30, మే 2011, సోమవారం

చెప్పుల చోరులు












చెప్పులను దొంగిలించిన వాళ్ళు, తర్వాతి జన్మలలో ఊసరవల్లిగా పుడతారని శ్రీమద్ మహా భారతములో ఉన్నది.దీనినే ఒంటాకియా (“Otikyata” a type of lizard) అని పేరుతో ఇంగ్లీష్ భాషలో ఉన్నది. బల్లి (Lizard)జాతికి చెందిన, ప్రాకే జంతువు ( Amphibia,Reptilia)  ఇది. తొండను ఊసరవల్లి అని పిలుస్తారు.













కంచిలోని  వరద రాజ పెరుమాళ్ , పేరుం దేవి అమ్మవార్లు కొలువై ఉన్న విష్ణుకంచి గొప్ప పుణ్య క్షేత్రము.దేవళములో పై కప్పు మీద రెండు వెండి బల్లి బొమ్మలు ఉన్నవి. వాటిని తాకితే , పాపాలు పోతాయని, బల్లిని ఎప్పుడైనా పొరపాటున తాకిన వారికి, బల్లి పాటు దుష్ఫలితాలు దరికి చేరవనీ భక్తుల నమ్మకం. ముఖ్య జాతులుగా వర్గీకరించదగినవి  
ఇంటి తొండ ; gekkonidae 
ఊసరవెల్లి;    chameleon  
ఉడుము;     varanidae 
తొండ;         chameleonidae   
క్రితం నుండి "బల్లి ఆరాధన" - ఇక్కడ ఆచరణలో ఉన్నది. 

ఏడు దివ్య పుణ్య క్షేత్రములలోని "కాంచీపురము", 
"సహస్ర దేవాలయ సీమ" అని ప్రసిద్ధి  చెందినది.  
East India Company - Governor General రాబర్ట్ క్లైవ్ varada raaja perumal కు సమర్పించిన హారము  
"రాబర్ట్ క్లైవ్ మకరకండి" - అని  పిలవబడుతూన్నది. 
విష్ణు కంచి, శివ కంచి, వీటితో పాటు ఆ పురములో 
ప్రాచీన కాలములో బుద్ధ కంచి, జైన కంచిలు కూడా ఉన్నవి. 
వరద రాజ పెరుమాళ్ దేవళముపై సీలింగు పై  
కాంచన, రజత బల్లులు, సూర్య,  చంద్రుల చిహ్నాలతో ఉన్నవి. పూజ గదిలో బల్లి చప్పుడు వినిపిస్తే తాము అనుకున్న పనులు సఫలమౌతాయని ప్రజలలో విశ్వాసం.   
మన దేశంలో - బల్లి శకునము - ప్రత్యేక శాస్త్రంగా రూపొందింది- అంటే అతిశయోక్తి కాదు. 
బల్లి పాటు, బల్లి శకునాలూ, 
అనేక సామెతలు కూడా ప్రజల పలుకుబడిలో ఉన్నాయి. 





21, మే 2011, శనివారం

కర్ణాటక లోని కరువపూర్























శ్రీపాద శ్రీవల్లభుల మాతృ వర్గ తరఫు న నుండి 30 తరముల వెనుక నుండి బంధుత్వము కలిగిన భాగ్యశాలి మల్లాది గోవింద దీక్షితులు. ఆయన కృషి చేసి, రేఖా మాత్రంగా ఉన్న శ్రీపాద శ్రీ వల్లభుల చరిత్రను కూలంకషంగా పరిశీలన చేసి, శ్రీపాద వల్లభు విపుల చరిత్రను వ్రాసారు. మరాఠీ భాషలో శ్రీ సరస్వతీ గంగాధర్ 1450 A.D.లో రాసిన "శ్రీ గురు చరిత్ర" లో శ్రీ శ్రీ పాద వల్లభుల ప్రస్తావన ఉన్నది.

శ్రీ పాద వల్లభులు మన తెలుగు దేశం వాడు అగుట మనకు గర్వ కారణము. శ్రీపాద వల్లభులు గోదావరి జిల్లాలోని పిఠాపురం లో పుట్టారు. ఆయన ఒక శుద్ధ సనాతన స్మార్త శ్రోత్రియ కుటుంబంలో జన్మించారు. సాక్షాత్తూ దత్తాత్రేయస్వామి అపరావతారము శ్రీపాద శ్రీ వల్లభులు. 
శ్రీ పాద వల్లభులు 1320 - 1350 కాలమునాటి ముని. శ్రీపాద వల్లభులు దర్శించిన ప్రదేశాలలో ఒకటి కర్ణాటక రాష్ట్రములోని కరువపూర్.శ్రీపాద వల్లభులు చరణ స్పర్శచే పునీతమైన ఊరు కరువారూర్, ఇచ్చట శ్రీపాద వల్లభుల ముద్రలు ఉన్నవి.హిమాలయాలలో తపము ఆచరించిన తపస్విలుఅగణితముగా ఈ సీమను దర్శించుకున్నారు. స్కంద పురాణములో 28 వేల మంది తాపసులు కరువరూర్ ను దర్శించారని చెప్పినది. ఇలాగ ఈ శ్రీ పాద వల్లభుల పవిత్ర పుణ్య క్షేత్రమైన కురువరుర్ భాసిల్లుతూన్నది
క్రిష్ణా నది వలయముగా ఏర్పడి, మధ్యలో ఉన్న కరువారూర్  "గురు ద్వీపము" గా పిలువబడుచున్నది. కరువారూర్ లో అనేక విశేషాల వలన ఇటు పుణ్య క్షేత్రముగా మాత్రమే గాక, అటు చారిత్రక స్థలముగానూ, ప్రకృతి దృశ్య ప్రేమికులకు విహార స్థలంగానూ విలసిల్లుతూన్నది.
అచ్చట ఒక గొప్ప వృక్షం ఉన్నది. 
ఆ ఔదుంబర వృక్షము (మేడిచెట్టు) కింద తెంబె స్వామి తపస్సు చేసారు.  
ఇక్కడ 1000 సంవత్సరాల వట వృక్షము ఉన్నది. ఈ ప్రాచీన వృక్షము, అటు వృక్ష శాస్త్రజ్ఞులకు, ఇటు  భక్తులకూ, ప్రకృతి ప్రేమికులకూ ఆహ్లాదాన్ని చేకూరుస్తూన్నది. ఈ చెట్టు ఉన్న గుహ (Kuravpur/ kuruvalaya/Kuravapura). అలాగే శ్రీ విఠల్ బాబా ఆశ్రమం, దత్త మందిరము చూడవలసిన  చోట్లు.శ్రీ పాద వల్లభుని సమకాలీన వ్యక్తి శంకరభట్.                                            
          ఈతను కన్నడ భాషలో చేసిన రచన - "శ్రీ శ్రీ పాద వల్లభర దివ్య చరితామృత". 
          ఇందులో శ్రీపాద వల్లభుల తపో సముపార్జిత అద్భుత మహిమలను వర్ణించారు   

















                               నవంబర్, 2001 లో మల్లాది గోవింద దీక్షితులు -                        భక్తవరులకువారి  అమూల్య రచన  లభించినది. 53 అధ్యాయాలు ఇందులో ఉన్నవి.               ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; కర్నాటక రాష్ట్రంలో, చిత్ర దుర్గ జిల్లాలోని, చల్లకెరె తాలూకాలో ఉన్న దొడ్డెరి గ్రామములో శ్రీ గురు  కన్నేశ్వర స్వామి దత్తావధూత ఆశ్రమము వారు 
"శ్రీ శ్రీ పాద వల్లభర దివ్య చరితామృత "ను ముద్రణలు భక్తులకు ఇచ్చారు. " శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము " గ్రంధములో ఎన్నో గొప్ప విషయములు చెప్పబడ్డాయి. వల్లభాఛార్యులు వారు శుద్ధాద్వైత సిద్ధాంతాన్ని స్ఠాపింఛారు. ఆయనపై చైతన్యమహాప్రభువు ప్రేరణ ఎక్కువగా వుంది. 
                           మృదు మధురమైన మధురాష్టకం ఆయన రఛనయే!
                        మధురాష్టకం          [madhurashtakam] 

అధరం మధురం - వదనం మధురం 

అధరం మధురం - వదనం మధురం నయనం మధురం - హసితం మధురమ్ హృదయం మధురం - గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం

వచనం మధురం - చరితం మధురం వసనం మధురం - వలితం మధురమ్ చలితం మధురం - భ్రమితం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్


వేణుర్మధురో - రేణుర్మధురః పాణిర్మధురః - పాదౌ మధురౌ నృత్యం మధురం - సఖ్యం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్

గీతం మధురం - పీతం మధురం భుక్తం మధురం - సుప్తం మధురమ్ రూపం మధురం - తిలకం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్
కరణం మధురం - తరణం మధురం హరణం మధురం - రమణం మధురమ్ వమితం మధురం - శమితం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్

గుఞ్జా మధురా - బాలా మధురా యమునా మధురా - వీచీ మధురా సలిలం మధురం - కమలం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్

గోపీ మధురా - లీలా మధురా యుక్తం మధురం - ముక్తం మధురమ్ దృష్టం మధురం - శిష్టం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్

గోపా మధురా - గావో మధురా యష్టిర్మధురా - సృష్టిర్మధురా దలితం మధురం - ఫలితం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్ .

       శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణం

           Read here (Link)
           Essay (Link- 2 )
           శ్రీపాద శ్రీ వల్లభాచార్యులు (Link 3)

19, మే 2011, గురువారం

మనుమడి చమత్కార వివరణ














          డాక్టర్ గిడుగు వేంకట సీతాపతి 
సంస్కృత భాషలోనికి –అనువదించినట్టి  
అనగా సంస్కృతీకరణ చేయబడిన
తెలుగులో రచించబడిన కావ్య, ప్రబంధాలలో 
అనేక మేలి రతనాలు ఉన్నవి.
వాటిని –“ కవితోదయ చంద్రిక “గా వెలువరించారు.
"నాహం సంస్కృత పండితః, న చ కవిః
కింత్వేష యత్నః కృతః
విజ్ఞాతుం బహుమాని తాంధ్ర కవితా
మాధుర్య మాంధ్రేతరే
కాంక్షంతీతి భ్రంశం విచింత్య కతిచి
త్పద్యాని గేయా న్యహం
ప్రీత్యా సంస్కృత భాష యా వ్యర చయం
మా మాద్రి యాంతాం చుదాః.”
అంటూ సవినయంగా మనవి చేసుకున్న నిగర్వి గిడుగు సీతాపతి.
గిడుగు సీతాపతి భీముని పట్నంలో 
 
1885 జనవరి 28 వతేదీన జన్మించారు.
ఆతని తండ్రి వేంకట రామ మూర్తి గారిది  పర్లాకిమిడిలో మాస్టారు గిరీ.
కావున  గిడుగు సీతాపతి బాల్యం పర్లాకిమిడిలో గడిచింది.
నాయనమ్మ ఈ మనవడిని,
చిన్నారి బుడుగు లాంటి  గిడుగు సీతాపతిని,
 
ఒళ్ళో కూర్చుండ బెట్టుకుని,
తనకు వచ్చిన పద్యాలూ, పాటలూ చెబుతూండేది.
ఒకసారి ఆవిడ ఒక పద్దెం (poem) చెప్పింది.
“చింతా మణి యను బ్రాహ్మడు;
పంతానికి గోడ మీద షట్ మని వ్రాసెన్;
అంతట వర్షము కురిసెను;
కంటి మీద కాకర పూసెన్.”
ఆమె కుమారుడు వేంకట రామమూర్తి,అనగా గిడుగు తండ్రి
“ తలా తోకా లేని ఇలాంటి పద్యాలేమిటి?! ” 
 
అంటూ విసుక్కునే వారు.
అప్పుడు చిన్నారి గిడుగు సీతాపతి ఇలా వివరణ చేసారు.
“ అలా కాదు నాన్నారూ!
గోడ మీద కాంతా మణి పటం మీద వాన పడింది.
అప్పుడేమో ఆ బొమ్మ కన్ను తడిసింది.
అందులో నీటి చుక్క ఒకటేమో కాకర పువ్వు ఐనదన్న మాట! ”
అంటూ ఆ టీకా టిప్పణి తో పితామహిని సమర్ధించాడు.
మనవడి అర్ధ తాత్పర్యాలూ,
ఆ చిన్నారి పాండిత్య ప్రతిభకు దర్పణం అవడంతో
ఆమె ఉప్పొంగిపోయిందని వేరే చెప్పాలా!
                { యువభారతి ప్రచురణలు  1975
                             తిరుమల రామ చంద్ర “మరపురాని మనీషి” }
               

            మనుమడి చమత్కార వివరణ (తెలుగురత్న)



12, మే 2011, గురువారం

సర్కస్ చెట్టు























Robert Ripley's " Believe It or Not! "ప్రేక్షకులకు అమిత   ఇష్టమైన Teli vision కార్యక్రమము. రాబర్ట్ రిప్లీ ప్రసారం చేసే ఈ - "నమ్ము! నమ్మక పో" అనే ప్రోగ్రాములో 12  సార్లు ప్రసారమైన విశిష్టతను కలిగిన విశేషం ఏమిటో తెలుసా?అదే - "సర్కస్ తోట".ఆక్సెల్ ఎరాల్డ్సన్  అనే స్వీడిష్ అమెరికన్ స్వతహాగా వృక్ష తత్వాల పట్ల ఏర్పడిన అభిరుచితో, చెట్ల పెంపకములో వినూత్న పద్ధతులను అభివృద్ధి పరిచాడు. అక్సెల్ ఎర్లాండ్సన్ పెంచిన తోటలను "న భూతో న భవిష్యతి" అన్న చందంగా వృద్ధి చేసాడు. 
ఆతని వనాలు, sculpting trees,The Circus Tree ను గనుక శ్రీ కృష్ణుడు, వ్రేపల్లె వాసులు చూసి ఉంటే, తప్పక, వీనినే నమూనాగా పరిగ్రహించే వారు. అక్సెల్ ఎర్లాండ్సన్  నాలుగవ గ్రేడ్ లోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసాడు Axel Erlandson (December 15, 1884 – April 28, 1964).  కేవలం ఆతని స్వయంకృషి , అనేక రంగాలలో ప్రావీణ్యుడు అయేలా చేసినది. సివిల్ ఇంజనీర్  గానూ, మ్యుజీషియన్ గానూ, నర్సరీ మ్యాన్ గానూ, హార్టికల్చరిస్టుగానూ, స్వీయ ప్రతిభతో సర్వేయర్ గానూ - ఇలాగ ఒకటేమిటి? అనేక రంగాలలో నిష్ణాతుడు ఐనాడు. pruning, grafting and bending  మున్నగు  పద్ధతులను ఆతడు అనుసరించాడు.చెట్లను మైనపు బొమ్మలలాగా మనిషి తనకు నచ్చిన ఆకారములో మలచుకునే విద్యను ప్రపంచానికి చూపి,అబ్బురపరచిన గొప్ప రైతు AxelErlandson.
 

హార్టికల్చర్ నుకూడా - ప్రత్యేక ఆకర్షణగా, ఎక్స్కర్షన్, ఎగ్జిబిషన్ , మ్యూజియం  లకు వలెనే - వృక్ష వన సంపదలను కూడా ప్రత్యేక ఆసక్తిని మనుష్యులలో కలిగి, సందర్శకులు పదే పదే వీక్షించడానికి వచ్చే అంశంగా మలచిన ఘనత ఆతనిదే!సరదాగా మొదలైన తరు సంపద పట్ల  కర్షక మహర్షి అభిరుచి, హాబీ ప్రపంచ హరిత వర్ణ ప్రేమికులకు మాత్రమే కాక - కర్షక లోకానికి కూడా మార్గదర్శి అనడంలో ఎంతమాత్రమూ సందేహమక్కర్లేదు. ""See the World's Strangest Trees Here," and named "The Tree Circus."
    sculpture trees  (Link 1)    Santa Cruz, California -“The Tree Circus” (Link 2)    Arborsculpture (Link 3)    అక్సెల్ ఎర్లాండ్సన్ ;     "Oh I talk to them"   

6, మే 2011, శుక్రవారం

విశాఖ పట్టణ బీచిలో Hawa mahal


















మహా రాజా విక్రమదేవ వర్మ, "అపర క్రిష్ణ దేవ రాయలు" గా 
ప్రజల చేత ప్రశంసించబడినారు.
విశాఖ పట్నంలో - బీచ్ వద్ద "హవా మహల్"లో నివసించే వారు. 
రాజా విక్రమదేవ వర్మ జన్మతః - ఒరియా  వ్యక్తి. 


అతి సామాన్యమైన మధ్య తరగతికి చెందిన కుటుంబంలో పుట్టారు. 
జయ పురము రాజ కుటుంబానికి వారసులుగా రాజా విక్రమదేవ వర్మ  
సంస్థానం బాధ్యతలను చేపట్టారు.
హవా మహల్ - అభినవ భువన విజయము గా వెలుగులీనినది.
సంస్థాన వ్యవహారాలతో పాటు, 
లలిత కళలతో వినోదాలతో 
నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా హవా మహల్ విలసిల్లేది.
శ్రీ రాజా విక్రమదేవ వర్మ, ఆంధ్ర విశ్వ విద్యాలయానికి - 
ప్రతి ఏటా లక్ష రూపాయలు 
( ఇప్పుడు సుమారు 70 రెట్లు విలువను అంచనా వేయవచ్చును)- ఇచ్చే వారు.
పది సంవత్సరాల పాటు, ఇలాగ అవిచ్ఛిన్నంగా ఈ రివాజు కొనసాగినది.
భాషా ప్రయుక్త రాష్ట్రాలు , తద్వారా- ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 
పర్లాకిమిడి,గంజాం మున్నగు పరగణాలలో తెలుగు వారు ఎక్కువమంది ఉన్నారు. 
అందువలన ఆ ప్రాంతాలను ఆంధ్ర దేశంలోనికి చేర్చాలని తెలుగువారు 
(గిడుగు మున్నగు వారి ఆధ్వర్యంలో) ప్రయత్నించారు, 
కానీ వారి శ్రమ విఫలమైంది.
రాజా విక్రమదేవ వర్మ కోరిక వలన, 
పర్లాకిమిడి సంస్థాన సీమ ఒరిస్సా రాష్ట్రానికి చేర్చబడినది.
(ఇలాగే టంగుటూరి ప్రకాశం పంతులు మున్నగువారు 
దక్షిణాది ప్రాంతాలకై శ్రమించారు.మద్రాసు పట్టణము - 
తమిళనాడు చేరగా -  తిరుపతి మహా   పుణ్య క్షేత్రము 
మన ఆంధ్ర దేశమునకు చెందినవి.)
జయ పుర సంస్థానము ఒరిస్సాలో కలిసిన మరు క్షణం నుండే, 
ఆంధ్ర విశ్వ విద్యాలయానికి,రాజా విక్రమదేవ వర్మ 
ప్రతి ఏడూ ఇస్తూన్న లక్ష రూపాయల విరాళము నిలిపివేసారు.  


@@@@@@@@@@@@@@@@@@@@@


(రాజుల నిర్ణయాలు, అప్పటికి చిన్నవిగానే అనిపిస్తూన్నా, 
కొన్ని సార్లు సీమల చరిత్రనే ప్రభావితం చేస్తూంటాయి కదా! 
ప్రపంచ చిత్ర పటంలో భారత దేశము- 
బొమ్మను అట్లాసులో వేయాల్సిన పద్ధతిని ప్రశ్నార్ధకంగా చేసి, 
అతి ప్రాచీన కాలం నుండీ 
కాశ్మీరులో నివసిస్తూన్న అహింసా సిద్ధాంత సమాజాల భవితను  
చిక్కులలో పడవేసినది - 
ఆలస్యంగా స్పందించినట్టి, ఇలాంటి ఒక రాజు యొక్క నిర్ణయమే.)




పూర్వ కాల వైభవానికి తీపి గురుతుగా నేటికీ హవా మహల్ బీచ్ రోడ్డులో ఉన్నది. 


  (ఆంధ్రా యూనివర్సిటీకి విరాళాన్ని ఆపిన రాజా )


     Town hall (photo ) Link 

5, మే 2011, గురువారం

పేదలకు బ్రతుకు తెఱువు దొరికినది కదా!
























కోటయ్య అనే సాధువు స్వామికి వస్తూన్న 
కీర్తి సంపదలను గని, కినిసి, ఈర్ష్య పడ సాగాడు.
శ్రీ మలయాళ స్వామిని దూషిస్తూ 
కొన్ని పద్యాలు రాసాడు. వాటిని అచ్చు వేసి, 
స్వామిని వ్యతిరేకిస్తూ ఏర్పరచిన సభల్లో పాడాడు.
స్వామి శిష్యుడైన రాజయ్య – స్వామికి ఆ సంగతిని చెప్పాడు.
స్వామి ఇలా వక్కాణించారు 
“రాజయ్యా!మనలను ఎందరో ప్రశంసించారు, 
 పొగడుతూ కరపత్రములను (pamphlet ) కూడా వేయించారు. 
పుస్తకములనూ ప్రచురించారు. 
అప్పుడు మనకు లేనిది వచ్చినదా? ఉన్నది పోయినదా? 
ఇప్పుడు ఒకరు మనలను దూషించినందు వలన మనకు కలిగిన నష్టమేమి?”
“అట్లు కాదు స్వామీ! ఆ దుర్మార్గుడు ఆ పద్యాలను అచ్చు కూడ వేయించాడు.”
“అచ్చు వేసిన నేమి? దాని వలన ప్రెస్స్ పని వారికి,
 కొందరు పేదలకు  బ్రతుకు తెఱువు దొరికినది కదా! 
మన తప్పులను వెదకి చూపుచు, 
మనలను నిందించు వారు మనకు ఎంతో అవసరమై ఉన్నారు. 
అట్టి వారు ఉన్నపుడే కదా మనము తప్పులు చేయకుండా జాగ్రత్త వహింతుము.”
కవి రాజు, నాస్తిక వాదులు యజ్ఞ శాలకు నిప్పు అంటించారు. 
ఇట్టి అనేక దుష్కృత్యాలను స్వామి సహించారు.
చివరికి సభలోని మహిళా వర్గము వారు సహింప లేక పోయారు. 
తిరుపతమ్మ అనే వనిత నాయకత్వములో, 
ఆ రిపు వర్గం వాళ్ళతో వాగ్యుద్ధము చేసారు. 
పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని – 
గ్రహించిన కవి రాజు -     ఆ సభ నుండి నిష్క్రమించారు. 
( అనంతర కాలములో కవి రాజు గారికి స్వామి పట్ల గౌరవము కలిగినది - పేజీ236)
స్తుతి నిందలలో సమ భావము కల వాడే జ్ఞాని – అనే 
సత్యాన్ని తన జీవితము ద్వారా నిరూపించిన మహనీయుడు స్వామి.

చిత్తాబ్జ ఖానుడు ఎవరు?















కాకతీయ రాజుల కాలంలో ఓరుగల్లు ఎంతో వైభవంతో విలసిల్లినది.
మార్కో పోలో “great abundance of all necessaries of life.”అన్నాడు.

"ఓరుగల్లు కోట"లో షితాబ్ ఖాన్ దివానే ఆమ్ (= దర్బారు),  
షితాబ్ ఖాన్ చబూతరా (= వేదిక );ఖుష్ మహల్ లు ,కీర్తి తోరణములు
16 వ శతాబ్దం నాటి శిల్ప కళాకారుల నైపుణ్యానికి నిదర్శనాలు.


Kush Mahal stands out amidst ornate pillars ,
tall toranas that fill the old settlement

అచ్చట కొన్ని కట్టడాలు local governor, Shitab Khan మంచి కళాభిరుచికి నిలువుటద్దాలు.
"ఓరుగల్లు కోట"లో షితాబ్ ఖాన్ దివానే ఆమ్ (= దర్బారు),  షితాబ్ ఖాన్ చబూతరా (= వేదిక );

 Chitapu Khan - ఈ పేరును బట్టి - అతడు ఎవరు? - 
 అనే ప్రశ్న చరిత్ర కారులను ఆలోచనలను రేకెత్తించింది.
"గోల్కొండ సీమ కావ్యాలు"లో - "చిత్తాబ్జ ఖానుడు......"
అంటూ పరిణామ పదం చోటు చేసుకున్నది.
దానిని పరిశోధించిన వారు " శ్రీ ఆదిరాజు వీరభద్ర రావు".
ఒక వీరుని పేరు "సీతడు , సీతాపతి రాజు".
ఆతని బిరుదులు షితాబ్ ఖాన్. అవి -
అని ఆదిరాజు వీరభాద్ర రావు పరిశీలనలతో వెలుగులోకి, 
అనేక అంశాలు వచ్చాయి.
ఆదిరాజు వీరభాద్ర రావు ;(Adi raju virabharda rav)
దెందుకూరులో 1887 లో జన్మించినారు. 
తెలంగాణా చరిత్ర, సాహిత్యాలను గురించి 
వీరు చేసిన కృషి అమూల్యమైనది


Link 1 
Link 2 

1, మే 2011, ఆదివారం

పువ్వు ( బొమ్మ)
















మధువు తేరులపైన ; 
పారిజాతము పూవు అరుదెంచెను; 
తాను,విరబూయు ప్రతి తూరి, 
పరిసరాలన్ని పర్వములుగా; 
నవ్య కావ్యాలను వెలయించును;


&&&&&@@@@@&&&&& 
&&&&&&@@@@@&&&&&
      
        puvvu (bomma) 


madhuvu tErulapaina ; 
paarijaatamu pUvu   
arudeMchenu; 
taanu virabUyu prati tUri, 
parisaraalanni parvamulugaa; 
navya kaavyaalanu velayiMchunu;


&&&&&&&&&&&&&&&&&&&


ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...