరికినవి.
మట్టి దిబ్బల కింద మహా నగరము మనకు లభించిన అమూల్యచారిత్రక సంపద.



శ్రీ ముఖుని కాలము నాటి సంస్కృతి పరిఢవిల్లినది.
కోటి ఇసుక రేణువులతో " ఉద్భవించుటచే "కోటి లింగాల"నామ ధేయమును కలిగినది.
గోదావరి తీరాన "కోటి లింగాల"(కరీం నగర్ జిల్లా)
శాత వాహనుల కాలమునాటిదనీ,
క్రీస్తు పూర్వము 2 వ శతాబ్దము నుండి
క్రీస్తు శకము 2 వ శతాబ్దంవరకూ
నిర్మాణము కొనసాగినందున,మహా నగరము ఏర్పడినదనీ,చారిత్రక ఆధారాలు లభ్యమైనవి.
చెత్తను పార వేసేందుకు "ప్రత్యేకంగా కుండీలు,మురుగు కాలవల నిర్మాణము ఇక్కడి ప్రత్యేక విశేషాలు.
మునుల గుట్ట"వద్ద లభించిన వస్తువులు అనేక వైవిధ్య భరితములుగా ఉన్నవి.
నాగ లింగము,సింహముల బొమ్మ చెక్కిన ఫలకము,బౌద్ధ సంస్కృతికి ఆనవాళ్ళు.

-------------------------------------------------------

ఎల్లం పల్లి ప్రాజెక్టు వలన 'ముంపునకు గురి అయ్యే'ప్రదేశాలలో ఇదీ ఒకటి.
అనుకోకుండా బయల్పడి,లభించిన ఈ అమూల్య చారిత్రక సంపదను పరి రక్షించడానికి అధికారులు సముచితమైన చర్యలను చేపడుతున్నారని ఆశిద్దాము.

9, జూన్ 2009, మంగళవారం

దవన పున్నమ









దవన పున్నమ
===========
"శ్రీ కాకుళ ఆంధ్ర మహా విష్ణు మూర్తి"
కొలువై ఉన్న పుణ్య క్షేత్రము "శ్రీ కాకుళము".

ఈ క్షేత్రము కృష్ణా జిల్లాలోని దివి సీమ లో ఉన్నది.

శ్రీ కాకుళాంధ్ర మహా విష్ణువు " తెలుగు రాయని" గా ప్రసిధ్ధికెక్కెను.

వసంత నవ రాత్రులలోనూ, పూర్ణిమ నాడు,

" ఆంధ్ర మధు మదనుడు" గానూ,

"తెలుగు రాయని" గానూ ఖ్యాతి

గాంచిన "ఆంధ్ర మహా విష్ణువు"నకు అనేక అర్చనలు జరుగుతూ ఉంటాయి.


వానిలో "దమళినీ దళ పూజ" ముఖ్యమైనది.

"పద్మ సంహిత" లో "దవన పున్నమ" వివరణ ఇది...

"వసంత కాల తృప్త్యర్ధం తత్సమృధ్ధిభి రాహృతైః

పుష్పైర్ నానా విధైః దేవ మర్చయే

దక్షిణా ముఖం

ఆసీనం మణ్డపే క్లుప్తే వేదీ మధ్యే మనోరమే

ఉద్యానే మందిరే వాపి కృత్రిమోద్యానన శోభితే

నద్యాదౌ వా యథా యోగం ఫల పుష్పోదకా న్వితే. "


"పౌర్ణమాస్యాం తిధౌ తస్మిన్ మాసే దమనికా దళైః

పుష్పాన్వితైఃప్రపాంకృత్వా మణ్దపే పూజయేధ్ధరిం

పుష్పైః దమనికాభి శ్చ సర్వాలంకార

మాచరయేత్ ఉత్సవశ్చ భవేత్తస్మిన్ హోమా దమనికా దళైః


వైశాఖి మాసి వా కుర్యా ద్వసంతోత్సవ మబ్జజ

దమనీ దళ కల్యాణ మపి వా పూర్వ మీరితం

వైశాఖే మాసి వా చైత్రే సిత పక్షే శుభే దినే

దమనీ దళవ త్కుర్యాత్ కళార కుసుమోత్సవం."


అక్క మహా దేవి శాసనము వలన మనకు తెలియు చున్న చారిత్రక విశేషము.

దాక్షారామము లో కొలువైన శ్రీ భీమేశ్వర స్వామికి కూడ

"దమళినీ పూజ" అర్చనా విధానములలో అనుసరించబడుచున్నది .

8, జూన్ 2009, సోమవారం

పోతన చేసిన సరస్వతీ విశేష వర్ణన










మహా కవి పోతన శ్రీ శారదాంబను ఇటుల స్తుతించెను:
క్షోణి తలంబు నెన్నెదురు సోగక మ్రొక్కి నుతించు, సైకత
శ్రోణికి ఛంచరీక చయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి, తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి, అక్షధామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్"


శ్రీ సరస్వతీదేవి అక్షమాల, చిలుక, తామర పూవు, పుస్తకములను ధరించెను.
ఆమెకు ప్రణతులొనర్చినాడు మన భక్త పోతన.
ఐతే ఈ పద్దెములో "వీణ" నుడువ బడలేదు.

పోతన తరువాతి కాలము నాటికి
చదువుల తల్లి "వీణాధారిణి" అయి,
"లలిత కళా రాణి"గా అవతరించినది.
సృష్టిలో కళలకు గల
ప్రాధాన్యము ముగ్ధ మనోజ్ఞముగా ఆవిష్కరించబడి
మన సంస్కృతిని విభిన్నముగా,
జగజ్జేగీయమానంగా, ఉత్తేజమయంగా ఉద్భవిల్లజేసినది కదా!
''''''''

7, జూన్ 2009, ఆదివారం

శ్రీ కృష్ణుని నాట్యము

శ్రీ కృష్ణుని నాట్యము
ముగ్ధ మనోజ్ఞం//
1)సిగలో పింఛము మిల మిలలూ, జారి
వీక్షణముల నలరారినవి
2)కన్నుల చూపుల మిల మిలలు
నాసాభరణము చేరినవి
3)ముంగెర ముత్తెపు మిల మిలలు
లోలకులందున ఊయల లూగెను
4)కర్ణాభరణము మిల మిలలు
కౌస్తుభ మాలను చేరినవి
5)హార పతకముల మిల మిలలు
మొల దండలను తొణికినవి
6)జల జల కాంతులు మువ్వ లందియల
మంజీరముల ఎగసినవి
7)ఇన్నిన్నిగ భాసించిన ఆ తళ తళలు
ఏక మొత్తముగ భాసించగ గాంచిన భాస్కరుడు

"ధరాతలమున తనకు పోటీగా
వేరొక సూర్యుడు,వెలసెనేమొ"యని
భీతిలు చందము కనుగొనినంతనె
గోపికలందరు ఫక్కున నవ్విరి.
(బమ్మెర పోతనామాత్యునికి కృతజ్ఞతలతో)

6, జూన్ 2009, శనివారం

ఔరా!ఈ గిజిగాడు !

Baala
ఔరా!ఈ గిజిగాడు !
By kadambari piduri,



అటు ఎగిరీ,ఇటు ఎగిరీ,

నటనాల నీడలతో

పైరు పంటలపైన,

పుడమిపైన

రంగవల్లులల్లేను

బంగారు పిచ్చుక //

ఉడ్డీనాల చిత్రాలను

గాలి తెరలపై వ్రాయును

తొలి పొద్దుల నిగ్గులను

తన కంటిలోన దాచేను //

ఉడ్డీనాల చిత్రాలను
గాలి తెరలపై వ్రాయును
తొలి పొద్దుల నిగ్గులను

తన కంటిలోన దాచేను //

చిన్ని రెక్కలను చాచి
తప తపలు ఆడిస్తు
మబ్బు ఱెక్కలతోటి
పోటీ పడు 'వస్తాదు'!
ఔరా!ఈ గిజిగాడు
నింగినే గేలి సేయు//


మెరుపు దారాలన్ని
ఏరేరి ఇంచక్క
చిన్నారి గూడులను
కొమ్మలలొ అల్లు కొనును //


అల్లికలొ నేర్పరి
మెలకువల గడసరి
గిజి గాడి గూడుకి
చిన్ని కొమ్మలలోన
చిటికెడంత చోటు
చాలును కద తన ప్రజ్ఞకి//

3, జూన్ 2009, బుధవారం

మహావీరుడు కట్ట బ్రహ్మన









Telusaa!

మహావీరుడు కట్ట బ్రహ్మన


By kadambari piduri,

కట్ట బ్రహ్మన (తమిళ నాడు) బ్రిటీషు వారిని ఎదిరించిన మహా వీరుడు. ఆతని కొలువులోఉన్న పాలెగాళ్ళు కొందరు దేశ ద్రోహులు, వీర పాండ్య కట్ట బొమ్మన్నను ఆంగ్లేయులకు పట్టివ్వడానికి కుటిల యత్నాలు చేయసాగారు. తప్పని సరియై, బొమ్మన స్వదేశాన్ని వదిలి వెళ్ళ వలసి వచ్చింది. తన ఇరువురు సోదరులతో కలిసి,మారు వేషాలలో పారి పోయాడు. మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా తిరుగుతూ అలిసి పోయిన ముగ్గురికి ఒక గుడిసెలోని అవ్వ ఆతిధ్యం లభించింది. ఆమె పెట్టిన రాగి సంకటిని తిన్నారు.

మాటలలో ఆమె దీన గాధ వారికి తెలిసింది. ఆమె భర్త, ముగ్గురు పిల్లలు మాతృ దేశ రక్షణకై ప్రాణాలు అర్పించారు.

ఇంతలో, బయట దండోరా వినిపించింది. "ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి బానర్ మన్ దొర ఉత్తర్వు! బొమ్మన సోదరులు తప్పించుకుని ఇదే పల్లెలో దాక్కుని ఉన్నట్లు తెలిసింది. వారిని పట్టి ఇచ్చిన వారికి మంచి బహుమతహో."

టముకును విని, "అమ్మా!! ఆ బొమ్మనని, తమ్ముళ్ళనీ పట్టి ఇస్తే మీకు మంచి బహుమతి వస్తుంది కదా!" అన్నాడు బొమ్మన. వెంటనే ఆమె గర్జించింది. 'నా భర్త దేశం కోసం ప్రాణాలు వదిలారు కట్ట బొమ్మన నాయకుల కోసం,పిల్లలు త్యాగం చేశారు.ఆయన మా పాలిటి దేవుడు. తెలుసా?"

ఆనంద బాష్పాలతో ఆ సోదర త్రయం ఆమెకు పాదాభివందనము చేసారు. ఇంతలో సిపాయీలు తలుపు తట్టారు. ఆమె కను సైగతో బొమ్మన, తమ్ముళ్ళు అటకపై దాక్కున్నారు. ఆమె గట్టిగా అరిచింది "నేను తలుపు తీస్తే, అమ్మ వారి గాలి సోకి మన్ను కరుస్తారు మీరు. జాగ్రత్త! కాదూ కూడదూ తియ్యాల్సిందేనంటే తలుపులు తీస్తాను" ఆ అవ్వ గదమాయింపులకు ఝడుసుకుని భటులు పరుగు లంకించుకున్నారు.

వీర వనిత అలా
ఆ దేశ భక్తులను తన శాయ శక్తులా కాపాడింది.
ఇట్టి ధీర గాధలు ప్రజలలో
దేశ భక్తిని ఇనుమడింప జేస్తాయి.







1, జూన్ 2009, సోమవారం

తెలుగుపద్యము-ఇంగ్లీషు వర్డ్సు, హిందీ పదాలు!

Share My Feelings

తెలుగుపద్యము-ఇంగ్లీషు వర్డ్సు, హిందీ పదాలు!

By kadambari piduri,



ఛందో బద్ధ పద్యాలు ఇంకా రాజ్యమేలుతున్న రోజులు అవి. వానిలోనికి ఇంగ్లీషు వర్డ్సును, హిందీ పదాలను జొప్పించి చెప్పడము అప్పట్లో గొప్ప సాహస ప్రయోగము అన్న మాటే! ఎక్కువగా స్నేహంగానో, తిట్టు కవితలలోనో ఇల్లాంటి (ఆనాటికి)వినూత్న ప్రయోగాలు జరిగేవి.

కాటూరి వేంకట కవి, వెల్లటూరి స్వామి అనే కవులు పరస్పరము, ఒకరిపై ఒకరు విసురుకున్నట్టి ఈ విసురులను గమనించండి.

తేజ సిన్స్పిరేషను పఠిస్ఠ మహేయ గవాయి గాన వి
వ్యాజిత పీరు సాబు నయనాంచిత కాంచన
భ్రాజిత స్పెక్టికల్ ద్వయి కవిత్వపు ఖరాబు నాట్యపుం
ఫోజులలో నవాబు పొగ పూతలు మింటి గిలాబు, బాబయా!

కాటూరి వారు వెల్లటూరి స్వామిని గూర్చి స్నేహంగానే లెండి, నవ్వుతాలుగా చెప్పిన పద్యము ఇది.

మరి స్వామి గారు మిన్నకున్నారా? ఆయన వెలువరించిన తమాషా పద్య రాజమును చదవండి!

గూడ కట్టో కటేసి గూడూరి రామ
చంద్రుండే తడన గొప్ప రోత గాడు
అన్నంబు తిన్నచో అరుగదం చూరక
పొగాకునే త్రాగెడు క్రాకు గాడు
కవిత జడ కుచ్చు ఆచార్లుగా మెచ్చు
మిత్ర వర్గమునకు ప్రాణమని ఇచ్చు
మీ గ్రామ మేగి చుట్ట కాల్చు కొనవోయి!
వెఱ్ఱి వెంకన్న సుకవి!



మొత్తానికి ధూమ పానము ఒక దుర్వ్యసనము అని చెప్పకనే చెప్పినట్లుగా అయినది కదూ. వెంకన్న సుకవి!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...