24, ఫిబ్రవరి 2015, మంగళవారం

వారముల పేర్లతో ఊళ్ళు, streets

""వాడల వాడల వెంట వసంతము
జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ": 
హోలీ ఆటపాటల మేలా ఇది.
ఈ మణిపూస అన్నమాచార్య సంకీర్తనా భాండాగారములోనిది.
వాడ - మొదలైన పదగుంఫన విదితమే!   
"వాడల వాడల వెంట వాఁడివో. " అని అన్నమయ్య సంకీర్తన చేసారు.
************************ 

వాడ , అంటే - పేట, వీధి అని అర్ధం. 
ఈ పదానికి మూలం మరాఠీ పదము ఐన "పేట్"/ "పేఠ్" = " పేట", వాడ.
తిరుమాడవీధి - మున్నగు పదాలు ఎరుకలో ఉన్నవే!
పేఠ్ – తెలుగున “పేట” అని ఉచ్ఛారణను పొందిన పదం.
పూనా పట్టణము మహారాష్ట్రలో వాణిజ్యకేంద్రము.
పూనా జనులకు - వారముల పేర్లతో ఉన్న వీధులు అక్కడ వ్యవహారములో ఉండి, సుపరిచితములైనవి.
పూనాలో ఇంచుమించు పద్ధెనిమిది పేటలలోని,
ఏడు  స్ట్రీట్స్ లకు = వీధులకు,వారముల నామములను కలిగి ఉన్నవి.
************************ 
17 – 18 శతాబ్దములలో వర్తకులు, ఆయా వీధులలో నిర్ణీత వారములందు మాత్రమే లావాదేవీలు, వర్తక కార్యకలాపాలను నిర్వర్తించే వారు.
నేడు పాతపట్టణముగా పూనావాసులకు, సంప్రదాయ కూడలిగా సుపరిచితమై ఉన్నది.
************************ 

సరే!  ఇప్పుడు మనం కొన్ని  జాగాలను ఇట్లాంటి వింత  ఉన్న  చూద్దాము.
భౌమ = భూమి సంబంధమైనది, భూమి పుత్ర - సూర్యుడు/ చంద్రుడు అని భావం. 
सार्वभौम - సార్వభౌమ:- సర్వ భూమినీ పరిపలన చేసేవాడు- చక్రవర్తి - అని అర్ధము. 
1] అ) ఆదివారము :- ఆదివారపు పేట –పేరు వినగానే తెలుస్తున్నది కదా!
తూర్పు గోదావరి జిల్లానందు, ద్రాక్షారామమునకు ఉత్తరదిశలో,
శివబాలయోగి దాదాపు పది, పన్నెండేళ్ళు తపస్సు చేసిన చోటు,
 Sunday Market , సంత – అని తాత్పర్యం. ఉన్నది.
2] భౌమ్య వారము:- Bhauma Nagar, Bhubaneswar - Odisha 
ఒరిస్సాలోని భువనేశ్వర్ లో "భౌమ నగర్" ఉన్నది. 
************************ 

 2] సోమవారము :-  
అ):- సోమవార పల్లె: - హుస్సేన్ జిల్లాలో, సులగోడు; ఆర్కల్ గుడ్ – 
 &) సోమవార్ పేట్ =  కొడగు , కర్ణాటక రాష్ట్రము లో ఉన్నది.
ఆ) :- విశాఖట్టణం – విశాఖ జిల్లాలోని, కశిం కోట మండలమున – సోమవారం గ్రామము ఉన్నది.
ఆ) వైరా మండలము లో; ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఉన్నది. ఇది తెలంగాణా రాష్ట్రమునందు ఉన్నది.
#(Somavaram is a Village in Wyra Mandal

************************ 

 3] మంగళవారము
మంగళగౌరీ వ్రతము - స్త్రీలకు తెలిసిన నోము. 
మంగళగౌరీ - కోవెల "గయ" లో కలదు.
అ) మంగళవారము:- శ్రీకాకుళం లోని - ఇచ్ఛాపురం మండలమునందు - + ఉన్నది.
 Jammadevi perta village
] 1662 లో పెట్టిన పేరు. “అష్టపుర” అనే పేరు కలిగి ఉన్నది, పిమ్మట 
ఆ] మంగళవార పేట :- రాయచూరు నందు ఉన్నది. 
************************ 

3) బుధవారము:- 
అ) గన్నవరం , అజ్జనపూడి గ్రామం, క్రిష్ణా జిల్లా లో ఉన్నది.
ఆ) మధ్యప్రదేశ్ లో బుర్హాన్ పూర్ ; నేపా నగర్ డిస్ట్రిక్ట్ లో - బుధవార బజార్ ఉన్నది.
ఇ) బుధవారము:- బుధవార్ పేఠ్ . పూనా - నందు కలదు.  
1703 నాటిది. ఔరంగజేబ్ స్థాపించెను.

************************ 
గురువారము /  లక్ష్మీ వారం :-
అని ఆంధ్రప్రదేశ్ లో - కొన్ని జిల్లాలలో వాడుకలో ఉన్నది.
మార్గశిర లక్ష్మివార వ్రతం - లక్ష్మీ పూజకు విశిష్టత కలిగిఉన్నది. 
పుష్యమాసము, మార్గశీర్షమాసములందున - గురువారం చేస్తున్న నోము మార్గశిర లక్ష్మీవార వ్రతము. 
అ) లక్ష్మివారపుపేట -రాజమండ్రి 
ఆ) గురువారపేట - పూనా 
************************ 

శుక్రవరము : - 
శ్రావణ శుక్రవారము, వరలక్ష్మీవ్రతము - ఇంటింటా గృహిణులు చేస్తూన్న వ్రతము.
అ) శుక్రవారమండపం . తూర్పు గోదావరి జిల్లాలోని కపిలేశ్వర పురం - లో ఉన్నది.  
కపిలేశ్వర అంతర్ భాగము, ఐరామ కాల్ (Ayiramkaal mandap) రీతి కలిగి ఉన్నది.
ఆ) paaliya rai shrine నందు కొలువై ఉన్నారు అమ్మవారు.  
"శుక్రవార అమ్మన్" :-
త్రిలోకజనని ఐన అమ్మవారు - పార్వతీదేవి అవతారము.
ఐ) "శుక్రవార అమ్మన్" , అంబాల్, అంబాళ్. 
త్రిపురసుందరి, చొక్కనాయకి, సుందరనాయకి – 
         మొదలైన నామావళితో కీర్తించబడుచున్నది.
************************ 

శనివారము :- 
అ) శనివారవాడ – అను పేరు కలిగిన వీధి పూనా లో ఉన్నది. 
ఇది ఒక రాజభవనము.  ఈ Royal Palace  1746 కట్టడము. 
పీష్వాలు 1838 వరకు పరిపాలించారు/
************************ 

[ వారముల పేర్లతో ఊళ్ళు, పల్లెలు, వీధులు, పేటలు, వాడలు ]
సేకరణా రచన:- కాదంబరికుసుమాంబ 

 Spinx amidst 

చింతామణి

 మణి మాణిక్యాలు, వాటికి కల మహిమలు - అనేక ప్రలోభాలకు హేతువులు ఔతున్నాయి.
మన హిందూదేశ వాసులకు అత్యంత ప్రాచీనకాలం నుండీ నవరత్నాల గురించి తెలుసును. చూడామణిని ధరించినది సీతమ్మ తల్లి. 
భద్రాద్రిరాములవారికి కంచర్ల గోపన్న - అనగా భక్త రామదాసు - 
తాను చేయించిన నగల పట్టికకు సాక్ష్యంగా ప్రజలందరికీ అందిన మంచి కీర్తన - ఉన్నది; 
'కీర్తన' - అని చెప్పకూడదేమో!? - ఎందుకంటే - జైలులో పడి, 
దెబ్బలకు తాళలేక చేసిన ఆక్రందన ప్రతిరూపం కదా.
భక్త రామదాసు పాట :-  

"ఇక్ష్వాకకులతిలక ఇకనైనా పలుకవా?రామచంద్రా!  ........
భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా! 
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా! 
సీతమ్మకు చేయిస్తి చింతాకుపతకము, రామచంద్రా!
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా!  
కలికితురాయి నీకు మెలకువగ చేయిస్తి  ......" 

-            అంటూ  రేట్లు కూడా అప్పజెప్పాడు. 

శ్యమంతక మణి సంరంభం :- - మనకు "వినాయక చవితి పండుగ" ను ఏర్పరచింది. 
సముద్రాలు దాటి నేటికీ విదేశీయుల మ్యూజియాలలో, ధనవంతుల మందిరములలోనికి చేరిన కోహినూర్ వంటివి ఎన్నో లెక్కలేదు.మణి మాణిక్యాలు, వాటికి కల మహిమలు - 
అనేక ప్రలోభాలకు హేతువులు ఔతున్నాయి.
శ్యమంతక మణి సంరంభం - మనకు "వినాయక చవితి పండుగ" ను ఏర్పరచింది. 
సముద్రాలు దాటి నేటికీ విదేశీయుల మ్యూజియాలలో, 
ధనవంతుల మందిరములలోనికి చేరిన కోహినూర్ వంటివి ఎన్నో లెక్కలేదు.
చింతామణి - అటువంటి లిస్టుకి చేరి ఉన్నది. 

******************************;
చింతామణి - అటువంటి లిస్టుకి చేరి ఉన్నది.మహారాష్ట్రలో - అష్ట విధ వినాయకులు
अष्टविनायक కొలువుతీరి ఉన్నారు.
1) చింతామణి గణపతి  अष्टविनायक) :- thEyuuru ;  (Chintamani, Theyur)::::: 
2) విఘ్నహర వినాయక , ఓఝర్ :(#wighnahara winaayaka , Ojhar : #
3) బళ్ళాలేశ్వర ;పాళీ:  '''''''
4) గిరిజాత్మజ, లేన్యాద్రి  (Girjatmaja, Lenyadri):  '''''''''
5) మహా గణపతి, రాజన్ గావ్ (Mahaa GaNapati, Rajan gaaw):  '''''''
6) మోరేశ్వర కోవెల, mOrgaaw (Moreshwar Temple):  '''
7)  సిద్ధివినాయక ఆలయ (Siddhiwinayaka dewalay, Siddhtek): ''''''''''                  
8) వరదవినాయక్, మహాద్ (Varada Vinayaka, Mahaad);      
చింతామణిగణపతి వెలసిన కథ ఆసక్తికరమైనది.
చింతామణి గణపతి స్థలగాథను తెలుసుకుందాము. 
కపిల ముని వద్ద చింతామణి ఉన్నది. ఈ చింతామణి మహర్షికి అవసరం వచ్చినప్పుడల్లా, 
ఆతను కోరినవన్నీ ఇస్తుంది. కారడవులలోని తాపసి, కనుక గొప్ప వాంఛలు లేనివాడు కావడాన 
తన పర్ణ కుటీరమునకు వచ్చిన బాటసారి, ప్రయాణీకులకు సదుపాయములను మాత్రమే 
ఆ మణిని కోరేవాడు.    
కపిలుడు 'తన ఆశ్రమానికి వచ్చిన అతిధులకు విందు భోజనాలు ఇచ్చేవాడు. 
ఋషి తన ఆధీనంలోని చింతామణి వలన అవసరపడినప్పుడల్లా కేవలం ఆహారపదార్ధాలను కోరే వాడు.  ఈ ప్రకారంగా కపిలముని కామితార్ధఫలప్రదాయిని ఐన చింతామణి వలన అతిథి అభ్యాగతులకు సంతృప్తిగా సత్కరించగలుగుతూ, తన జీవనసాఫల్యతతో సంతోషంగా రోజులు గడుపుతున్నాడు. 

ఆ సీమ ప్రభువు అభిజిత్తు, అతని భార్య గుణవతీదేవి. 
ఇరువురి సత్పరిపాలనలో దేశమునందు సుఖశాంతులు నెలకొని ఉన్నవి. 
వారి పుత్రుడు గుణవర్ధనుడు. ఒక రోజు గుణవర్ధన రాజకుమారుడు అటవీప్రాంతంలో వేటకై వెళ్ళాడు. కాననమునకు వచ్చిన యువరాజ్, మిట్టమధ్యాహ్నం ఆలస్యం కావడంతో దగ్గరలో కానవచ్చిన కపిలాశ్రమమునకు వచ్చాడు. అంగరక్షకులు, భటులుపరివారసమేతంగా కపిలుని ఇంట సేదదీరాడు. అంతమందికీ ఒక బవిరిగడ్డం సన్యాసి అద్భుత భోజనాదులతో 
నిముషాలలో వసతి సౌకర్యాలను అందించాడు. 
"ఇది ఎట్లాగ సంభవమైనది?" విస్మిత యువరాజుకు ,
మౌని "నా వద్ద అభీష్ఠ వర ప్రదాయిని ఐన చింతామణి అనుగ్రహము వలన 
నేను ఈ పనులను చేయగలిగాను." అని చెప్పాడు. 
ఇంకేమున్నది? గుణవర్ధన్ కు లాలస పుట్టింది. 
"అరణ్యవాసివి, నీకెందుకు? ఆ మణిని నాకు ఇవ్వు." అన్నాడు. 
"జమదగ్ని ముని వద్ద కామధేనువును హైహయ వంశ రాజు ఐన కా
ర్తవీర్యుడు అడిగినందువలన, పరిస్థితులు అతలాకుతలం ఐనవి. 
ఇప్పుడు అట్లాంటి విధ్వంసానికి 
నీవు మూలకారకుడివి అవవద్దు రాజకుమారా!" 
అని కపిలమిని శిష్యులు, తోటి ఆశ్రమవాసులు హితవు పలికారు. 
కానీ అభిజిత్తు కుమారుడైన "గుణవర్ధనుడు "ససేమిరా!" 
అందరి మాటలను పెడచెవిని పెట్టాడు. 
దౌర్జన్యంగా చింతామణిని లాక్కుని, వెళ్ళబోయాడు. 
గత్యంతరం కానరాక, కపిలుడు "విఘ్నవినాయకుని" ప్రార్ధించినాడు. 
భక్తుని వేదన వినగానే గజవదనుడు ప్రత్యక్షమైనాడు. రాజకుమారుని ఓడించినాడు. 
ఆతని తండ్రి అభిజిత్తు "మహర్షీ! ఈ మణిని స్వీకరించండి." అని కపిలమౌనికి తిరిగి ఇవ్వబోయాడు. 
కానీ ఆ జడధారి సున్నితంగా తిరస్కరించాడు. "ప్రభూ! ఇన్ని కల్లోలాలకు కారణమైనది సంపద. 
కావున నాకు వలదు. ఐతే నాదొక విన్నపం. తమరు గజాననునికి పూజావిధులను ఏర్పాట్లు చేయించండి. అంతే నాకు చాలు." అన్నాడు.  
అక్కడ కదంబ వృక్షము క్రింద వినాయక స్వామి వెలిసి ఉన్నాడు. 
పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు గణాధిపతి వెలసిన ఊరు 
పేరు "దేవూర్", పూనా సమీపమున దేవూరు ఉన్నది. 
కడిమి చెట్టు ఛాయలో వెలిసిన చల్లని స్వామి "చింతామణి గణపతి" ప్రజలకు ప్రత్యక్షదైవము.  

******************************;

#maNi maaNikyaalu, waaTiki kala mahimalu - anEka pralOBAlaku hEtuwulu autunnaayi.
mana himduudESa waasulaku atyamta praachiinakaalam numDI nawaratnaala gurimchi telusunu. chuuDAmaNini dharimchinadi siitamma talli. bhadraadriraamulawaariki kamcharla gOpanna - anagaa bhakta raamadaasu - taanu chEyimchina nagala paTTikaku saakshyamgaa prajalamdarikii amdina mamchi kiirtana - unnadi; kiirtana - ani cheppakUDadEmO!? - emdukamTE - jailulO paDi, debbalaku taaLalEka chEsina aakramdana pratiruupam kadaa.

bhakta raamadaasu :- 
ikshwaakakulatilaka ikanainaa paluka waa?raamachamdrA! bharatunaku chEyisti pachchalapatakamu raamachamdrA!  aa patakamunaku paTTe padiwEla warahAlu raamachamdrA!  siitammaku chEyisti chimtaakupatakamu raamachamdrA! kalikituraayi niiku melakuwaga chEyisti raamachamdrA!   

Syamamtaka maNi sam rambham - manaku "winaayaka chawiti pamDuga" nu Erparachimdi. 
samudraalu daaTi nETikii widESiiyula myuujiyaalalO, dhanawamtula mamdiramulalOniki chErina kOhinuur wamTiwi ennO lekka lEdu.
chimtaamaNi - aTuwamTi lisTuki chEri unnadi.
kapila muni wadda chimtaamaNi unnadi. ii chimtaamaNi maharshiki  awasaram wachchinappuDallaa, aatanu kOrinawannii istumdi. kaaraDawulalOni taapasi, kanuka goppa waamCalu lEniwaaDu kaawaDAna kapiluDu 'tana aaSramaaniki wachchina atidhulaku wimdu bhOjanaalu ichchEwaaDu. Rshi tana aadhiinamlOni chimtaamaNi walana awasarapaDinappuDallaa kEwalam aahaarapadaardhaalanu kOrE wADu. ,,,,,,,,, ii prakaaramgaa kapilamuni kaamitaardhaphalapradaayini aina chimtaamaNi walana atithi abhyaagatulaku samtRptigaa satkarimchagalugutuu, tana jiiwanasaaphalyatatO samtOshamgaa rOjulu gaDuputunnaaDu. 

******************************;

okarOju abhijittu puruDu guNawardhanuDu - anE raajakumaaruDu aTawiipraamtamlO wETakai wachchi, miTTamadhyaahnam aalsyam kaawaDam tO daggaralO kaanawachchina kapilaaSramamunaku wachchaaDu. amgarakshakulu, bhaTulupariwaarasamEtamgaa kapiluni imTa sEdadiiraaDu. amtamamdikii oka bawirigaDDam sanyaasi adbhuta bhOjanaadulatO nimushaalalO wasati saukaryaalanu amdimchaaDu. "idi eTlaaga sambhawamainadi?" wismita yuwaraajuku mauni "naa wadda abhiishTha wara pradaayini aina chimtaamaNi anugrahamu walana nEnu ii panulanu chEyagaligaanu." ani cheppaaDu. imkEmunnadi? guNawardhanuniki laalasa puTTimdi.  "araNyawaasiwi, niikemduku? aa maNini naaku iwwu." annaaDu. "jamadagni muni wadda kaamadhEnuwunu kaartawiiryuDu aDiginamduwalana, paristhitulu atalaakutalam ainawi. ippuDu aTlaamTi widhwamsaaniki niiwu muulakaarakuDiwi awawaddu raajakumaaraa!" ani kapilamini Sishyulu, tOTi ASramawaasulu hitawu palikaaru. kaanii abhijittu kumaaruDaina "guNawardhanuDu "sasEmiraa!" amdari maaTlanu peDachewini peTTADu. daurjanyamgaa chimtaamaNini laakkuni, weLLabOyADu. gatyamtaram kaanaraaka, kapiluDu "wighnawinaayakuni" praardhimchinaaDu. bhaktuni wEdana winagaanE gajawadanuDu pratyakshamainaaDu. raajakumaaruni ODimchinaaDu. aatani tamDri abhijittu "maharshii! I maNini swiikarimchamDi." ani kapilamauniki tirigi iwwabOyADu. kaanii aa jaDadhaari sunnitamgaa tiraskarimchaaDu. 
"prabhU! inni kallOlaalaku kaaraNamainadi sampada. kaawuna naaku waladu. aitE naadoka winnapam. tamaru gajaananuniki puujaawidhulanu ErpATlu chEyimchamDi. amtE naaku chaalu." 
akkaDa kadamba wRkshamu krimda winaayaka swaami welisi unnaaDu. paarwatii paramESwarula muddula tanayuDu gaNAdhipati welasina uuru pEru "dEwUr", puuanaa samiipamuna dEwUru unnadi. "chimtaamaNi gaNapati" prajalaku pratyakshadaiwamu.   guNawatiidEwi 

mahaaraashTralO - ashTa widha winaayakulu koluwutiiri unnaaru.
******************************;

అఖిలవనిత
Pageview chart 30350 pageviews - 778 posts, last published on Feb 23, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56722 pageviews - 1014 posts, last published on Feb 21, 2015 - 6 followers

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

బారా బలావతి [ samkramthi ]

"బారాహ్/ బారా" ఈ మాట తరచూ చెవుల బడుతూనే ఉంటుంది, 
        Barag -  అర్ధం - పన్నెండు/ పండ్రెండు/ XII    
@] శాంతారామ్(SAmta Ram) దర్శకత్వంలోని సుప్రసిద్ధమైన హిందీ చిత్రం 
"దో ఆంఖే బారా హాథ్".  बारह:- दो आँखें बारह हाथ;
@] 2009 లో రాజామీనన్ రాసిన డ్రామా ఆధారంగా  
"బారాహ్ అణా" (baraah anaa)హిందీ సినిమా వచ్చింది.  
(12 Barah in Hindustani aanas (or annas), ; 2009 by Raja Menon )

గులేబకావళి కథ, ఆలీబాబా నలభై దొంగలు వగైరా సినిమాలలో 
కొన్ని పాటలు, తెలుగులో మిళాయించిన పార్శీ పదాలు వినిపించినవి.
@] ఆలీబాబా నలభై దొంగలు - 
  "లేలో దిల్ బహార్ అత్తర్! దునియా మస్తానా అత్తర్!  
         ఒక్కసారి రాసి చూస్తే 
           ఘుమ్ ఘుమ్ ఘుమ్ ; ఘుమ్ ఘుమా!............  ;  
ఎక్కువగా అత్తరు సాయిబు సంబంధిత గీతాలు ఇవి. 
@] గులేబకావళి కథ (1962 విడుదల); 
           "సలామ లేకుం సాహెబ్బు గారూ! 
                     బలే షోకుగా వచ్చారు ...... "
@)  ఏక్ బుడ్డి ఆఠణా దో బుడ్డి బారణా పధ్యమేదిలేదండి - 
"భాగ్యరేఖ" (1957) మూవీలోని పాట ఇది, 
గానం చేసిన యుగళం - మాధవపెద్ది, స్వర్ణలత - రచన: కొసరాజు 

బారా బలావతి :- తెలుగు నుడిలో వచ్చిన నానుడి ఇది.
హిందీ, ఉర్దూ పదాలు ముచ్చటగా తెలుగులోకి చేరినవి. 
అష్టాచమ్మా, పాంచ్ పటాకా, 
పండుగల పుణ్యమా - అని - ధన్ తేరస్, రాఖీ మున్నగునవి.  

********************************,


దేశీ భాషలలో చోటు చేసుకున్న అందమైన మాట "బారా బలావతి ". 
19 వ శతాబ్దం దాకా ఈ పదం, నానుడి వలె - సంఘంలో వాడుకలో ఉన్నది. 
బారా బలావతి - అంటే ఏమిటి?
మన గ్రామాలలో గత రెండు దశాబ్దాల క్రితం వరకు - 
గ్రామ పంచాయతీ ల నిర్వహణలో స్వయం పరిపాలనతో, సమృద్ధంగా ఉండేవి. 
చిన్న పరిధికి అవసరమైన సిబ్బంది ఉండే వాళ్ళు. 
అందు నిమిత్తం, ఏర్పడిన సిబ్బంది, పల్లెటూళ్ళలోని ప్రజల సేవకు వినియోగపడేవి. 
పరిమిత అవసరములను తీరేవి. 
ఈ సందర్భంగా ఏర్పడిన సేవక, పాలన, కేటగిరీ - 
ఇంచుమించు 12 మంది ఉండే వాళ్ళు. 
బారా + బల = బారా బలావతి -
బారా = 12 ; పన్నెండు మంది బలగం ఉన్న 
చిన్న స్వయ సమృద్ధి కలిగిన పల్లెలు - అన్న మాట.  అవేమిటో చూద్దాము.

1. కరణం 2. (మునసబు); 
3. రెడ్డి :- చిన్న తాగాయిదాలను, తీర్పులు చేసే వాడు; 
4. కట్టుబడి; 5. శెట్టి/ సరాఫు; 5. కంసాలి; 
6. వడ్రంగి; 7. కుమ్మరి; 8. చాకలి; 9. మంగలి; 
10. తోటీ = చిమ్మి, శుభ్రం చేసే వాడు; 
11. కట్టుబడి = మునసబుకు సహాయకుడు. 
12. తలారి = గ్రామ భటుడు;
ఈ విధంగా పండ్రెండు మంది స్టాఫ్ కలిగి ఉండిన కూటమి పల్లెటూరు.
"బారా బలావతి " లోకోక్తి విశేషాలు ఇవి. 

********************************,

@) 12 గుణింతాలు హిందీలిపిలో ఉన్నవి (बारहखड़ी).
@) 12 ఇంచెస్ చేయి యొక్క సాధారణ కొలత - అని భావిస్తారు.
@) 'బారు చెయ్యి ' = దానగుణం కలిగిన మనిషి;
@) "చారణా పనికి బారణా ఖర్చు";
@) 'పావలా ప్రజలకు అందితే బారణా నాయకుల జేబుల్లోకి వెళ్లిందని చెప్పుట ;  '
@)    అణా = 6 పైసలు; 
@) చార్ అణాలు - పావలా, 25పైసలు; బారణా = 75 నయాపైసలు, 
@) 16 అణాలు - 96 దమ్మిడీలు - రూపాయి సమానం గా వ్యవాహారంలో ఉండేవి.
@) బారెడు దూరం = 12 క్రోసులు దూరం, = ఎక్కువ దూరం;  
@) మూరలు,  కొలుచుట ; 

********, 
బారెడు జుట్టు (12"); కాళ్ళు బారచాచుకుని కూర్చుము, 
తలుపులు  బార్లా తెరుచుకుని కూర్చుని; 
బారులు (క్యూ ) తీరిన ' 
ఇట్లాంటి మాటలు నిత్య వ్యవహారంలో ఉన్నవి.

================================,

बारह:- दो आँखें बारह हाथ ;
12 #Barah in Hindustani aanas (or annas), ; 2009 by Raja Menon ;# 
/ ii maaTa tarachuu chewula baDutUnE umTumdi, ardham pannemDu.
pamDremDu = # XII # 
[SAmtaa raamm darSakatwamlOni prsiddhamaina himdii chitram "dO 
aamkhE bArA haath". 2009 lO raajaamiinan raasina DrAmaa 
aadhaaramgaa  
"baaraah aNA" (#baraah anaa#)
himdii sinimaa wachchimdi. ]
గులేబకావళి కథ (1962 wiDudala); 
"salAma lEkum saahebbu gaaruu! 
balE shOkugaa wachchaaru ...... "

] ఆలీబాబా నలభై దొంగలు 
baaraa balaawati :- telugu naanuDilO wachchina naanuDi idi.
himdii, urduu padaalu muchchaTagaa telugulOki chErinawi. 
ashTAchammaa, paamch paTAkaa, 
pamDugala puNyamaa - ani - dhan tEras, raaKI munnagunawi. 
gulEbakaawaLi katha, aaliibaabaa nalabhai domgalu wagairaa 
sinimaalalO konni paaTalu, telugulO miLAyimchina paarSI padaalu 
winipimchinawi.
"lElO dil bahaar attar! duniyA mastaanaa attar!  
okkasaari raasi chuustE Gum Gum Gum Gum GumA!............  ; 
ekkuwagaa attaru saayibu sambamdhita giitaalu iwi. 
dESI bhaashalalO chOTu chEsukunna amdamaina maaTa 
"బారా బలావతి ". 

19 wa Sataabdam daakaa ii padam, naanuDi wale - samghamlO 
         waaDukalO unnadi. బారా బలావతి - amTE EmiTi?
mana graamaalalO gata remDu daSAbdaala kritam waraku - graama 
pamchaayatii la nirwahaNalO swayam paripaalanatO, samRddhamgaa 
umDEwi. 
chinna paridhiki awasaramaina sibbamdi umDE wALLu. amdu nimittam, 
ErpaDina sibbamdi, palleTULLalOni prajala sEwaku winiyOgapaDEwi. 
parimita awasaramulanu tiirEwi. ii samdarbhamgaa ErpaDina sEwaka, 
paalana, kETagirii - imchumimchu 
12 mamdi umDE wALLu. ka
baaraa + bala = baaraa balaawati -
baaraa = 12 ; pannemDu mamdi balagam unna -
chinna swayam samRddhi 
kaligina pallelu - anna maaTa.  awEmiTO chuuddaamu.
1. karaNam 2. (munasabu); 
3. reDDi :- chinna taagaayidaalanu, tiirpulu chEsE waaDu; 
4. kaTTubaDi; 5. SeTTi/ saraaphu; 
5. kamsaali;  6. waDramgi; 
7. kummari; 8. chaakali; 9. mamgali; 
10. tOTii = chimmi, Subhram chEsE waaDu; 
11. kaTTubaDi = munasabuku sahaayakuDu. \
12. talaari = graama bhaTuDu;

ii widhamgaa pamDremDu mamdi sTAph kaligi umDina kuuTami 
palleTUru."baaraa balaawati " lOkOkti wiSEshaalu iwi.  


********************************,
Pageview chart 34345 pageviews - 825 posts, last published on Nov 30, 2015
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 63800 pageviews - 1035 posts, last published on Nov 30, 2015 - 7 followers
Create new postGo to post listView blog
తెలుగురత్నమాలిక
Pageview chart 5100 pageviews - 147 posts, last published on Nov 11, 2015 
&
కోణమానిని తెలుగు ప్రపంచం : ; 58420 
Pageview chart 56585 pageviews - 1012 posts, last published on Feb 19, 2015 - 6 followers 
అఖిలవనిత
Pageview chart 30248 pageviews - 776 posts, last published on Feb 19, 2015 
Posted by Anil Piduri at 2/20/2015 10:44:00 [AM]    
Labels: చిత్ర లేఖనము, తెలుసా ?, ప్రాచీన రత్న మాల, వ్యాసములు
0 comments:

**********************************************************, 

19, ఫిబ్రవరి 2015, గురువారం

ఆ అవధూత నామం "సదాశివబ్రహ్మేంద్రస్వామి"

"శంకరాభరణం" సినిమాలో పాట ప్రేక్షకులకు బాగా గుర్తు ఉన్నదే! 
'మానస సంచరరే ....." ఈ కీర్తన రచయిత పేరును చెప్పండి, 
సరే! ఆ అవధూత నామం "సదాశివబ్రహ్మేంద్రస్వామి".
సదాశివబ్రహ్మేంద్ర యోగి నిర్వికల్ప తాపసి. ఆయన గొప్ప నిష్కామ ధ్యానయోగి. 
ఐనప్పటికీ సదాశివబ్రహ్మేంద్రస్వామి తాదాత్మ్యతతో చేసిన ఆలాపనలు 
భారతీయసంగీతములో ప్రముఖస్థానాలను పొందినవి. 

తన జీవితపు తొలిదశలో ‘ఒక పిచ్చివానిగా’ అవహేళనకు గురి ఐన వ్యక్తి సదాశివబ్రహ్మేంద్రులు. 
అట్లాంటి స్థితి నుండి గొప్ప ప్రతిభాసంపన్నునిగా  
అలనాటి సమకాలీన సమాజములో గుర్తింపు పొందాడు సదాశివబ్రహ్మేంద్ర స్వామి. 
భక్తిపారవశ్యతతో అలౌకికజ్ఞాననిధిని పొందిన అవధూత , 
శ్రీ  సదాశివబ్రహ్మేంద్ర యోగికి ప్రభువులు సైతం శిష్యులైనారు. 
ఆయనను “గురుదేవులు” గా  స్వీకరించారు.
17 వ శతాబ్ది, తమిళనాడులోని పుదుక్కోట రాజులు భక్తులు.   
విజయరఘునాధరాయ తొండైమాన్ చక్రవర్తికి గురుస్థాన గౌరవములను పొందిన సదాశివబ్రహ్మేంద్రస్వామివారు కొన్ని సూచనలను ఇచ్చారు. 
పాతకోటలో ‘దక్షిణామూర్తి దేవాలయమున కొన్ని విశేషాలు ఉన్నవి.  
ఒక వకుళపాదపం కింద సదాశివబ్రహ్మేంద్రస్వామి కోవెల ఉన్నది. 
సదాశివ గురు అనుగ్రహభాషణములనే 
ఈ దక్షిణామూర్తికోవెలలో చారిత్రకపరిశోధనలకు సమాదరణీయాలు.  
పిబరే రామ రసం ; మానస సంచరరే - ఇత్యాది బహుళ ఆదరణీయ కృతులు, 
ఈ నిర్వికల్ప తాపసి, బ్రహ్మజ్ఞానివే!  
కావేరీనదీ తీరాన, కరూర్ అను ఊరు, మహాధనపురము, పున్నై నల్లూరు - 
మున్నగు ప్రదేశాల వద్ద సంచరించారు.
నేరూరు వద్ద సమాధి ఉంది.
మైసూర్ వొడయార్ మహారాజా కుటుంబీకులకు చాముండేశ్వరీదేవి కులదేవత, 
అట్లాగే పుదుక్కోట్టై - తొండమాన్ చక్రవర్తి, కులదైవం బృహదాంబై, 
ఇలవేల్పు దక్షిణామూర్తి లు పూజలు అందుకుంటున్నారు. 
నెరూరు, మన మధురై ల వద్ద సదాశివబ్రహ్మేంద్ర యోగి "సస్మరణ సంగీత ఉత్సవాలు" నేటికీ జరుగుతున్నవి.
 Rhinosorus 















# "pibarE rAma rasam" ; kAwErInadii tiiraana,
 karuur anu uuru, mahaadhanapuramu, punnai nalluuru - 
munnagu pradESAla wadda samcharimchaaru.
neruuru, mana madhurai la wadda sadaaSiwabrahmEmdula samgiita utsawaalu nETikii jarugutunnawi. #

*****************************, 

Pageview chart 34345 pageviews - 825 posts, last published on Nov 30, 2015
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 63800 pageviews - 1035 posts, last published on Nov 30, 2015 - 7 followers
Create new postGo to post listView blog
తెలుగురత్నమాలిక
Pageview chart 5100 pageviews - 147 posts, last published on Nov 11, 2015 
58380 - అఖిలవనిత
Pageview chart 30205 pageviews - 776 posts, last published on Feb 19, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56508 pageviews - 1011 posts, last published on Feb 16, 2015 - 

16, ఫిబ్రవరి 2015, సోమవారం

శాంతి నికేతన్ లో వీణా మాధురి

శాంతినికేతన్ కళలకు ఇంద్రధామం. మహాకవి రవీంద్రనాథ టాగూర్ తన సర్వసంపదలనూ ధారపోసి, నెలకొల్పిన ఆదర్శ విశ్వ కళా విద్యాలయం అది. 
లలితకళా లావణ్యతకు చలువపందితిళ్ళు వేసిన ఆదర్శ నిర్వచనం శాంతినికేతన్.
ఈ శాంతినికేతనము నందు వీణను ప్రవేశపెట్టిన వారు ఎవరో తెలుసా? ఆ వ్యక్తి మన తెలుగువాడే! 
ఆ సంగీతపండితుని పేరు "తుమురాడ సంగమేశ్వర శాస్త్రి".
ఇదిఎట్లాగజరిగిందంటే :- 
పిఠాపురం రాజావారికి ఒక సంగతి తెలిసింది. "ఆ రైలుబోగీలో ఒక మహానుభావుడు ఉన్నారు", 
ఆయనే విశ్వకవి రవీంద్రనాథ టాగూర్.  
మద్రాసుకు వెళ్ళి, తిరిగి కలకత్తాకు బైలుదేరారు రవీంద్రనాథ టాగూర్. 
రాజాగారికి ఇది తెలిసింది. ఇంకేమున్నది? రాజుగారు తలుచుకున్నారు, 
చుక్ చుక్ బండిని ఆపించారు. పొగబండిని పిఠాపురం లో నిలిపి, 
"విశ్వకవీ! మా ఊళ్ళో మూడు రోజులు ఉండండి. 
మా ఆతిధ్యాన్ని స్వీకరించి, మమ్మల్ని ధన్యుల్ని చేయండి!" అని కోరారు.

ఆ మూడు రోజులు - అవి శాస్త్రీయసంగీత తరువుకు పూయించిన త్రిదళములు. 

వైణికవిద్వాంసులు సంగమేశ్వర శాస్త్రి మనోమోహనముగా వీణను వాయించారు. వీణాసుస్వర సునాదమాలలను ధరించిన రవీంద్రనాథ టాగూర్    'తాను లలితకళా తోరణం'  ఐనారు.
"సంగమేశ్వర శాస్త్రీజీ! మా శాంతినికేతన్ లో విద్యార్ధులకు వీణావాదనను నేర్పించండి. వైణికగురు పదవికి మిమ్ములను ఆహ్వానిస్తున్నాను." వెదకకుండానే కాలికి చుట్టుకున్న పారిజాతాల హారాన్ని వెంటనే ఆనందంతో గైకొన్నారు తుమురాడ సంగమేశ్వర శాస్త్రి, 
కొంతమందిని వైణికులుగా తీర్చగలిగారు సంగమేశ్వర శాస్త్రి. కుటుంబబాధ్యతలు, 
స్వగ్రామముపై మరులు, సంగమేశ్వర శాస్త్రిని పిఠాపురం చేరేలా చేసాయి.  
అప్పటిదాకా తమకు తెలిసి ఉన్న ఉత్తరాది వాయిద్య, సంగీతాలు శాంతినికేతన్ ఉన్నవి. 
వీణా మాధుర్యాన్ని ఆస్వాదించిన రవీంద్రనాథ టాగూర్ 
శాంతినికేతన్ లో వీణియ - పరిచయ ఘటనకు శ్రీకారం చుట్టడానికి మన రాష్ట్రం మూల హేతువు అయింది. 

*************************
శాంతి నికేతన్ లో వీణా మాధురి!; User Rating:  / 2 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri
Thursday, 12 February 2015 07:49
Hits: 139
*************************

అఖిలవనిత
Pageview chart 30031 pageviews - 769 posts, last published on Feb 15, 2015

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56402 pageviews - 1010 posts, last published on Feb 13, 2015 - 

13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

హొయసల మూలసంస్థాన శ్రీక్షేత్ర అంగడి


చిక్కమగళూరు' - అనగానే కర్ణాటకలోని ఒక గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రత్యేకత మనస్సులో కదలాడుతుంది.సరే! ఆనాటి ఎన్నికల సంరంభాన్ని పక్కనబెట్టి, ఆ పల్లె వివరములను పరికిద్దాము."అంగడి" అంటే కొట్టు, షాపు అనే అర్ధాలు ఉన్నవి. తెలుగునాట, జోడీ దశాబ్దము క్రితం - కొన్ని జిల్లాలలో 'అంగడి' అని వాడుకలో ఉన్నది. 
'అంగడి సరుకులు '; అంగడిబొమ్మ - ఎట్సెట్రా పదాలు వాడుకలో ఉన్న మాటలు.వ్యవహృతాలు.
బసడి :- అనునది పాలీ భాష పదము. బసడి - అంటే "వసతి" అని అర్ధం.   
"నేమినాధ బసడి" అని రెండింటిలోనూ- పెద్దదైన జినాలయాలము పేరు. 
ఇందు ముగ్గురి విగ్రహాలు ఉన్నవి, 
అవి - నేమినాధ, చంద్రనాధ, గోమఠేశ్వర ; ముడిగెరె తాలూకాలో కుగ్రామం 'అంగడి ', 
ఐదు  ఆలయముల పురాతనత్వము, చారిత్రక ప్రాధాన్య దృష్ట్యా వార్తలలో చేరింది.   
అంగడి పల్లెయొక్క అసలు పేరు "శశకపుర"/ "సొసెవూర్".
{Mudigere taluk.\;"Sasakapura or Sosevur" by the Hoysalas, }

ఈ "అంగడి పల్లెతోపాటు హొయసల రాజ్యం, హొయసల- అనే పేరు రావడానికి ప్రధాన హేతువు, 
అంగడి  గ్రామ, స్థానికుల దేవి "వసంతిక మాత" - ఈ మూడు విశేషాలు ముప్పేటగా అల్లుకున్న ముత్యాలపేట వలె మురిపిస్తున్నవి.
***************;
కోవెలలో కొలువై ఉన్న "వాసంతికా దేవి" - ప్రాభవమైన హొయసలా సామ్రాజ్య స్థాపకుడైన వీరునికి 
బిరుదనామం కలుగుటకు పునాది స్తంభముగా వెలసినది.
***************;
వాసంతికా దేవి :-- ఊరి దేవత. 
'యోగేంద్ర సుదత్త' అను జైనగురువు కారడవిలోని వాసంతికా దేవిని రోజూ పూజిస్తుండేవాడు.  
యోగేంద్ర సుదత్త ఒకనాడు - వసంతిక దేవి ని పూజించుటకై వెళ్తుండగా గాండ్రిస్తూన్న పులి ఎదురైంది. 
ఒక లోహపు కడ్డీని శిష్యుడైన సాలునికి ఇచ్చాడు. "పొయ్! సాలా!" ("కొట్టు, సాలా!")అని జినుడు ఆదేశించగా, గురువు విసిరిన లోహశలాకను అందుకున్నాడు సాలుడు. గురువు ఆజ్ఞపై "సాలుడు" ఆ వ్యాఘ్రమును పరిమార్చాడు. 
యోగేంద్ర సుదత్త వాక్యాలు రత్నఖచితములైనవి. తద్వారా - ఆ సీమకు  హొయసల అని పేరు వచ్చినది.  
హొయసల- వంశనామ మూల కథ, కొద్దిభేదాలతో చాలా చోట్ల ఉన్నది. సాలుని గాధ, తామ్ర పళ్ళాలు, 
నాణెములు, ఆలయాలలో ఉన్నది. రాగిరేకులపై, ముద్రలపై, ఆలయ కుడ్యాలపై- శిల్ప, లేఖనాదులు - లోహ కమ్మీ, పులి వద్ద వీర సాలుడు - సాక్షాత్కరిస్తూ, హొయసల - మూలపురుషుడైన సాలుని పరాక్రమానికి నిదర్శనములైనవి.
***************;
వాసంతికా దేవి కొలువైన  అంగడి గ్రామమునందు - ఐదు ప్రాచీన దేవాలయాలు ఉన్నవి. 
(జీర్ణావస్థలో ఉన్న పంచ కోవెలలను తిరిగి - పునరుద్ధరణ చేయుటకై విజ్ఞులు ప్రయత్నాలు చేస్తున్నారు.) అంగడి కోవెలలు రెండు - "జైన బసడి" (జైన వసతి) లు అని గుర్తింపు పొందినవి. 
 "నేమినాధ బసడి" అని రెండింటిలోనూ- పెద్దదైన జినాలయాలము పేరు. ఇందు ముగ్గురి విగ్రహాలు ఉన్నవి, అవి - నేమినాధ, చంద్రనాధ, గోమఠేశ్వర. 
10 వ శతాబ్ద కాలమునాటివి జైనబసడీలు. 'మాణిక పొయ్ సలాచారి'
("Makara Jinalaya," built by Manika Poysalachari.) నిర్మించిన జైనబసడీకి "మకర జినాలయము" అని పేరు. 
అక్కడ ఆసీనభంగిమలో ఉన్నట్టి "శాంతినాధ" విగ్రహము శిల్పుల ప్రతిభకు ఆనవాలు.  తక్కిన కోవెలలు మూడు :- కేశవ, పాటల రుద్రేశ్వర, మల్లికార్జున ఆలయాలు. **********; 
వాసంతికా దేవిని స్థానికులు "వసంతమ్మ" అని పిలుస్తారు.  వాసంతికా దేవి కోవెలలోని మకుటములు ధరించిన సప్తమాతృకలు దర్శనం భక్తులు అనుసరిస్తారు. ఏడు మాతల ప్రతిమలు, సున్నము మొదలగు వస్తునిర్మితములు( అనగా ఏడు బొమ్మలు రాతిలో చెక్కినవి కావు, అవి సున్నము, మట్టి, పీచు వంటి సంభారములను అనుభవ నైపుణ్యాలతో, సరైన నిష్పత్తి, దామాషాలలో మేళనం చేసి నెలకొల్పిన ఆలయ నిర్మాతల నిర్మాణములు)   
***************;
వాసంతికా దేవి, పంచ కోవెలలు, జైన బసడిలు :- అంగడి గ్రామం యొక్క కలిమి, హొయసలప్రాభవమునకు మచ్చుతునక.
టూరిజ్మ్ అభివృద్ధి చెందితే, స్థానికప్రజలకు జీవనోపాధి లభిస్తుంది.
మీదుమిక్కిలి అద్భుత ప్రాచీన శిల్పకళావారసత్వము తమ ఊరికి గర్వకారణం కూడా కదా!?
కనుకనే ఔత్సాహికులు జీర్ణోద్ధరణా ప్రయత్నాలను ఉత్సాహభరితులై కొనసాగిస్తున్నారు.
***************;
color pieces in AIR 












వాసంతికా దేవి; హొయసల మూలసంస్థాన శ్రీక్షేత్ర అంగడి 
58278 ;

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ఌఉ 

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56290 pageviews - 1008 posts, last published on Feb 12, 2015 - 6 followers
అఖిలవనిత
Pageview chart 29947 pageviews - 768 posts, last published on Feb 11, 2015

12, ఫిబ్రవరి 2015, గురువారం

గమక, గానకళ

గాన పద్ధతి - :- హరి కథలు, బుర్రకథలు విన్నారా? కథకులు, పౌరాణికులు రాగయుక్తంగా కథలను చెప్పి, పాఠకులను రంజిస్తారు. ఇటువంటిదే గాన కళా పద్ధతి. 
ఐతే హరికథకులు, బుర్రకథ చెప్పే వాళ్ళు పాటల బాణీ మార్గం కాక, 
విభిన్నమైన సంగీత, రాగ, గమకాదులను, బాణీలను ఎన్నుకున్నారు గాన కళా పద్ధతి అనుసరణ కర్తలు. 
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦

గాన కళా పద్ధతి అంటే ఏమిటి? కొన్ని వివరములను గమనిద్దాము.
వేదము, పన్నములు - చదివేటందుకు - ఒక పద్ధతి కలదు. వేదపన్నాలను ప్రత్యేక స్వరముతో పాడుతారు. ఉదాత్త, అనుదాత్త, గమకం - వంటివి స్వరోచ్ఛారణలు కీలకపాత్రను నిర్వహిస్తున్నవి. 
చిన్న ఉచ్ఛారణకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నది.  
స్వరభేదం ఇసుమంత  ఉన్నా, భావవిపర్యాసం సంభవిస్తుంది.
ఈ స్వర అనుసరణలను - గురుకులములందు - ఉపాధ్యాయులు పట్టుదలతో బోధిస్తారు:
విద్యార్ధులు దీక్షతో అభ్యసిస్తారు. క్రమంగా మన సాంప్రదాయసంగీతమునకు పునాదులు ఏర్పడినవి. 
గమక - దీనిని "కావ్య వచన" అని కూడా పిలుస్తున్నారు. 
ఒక వ్యక్తి - పద్యాలను ఉచ్ఛ స్వరంతో పాడుతుంటాడు. కథలోని భావోద్వేగాలను
ప్రతిఫలిస్తుంటాయి ఈ రాగములు.
నేటి సినిమాలలో - బ్యాక్ గ్రౌండు మ్యూజిక్ ను బోలినవన్న మాట. 
నేపథ్య సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన కళాకారులు
(Gamaka / kAwyawachana artists. ). గమక బాణీ గాయకుని  "గమకి" అని పిలుస్తున్నారు.
గమకి పద్యాలాపన వెనుక, కథకుడు కథను వివరిస్తూ, ఆ భవాల ఉత్తేజాన్ని ప్రేక్షకులో నింపగలుగుట - ఇందలి విభిన్నశైలి. 
మన ఆంధ్రదేశాన బుర్రకథను- ఇంచుమించు - ఈ విధానాన్ని ఎంచుకున్నారు. 
కర్ణాటకదేశాన 'పల్లెపదముల రాగమట్టులకు', సాంప్రదాయక కర్ణాటకసంగీతమునకు -
చిత్రీకరణ ఈ గమక కళా సంపద, అని చెప్పవచ్చును.   
కావ్య వచన రీతి, సాహిత్యములోని క్లిష్ట పద. తాత్పర్య, 
భావాలను, సభికులకు సులభంగా అర్ధమయేలాగా చేస్తుంది. 
అధికశాతం - ప్రాచీనకన్నడ కావ్యాలనుండి కథలను తీసుకుంటారు. 
జైమినీ భారతము, హరిశ్చంద్ర, కర్ణాటక భారత కథా మంజరి, దేవీ భాగవతము, 
సిద్ధరామేశ్వర చరిత్ర, అజిత పురాణము, తొరవె రామాయణము ఇత్యాది సాహిత్య గాధలు, ఉపకథలు
గమక కళను పరిపుష్ఠం చేస్తున్నవి. 
వ్యాఖ్యానాలు, పద్యాలు, నవ్య సంగీత బాణీలు,
ట్యూనులు కలబోసిన గమక కళ - కర్ణాటక విద్యా వారసత్వ అమూల్య నిధి.
సంస్కృత ఉపయోగ భాష, గమక కళలకు పట్టు కొమ్మలైన మత్తూరు, హొసపల్లెలు ఆదర్శ సీమలు. 

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦

హొసహల్లి గ్రామము "గమక కళ" కు ఆటపట్టు. 
కర్ణాటక రాష్ట్రంలో కథన ప్రక్రియ, గానం చేస్తూ చెబుతారు. 
మత్తూరు, హొసహల్లి లలో 5 వేలకు పై చిలుకు ప్రజలు నివాసం ఉంటున్నారు. 
అక్కడ నివాసం ఉంటున్న అందరూ సంస్కృతభాషను అధ్యయనం చేసారు. 
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦

] మత్తూర్:- (/ మాధుర్/ మత్తూరు):, హొసహల్లి - తుంగానదీ తీరమున ఉన్న జంటఊళ్ళు. 
హైదరాబాదు, సికింద్రాబాదుల వలె, ఇవి ట్విన్ గ్రామాలు అన్న మాట. 
మత్తూరు మన దేశీయవార్తా పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తూంటుంది. 
అందుకు కొన్ని విశేష కారణాలు ఉన్నవి. 
మత్తూర్ శివమొగ్గ పట్టణానికి దగ్గర ఉంది.  
ప్రజలు నిత్య దైనందినభాషగా గీర్వాణభాషను వాడుట - ఇక్కడ పరిపాటి,  ప్రత్యేకత. 
హొసహల్లి గ్రామము "గమక కళ" కు ఆటపట్టు. 
హొసహల్లి - 'కొత్త పల్లె' / NEW VILLAGE {ಹೊಸ,  होस } అని అర్ధం.
ఇవి ప్రశాంతతకు నెలవులు ఐన మారుమూల పల్లెలు. 
హొసకన్నడ మొదలైన పేర్లు ఈ భావాన్ని కలిగి ఉన్నవి.
మత్తూరు, హొసహల్లి - ఈ రెండు పల్లెటూళ్ళు / 4 కె ఎమ్ దూరాన ఉన్నవి.  

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦

 colourful birds, playing two boys 















   #] hari kathalu, burrakathalu winnaaraa? kathakulu, pauraaNikulu raagayuktamgaa kathalanu cheppi, paaThakulanu ramjistaaru. 
] chCA చ్ఛా paripaaTi  
gamaka - diinini "kaawya wachana" ani kuuDA pilustunnaaru. 
oka wyakti - padyaalanu uchCa swaramtO paaDutumTADu. kathalOni bhaawOdwEgaalanu
pratiphalistumTAyi ii raagamulu.
nETi sinimaalalO - byaak graumDu myuujik nu bOlinawanna maaTa. 
nEpathya samgiitaaniki unna praadhaanyatanu gurtimchina kaLAkArulu
(#Gamaka / kAwyawachana artists#. ). gamaka baaNI gaayakuni  "gamaki" ani pilustunnaaru.
gamaki padyaalaapana wenuka, kathakuDu kathanu wiwaristuu, aa bhawaala uttEjaanni prEkshakulO nimpagaluguTa - imdali wibhinnaSaili. mana aamdhradESAna burrakathanu- imchumimchu - ii widhaanaanni emchukunnaaru. 
karNATakadESAna pallepadamula raagamaTTulaku, saampradaayaka karNATakasamgiitamunaku chitriikaraNa ii gamaka kaLA sampada, ani cheppawachchunu. \\\\\\\\\\\\\\\\\\\\\\   ''''''''''''''''''''''''''''''''''
] mattuur:- (/ maadhur/ mattuuru):, hosahalli - jamTa uuLLu.  haidaraabaadu, sikimdraabaadu la wale, iwi Twin graamaalu anna maaTa. mattuuru mana dESIyawaartaa pariSIlakula dRshTini aakarshistuumTumdi. amduku  konni wiSEsha kaaraNAlu unnawi. mattuur Siwamogga paTTaNaaniki daggara umdi. 

] హొసహల్లి - 'kotta palle ' {  ಹೊಸ ' ' होस ' } ani ardham. hosa kannaDa modalaina pErlu ii bhaawaanni kaligi unnawi.  

] iwi praSAmtataku nelawulu aina maarumuula pallelu. prajalu nitya dainamdina bhaashagaa giirwaaNa BAshanu waaDuTa - ikkaDi pratyEkata. mattuuru, హొసహల్లి - ii remDu palleTULLu / 4 ke emm duuraana unnawi. wEdamu, pannamulu - chadiwETamduku - oka paddhati kaladu. wEdapannaalanu pratyEka swaramutO paaDutaaru. udaatta, anudaatta, gamakam - wamTiwi swarOCchAraNalu kiilakapaatranu nirwahistunnawi. 
chinna uCchAraNaku kuuDA emtO prAdhAnyata unnadi.  swarabhEdam isumata  unnaa, bhaawa wiparyaasam sambhawistumdi.ii swara anusaraNalanu - gurukulamulalmdu - upaadhyaayulu paTTudalatO bOdhistaaru:  
widyaardhulu diikshatO abhyasistaaru. kramamgaa mana saampradaaya samgiitamunaku punaadulu ErpaDinawi. 
హొసహల్లి graamamu "gamaka kaLa" ku ATapaTTu. karNATaka raashTram  lO kathana prakriya, gaanam chEstU chebutaaru. mattuuru, హొసహల్లి lalO 5 wElaku pai chiluku prajalu niwaasam umTunnAru. nnamdaruu samskRtabhaashanu adhyayanam chEsAru.
kaawya wachana riiti, saahityamulOni klishTa pada. taatparya, 
bhaawaalanu, sabhikulaku sulabhamgaa ardhamayElaagaa chEstumdi. 
adhikaSAtam - praachiinakannaDa kaawyaalanumDi kathalanu tiisukumTAru. 
jaiminii bhaaratamu, hariSchamdra, karNATaka bhaarata kathaa mamjari, dEwI BAgawatamu, 
siddharaamESwara charitra, ajita puraaNamu, torawe raamaayaNamu ityaadi saahitya gaadhalu, upakathalu
gamaka kaLanu paripushTham chEstunnawi. 
wyaakhyaanaalu, padyaalu, nawya samgiita baaNIlu,
Tyuunulu kalabOsina gamaka kaLa - karNATaka widyaa waarasatwa amuulya nidhi.
samskRta upayOga bhaasha, gamaka kaLalaku paTTu kommalaina mattuuru, hosapallelu aadarSa siimalu.  

ఆధార పదాలు:-  Mattur and Hosahalli, Gamaka art,  
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦   
   
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56258 pageviews - 1007 posts, last published on Feb 11, 2015 - 6 followers

అఖిలవనిత
Pageview chart 29941 pageviews - 768 posts, last published on Feb 11, 2015

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 

11, ఫిబ్రవరి 2015, బుధవారం

నంజనగూడు పళ్ళపొడి - ఒక రైలు కథ

 కేవలం ఒక 'పళ్ళపొడి పేరు’ను తన పేరుగా రైలు పొందిన సందర్భం ఉంది. అదేమిటో తెలుసా?
మనదేశం స్వాతంత్ర్యం పొందిన తొలిదశలో - ఆర్ధికంగా తప్పటడుగులు వేస్తున్నదశలో - వ్యాపారరంగంలో కొన్ని ఉత్పత్తులు - అమృతాంజన్, నవనీతం లేపనం వంటివి వచ్చినవి.ప్రజల ఆదరణను పొంది, బిజినెస్ రంగానికి మార్గసూచికలు ఐనవి. అట్లాంటి లిస్టులో చేరిన పేరు "నంజన్ గూడ్ పళ్ళ పొడి".

నేడు టూత్ పేస్టులు, టూత్ బ్రష్ లు, టూత్ పౌడర్లు మార్కెట్టులో హల్ చల్ చేస్తున్నవి. స్వాతంత్రం పొందిన కొత్తల్లో, సమాజం సాంప్రదాయిక విధానాలను  అనుసరిస్తున్నది. అప్పట్లో ప్రజలు దంతధావనానికి వేప పుల్లలు, కానుగ పుల్లలు వంటి వాటిని పందుంపుల్లలుగా వాడేవారు. పిడకలపై వంటలు చేసేవారు. పిడకల కచ్చికలతోనూ,బొగ్గుపొడితోనూ, డికాక్షన్ తయారీకి వాడేసిన కాఫీపొడి మొదలైనవాటితో - పళ్ళుతోముకునేవాళ్ళు. ఆ తరుణంలో వ్యాపారరంగం వైపు దృష్టి సారించిన వ్యక్తి "బి.వి.పండిత్".

మైసూర్ చామరాజ్ ఒడెయర్ ఆయుర్వేద కాలేజీ నుండి ఉత్తీర్ణులైన మొదటి బ్యాచి విద్యార్ధులకు లీడరు ఈ పండిట్. బృందనేతగా పటిష్ఠ ప్రణాళికకు రూపకల్పన చేసారు. "సద్వైద్య శాల" ను నెలకొల్పారు బి.వి. పండిత్.  

B.V. Pandit ఆయుర్వేద వైద్యులు,ఆయుర్వేద పరిజ్ఞానాన్ని ప్రజావళికి ఉపయోగపడేలా యోచన చేసారు. పండిత్, శిష్యులు, కుటుంబీకులు అందరూ - పళ్ళపొడి తయారీకి వాడవలసిన వస్తువుల జాబితాను రాసుకున్నారు. సగటు మనిషి కొనుగోలుశక్తి - ఇందులో కీలకపాత్ర వహించినది. చిగుళ్ళకు హాని కలిగించని పదార్ధాలను ఎంపిక చేసారు. ఏకగ్రీవంగా ఆ మెనూ ని ఆమోదించారు. అందరి సమిష్ఠి కృషి ఫలితం నంజనగూడు దంతచూర్ణం.

మొదట కుటీరపరిశ్రమ స్థాయిలో వారు పొడిని ఉత్పత్తి చేసారు. వరిపొట్టుతో బి.వి. పండిత్ చేసారు.  కొన్ని ఒడిదుడుకులను అధిగమించి, విపణివీధిలో నిలదొక్కుకున్నారు. మింట్  కలిపిన పింక్ కలరు పళ్ళపొడి అట్టడుగు వర్గాల వారు కూడా కొనగలిగేలాగా కారుచౌకగా లభించడం వలన  మారుమూల పల్లెటూళ్ళు సైతం ఈ పేరును 'పళ్ళపొడి'కి ప్రతీకగా నిలబెట్టినవి.    

"సద్వైద్య శాల" ఫౌండర్ "బి.వి.పండిత్"  - ఆయన 'నంజనగూడు హల్లుపుడి' (నంజనగూడు పళ్ళ పొడి) ఉత్పత్తిని సంఘంలోనికి తీసుకొచ్చారు.

******

"సద్వైద్య శాల" నంజనగూడు పళ్ళ పొడి లేతగులాబీరంగులో, తియ్యగా ఉండి ఇంటింటా ఆదరణ పొందింది. నోటి చిగుళ్ళు, పళ్ళు సంరక్షణకు అద్భుత రక్షాకవచం అనే నమ్మకాన్ని పొందింది ఈ పళ్ళపొడి. ఈ దంతధావన చూర్ణం చిరకాలం నాణ్యతతో, అచిరకాలంలోనే కన్నడసీమలో అందరి ఆదరాభిమానాలను చూరగొన్నది.
హల్లు పుడి ట్రైను :-

ఈ పళ్ళపొడి ఎంత జనరంజకమైనది అంటే - నంజనగూడు ఊరుకి వస్తున్న రైళ్ళను "హల్లు పుడి ట్రైను" (పళ్ళపొడి ట్రైను) అని పిలిచే వారు. ఐదు పుష్కర కాలాల వెనుక ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణులకు సుపరిచితం నంజనగూడుపళ్ళపొడి. కొత్తగా 4-ఇంచ్, 3-ఇంచ్ బ్రౌన్ పేపర్  బ్యాగ్ రూపాన, హెర్బల్ ప్రోడక్టుగా ఇప్పుడు పునః ప్రవేశం జరుగసాగినది. 90 సంవత్సరాల ఘన చరిత్రను సొంతం చేసుకున్న  నంజనగూడు పళ్ళపొడి, మళ్ళీ నేడు కొత్త అవతారం దాల్చుతున్నది.  

*******

నంజనగూడు ప్రాంత సమాచారం, ఆసక్తికర విశేషాలు కొన్ని పరికిద్దాం.

1) బి.వి. పండిత్ సంబంధిత అంశాలలో ప్రత్యేక అంశం ఒకటి ఉన్నది. ఆయన కుమార్తె - కల్పనా పండిత్ ఫేమస్ సినిమా నటి కూడా!
2) నంజనగూడు కేలాలు:- నంజనగూడు సీమ లో పండుతున్న అరటిపళ్ళు రుచికరమైనవి.  Kayyar Kinnan Rai వీటి రుచిని వివరిస్తూ "నంజనగూడిన రసబాళె" అనే పాటను రాసారు. నోరూరించే ఆ పాట (తెలుగులో 'మొక్కజొన్నతోటలో’ వలె) అందరు కులాసాగా ఈలవేస్తూ కూనిరాగం తీసేలాగా హిట్ ఐంది.
3) కయ్యర  కిణ్ణన్ రై (ಕಯ್ಯಾರ ಕಿಞ್ಞಣ್ಣ ರೈ) (జూన్ 1915) :- నంజనగూడు ప్రాంతాన పేరొందిన రచయిత, జర్నలిస్టు, సాహితీచైతన్య కృషీవలుడు - అని పేర్గాంచారు. వీరు రాసిన కదళీరసభరిత కవితను పద్య గీతమ్ - బాలగీత, జానపదగీత ఫణితితో శ్రవణానందకరమైనది. "పడువారళ్ళి పాండవరు" - అనే కన్నడ సినిమాలో అతనురాసిన కొన్ని పద్యాలను చేర్చారు. (తెలుగులో బాపు దర్శకత్వంలో "మన ఊరి పాండవులు"గాను, హిందీలో "హమ్ పాంచ్"గాను వచ్చిన సినిమా)

********
నంజనగూడుపుణ్యక్షేత్రం :-  
[Nanjangud temple- నంజుండేశ్వర ఆలయం]
కపిలనదీ తీరమున వెలసిన నంజనగూడ్. ఈ సీమలో గౌతమముని ప్రతిష్ఠించిన శ్రీలింగం కలదు.  ఈ ఊరికి ఉపనామములు 'గరళపురి ', గొలపుర.   నంజనగూడు పుణ్యక్షేత్రం :- కర్ణాటకలోని ప్రసిద్ధ  పుణ్యక్షేత్రం, "శ్రీ కంఠేశ్వరస్వామి" నెలకొని ఉన్నాడు . "దక్షిణ వారణాశి" "దక్షిణ ప్రయాగ"  అని కీర్తి కలిగిన ఆలయం.

నంజుండేశ్వరస్వామి - "నంజు" కన్నడ మాటకు విషం అని అర్ధం. క్షీరసాగరమథనం జరిగినప్పుడు అనేకవస్తువులు పుట్టినవి. పిమ్మట హాలాహలం వచ్చింది. ఆ విషాన్ని గ్రోలి కంఠం లో నిలువరించగలిగిన మహాశివుడు, ఇక్కడ వెలిసాడు. గరళకంఠునికి ఇక్కడ నంజుండేశ్వరస్వామి అనే పేరు కలిగినది.

హకీం నంజన్ గూడు/ నంజనగూడ్ :- "హకీం నంజన్ గూడు" అని ఈ ఊరుని టిప్పుసుల్తాన్ పిలిచాడు. టిప్పు సుల్తాన్ యొక్క పట్టపు ఏనుగుకు కంటిచూపు పొయ్యింది.నంజుండేశ్వరస్వామి తలిచి, ప్రార్ధించాడు టిప్పుసుల్తాను. ఏనుగు సమస్యను పరిష్కరించుకున్నాడు. మైసూర్ గెజెట్ లో ఈ వివరములు ఉన్నవి. టిప్పుసుల్తాను పచ్చలు,  మరకత నెక్లెస్ ను శ్రీనంజుండేశ్వరస్వామి గుడికి బహుమతులుగా సమర్పించుకున్నాడు. 
కబినీ నది:- 
(Kabini river- కబిని నది స్నానఘట్టం:)
కావేరీనదికి ఉపనది ఐనట్టి  - కపిల నది కి 'కబిని' మరి ఒక ప్రాచీన నామం ఉన్నది. కపిలనదీ స్నానాలకు ప్రత్యేకత కలదు. 
భక్తులు కపిలనదిలో  చేస్తున్న పావన స్నానాలను (ఉరుళు సేవె)అంటారు.

*******************
Email User Rating:  / 3 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri; Tuesday, 03 February 2015 06:44; 
Hits: 234

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  
 many birds, collosual work 














B.V. Pandit
IMAGE:KALPANAPANDIT.COM

అఖిలవనిత
Pageview chart 29897 pageviews - 768 posts, last published on Feb 11, 2015
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56177 pageviews - 1006 posts, last published on Jan 27, 2015 - 6 followers

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...