18, డిసెంబర్ 2018, మంగళవారం

ముద్దు పేర్లు - మొద్దు పేర్లు

"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ."  ;
తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలిచారు. 
మేడమీది రూములోనుండి బద్ధకంగా ఆవులిస్తూ ఒక్కొక్కళ్ళూ కిందికి దిగివచ్చారు. 
"పళ్ళు తోముకో లేదా?" 
"ఇవ్వాళ భౌమ్యవారం కదా పిన్నీ! ఇవాళైనా మమ్మల్ని రెస్టు తీసుకోనీయరేంటి, 
కాస్త విశ్రాంతి తీసుకుంటే మీరేమైనా అరిగిపోతారా? ఏంటి? 
పెద్దాళ్ళందరూ ఎప్పుడూ ఇంతే!" పెద్ద నాపసానిలా చిట్టి అనబడే గౌరి అన్నది. 
ఆ రోజులలో సంస్కృతం ఓరియంటల్ చేసింది లవంగిక. 
ఆమెకు దేవభాష అంటే ఇష్టం. ఆమె దగ్గర గౌరికి చనువు, గారాబం ఎక్కువ. 
కనుకనే ఛలోక్తులను కానుకలుగా ఇస్తూంటుంది చిట్టీ ఉరఫ్ గౌరి. 
'ఆదివారము'ఐనట్టి SunDay కి భౌమ్యాన్ని పులిమి, 
చిట్టి తన గీర్వాణభాషా ప్రావీణ్యాన్ని వెల్లడించింది.
"ఇవాళ సన్ డే, కాస్త గుర్తుంచుకోండి, ప్లీజ్!" 
తరళాక్షి కొడుకు బంటీ అన్నాడు.  
"ఏ వారమైనా గంటలు ఇట్టే గడుస్తాయి. 
గడియారం లో ముల్లు చకచకా కదల్తూనే ఉంటుంది, 
నడినెత్తిపైకి పొద్దు వాలినా నిద్రమత్తుల్ని వదలరు, పైగా ఇట్లాగ నయగారాలు...." 
అంత గడుసు దీర్ఘోపన్యాసం ఇచ్చిన మనిషి పేరు
సత్యమ్మ ఉరఫ్ సత్యవతీదేవి.
మూలనున్న ముసలమ్మ సత్యవతి అప్పటికే వాకిట్లో ముగ్గులేసింది, స్నానం చేసింది, 
ఇత్తడి గ్లాసులో పావుశేరు కాఫీని గటగటా తాగేసింది. 
గునగునా అటూఇటూ నడుస్తూ శ్లోకాల్ని పఠిస్తూ,
ఆమె మాటల్ని కనీసం చెవి తమ్మెల దాకానైనా ఎక్కించుకోలేదెవ్వరూ. 
తొలి పొద్దున ఆలిండియా రేడియో లో అరగంటపాటు వచ్చే 'భక్తిరంజని ' 
ఎంతో ఆమె మాటల విలువ అంతే! 
రెండింటినీ ఎవ్వరూ పట్టించుకోనే పట్టించుకోరు. :) :) :) 
"అట్లాగ పెట్టీ  నేమ్స్ పెట్టి పిలిస్తే ఊరుకోము" 
రుసరుసలాడ్తూ అన్నారు పిల్లకాయిలు. 
"ఏం చేస్తారేంటి?" నవ్వుకుంటూ అన్నది. తరళ. 
"రోజూ ఉండే భాగోతమే కదా ఇది!" నవ్వాపుకుంటూ అన్నది లవంగిక. 
"అసలు పేర్లు మాని, కొసరు పేర్లు పెట్టి పిలుస్తారేంటి డాడీఈ వీళ్ళు? 
ఇట్లాగైతే పెట్టేబేడా సర్దుకుపోతామంతే!"  
దంతధావనం పూర్తిచేసుకుని, వంట్టిలోకి వచ్చి, కాఫీకప్పులు తీసుకున్నారు.
"మా ముద్దుపేర్లనే నామకరణం రోజున బియ్యప్పళ్ళెంలో రాసేస్తే సరి పోయేదిగా" 
బుజ్జీ అన్నాడు కోపంతో. వాడి పరిస్థితి మరీ అన్యాయం. 
"బుజ్జీ! బజ్జీ! మిరపకాయ సొజ్జీ.........." 
అంటూ అర్ధం తెలీకున్నా, రిథమ్‌ బాగా కుదిరింది కదాని, 
ఆ అర్ధంపర్ధం లేని మాటలని పాటలు కట్టి వాణ్ణి 
బాగా ఎగతాళి చేస్తూంటారు ఆటల వేళలలో తోటి ఫ్రెండ్సు.
"ఔను మరి, అట్లాగ నిక్ నేముల్నే బారసాలనాడు పెట్టేసి ఉంటే 
మాకు తేడా కూడా తెలిసేదే కాదు. 
ఆ పిలక నేములకు అలవాటు పడి ఉండే వాళ్ళం" 
ఈ మారు వాళ్ళ కంప్లైంట్సుని ఇవ్వడానికి తాతయ్య దగ్గరికి దారి తీసారు. 
"చూడు తాతయ్యా! అమ్మ, పిన్నీ మమ్మల్ని ఈ టిక్కీ నేముల్తో బైట కూడా పిలుస్తున్నారు. 
సినిమాహాలు దగ్గర విని, మా ఎగస్పార్టీవాళ్ళు అవే పేర్లెట్టి పిలుస్తూ ఏడిపిస్తున్నారు."   
[ ఏదో సినిమాలో - పండు - అని ముద్దు పేరు పెట్టినందుకు 
parents ని heroin బాగా కోప్పడింది ....... 
పాపం, ఇట్లాంటి చేదు experiences ని face చేసింది కదా]
తాతయ్య బోసిపళ్ళ నోట్లోంచి మాటలు తుస్సుతుస్సున గాలిని కలుపుకుంటూ వస్తున్నాయి. 
"మరి మీకు పెట్టిన పేర్లు
ముసలితరం వాళ్ళవి. అంటే మావి, బామ్మ, అమ్మమ్మ, తాతలవి అన్నమాట." 
"అయితే?......" మనమలు, మనవరాళ్ళ ఏకైక ప్రశ్న. 
"పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు, మీరు సరిగా చదవక మకురుతనం చేస్తున్నప్పుడు 
కోపంతో అప్పుడప్పుడు తిట్టాల్సివస్తుంది కదా?" 
"హూ!?" ఈ సారి సౌండులోనే క్వశ్చన్ మార్కును సంధించారు.
"అట్లాగ తిడితే ఆ పేర్లు ఉన్న మాలాంటి పెద్దవాళ్ళను తిట్టినట్లౌతుంది. 
అందుకే మీకీ పేర్లు. అవి నిక్ నేములు కాదు, ముద్దు పేర్లు." 
కాస్త సముదాయిస్తూ సమాధానపరిచాడు కన్నింగ్ తాతయ్య. 
ఆ జవాబు నచ్చినా నచ్చకున్నా ముక్కులు చిట్లించి, 
పెదవులు ముడుస్తూ బైటికి ఆడుకోడానికి పరుగులు తీసారు. 
*********************, ,
కరుణాకర్ తెలుగు టీచర్. ప్రైవేటుగా కట్టి బి. ఇడి., ఎం. ఇడి. లు పాసయ్యాడు. 
ఇప్పుడు పిల్లల గోల వలన ఈ నామధేయాల పట్ల కొన్ని సందేహాలు, 
దాంతో ఉన్నట్లుండి కొన్ని డౌట్లు ఉరవడిగా మదిలో వెల్లువెత్తాయి.
"నాన్నా! పెద్దల పేర్లను భక్తితో పెడ్తున్నాము, 
సరే! కానీ ఎక్కువగా దేవుళ్ళ పేర్లను పెడ్తున్నాము. 
నాకు మీరు మోహన క్రిష్ణ అని పేరు పెట్టారు. తప్పు కదూ!" 
అనూచానంగా వస్తూన్న ఈ ఆచార సంప్రదాయాలని
అనుసరించడమే తప్ప అసలు దానిగురించి పట్టించుకోలేదెన్నడూ. 
 "ఏమిటో? ఇట్లాంటి ధర్మసందేహాలు కలిగితే ఎట్లాగ? జవాబు లేని ప్రశ్నలు ఇవి." 
అని బట్టతలను గోక్కుని, చేతులెత్తాడు.
"రామాయణములో ఉన్న పేర్లన్నీ గుర్తున్నంత వర్ఱకూ చెప్పండి నాన్నగారూ!" 
"రామ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు,
కైకేయి సోదరుడు యుధాజిత్తు, గిరివజ్ర గిరివ్రజ " 
అప్పుడప్పుడూ ఇద్దరూ ఇంకా ఉన్నవాటిని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ చెప్పారు.
"దశరధ, వశిష్ఠ, విశ్వామిత్ర, శబరి, మాతంగ ముని, భరద్వాజ......." 
" సుగ్రీవ, వాలి, రుమ, జాంబవంత,
అంగద, హనుమంత"
"సురమ, విభీషణ, సుమిత్ర, కౌసల్య."  
తర్వాత భారత, భాగవతాలకు జంప్ చేసారు. "అర్జున్, భీమ్ - మొదలుకొని - 
దుర్యోధనుడు, నూర్గురు తమ్ముళ్ళు, చెల్లెలు దుస్సల 
ఇత్యాదిని కరువు తీరా చెప్పుకున్నారు. 
"నాన్నా! ఇతిహాసాల, ప్రబంధాల రచయితలు ఎవరు?"
వాల్మీకి, వ్యాస, నన్నయ, తిక్కన, ఎర్రాప్రెగ్గడ, 
అల్లసాని పెద్దన ............ " లిస్టును చెప్పుకుంటూ వెళ్ళారు.
'బమ్మెర పోతన, బావమరదులు వగైరాలు పింగళి అక్కన్న, మాదన్న, శ్రీనాథుడు, శ్రీకృshNaవరాయలు ........"
వంట పూర్తి చేసి వచ్చిన ఇంటి ఇల్లాళ్ళు అక్కడికి చేరి, తమకు తోచిన అలనాటి పేర్లను చెప్పసాగారు.
"పల్నాటియుద్ధం లో బాలచంద్రుడు, ఐతాంబ, పేరిందేవి, మాంచాల,...........' 
ఈ పట్టిక పాతిక పాతపేర్లు కొత్తవాటిని
చేర్చుకుంది. సంగీతం నేర్చుకుంటూన్న గౌరి 
'త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, సారంగపాణి,
అన్నమయ్య, కంచెర్లగోపన్న, అనగా రామదాసు ....... " 
వెనక తోకలా తగుల్కొన్నాడు కొంచెం సంగీతపరిజ్ఞానం ఉన్న బంటీ ఫ్రెండు 
"రామదాసుగారూ! ఇదిగో రశీదందుకోండీ......"
సత్యం బామ్మ అన్నది "పాతకాలం పేర్లలో దేవుని పేర్లు తక్కువగా కనపడుతున్నాయి. 
ఆ కాలం వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదో?"
సంభాషణలోకి అందరూ వచ్చి చేరగా, పదాల ప్రవాహం వేగం పుంజుకుంది. 
వంటపూర్తి చేసి, స్త్రీలు హాలులోకి వచ్చారు.
తరళాక్షి అన్నది. "నార్త్ ఇండియాలో నకుల్. సహదేవ్, కర్ణ, కౌరవుల పేర్లను పెట్టుకుంటారు. 
దుర్యోధన్, సుయోధన్, ఇట్లాగ." "డార్జిలింగ్ లో హిడింబికి గుడికూడా ఉన్నదట" 
"ప్రబంధకాలం గురించి చెప్ప్పండి. భువనవిజయ ఆస్థానంలో
పెద్దన, ముక్కు తిమ్మన్న, గోదాదేవి, 
అట్లాగే ఆకాలానికి ముందువెనకలుగా అవ్వయ్యార్, మీరాబాయి, 
లొల్ల, కథానాయిక మొల్లమాంబ." "కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన." 
"కన్నడదేశాన రన్న, పొన్న్న, కుమారవర్మ..." 
"ప్రాచీనకాలాన చాల ఉన్నాయి. విక్రమార్క, భట్టి, 
భోజరాజు, హర్షవర్ధన, సముద్రగుప్త, శాతవాహన, మిహిరలకుడు........"
"విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఒకరు బుక్కరాయలు మామూలు పేరే, 
రెండవ వ్యక్తి హరిహరరాయలు..........
శ్రీకృష్ణదేవరాయలులో క్రిష్ణుని పేరు ఉంది. మహామంత్రి తిమ్మరుసు, 
అష్టదిగ్గజ కవులు ముక్కుతిమ్మన,
అల్లసానిపెద్దన, వీళ్ళతోబాటు వికటకవి తెనాలి రామకృష్ణుడు, ధూర్జటి  ..." 
"మన ఆంధ్ర కవిత్రయం నన్నయ్య,తిక్కన, ఎర్రాప్రెగడ ఐతే - 
అటు కర్ణాటక దేశాన రన్నడు, పొన్నడు, పంపడు ఎట్సెట్రా ఎట్సెట్రా"
సత్యమాంబ "ఇంతకీ సారాంశమేమిటీ అని?" 
"జనసామాన్యంలో భగవంతుని పేర్లను పెట్టుకోవడం, 
ఇటీవలి కాలంలో మొదలైంది. అన్నమాచార్యులు, భక్తపోతన, 
వారి కుటుంబీకులు అక్కన్న, మాదన్నలు. తాళ్ళపాక తిరుమలాంబ, తిరుమలయ్య 
వీరివి పుణ్యక్షేత్రాల పేర్లు ........ 
"ఇవి వింటుంటే మొద్దు పేర్లు . వీటి కన్నా ముద్దు పేర్లే నయం ....... "
సదస్యులలో - ఒకరు - వెనక నక్కి, నొక్కి చెప్పిన వక్కాణం అది.
వక్క, ఆకులు నముల్తూ పెద్దల శాల్తీ కనుబొమ్మలను ప్రశ్నార్ధకంగా మలిచి, 
"ఇంకా చెప్పుడు ........ " అన్నట్లు వీక్షణాదులను ప్రసరించాడు. 
"శ్రీనాధుని పల్నాటియుద్ధములోని పాత్రలు, నాగమ్మ, ఐతాంబ, మాంచాల,
బాలచంద్రుడు, పేరిందేవి, అనపోతరాజు, ఎక్కువగా ఇలాంటివి. 
తక్కువగా నరసిం హ, బ్రహ్మనాయుడు లాంటివి.
ప్రబంధపాత్రలు- నలుడు, దమయంతి, 
ప్రవరుడు, వరూధిని, గిరిక ఇవి చాలా ఉన్నాయి. 
క్రిష్ణరాయలనాటి మహామంత్రి
తిమ్మరుసు, శిల్పి జక్కన, స్థూలంగా చెప్పాలంటే 
దేవుని పేర్లను సామాన్యులు సాధారణంగా పెట్టుకొనేవాళ్ళుకాదు. 
ఇటీవల మొదలైన అలవాటు అది. 
మళ్ళీ సంబోధిస్తూ పిలవాల్సి వచ్చినప్పుడు కలిగే ఇబ్బందుల్ని అధిగమించడానికి 
ముద్దుపేర్ల తంటాలు ఇదిగో, ఇప్పుడు మన ఇంట్లోకి మల్లేనే!" తరళ అన్నది.
"నీకు ఇంత నాలెడ్జి ఉందనుకోనే లేదు నేను." 
విస్తుపోతూ భర్త రేపటి టెల్గూ రీసెర్చ్ క మ్‌ ప్రొఫెసర్ అన్నాడు.
;
మా బామ్మ మాట బంగారు మూట - 2 ;
 ===================================,
;
"bujjii! chamTI! bannii! chiTTI! kaaphii taaguduru gaani ramDi! 
Tiphin kuuDA reDI." taraLa, aame sOdari lawamgika tamatama 
pillalni elugetti pilichaaru. mEDamiidi ruumulOnumDi baddhakamgaa aawul istuu 
okkokkaLLU kimdiki digiwachchaaru. 
"PA paLLu tOmukO lEdA?" 

"iwwaaLa bhaumyawaaram kadaa pinnii! iwaaLainaa mammalni 
resTu tiisukOniiyarEmTi, kaasta wiSraamti tiisukumTE miirEmainaa arigipOtArA? EmTi? 
peddaaLLamdaruu eppuDU imtE!" pedda naapasaanilaa chiTTi anabaDE gauri annadi. 
aa rOjulalO samskRtam OriyamTal chEsimdi lawamgika. aameku dEwabhaasha amTE ishTam. 
aame daggara gauriki chanuwu, gaaraabam ekkuwa. 
kanukanE CalOktulanu kaanukalugaa istuumTumdi chiTTI uraph gauri. 
'aadiwaaramu' ki bhaumyaanni pulimi, chiTTi tana giirwaaNabhaashaapraawiiNAnni wellaDimchimdi.
"iwaaLa san DE, kaasta gurtumchukOmDi, plIj!" taraLAkshi koDuku bamTI annaaDu.

"E wAramainA gamTalu iTTE gaDustaayi. gaDiyaaramlO mullu chakachakaa kadaltuunE umTumdi,
naDinettipaiki poddu waalinaa nidramattulni wadaru, paigaa iTlAga nayagaaraalu...." 
amta gaDusu diirghOpanyaasam ichchina manishi pEru satyamma uraph satyawatiidEwi. muulanunna musalamma satyawati appaTikE waakiTlO muggulEsimdi, snaanam chEsimdi, 
ittaDiglaasulO paawuSEru kaaphiini gaTagaTA taagEsimdi. gunagunaa aTUiTU naDustU SlOkaalni paThistuu,

aame maaTalni kaniisam chewitammala daakaanainaa ekkimchukOlEdewwaruu. toli podduna aalimDiyaa rEDiyO lO aragamTapaaTu wachchE 'bhaktiramjani ' emtO aame maaTala wiluwa amtE! reDimTinii ewwaruu paTTimchukOnE paTTimchukOru.
"aTlaaga peTTI nEmm s peTTi, pilistE UrukOmu" 
rusarusalaaDtuu annaaru pillakaayilu. 
"Em chEstaarEmTi?" nawwukumTU annadi taraLa. 
"rOjU umDE BAgOtamE kadaa idi!" 
nawwaapukumTU annadi lawamgika. 
"asalu pErlu maani, kosaru pErlu peTTi 
pilustArEmTi DADI  wiiLLu? 
iTlaagaitE peTTE bEDA sardukupOmamtE!"  
damtadhaawanam puurtichEsukuni, 
wamTTilOki wachchi, kaaphiikappulu tiisukunnaaru.

"maa muddupErlanE naamakaraNam rOjuna
 biyyappaLLemlO raasEstE sari pOyEdigaa" 
bujjii annaaDu kOpamtO. waaDi paristhiti marii anyaayam. "bujjii! bajjI! mirapakaaya sojjii.........." 
amTU ardham teliikunnaa, rithamm baagaa kudirimdi kadaani, 
aa ardhampardham lEni maaTalani paaTalu kaTTi waaNNi baagaa egataaLi chEstuumTAru 
aaTala wELalalO tOTi phremDsu. "aunu mari, 
aTlaaga nik nEmulnE baarasaalanaaDu peTTEsi umTE 

maaku tEDA kUDA telisEdE kaadu. aa pilaka nEmulaku alawaaTu paDi umDE wALLam"
ii maaru waaLLa kamlaimTsuni iwwaDAniki taatayya daggariki daari tiisaaru.
;
 "chUDu tAtayyaa! amma, pinnii mammalni ii Tikkii nEmultO baiTa kUDA pilustunnaaru. sinimaahaalu daggara wini, maa egaspaarTIwaaLLu awE pErleTTi pilustuu EDipistunnaaru."  
[EdO sinimaalO - pamDu - ani muddu pEru peTTinamduku 
`parents` ni baagaa kOppaDimdi ....... paapam, 
iTlAmTi  cEdu`experience` ni cEsimdi kadaa]

taatayya bOsipaLLa nOTlOmchi maaTalu 
tussutussuna gaalini kalupukumTU wastunnaayi. 
"mari miiku peTTina pErlu musalitaram waaLLawi. 
amTE maawi, baamma, ammamma, 
taatalawi anna maaTa." "ayitE?......" manamalu, manawaraaLLa Ekaika praSna. 
"pani ottiDi ekkuwainappuDu, 
miiru sarigaa chadawaka makurutanam chEstunnappuDu kOpamtO appuDappuDu tiTTAlsiwastumdi kadaa?" 
"huu!?" ii saari saumDulOnE kwaSchan maarkunu samdhimchaaru.

"aTlaaga tiDitE aa pErlu unna 
maalaamTi peddawaaLLanu tiTTinaTlautumdi. amdukE miikii pErlu. awi nik nEmulu kaadu, muddu pErlu." 
kaasta samudaayistuu samaadhaanaparichaaDu kannimg taatayya. aa jawaabu nachchinaa nachchakunnaa mukkulu chiTlimchi, 
pedawulu muDustuu baiTiki ADukODAniki parugulu tiisaaru. 
;
*********************,  ,
karuNAkar telugu TIchar. praiwETugaa kaTTi bi. iDi., em. iDi. lu paasayyaaDu. ippuDu pillala gOla walana ii naamadhEyaala paTla konni samdEhaalu, daamtO unnaTlumDi konni DauTlu urawaDigaa madilO welluwettaayi.
"naannaa! peddala pErlanu bhaktitO peDtunnaamu, sarE! kaanii ekkuwagaa dEwuLLa pErlanu peDtunnaamu. naaku miiru mOhana krishNa ani pEru peTTAru. tappu kaduu!" anuuchaanamgaa wastuunna ii aachaara sampradaayaalani anusarimchaDamE tappa asalu daanigurimchi paTTimchukOlEdennaDU. baTTatalanu gOkkuni, 
"EmO? EmiTO - iTlaamTi dharmasamdEhAlu kaligitE eTlaaga? 

jawaabu lEni praSnalu iwi." ani chEtulettADu.
2] "raamaayaNamulO unna pErlannii gurtunnamta warakuu cheppamDi nAnnagaarU!" 
"raama,lakshmaNa, bharata, Satrughnulu, kaikEyi sOdaruDu yudhaajittu." 
appuDappuDU iddaruu imkaa unnawaaTini maLLii maLLI nemaru wEsukumTU  cheppaaru.
"daSaradha, waSishTha, wiSwaamitra, Sabari, maatamga muni, bharadwaaja......." 
"sugriiwa, waali, ruma, jaambawamta, amgada, hanumamta"  
"surama, wibhiishaNa, sumitra, kausalya."
tarwaata bhaarata, bhaagawataalaku jamp chEsAru. 
"arjun, bhiimm - modalukoni - duryOdhanuDu, nuurguru tammuLLu, chellelu dussala ityaadini 
karuwu tiiraa cheppukunnaaru. 
"naannaa! itihaasaala, prabamdhaala rachayitalu ewaru?"
waalmiiki, wyaasa, nannaya, tikkana, erraapreggaDa, allasaani peddana ............ " 
lisTunu cheppukumTU weLLAru.
'bammera pOtana, baawamaradulu wagairaalu 
akkanna, maadanna, SriinaathuDu, 
SriikRshNa dEwaraayalu ........"
wamTa puurti chEsi wachchina imTi illaaLLu akkaDiki chEri, 
tamaku tOchina alanaaTi pErlanu cheppasaagaaru. 
3]] "palnaaTiyuddham lO baalachamdruDu, aitaamba, pErimdEwi, maamchaala,...........' ii paTTika paatika paatapErlu kottawaaTini chErchukumdi. samgiitam nErchukumTUnna gauri 
'tyaagaraaju, muttuswaami diikshitulu, SyaamaSAstri, 
saaramgapaaNi, annamayya, kamcherlagOpanna, 
anagaa raamadaasu ....... " wenaka tOkalaa tagulkonnaaDu 
komchem samgiitaparij~naanam unna bamTii phremDu 
"rAmadaasugaaruu! idigO raSIdamdukOmDii......" 
satyam baamma annadi "paatakaalam pErlalO dEwuni pErlu takkuwagaa kanapaDutunnaayi. aa kaalam waaLLu emduku peTTukOlEdO?"  
sambhaashaNalOki amdaruu wachchi chEragaa, padaala prawaaham wEgam pumjukumdi.
4]] wamTapuurti chEsi, striilu haalulOki wachchaaru.
taraLaakshi annadi. "naart imDiyaalO nakul. sahadEw, karNa, kaurawula pErlanu peTTukumTAru. duryOdhan, suyOdhan, iTlaaga." "DArjilimg lO hiDimbiki guDikuuDA unnadaTa" 
"prabamdhakaalam gurimchi chepppamDi. bhuwanawijaya aasthaanamlO peddana, mukku timmanna, gOdaadEwi, aTlaagE aa kaalaaniki mumduwenakalugaa awwayyaar, miiraabaayi, 
lolla, kathaanaayika mollamaamba." "kawitrayam nannaya, tikkana, errana." 
"kannaDadESAna ranna, ponna, kumaarawarma..." 
"praachiinakaalaana chaala unnaayi. wikramaarka, bhaTTi, 
bhOjaraaju, harshawardhana, samudragupta, SAtawaahana, mihiralakuDu........"
"wijayanagara saamraajya sthaapakulu okaru bukkaaraayalu-
 maamuulu pErE, remDawa wyakti harihararaayalu .......... 
SriikRshNadEwaraayalulO krishNuni pEru umdi. 
mahaamamtri timmarusu, ashTadiggaja kawulu mukkutimmana, 
allasaanipeddana, wiiLLatObATu 
wikaTakawi tenaali raamakRshNuDu, dhuurjaTI..." 
"mana aamdhra kawitrayam nannayya, tikkana, erraapregaDa aitE - 
aTu karNATakadESaana rannaDu, ponnaDu, 
pampaDu eTseTraa eTseTrA" 
satyamaamba "imtakii saaraamSamEmiTii ani?" 
"janasaamaayamlO bhagawamtuni pErlanu peTTukOwaDam, 
iTIwali kaalamlO modalaimdi. 
annamaachaaryulu, bhaktapOtana, 
waari kuTumbiikulu pimgaLiakkanna, maadannalu. 
taaLLapAka tirumalaamba, tirumalayya -
wiiriwi puNyakshEtraala pErlu. 
Sriinaadhuni palnaaTiyuddhamulOni paatralu, 
naagamma, aitaamba, maamchaala, baalachamdruDu, 
pErimdEwi, anapOtaraaju, ekkuwagaa ilaamTiwi. 
takkuwagaa narasimha, brahmanaayuDu laamTiwi. 
prabamdhapaatralu- naluDu, damayamti, 
prawaruDu, waruudhini, girika iwi chaalaa unnaayi. 
krishNaraayalanaaTi mahaamamtri timmarusu, 
Silpi jakkana, sthuulamgaa cheppaalamTE dEwuni pErlanu 
saamaanyulu saadhaaraNamgaa peTTukonEwaaLLu kaadu. 
iTiiwala modalaina alawaTu adi. 
maLLii pilawaalsi wachchinappuDu kaligE ibbamdulni 
adhigamimchaDAniki muddupErla tamTAlu idigO, ippuDu 
mana imTlOkimallEnE!" taraLa annadi.
"niiku imta naaleDji umdanukOnE lEdu nEnu." 
wistupOtU bharta rEpaTi Telguu riiserch kamm prophesar annaaDu.
;
maa baamma maaT bamgaaru mUTa - 2 ; -
ముద్దు ముద్దు పేర్లు మొద్దు పేర్లు ;- స్టోరీ - 2 ; =
muddu muddu pErlu moddu pErlu ;

ఉభయకుశలోపరి

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగు మోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు చేరాడు మదన్ మోహన్. 
కల్హారములు కళకళలాడే కొలను అలల మాదిరిగా కూని రాగాలు  జిహ్వామూలాగ్రం నుండి వెలువడుతున్నాయి.మదన్ మోహన్ తరచుగా క్యాంపుకెళ్తూంటాడు, 
ఫ్యాక్టరీ వాళ్ళే గెస్ట్ హౌస్ నూ, రాజభోజనాన్నీ అరేంజ్ చేస్తారు, 
కాబట్టి  నిశ్చింతగా అటు నుండి అటే రోజుకో సెకండ్ షోనూ చూసి, హాయిగా ఊరికి వచ్చేస్తూ ఉంటాడు.
మదన్ మోహన్ కి సినిమా ప్రభావం కాదు గానీ, హీరో చంద్రమోహన్ కి లాగానే 
తన భార్య ఇందుమతి మీద చిన్న ప్రయోగాన్ని చేయాలని బుద్ధి పుట్టింది. 
ఆ బుద్ధి కాస్తా కీచురాళ్ళ రొదలా కంటి మీద కునుకు రానీయడం లేదు. 
ఇక తన డౌట్ ని క్లియర్ చేసుకోవాల్సిందే! - అనే దృఢ నిశ్చయానికి వచ్చేసాడు. 
అనుకోవడమే తడవుగా ఆచరణకు నాంది పలికాడు, సారీ! నాంది చేసాడు.
****************************
మదన్ మోహన్ కి టైపు చేయడం రాదు. అందుకని జెరాక్స్ షాపుకు  దారి తీయక తప్పింది కాదు. 
మదన్ మోహన్ కి, సిబ్బందికీ  షాపులో తాను పని చేస్తూన్న కంపెనీ సంబంధిత ఫైళ్ళను ఇస్తూ ఉంటారు, 
కాబట్టి ఆ మడిగెలోని వర్కర్సు  ముఖపరిచయాలు ఉన్నవాళ్ళే! టైపిస్టు పలకరింపుగా నవ్వి 
"ఈ ఒక్క పేపరేనా సార్!?" అడిగాడు. 
ఇప్పటిదాకా అంత చిన్న పేపరును ఈ కంపెనీ ఉద్యోగులద్వారా తమ వద్దకు రాలేదు. 
కించిత్ ఆశ్చర్యార్ధకంతో ప్రశ్నించాడు.
మదన్ మోహన్ గతుక్కుమన్నాడు. 
"వీడికి అక్కర్లేని సందేహాలు వస్తాయి" అనుకుంటూనే నోటికి వచ్చింది అనేసాడు
"మా కంపెనీ వాళ్ళ పత్రికలో ప్రేమలేఖల పోటీ పెట్టారోయి! అందుకే ఈ తతంగం "  
టైపు చేసాక అతను " సార్! నా పేరు మధుకర్ . నేనో అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మా లవ్ సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించండి"  అన్నాడు. అయిష్టంగానే మదన్ మోహన్ "ఓ!కే!. నీ లవ్ దిగ్విజయోస్తు! నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను తప్ప అన్యుల వైపు కన్నెత్తిచూడదు, సరేనా?"

****************************
మదన్ మోహన్ మదన్ మోహన్ మదన్ మోహన్
మదన్ మోహన్
మదన్ మోహన్  అనామతు "నాకింత భాషాప్రావీణ్యాదులు ఉన్నవని  నాకే తెలీదే! - అనుకుంటూ అబ్బురపడ్తూ మధుని ఎంకరేజ్ చేసాడు. "సర్!" మొహమాటపడుతూ గౌరవసూచకంగా నిలబడ్డాడు. మదన్ మోహన్  "ఏమిటి? ఏం కావాలి?" అన్నట్లుగా కనుబొమ్మల్ని  ప్రశ్నార్ధక ముడిని వెలయింపజేసాడు. మధు "నాకో చిన్న హెల్ప్ కావాలి" మదన్ మోహన్  గతుక్కుమన్నాడు, "డబ్బు దస్కమూ అప్పు, చేబదులు అడుగుతాడేమో?!? 
వీడి ఇల్లు కూడా ఎక్కండో ఏమో?"  అనామతుగా నాలికను అదుపులో ఉంచుకోవాలిరా మదన్ మోహన్ ! - అనుకున్నాడు. 
"ఆహ! మరేమీ పెద్దవీ, హిరణ్యాక్ష వరాలూ కాదు సార్!" 
"హమ్మయ్య!" అనుకుని  నిట్టూర్చి, ప్రసన్న వదనుడైనాడు మదన్ మోహన్ . 
"ఐతే ఏం కావాలో చెప్పు, అవతల నాకు కంపెనీ వాళ్ళు శ్రీముఖం జారీ చేస్తారు, త్వరగా వెళ్ళాలి" 
అన్నాడు కించిత్ హడావుడి చేస్తూ.
"మరి. మీరు లవ్ లెటర్ ని చాలా బాగా రాసారు. నాకేమో వలపు లేఖల్ని రాయడం చేతకాదు. 
నా విరజ నన్నెప్పుడూ ఎద్దేవా చేస్తూంటుంది- కనీసం ఒక్క లవ్ లెటర్ ఐనా రాయలేదు  నువ్వు. అంటూ. 
మీరు పత్రికకి పంపిస్తూన్న ఈ లెటర్ కాపీని నాకిస్తారా? ప్లీజ్! తనకు ఫైర్ కపీని ఇస్తాను" 
ఇలాటి ప్రపోజల్ ఎదురౌతుందని అనుకోలేదు మదన్ మోహన్. అతని ముఖంలో మారుతూన ఫీలింగ్స్ ని గమనించి, "మీరు లవ్ లెటర్సు రచనలో ఎక్స్ పర్ట్ సార్! ఆహా! ఏమి శైలిి! ఏమి భావాలు!" 
మధు పొగడ్తతో ఉబ్బితబ్బిబ్బు ఐనాడు మదన్ మోహన్ . "సరే! దాందేముంది? నీ ప్రేమ సౌధానికి ఈ నా ఉత్తరం పునాది ఔతుందంటే అంతకంటే కావల్సింది ఏముంది! నకలు ప్రతి, ఒరిజినల్ ప్రతి, సాదా ప్రతి ఇత్యాదులు అర డజను పాంప్లెట్ లు రెడీ ఐనాయి. 
మూడు కరపత్రములతో వెనుదిరిగాడు మదన్ మోహన్.
********************************************  
ఇవాళ జరిగింది వింతగా తోచింది మదన్ మోహన్ కి. మధు అభిలాషని వినినంతనే ఉలికిపాటు ఎందుకని? ఔను! ఎందుకంటే - ఆ చిన్ని కాగితాన్ని తను ఏ మాగజైన్ కోసమూ రాయలేదు. తానే అష్టాచమ్మాలో లాగా మారుపేరుతో రాసాడు. సుధాకర్ అనే పేరుతో చేవ్రాలు చేసి, సాక్షాత్తూ తన భార్యకే పంపించే బృహత్ ప్రణాళికను వేసాడు మరి! భార్య ఇందుమతి రియాక్షన్ ని పరీక్షకు పెట్టి, తద్వారా తన అనుమాన నివృత్తి చేసుకోవాలనుకుంటూన్నాడు.
చేతివ్రాతని ఇందు గుర్తుపట్టేస్తుందని  - ఇదిగో! ఇలాగ ఈ అంగడికి వచ్చేసాడు. 
"మిత్రమా! షాపు అనాలి, అంగడి కాదు" 
చెవిలో ఊదే అశరీరవాణిని ఆట్టే పట్టించుకోకుండా పెడ చెవిని పెడ్తూ పోస్టాఫీస్ ముఖం పట్టాడు.
************************
ఆ తర్వాత అనేక సంఘటనలు సినిమా రీలులాగా గిర్రున తిరిగాయి. మధుకర్ గర్ల్ ఫ్రెండ్ కి లవ్ లెటర్ తెగ నచ్చింది.మూడు నెలల్లో మదన్ మోహన్  కి మధుకర్ వీర భక్తుడైనాడు. 
కానీ మదన్ మోహన్ కే వింత పరిస్థితి ఎదురైంది. లవ్ లెటర్ ని పోస్ట్ మాన్ ఇవ్వగానే అందుకుంది ఇందుమతి. 
అలాగ అటు తీసుకుని, ఇటు చదివేసుకుంది కూడా! అంతేనా! 
గుంభనంగా ముద్దుపెట్టుకుని, ఇంచక్కా బీరువాలో పెళ్ళినాటి పట్టుచీరల నడుమ పదిలంగా  ధాచిపెట్టుకుంది.
"హమ్మో! హమ్మో! గుండెలు తీసిన నెరజాణ! ఎ
వడో రాసిన లెటర్ ని చూసీ చూడగనే - అరిచి గీ పెడుతుంది, 
కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ తనకు చూపించి, ఆగమాగం చేస్తూ, 
వాడెవడో కనుక్కుని ఆ సుధాకర్ గాడి భరతం పట్టేయండీ!" 
అంటూ తనను హత్తుకుని గోడు గోడున ముక్కు చీదుకుంటూ విలపిస్తుంది, అనుకున్నాడు, 
కానీ ఇదేమిటి? ఏమీ ఎరగని నంగనాచి తుంగబుర్రలాగా ముసిముసినవ్వులు చిందిస్తూన్నది. 
అరవిరుపు అధరాలలో  దరహాసాల్ని నొక్కి పట్టి, రోజువారీ పనులను చక్కగా చేస్తూ, 
దినచర్యలో ఎలాంటి మార్పునూ కనబడనీయట్లేదు.      "ఇలాగైతే ఏ మగాడైనా ఎంతకని ఓర్పు  వహిస్తాడు?" 
"బీరువా తాళాలేవీ? ఆఫీసు పేపర్లు తీసుకోవాలి?" అడిగాడు. 
ఆ వంకతో అరలను కెలికి, చీర మడతల్లో పెట్టుకున్న 
ఆ చిట్టి కాగితమ్ముక్కను పెకలించి,
 "ఇదెవరు రాసారు? చెప్పు! ఎన్నాళ్ళనుంచీ సాగుతోన్నదీ భాగోతం?" 
అంటూ హుంకరిస్తూ గదమాయించాలని ప్రయత్నం.
ఊహూ! ఇందూ మగని కన్నా నాలుగాకులు ఎక్కువే చదివింది, 
మీకు సంబంధించిన ఫైళ్ళు, దస్త్రాలూ అన్నీ హాలులో అలమార్లో పెట్టేసానండీ!"
 "ఓసి దీని..." ఒక కఠోరమైన తిట్టును లోలోనే తిట్టుకున్నాడు మదన్ మోహన్.  
రమారమి దిగ్భ్రమలో మునిగి, ఇంచుమించు చేష్ఠలుడిగి మ్రాన్పడిపోయాడు.
****************************
  
గేటు తీసుకుని లోపలికి వస్తూన్నాడు, అతను మధుకర్.  
"అమ్మయ్యో! తన లేఖా గ్రంధ సాంగత్వం గుట్టు కాస్తా రట్టు ఔతుంది - 
ఒక్క ఉదటున భార్యతో మాట్లాడుతున్నవాడల్లా సంభాషణను ఆపేసాడు; 
మదన్ మోహన్ బైటికి ఉరికాడు. 
ఇందు "ఎమిటండీ ఆ పరుగులూ ఉరుకులూ?" అడుగుతూన్నది. 
ఆమె నోట్లో మాట నోట్లో ఉండగానే "అర్జంటుగా కాఫీ పట్రా!" అనేసాడు  వెనక్కి తిరక్కుండానే. 
ఆమైన ఏమాత్రం వెనుకంజ వేయకుండానే మధుకర్ ని ఒక్క అంగలో చేరాడు. 
మండువా బైట పూల చెట్ల వద్దనే ఆగిపోవాల్సివచ్చింది మధుకర్. 
శుభలేఖను మదన్ మోహన్ చేతికి ఇస్తూ 
"సర్! మా వెళ్ళి వచ్చే వారమే! మీరూ మేడ  మేడమ్ గారూ తప్పక రావాలి. ఆవిడ ఉన్నారా?" 
మళ్ళీ పౌనః పున్యాలు తప్పలేదు మదన్ మోహన్ కి. మనసులోనే కరకు బూతును తిట్టుకుని, 
"మా ఆవిడ గుడికి వెళ్ళిది. అసలే అసుర సంధ్య కదా! త్వరత్వరగా అందరికీ మి వెడింగ్ కార్డులని ఇవ్వండి" 
ఇక వెళ్ళవచ్చునని సిగ్నల్ ఇస్తూ నొక్కి పలికాడు.
*************,
"మేడమ్ మేడమ్ అట! ఏడు జన్మల పరిచయాలు ఉన్నట్లు. హ్హు!"  
పళ్ళు పట పటా  నూరుకుంటూ అనుకున్నాడు. 
వెనక్కి తిరగ్గానే గుమ్మం దగ్గర నిలబడి రోడ్డుకేసి చూస్తూ భార్యామణి! 
మదన్ మోహన్ గుండె గుభేల్ మన్నది.  
పతిదేవునికి కాఫీకప్పును అందిస్తూ అన్నది ఇందు 
"ఏమండీ! ఆ వెళ్ళేది సుధాకర్ కదూ!"  గొంతులో దిగుతూన్న వేడి వేడి ద్రవం తో పొలమారింది. 
"ఎవరో తలుచుకుంటున్నారు" జీవితభాగస్వామి తలపై తట్టుతూ అంది ఆ ఉత్తమ ఇల్లాలు.
"ఈ బతుక్కి అదొక్కటే తక్కువ" రోషావేశాలతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగం పుంజుకున్నాయి. 
"ఆహా! ఆ సుధాకర్ మదన్ మోహన్ మునుపే తమరికి తెలుసునన్న మాట."
"ఆ! ఈ మధ్యనే పరిచయ భాగ్యం కలిగింది." 
"ఆ! ఆ!." కుర్చీలో చతికిలబడ్తూండగా టేబుల్ పైన రెపరెపలాడుతూ అగుపిస్తూన్నది 
ఆ pamphlet, పింకు కలర్ పేపర్ ముక్క. 
దాన్ని పట్టుకునే సాహసం కూడా చేయడానికి అశక్తుడైనాడు.
"ఇదిగో! తమరు రాసిన ముద్దు ఉత్తర సాహిత్యం." మొగుడి కరకమలాలలో పెట్టేసింది. 
"ఎలా కనిపెట్టావు?" గుటకలు మింగుతూ అడిగాడు. 
"అలాగ నీళ్ళు నమలడం ఆపేసి, ముందు ఈ మామిడిముక్కను నమలండి"
 'ఇంకా నయం! అన్ని తెలిసిపోయినా ............
తనను ఏరా! ఒరే! అనకుండా , ఏమండీ అనేసంబోధనతో మన్నిస్తూన్నది అనుకుంటూ, 
సతీలలామ తనంతట తానే విస్తారంగా విప్పి చెబ్తూన్న కథా కమామిషూలను వినసాగాడు. 
"సుధాకర్ అనే పేరు మీకు చాలా ఇష్టం. మనకు పుట్టబోయే బాబుకు పెట్టాలని 
మీరు సెలక్టు చేసిన నామధేయం అది. సంతకం గట్రాలు చేస్తే దొరికిపోతారని- 
ఇదిగో ఇలాగ టైపు మిషనుపైకెక్కించిన లెటర్ ను వదిలారు. ఔనా?!" "అదిసరే గానీ అంతమాత్రానికే......"
"లెటర్ కొసన అలవాటు చొప్పున, ప్రింటింగు చేసే వాళ్ళు - 
తమ shop అడ్రసును ముద్రించారు." "ఐతే....
" భేతాళుని సందేహపూర్వక ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకలేదు.   
"తమరు సైతం అలవాటు చొప్పున పై మూలన 'శ్రీరామ ' చుట్టేసారు. 
మీ బాల్ పెన్ను ఇంకు రంగూ, ముత్యాల్లాంటి ఆ మూడు అక్షరాలూ 
ఈ చోరశిఖామణిని పట్టిచ్చేసాయి. 
ఐతే ఇదేం బుద్ధి, ఇదేం వాలకం, ఇదెప్పటినుంచ్హీ బుద్ధి ఎక్కిన తిమ్మిరి సార్!?"
అప్పటికప్పుడే జెరాక్స్ షాపుకు వెళ్ళింది ఇందుమతి, దాంతో అన్నీ ఆటోమాటిక్ గా
 'ఆ నుండి 'క్షా దాకా ఆమూలాగ్రం తెలిసి  వచ్చినవి. 
సిగ్గుపడుతూ పూసగుచ్చినట్టు అంతా చెప్పేసి 
"ఇది సినీ ప్రభావం బేలా! నన్ను క్షమించు" 
ఆనందబాష్పాల తాలూకు కన్నీటి తెమ్మెర నుండి మదన్ మోహన్ కి ఇందుమతి ఇప్పుడు - 
మేలిముసుగు వేసుకున్న గిరిజన రాణిలాగా అగుపిస్తూన్నది. 
"మిమ్మలని మన్నిస్తున్నాం భోళా శంకరా! సినిమాలమీద నింద వేస్తున్నారు గానీ, 
పాత్ర అపరిశుభ్రతను గూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందే! ఎందుకంటే ఆ మూవీని వరుసకు మా పెదమామయ్యగారు నిర్మించారు. 
ఆయనది ఉత్తమాభిరుచి. నేను భాగ్యనగరంలో ప్రివ్యూ చూసేసాను........" 
ఇంకా  సాగుతూన్న అర్ధాంగీమణి వాగ్ధాటికి నమస్కారం పెడుతూ "మహా ప్రభో!" అని పెడబొబ్బ పెట్టాడు.
"ఆ విరజా మధుకర్ ల పరిణయ పత్రికను ఇటు ఇవ్వుడు. 
ఐతే మదన్ మోహన్  వివాహవేడుకకు మనమిద్దరమూ వెళ్ళి, 
దంపతితాంబూలాన్ని, చందన తాంబూలాది సత్కారాలనూ గ్రహిస్తున్నామన్న మాటే కదా!" క్వశ్చనించింది.
"తప్పకుండా! పెళ్ళివాళ్ళు మనకి అంతటి మర్యాదలను చేస్తే స్వీకరించడమేమన్నా చేదా?"
పట్టు విడుపులు ఉన్న సంసారంలో - అప్పుడప్పుడూ తారసిల్లే చిటికెడు చేదులు - అటు పిమ్మట  సంభవించే తీపితేనెల మాధుర్యాల గ్రుమ్మరింపులలో రంగరించబడుతూంటే ఎ
ల్లరూ ఇష్టంగా, తినే ప్రీతిపాత్రమైన ఉగాదిపచ్చడియే కదా! నేస్తాల్లారా! - a
అంటూ ఆహ్వానిస్తూన్నవి ఉగాది శుభఘడియలు. 
;
మా బామ్మ మాట బంగారు మూట - ఉభయకుశలోపరి ;
;
=======================, ,;
ubhayakuSalOpari - maa baamma mATa bangaaru mUTa ;

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...