పన్నీటి జల్లులు:::::
.........
1) తామ్ర పర్ణీ నది దక్షిణా పథమును సస్య శ్యామలమొనరించుచున్నది. ::
2)పడమటి కనుమలలో ప్రభవించి ,
తమిళ నాడులోని తిరునల్వేలి జిల్లాలో ప్రవహించి,
బంగాళా ఖాతమునందు సంగమించుచున్నది.:::
3)"తండ్రి ,తన కుమార్తెను కానుకలతో భర్త వద్దకు పంపిస్తున్నట్లుగానే ,
'తామ్ర పర్ణీ అనర్ఘ మౌక్తికములను ఇచ్చి ,
అగస్త్య మహర్షి ,ఆమెను తన భర్త ఐన సముద్రుని వద్దకు సాగ నంపెనట!:::
4) ఈ పై వర్ణన ,'శివ లీలార్ణవము ' అను గ్రంధములోని ద్వితీయాధ్యాయములోని 'హాలాస్య మాహాత్మ్యమూలోనిది.:::
5) నీల కంఠ దీక్షితులు ,రచయిత. ఇతను 17 వ శతాబ్దికి చెందిన వాడు .
6)తామ్ర పర్ణీ నదిలో అనేక అమూల్యమైన "ముత్యములు " లభిస్తూన్నవి.' అని ,
ప్రాచీన ఉద్గ్రంధమైన " వాయు పురాణము "లో ఉటంకించ బడినది.:::
8) "కామం భవంతు సంతో భువి సంప్రతిష్టః :::
స్వాదూని సంతు సలిలాని చ శుక్త యశ్చ :::
ఏతాం విహాయ వర వర్ణిని తామ్ర పర్ణీ ః . :::
నాన్యత్ర సంభవతి మౌక్తిక కామ ధేనుః . "
' కావ్య మీమాంస 'లో రాజ శేఖరుడు ఇట్లు వివరించెను ,
" తామ్ర పర్ణీ నది ,ముత్తెములకు కామ ధేనువు వంటిది .
అందుచేతనే ,ఆ నదీమ తల్లి ఇతర నదుల కన్నా ,మేలు తరమైనది ."
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి