26, సెప్టెంబర్ 2017, మంగళవారం

ధన్వంతరి వాక్కు, నేర్పు

"వసంత సేనా, మొన్న ఉత్సవంలో నీ నాట్య కళ మసకబారింది, 
మొదట్లో బాగానే చేసావు,  అదేంటోగాని, ఆఖర్న అస్తవ్యస్తంగా చేసేసావు.
అప్పటికీ శత పోరుతూనే ఉన్నాను కదా, ఈ తూరి బాగా చెయ్యాలి సేనా - అంటూ.
ఆలాంటిలాంటి వాళ్ళు కాదు, హేమాహేమీలు నీకు కన్నెరికం చేయాలీ అని. .........."
తల్లి ధోరణి సాగి పోతూనే ఉన్నది. 
వసంత సేన మాత్రం పరధ్యానంగా ఉన్నది.
"హూ, ఏదో గాలి సోకింది. లేకుంటే ఏమిటీ పిల్ల, 
వైద్యునికి కబురంపాను, అరుగో, రానే వచ్చారు, ........ "
"దయ చేయండి ధన్వంతరి మహాశయా! 
మొన్న ఉత్సవంలో నాట్య ప్రదర్శన ఇచ్చింది, అప్పటి నుండీ ....... 

"నాడి చూస్తూ "తెలుసు తెలుసు, నాకన్నీ తెలుసు. 
ముందు మంచి నీళ్ళను సావకాశంగా మరిగించి, తీసుకు రండి ........ " 
తల్లి లోనికి వెళ్ళింది.
" వసంత మణీ! ఆ రోజు నువ్వు ప్రేక్షక జనంలో ఉన్న 
చారుదత్తుని ప్రేమిస్తున్నావు, ఔనా." 
తెల్లబోయింది వసంత సేన,
 "మీకు తెలుసా, తెలిసిందా!?"
"ఈ ధన్వంతరివి నాడిని పసికట్టడమేనా విధి కదా. పసికట్టాను. ........ "
"ప్రస్తుతానికి ఇది రహస్యంగా ఉంచండి, ముఖ్యంగా మా అమ్మ దగ్గర."
సిగలోని నగను ఇచ్చింది. 
"సరే సరే" అంటూ, మందుల పెట్టెలో - అడుగున దాచాడు.
తల్లి, మదనిక - వేణ్ణీళ్ళ గిన్నె పట్టుకుని వచ్చారు.
వైద్యుడు "అమ్మాయీ మణిగారికి ఈ చూర్ణం ఉష్ణ జలంలో కలపండి, 
బాగా కాపడం పెట్టండి, ఉష్ణం ఉష్ణేన శీతలం - అన్నారు పెద్దలు."  

నర్మగర్భంగా నవ్వుతూ అన్నాడు.
;
వసంత సేన సైగను అర్ధం చేసుకున్నాడు వైద్యుడు.
"అమ్మా! మీ పెరట్లో తమలపాకులు ఉన్నాయా!?"
"మా పెరటి తోటలో లేవు. ఊరి బైట ఉద్యానంలో ఉన్నవి.
వాటినే విపణి వీధిలో అందరూ కొంటారు. ఐనా, మాకు కొనే దుర్గతి ఏమీ పట్ట లేదు...... "
గతుక్కుమని - "ఔనౌను, మరిచాను కదండి. 
అందరూ - మీకు దండిగా ధనం, స్వర్ణం - 
అన్నింటినీ - తాంబూలలో పెట్టి మరీ ఇస్తూంటారు కదా!"
"ఈ మోహిని లోగిలి స్థాన మహత్మ్యం ఘనత అదే!" అన్నది తాలి.
"తమాల పత్రములను - అదేనండీ, తమలపాకులకు 
పిసరంత తైలం రాయండి,  కుంపటి రాజేసి, 
కొంచెం వెచ్చ జేసి తీసుకు వస్తారూ!?"
వాళ్ళు అటు కేసి వెళ్ళాక, వసంత సేన అడిగింది.
"చారుదత్తుడు నిష్ఠాగరిష్ఠుడట. 
ఏదైనా మందు, వశీకరణం ఔషధం - ఇవ్వ గలారా!?"
"నా వృత్తి అదే కదా! ..... " 
అతని చూపుల అర్ధాన్ని గ్రహించింది వసంతసేన.
"మీ మేలు మరిచి పోను, ప్రతిఫలం భారీగానే ఇస్తాను లెండి."
వాడ్చిన తమలపాకులు తెచ్చారు తల్లి, మదనిక.
"వీలు కలిగినప్పుడల్లా, అంటే అమ్మాయి అడిగినప్పుడు - 
ఈ ఆకులను మేనుపై వేస్తూడండి. మళ్ళీ రేపు ఈ ఝాముకు వస్తాను.

ధన్వంతరి వెళుతూ ' వశీకరణం మందు తెచ్చి ఇస్తాను ' 
అని వసంత సేనకు సైగ చేసి, నిష్క్రమించాడు.
;
*****************************************;
 అధ్యాయ శాఖ ;- 7  ; ధన్వంతరి వాక్కు, నేర్పు ;
వసంతసేన వసంత సేన కోణమానిని, నాటకం తెలుగు,  ;
;

సంవాహకుడు - శర్విలకుడు

"సరే, ఇక సెలవు, మళ్ళీ పున్నమికి 
మదనిక, శర్విలకుల సమావేశం. సరేనా!?"
;
"ఒళ్ళు మర్దన చేస్తాం. మీ మేనికి మిసమిస, ఒళ్ళు మర్దన చేస్తాం." 
వీధిలో అరుస్తూ చెబుతూ, వెళుతున్నాడు సంవాహకుడు.
"ఓ సంవాహకుడా ....... నేను శర్విలకుడిని."
"సంవాహకుడా! బాగున్నావా, 
మన పల్లెలో అందరూ  కుశలమా, త్వరగా చెప్పు చెప్పు."
"ఇంకా మన పల్లెసీమ గురించి తలుచుకుంటూనే ఉన్నావా,
నేను మళ్ళీ వెనకకు వెళ్ళనే లేదు కదా."
"ఔరా, ఐతే మనకు పుట్టిన నేలకూ ఋణం తీరినట్లేనా" 
నిట్టూర్చాడు శర్విలకుడు .
"అది సరేగాని, సంవాహకుడా! 
మర్దన క్రియలు - ఈ కొత్త పనిని ఎప్పుడు నేర్చుకున్నావు!?"
"చారుదత్తుల దగ్గర చేస్తుండే వాడిని. ఆయన చాలా మంచివారు.
గొప్ప దాత. దాన ధర్మాలు చేసి, నిర్ధనులైనారు.
ఇక నాకు గత్యంతరం ఏమున్నది, ఇదిగో - పొట్ట చేత పట్టుకుని,
వీధులలో పడ్డాను. నీకు ఒళ్ళు పట్టమంటావా!?" 
నవ్వుతూ అడిగాడు సంవాహకుడు.
"జోగీ జోగీ రాసుకున్నట్లున్నది. ఎర్ర ఏగాణీ లేని వాణ్ణి అడుగుతున్నావు.
నాకు శుశ్రూష చేస్తే నీకు ఏమివ్వగలను, శూన్యహస్తాలు ..... "
"ఫర్వా లేదులే. మిత్ర శర్విలకుని నుండి ప్రతిఫలం అక్కర లేదులే. 
హాయిగా మన చిన్ననాఈట్లను నెమరేసుకుందాం. 
అవే మన ఉభయులకు ప్రస్తుత పారితోషిక నిధులు. ఏమంటావు!?"
"అంతకంటేనా, ఇన్నాళ్ళకి నా మనసు సేద దీరున్నది."
"అది సరే గాని మిత్రమా, శర్విలకా, 
ప్రఖ్యాత నర్తకి వసంతసేన ఇంటి నుండి వస్తున్నావు, 
ఏదైనా రహస్యం గానీ ఉన్నదా."
"మదనిక వసంతసేన వద్ద ఉన్నది.
ఆమె పరిచారిక మదనిక చాలా మంచి కన్యక,
బహు ఓరిమి కలిగిన పడుచు. ........... "

బోధపడింది, ఈ సంవాహకుడు - ఇక నుండీ  నీకు బోధ గురువు నీకు అండదండ ....."
"ఐతే నాకిక బెదురు, బెరుకు లేవు. ఇంత మంచి స్నేహితుడు 
కుడి భుజంగా ఉన్నపుడు నాకిక  ఎదురేమున్నది ..... " అనేసి నవ్వాడు.
ఇద్దరూ  ముచ్చట్లు చెప్పుకుంటూ ముందుకు నడుస్తున్నారు.
;
****************************************************,
అధ్యాయ శాఖ ;- 6  ; సంవాహకుడు - శర్విలకుడు ; 
Tags ;- వసంతసేన వసంత సేన కోణమానిని, నాటకం తెలుగు, 
;

మదనిక-శర్విలకుడు , వసంతసేన

కిటికీలో నుండి కోకిల పాట వినిపిస్తుంది. మదనిక అటు వెళ్ళబోతుంది. 
"మదనికా! ..... "  వసంతసేన  వసంతసేన గొంతు అది. 
యజమానురాలి కంఠధ్వని వినీ వినగానే, 
పరిచారిక మదనికలో  తత్తరపాటు.
"మదనికా! వేళ గాని వేళలలో - ఋతువు గాని ఋతువులలో - 
ఈ పిక గానం ఏమిటి?, తరచుగా వినిపిస్తూన్నది!?"  
నవ్వుతూ ప్రశ్నించింది వసంతసేన.
మదనిక ఉలిక్కిపడి ఆగింది. 
"అబ్బె, ఏం లేదమ్మా! ......... 
మన ఆవరణలో మామిడి చెట్లు చిగురులు వేశాయి.
ఉజ్జయినిలో అందానికి తలమానికం ఐన ఈ మా వసంతసేన ప్రతి రోజూ - 
ఆ చెట్టును నిమురుతూ ఉన్నారు కదా , 
ఆ ఆకులతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు కదా! 
ఇంత దోహదం లభిస్తున్నది కాబట్టే ఆ ఆమ్ర తరువు పల్లవిస్తున్నది.
చిగురులు వేసిన కొమ్మల గుబురులలో కోకిలలు దాక్కోవడం సహజమే కదమ్మా!"
"ఏమో అనుకున్నాను. భలే చమత్కారివే" 
"ఈ వసంతసేన గారికి ఇష్ట దాసి కదా ఈ మదనిక, 
అంత తావిలో ఇంత, గోరంత తావి అంటుకున్నది, - నాపై విరజిమ్మింది మరి." 
;                  
"సరే నేను మిద్దె పై గదికి వెళ్తున్నాను." 
ఓరగా కిటికీ బైట వంగి దాక్కుంటూ నిలబడిన మనిషిని గమనిస్తూ, 
మెట్లు ఎక్కసాగింది వసంతసేన.
"హుష్, నీకు  బుద్ధి లేదు శర్విలకా!"
మెట్ల మీది వసంతసేన "ఓహో, ఈతని పేరు శర్విలకుడన్న మాట" ;
"ఈ మదనికను తెగ ఇరకాటంలో పెడ్తున్నావు శర్విలకా! 
ఇట్లాగ - మాటి మాటికీ - దొంగతనంగా కలుసుకోవడం కుదరదు.
యజమాని వసంతసేన మనల్ని పసికట్టినట్లు ఉన్నారు."
"మరెట్లాగ, ఇట్లాగ తప్పడం లేదు మరి!? 
నిన్ను విడిపించాలంటే పరిహారం చెల్లించాలి కదా.
ఆ శుల్కం పెద్ద మొత్తం ఆయిరి, నువ్వు చెప్పినట్లు ఇక నేను దొంగతనాలు చేయాల్సిందే!" 
"మీ ఊరు నుండి ఇంత దూరం వచ్చింది, చోరునిగా మారడానికా,
అదిన్నీ ఈ మదనిక కోసం. నా మూలాన్న ఒక పల్లెటూరి బైతు -  అమాయక చక్రవర్తి - 
చోరునిగా మారితే, ఆ పాపం నాకు చుట్టుకుంటుంది, 
పైగా మాకు అప్రదిష్ట కూడానూ."

వసంతసేన తల్లి అందర్నీ పిలుస్తూ వచ్చింది.
"వసంతసేనా! ఎక్కడున్నావు? మదనికా, మదనికా! ఎవరూ కనబడరేం, 
సమయానికి దాసీలు - ఒక్కరూ అందుబాటులో ఉండరు కదా!?" 

"అమ్మో, దొడ్డ యజమాని వస్తున్నట్లు ఉన్నారు, వెళ్తున్నాను. ----- "
"ఈ మదనిక మహారాణి గారి మళ్ళీ పునర్దర్శనం - ఎప్పుడో ఏమో!?"
"ఎవరో వస్తున్నారు. సద్దు సద్దు, ఇక మరలిపో!"
**************************************************;
     అధ్యాయ శాఖ ;- 5  ;  
TAG :-  వసంతసేన వసంత సేన కోణమానిని, ప్రాచీన రత్న మాల, ;

కోవెలలో నర్తకి

వసంతసేన నాలుగు కాళ్ళ మండపంలో - నృత్యం చేస్తున్నది.
ఆమె కాలి గజ్జెలలోని ఒక మువ్వ జారి, దొర్లుతూ కింద పడింది.
"మీ మువ్వ."  అంటూ -
తన ముందు పడిన మువ్వను ఇచ్చాడు రోహణుడు.
నాట్య రూపకంలో సంభాషణలో కలిపేస్తూ
"ఆర్యుల నామధేయములు తెలుసుకొనవచ్చునా!? ...... "
ఆ ప్రశ్నకు బాల రోహణుడు సమాధానం ఇచ్చాడు.
"నా పేరు రోహణుడు, ఆర్య చారుదత్తుల కుమారుడిని,
మా జనని నామం ధూతమాంబ."
నవ్వుతూ అటు చూసిన వసంతసేనకు చారుదత్తుడు కనిపించాడు. -
"ఆహా, ఎంత రూపసి. ధూతా దేవి ఎంత భాగ్యశాలి." అనుకున్నది.
;
నాట్యం పూర్తి ఐనది.
వసంతసేన పై వ్యామోహం కలవారు ముందుకు వస్తున్నారు.
వసంతసేన తల్లి వారిని నిలుపుతూ, కన్నెరిక శుల్కం ఎవరు ఎక్కువ కట్టగలరో తెలుపండి.
రాబోయే శ్రావణ మాసం, పౌర్ణమి నాడు ఏర్పాటు చేస్తున్నాము ....... 
 వేలం పాటను, 12 లక్షల వరహాలు చెల్లించగల వారు మాత్రమే వేలంలో పాల్గొనడానికి రావొచ్చును."
ఆ ప్రకటన విని అందరు జారుకున్నారు.
శకారుడు, మరి కొంతమంది తమలో తాము మాట్లాడుకుంటూ నిలబడ్డారు.
వసంతసేన కళ్ళు మాత్రం -
అక్కడి నుండి వెళ్ళి పోయిన చారుదత్తుని కోసం అన్వేషిస్తున్నవి. ;  
;
*************************************************;
కోవెలలో నర్తకి ;- అధ్యాయ శాఖ ;- 4  ;
;

వసంత రేఖ నాట్య ఉత్సవ్

తల్లి ;- "వసంతసేనా! - త్వరగా బయలుదేరు. ఉత్సవం మొదలయ్యే వేళ ఔతున్నది. 
అమూల్యాభరణాలను మిక్కిలి అందంగా అలంకరించుకో.  
సాక్షాత్తూ చక్రవర్తులే నీ అందానికి దాసోహం - అనేటట్లు ఉండాలి నువ్వు. 
కన్నెరికం చేయాలి కదా నీకు. మన వేశ్యా వాటికలో అందరూ అసూయ పడేలా - 
నిన్ను నవ మన్మధుడు, భాగ్యవంతుడూ నిన్ను ఎన్నిక చేయాలి! 
నీ కన్నెరికం ధూమ్ ధామ్ గా జరుపుతాను. ఇవాళ నీ నర్తనం - 
అందరి కళ్ళు జిగేల్ మనిపించాలి, గుర్తుంచుకో. 
నీ తల్లి పేరును నీవు నిలబెట్టాలి. నాట్యం బాగా శిక్షణ చేసావు కదా! 
మదనికా, అన్నీ సిద్ధమేనా?"   
"అన్నీ సర్దాను దొరసానీ! బండి వాకిట్లో ఉన్నది." 
అందరూ హడావుడిగా కదిలారు.
;
****************************************:
వసంత రేఖ నాట్య ఉత్సవ్ ;- 
వసంత rEKa nATya utsaw ;- అధ్యాయ శాఖ ;- 3  ; 
;

రోహణుడు son of చారుదత్త

ఇంకో చిన్న *CART WHEEL కనబడుతున్నది - 
అది బాలుడైన రోహణుడు ఆడుకుంటున్న **బొమ్మ బండి. ;
రోహణుడు చారుదత్తుని కొడుకు.   
"కుమారా, రోహణా! ఉత్సవానికి వెళ్తున్నాను. నువ్వూ వస్తావా." 
 తండ్రి ప్రశ్నకు "నేను రాను, నాన్నగారూ! 
బండి ఆట ఆడుకుంటున్నాను కదా"
"తండ్రి గారితో అట్లాగ మాట్లాడ వచ్చునా, తప్పు కదూ?? లెంపలు వేసుకో కుమారా!" 
"క్షమించు అమ్మా! ఇదిగో, గుంజీలు కూడా తీస్తున్నాను సరేనా!!"
"అయ్యో, నా చిన్ని తండ్రి చెంపలు ఎంత వాచిపోయాయో. ధూతమాంబా, పసివానికి ఇన్ని దండనలా, 
హన్నా!" నవ్వుతూ చెప్పాడు  చారుదత్తుడు.  
"ఇప్పటి నుంచీ దండనకు, శిక్షణలకు దేహం అలవాటు పడడం మంచిదే, 
పెద్దవాడు ఐనాక - జీవితంలో ఢక్కా మొక్కీలను ధైర్యంగాఎదుర్కుంటాడు. 
మైత్రేయా! రదనికా! బండిలో పుజా సామగ్రి అంతా సర్దారా!?" ;        
"సామాను అంతా పెట్టాము, అమ్మా!" 
రదనిక చెబ్తూ,"రోహణ బాబూ! రండి.  ... 
అరె, ఈ ఆట బండి - మన తోటి ఎందుకు?" ఇంటి లోపల పెడ్దాము." అంటూ తీసుకున్నది రదనిక.
"వద్దు. బొమ్మ బండి - లేకుండా నేను రాను. రానంటే రాను, అంతే!" 
"ఈ మైత్రేయుని మాట శిలా శాసనం. 
మనం మీ బుల్లి బండితోనే బయలు  దేరుతున్నాం, సరేనా బాబు 
గారూ!" "మైత్రేయ మిత్రుని వాక్కు వేద వాక్కు , 
పదండి. ఆలస్యం చేస్తే - రాహుకాలం వస్తుంది.  
అదిగో సందడి, ఉత్సవం మొదలైనది." ; 
;
*******************************************:
**బొమ్మ బండి = 
మృచ్ఛకటికమ్ - మహారాజు శూద్రక రచన ;
నాటకమునకు ఈ మట్టిబండి కేంద్ర బిందువు 
;
*******************************************:
రోహణుడు son of చారుదత్త ;- అధ్యాయ శాఖ ;- 2  ;

ఆర్యకుడు ; in పట్టణంగా మారుతూన్న పల్లెటూరు

ఆర్యకుడు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. వర్తమాన విషయాలు, సంఘంలోని ప్రజల ఈతిబాధలు -
వివిధ విషయాల పైన చర్చలు చేసుకుంటున్నారు.
అసమర్ధ రాజు, దుష్టుడైన రాజు యొక్క బావమరది ఆగడాలు, పన్నుల భారంతో 
ప్రజలు విలవిల - సంభాషణలలో సాగుతూండగా - రాజభటులు, శకారుడు వచ్చారు. 
"యువరాణి - పెంపుడు పిల్లి పుట్టిన రోజు - కనుక పన్నులు కట్టండి." అన్నారు. ఆర్యకుడు, ఇతరులు - 
"క్రిందటి వారమే - ఇంట్లో స్త్రీల నగలు , అమ్మి మరీ మీకు - సుంకం చెల్లించాము. మా వల్ల కాదు." 
శకారుడు ఆగ్రహంతో "ఆర్యకుడా! నిన్ను చెరసాలలో వేసి, కొరడా దెబ్బలు కొట్టిస్తాను." అంటూ వెళ్ళి పోయాడు. 
"రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా - అని పెద్దలు అన్నారు, ఇందుకే" 
;
;"సంవాహకా! మూట ముల్లె సర్దుకుని, ఎక్కడికి వెళ్తున్నావు?" అడిగాడు ఆర్యకుడు.
"మన పల్లెలో భుక్తి లేదు." 
"ఐతే ముక్తి కోసం పట్నం వెళ్తున్నావన్న మాట."
రచ్చబండ మీద కూర్చున్న వారిలో నుండి లేచి, నిలబడ్డాడు శర్విలకుడు, 
"ఆగు, సంవాహకా! నేను కూడా వస్తున్నాను. 
పనీ పాటా లేకుండా గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నావని - 
ఇంటా బయటా నన్ను  - అందరూ ఆడిపోసుకుంటున్నారు. 
అక్కడైతే ఏదో ఒక పని దొరికితే, నా తిప్పలేవో నేను పడతాను." 
అందరూ నిర్ఘాంత పోతారు. 
"అరె, శర్విలకా! ఎంతైనా మనం పుట్టిన గడ్డ ఇది,  ఈ నేల మన కన్నతల్లి. 
పురిటి గడ్డని విడిచి పోవచ్చునా!?  ఆగు, శర్విలకుడా, నిలు నిలు, సంవాహకుడా!" 
మిత్రులందరూ అన్నారు. 
"ఇక్కడే ఉండి పస్తులు ఉండమంటున్నారే!? భలే వాళ్ళే"                                          ఇద్దరూ ఎడ్ల బడిని ఎక్కారు.బండి చక్రాలు తిరుగుతూ ఉన్నవి.
*********************************************;

;   అధ్యాయ శాఖ ;- 1 ;-  ఆర్యకుడు ; in పట్టణంగా మారుతూన్న పల్లెటూరు ;-  
Tag ;- వసంతసేన వసంత సేన కోణమానిని, 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...