25, నవంబర్ 2013, సోమవారం

జావా , ఇండొనేషియా ద్వీపాల భవిష్యత్ సూక్తికారుడు

మన త్రిలింగ దేశంలో(ఆంధ్ర. ఒరిస్సా, కర్ణాటక; కటకం నుండి) శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి "కాలజ్ఞానము" గీతాలు పరివ్యాప్తి గాంచినవి. 
ఇలాంటి నుడువులు ఇండొనేషియా ద్వీపసముదాయాలలో (ఆగ్నేయ ఆసియా దేశాలు ఇవి) ప్రజల నాలుకలపై విస్తృత సూక్తి, గీతాల, జానపదములుగా ఆడుచున్నవి. “జయోభయో భవిష్యద్ వాక్కులు” జనులు భక్తిప్రపత్తులతో మననం చేస్తున్నారు.

* * * * * * * * *

జావా- పశ్చిమ ప్రాంతమునకు రాజు జయోభయో (1135 - 1157). 
ఐర్లింగ చక్రవర్తి అనంతరం – జావాదేశం ముక్కలుచెక్కలైంది. 
ఆ పరిస్థితులలో ఉదయించిన ఆశాజ్యోతి “జయ అభయ సామ్రాట్”. తూర్పు జావా , కెదిరి రాజ్య స్థాపకుడు "శ్రీ మపాంజి జయాభయ": (జావా భాషలో “జయోభయో” అని ఉచ్ఛారణా పదము ఇది.) ఋతు జయభయ – అని గౌరవసూచిత నామము. శాంతి సౌభాగ్యాలకు ప్రతీక ఈతని పాలనాకాలము. ఇతను హిందూ దేవుడు “శ్రీ మహా విష్ణువు” యొక్క అవతారము- అని ప్రజలు భక్తిపూర్వక విశ్వాసము. 

“విదర్భ”- నేటి కెదిరి మండలం లో, “పమెనాంగ్” లోని అంతర్భాగం. 
విదర్భ = అంటే సహస్ర (= వెయ్యి) నగరములు. 
జయోభయో తండ్రి “గెండ్రాయన”. పాండవుల వంశీయుడు అని ప్రఖ్యాతి చెందిన అర్జునుని పుత్రుడు అభిమన్యుడు, అభిమన్యు ని సుతుడు పరీక్షిత్తు, పరీక్షిత్తు కుమారుడు యుదయన (=ఉదయనుడు). 
ఈ విధంగా జయోభయో వంశవృక్ష గాధలు “మహాభారత ఇతిహాసము లోని పాండవ సంజాతులై ఉన్నవి.

జయోభయో భార్య దేవీ సారా. ఆ రాజ దంపతులకు నలుగురు కుమార్తెలు – 
౧) దేవీ జయామి జయ; ౨) ప్రమేష్ఠి దేవి, ౩) ప్రాముని, దేవీ ౪) శశాంతి ~ అనే నలుగురు. 
జయోభయో చతుర్ పుత్రికల పరిణయాది బాధ్యతలను నిర్వర్తించాడు. 
హిందూ మతములో చతుర్ ఆశ్రమములు; జీవిత దశలు; గమన యాత్రలో- బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమములు- తత్ ప్రకారము, మోక్షగామియై, వానప్రస్థమును స్వీకరించాడు. జయోభయో చరమదశను “మెనాంగ్ గ్రామము” లో ప్రశాంతంగా గడిపాడు.

* * * * * * * * *

కెదిరి మండలంలోని ఉప జిల్లా “పాగు” లో మెనాంగ్ గ్రామంలో ఉన్నది. ఆ కుగ్రామమునకు జయోభయో వెళ్ళాడు, అక్కడ పట్టు వదలని నిష్కామ తపసు చేసాడు. ఆ దీక్ష వలన జయోభయో కి వాక్శుద్ధి వంటి అతీత శక్తులు లభించినాయి. 

* * * * * * * * *

ప్రాచీన జావా దేశములో జయోభయో పాలనలో పురా జావా సాహిత్య స్వర్ణ యుగముగా విలసిల్లినది. జయోభయో (1135 - 1157) భవిష్యత్తును తెలిపే గ్రంధాన్ని రచించాడు. అటు తర్వాతి కాలంలో - జయాభయ వాక్కులు అధికాధికం నిజమైనవి.

"ఇండొనేషియా పతనమౌతుంది, తెల్లవాళ్ళు ఆక్రమించి, పాలిస్తారు. అటు పిమ్మట పసుపు వన్నె జాతి వారు (Yellow dwarfs) పాలించుతారు" అని చెప్పాడు. ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలో వలస వచ్చిన డచ్ వారు దేశాన్ని ఏలారు. పిమ్మట జపాన్ దేశం (పసుపు వన్నె పొట్టివారు) కూడా ఇండొనేషియాను పరిపాలించింది. చిత్రంగా – జయోభయో మాటలని వాస్తవం చేస్తూ ఇండొనేషియా ప్రజలు జపాన్ సైన్యం రాకను స్వాగతం పలుకుతూ వీధులలో డాన్సులు చేసారు.  అలాగే ఇండొనేషియా స్వాతంత్ర్యం పొందుతుంది – ఫెటిల్లున రెండు ప్రపంచ యుద్ధాలూ, కొద్ది సంవత్సరములలోనే గగనపర్యంతం పెరిగిన ఆధునిక సైన్సు, చరిత్రాది శాస్త్ర విజ్ఞానములు - జయాభయ నుడువులను సార్ధకపరిచినవి. విశాల కెదిరి సామ్రాజ్యము సాహిత్యమునకు స్వర్ణయుగమై భాసించినది. అనేక బృహత్ గ్రంధాలు వెలువడినవి. అంతే కాదు! జావా ద్వీప నేపథ్యంగా – మహాభారత ఇతిహాసం రూపొందింది.

సెరత్ జయభయ ముసరర్, సెరత్ ప్రనీతివాక్య్ ; ఇతరులు చేర్చినవి 
జయభయ వాణీ సేకరణలు; ఎంపు సెడహ్, ఎంపు పానులూహ్ అనే ఇద్దరి కృషి- ఈ సేకరణలలో సింహభాగము వీరిది ముఖ్య స్థానము. (Prelambang Jayabaya, a prophetic book) 
పరివ్రాజక “సెడాహ్”, ఆతని సోదరుడు పానులూహ్ ల కృషికి ఫలితమే “మహాభావివాణి”.
1157 లో ఈ బృహత్కార్యము ప్రచురణతో వెలుగొందింది.

* * * * * * * * *

అలాగే ఉత్తర దిక్కునుండి వచ్చే yellow men వలన వాళ్ళు కూడా వెళ్ళగొట్టబడతారు- అని జయాభయ నుడివెను. జయాభయ పలికినట్లుగానే “పంట నాట్లు కోతకు వచ్చే నాటికి జపాన్ వారి పాలనకు తెర పడింది.” ఇలాటి ఆటుపోట్లకు సంచలనాలకూ కేంద్ర బిందువైంది ఎక్కువగా ‘జావా ద్వీపము . ("With the minor exception that three crops had been harvested, Jayabaya's prophecy had been realized.") డోలాయమాన స్థితిలో ఉన్నవి ఈ “ఈస్ట్ ఆసియా దేశాలు . అప్పుడు 1944 లో డచ్ నియంతృత్వం నుండి ఇండొనేషియా ప్రజలకు విముక్తి కలిగించింది జపాన్. సెకండ్ వర్ల్డ్ వార్ లో జర్మనీ (హిట్లర్) తో చేతులు కలిపినందున – జపాన్ కూడా ఓటమి పాలవడం ఖాయమైంది. 
అందుచేత అత్యవసరంగా – జపాన్ రెండో ప్రపంచ యుద్ధపు ఆఖరి డంకారావం మ్రోగే సమయానికి – ఇండొనేషియాకు స్వాతంత్ర్యం ఇచ్చి, 1945 ఆగస్ట్ 9 వ తేదీన 
(The Japanese officially granted Indonesia its independence on 9 August 1945) ప్రకటన చేసింది. 
ర్యాటు ఆదిల్ ప్రకారమే "when iron wagons could drive without horses and ships could sail through the sky"), ”

19 వ శతాబ్దపు పాశ్చాత్యులు రుద్దిన సేద్య విధానాలు ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మొదలైనది. 
ఇచ్చట సుగంధ ద్రవ్యాలు పుష్కలంగా ఉన్నవి, అందుచేత యూరోపు నుండి పాశ్చాత్యుల వలసలు ఆరంభమైనవి. డచ్, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆధిపత్యంలో నిరంకుశ వ్యాపార పాలనా విధానాల వలన, అణచివేతకు ఇండొనేషియా ప్రజలు మగ్గిపోయారు.

వారి పద్ధతులలో – ప్రజలపై బలవంతంగా రుద్దిన Cultiveer stelse. 16 వ శతాబ్దం నుండి ఈ తభావతు మొదలైంది. యూరపు వాణిజ్యకర్తలు ఆధిపత్యపు పోరులో క్రమంగా స్పెయిన్, పోర్చుగీసు వారు స్థిరపడ్డారు. పిమ్మట వారిని Dutch వణిక్కులు వెళ్ళ గొట్టగలిగారు.  

జావాద్విపంలో స్వలాభాలకై డచ్ వాళ్ళు ప్రవేశపెట్టిన వ్యవసాయ విధానాలు స్థానికులలో వ్యతిరేకత పెంచాయి. స్వేచ్ఛా భావాలు పెల్లుబికే తరుణంలో జపాన్ వారి ఆగమనం ఇండొనేషియన్ జనుల ఆశలకు ఊపిరి పోసాయి.
*************************
;
JayabhayO (photo curtecy)






















photo curtecy  (Link)

Ratu Jayabaya ఆశు పద్య, గద్య, లేఖనములు ప్రసిద్ధమైనవి (famous oracles or prophesies) . 
అతని భవిష్యద్ వాణి పలుకులు “ Serat Jayabaya Musarar, Serat Pranitiwakya” గా లోక ప్రఖ్యాతమైనవి. జయోభయో అనుయాయులు, శిష్యపరంపరాగతముగా, ఈ సారస్వత స్వరూపము రక్షించబడుతూన్నది.

జయోభయో విరచితములు- దీర్ఘ పద్య ఛందస్సులు, చాలా పెద్ద పాదములు కల “పదముల వంతెన” అనవచ్చును. జయోభయో నుడువులలో వేరొకటి :- 

"The Javanese would be ruled by whites for 3 centuries and by yellow dwarfs for the life span of a maize plant prior to the return of the Ratu Adil: whose name must contain at least one syllable of the Javanese Noto Negoro."

జయాభయ – గుర్రాలు కట్టని(పూన్చని) ఇనుప బోగీలు, లోహ నావలు ఆకాశములో చరిస్తాయి – అంటూ ముందే చెప్పగలిగన దీర్ఘ ద్రష్ట.

**************************** 
Prophecy of Satriyo Piningrit ;  (Link for matter):

న్యాయదేవతకు రక్షణ కవచము వోలె భాసిల్లును చక్రవర్తి. 
సాంత్రియో పినింగిత్ (Santryo piningith) - 
అనగా అజ్ఞాత యోధ/ గుప్త్  క్షత్రియుడు - కి ప్రతీక - గా సామ్రాట్టు సంభవించబడుచున్నాడు. 
జయాభయో - రచనలలో - "మైతేయుని సంఘము నిర్వహించే విధులను చెప్పారు. కల్కి అవతారము
కృత యుగము, సత్య యుగము- కాలచక్ర పరిభ్రమణ విశేష ఘటనలు చోటు చేసుకుంటాయి. 
ఈ పద్ధతిలో - భవిష్య వాక్కు కర్త  "సాంత్రియో పినింగిత్" ప్రతిబింబమై వరలుట- - ఈ జావా ద్వీప చారిత్రక ఘటన సూత్రీకరణ జరిగినది.


*********************************
౧, ౨, ౩, ౪, ౫, ౬, ౭, ౮, ౯, ౧0
*********************************

జావా , ఇండొనేషియా ద్వీపాల భవిష్యత్ సూక్తికారుడు

User Rating:  / 2 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri
Tuesday, 20 August 2013 08:51
Hits: 338 

14, నవంబర్ 2013, గురువారం

జమ్మి చెట్టు కథ

జమ్మి చెట్టు ఆకులను బంగారముతో సమానముగా భావిస్తూ, ఆదాన ప్రదానములుగ ఉన్న ఆచారముగా- మన ఆంధ్రదేశములో వ్యాప్తిలో ఉన్నది. 

"ఆప్త తరువు" ను మహారాష్ట్రలోని ప్రజలు పూజిస్తారు. 
ఆ తర్వాత ఆ చెట్టు  ఆకులను తీసుకుంటారు. ఈ పత్రములను 'బంగారము 'నకు ప్రతీకగా జనులు భావిస్తారు. కాంచన సంకేతమైన ఆ  కులను ప్రజలు ఒకరి  కొకరు ఇచ్చి పుచ్చుకుంటూంటారు./ ఇలాటి పరస్పర ఆదాన ప్రదాన ఆచారముచే- అందరి మనసులలో ఉన్నట్టి పాత వైషమ్యాలు తొలగిపోయి, స్నేహభావము నెలకొంటుంది.  
ఆప్త వృక్షానికి పూజచేసి, బంగారు ఆకులని పిలిచే ఆ ఆకులని స్వర్ణానికి సంకేతంగా, ఒకరికొకరు అందించుకుంటారు  
మహారాష్ట్రీయులు (Shanu and Apta tree/ Aapati trees) ఆపతి తరువు హరిత దళాలను ఇలాగే వినియోగిస్తారు. వారు అత్తి చెట్టు ఆకులు, తెల్ల ఆరె చెట్టు పత్రములుతో వ్రతాన్నిచేస్తారు. ఇందుకు కారణముగా ఒక కథ కలదు.
;


















*********

కౌత్స, వరతంతు కథ:

ప్రతిష్ఠానపురంలో నివసిస్తూన్న దేవదత్తుని తనయుడు కౌత్సుడు. తండ్రి కౌత్సుని విద్యాభ్యాసము కొరకు వరతంతు అనే ఋషికి బాధ్యతను అప్పజెప్పాడు. వరతంతు గురువు వద్ద విద్యను అభ్యసించాడు కౌత్సుడు. దేవదత్తుని కుమారుడు కౌత్సుడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి ఐనది. గురుకులమునుండి ఇంటికి వెళ్ళే తరుణం వచ్చింది. 

"గురువర్యా! మీకు ఏ గురుదక్షిణను నేను ఇవ్వవలెను? మీరు ఏదైనా వస్తువులను తెమ్మని ఆనతి ఇస్తే తెస్తాను" వరతంతు దరహాసముతో "నీ శ్రద్ధాసక్తులూ, వినయవిధేయతలే నాకు నీవు ఇస్తూన్న నిజమైన గురుదక్షిణ, అది చాలును నాకు! నీవు పరిపూర్ణ విద్యావంతునివైనావు. నాకు ఆ తృప్తి చాలును" అంటూ ఆశీస్సులు ఇచ్చాడు. కానీ కౌత్సునికి మనసులో ఎంతో వెలితి! ఇన్ని ఏళ్ళుగా భోజనము పెట్టి సాకిన గురు దంపతులు కన్నవారిని తలపించేలా చదువులు చెప్పారు. అట్టి మహనీయులకు ఏమి ఇవ్వక తాను గృహోన్ముఖుడు ఐతే ఎలా?" అదుచే శిష్యపరమాణువు పట్టు విడువక "మీ కోసం ఏదో ఒకటి నేను తెస్తాను,చెప్పండి స్వామీ!” 

అయ్యవారికి ఈ బాలుని మొండితనం చిరాకు తెప్పించింది. విసుగుతో "ఐతే నాకు బంగారు నాణెములు కావాలి. నేను నీకు 14వేదములు నేర్పాను. ఒక్కొక్క శాస్త్రానికీ ఒక్కొక్క కోటి చొప్పున 140 కోట్ల హేమ టంకములు తీసుకురా!" అని పలికాడు.

అందుకు "సరే!" నని కౌత్సుడు అంగీకరించి, వరతంతు వద్ద సెలవు తీసుకున్నాడు.


*********

అటు తర్వాత బహు యోచన చేసాడు. తండ్రి, హితుల సలహా తీసుకున్నాడు. ధర్మదాత అని పేరు పొందిన రఘు మహారాజు వద్దకు వెళ్ళాడు. 
(రఘు చక్రవర్తి వంశీయుడే శ్రీరామచంద్రుడు, కనుకనే ఆతనిని 'రఘుపతి" అని కూడా పిలుస్తారు)

కౌత్సుడు వెళ్ళే వేళకు రఘు చక్రవర్తి "విశ్వజిత్ యజ్ఞము"ను చేసాడు. యజ్ఞ యాగాలు చేసే ప్రభువులు 'అడిగిన వారికి లేదనకుండా దానము చేయాలి. ఆ ప్రకారము అప్పటికే ప్రజలందరికీ రాజభవనములోని డబ్బు, దస్కమూ, సొమ్ములను యావత్తూ తన సర్వస్వము దానము చేసేసాడు. ఆయన కోటలోకి - ధనమును యాచించుటకు వచ్చినప్పుడు రఘు చక్రవర్తి కోశాగారం ఖాళీ ఐంది. కౌత్సుడు తన ’గురుదక్షిణ’ సంగతి తెల్పగా, ఖిన్నుడు ఐనాడు ఆ చక్రవర్తి.

"కౌత్సా! ఎల్లుండి రమ్ము!" అని చెప్పాడు. 

మూడురోజుల గడువులోపల రాజు అంత ధనాన్ని తీసుకురావాలనుకున్నాడు. అతను ఇంద్రుని వద్దకు వెళ్ళి ద్రవ్యమును కోరాడు. ధనపతి కుబేరుని పిలిచాడు మహేంద్రుడు. 
"కుబేరా! రఘు సామ్రాట్టు ముఖ్యపట్టణము అయోధ్య. ఆ రాజధానిలోని షాణు, అపర్తి చెట్లు (Shanu and Aapati trees) పై స్వర్ణ నాణాల వర్షము పడేలా చేయి!" అంటూ అజ్ఞాపించాడు సురపతి. 
అయోధ్యలో ఎడతెరిపి లేకుండా సువర్ణ వర్షం కురిసింది. అలాగ వర్షించిన ధనమును పూర్తిగా కౌత్సునికి ఇచ్చేసాడు రఘువు. [సురవర అనుగ్రహముతో లభించిన అగణిత అపరంజి రాసులు అవి!]

కానీ కౌత్సుడునికి డబ్బు అంటే వ్యామోహము లేదు. తన గురుదక్షిణకు అవసరమైన 140 కోట్లు మాత్రమే తీసుకున్నాడు కౌత్సుడు. అతడు"మహాప్రభువుకు కృతజ్ఞతలు" చెప్పి గృహోన్ముఖుడైనాడు.

*********

గురువు గారు కోరిన నాణెములు తీసుకుని తక్కినవి రఘురాజుకు తిరిగి ఇచ్చేసాడు కౌత్సుడు.

దానముగా ఇచ్చిన వాటిని మళ్ళీ తీసుకోకూడదు రాజు. కావున రఘువు "ఈ డబ్బును నేను తీసుకోను" అంటూ నిరాకరించెను. అప్పడు కౌత్సుడు మిగిలిన డబ్బును ప్రజలకు అందరికీ పంచాడు. అయోధ్యా పట్టణమునందు తెల్ల ఆరె చెట్ల పైన కనకవర్షము కురిసిన రోజు ఆశ్వీజ శుక్ల దశమి.

పథాన్ నివాసి ఐన కౌత్సుని అన్వేషణ వలన ఆపతి తరువుల కుందన వృష్టి కురిసి, ధనరాసులనిలయాన్ని చేసింది అయోధ్య నగరము సిరి సంపదలు పొంగులు వారి సుఖసంతోషములతో విలసిల్లసాగినది. నాటినుండీ ప్రజలు అత్తి చెట్టు ఆకులను/తెల్ల ఆరె చెట్టు పత్రములను' పసిడి 'కి ప్రతీకలుగా భావిస్తూన్నారు. ఇరుగుపొరుగువారికీ, బంధు మిత్రులకూ ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూండడం నవ రాత్రి, దసరాల ఆనవాయితీ ఐనది.

వరతంతు గోత్రము :- 

ఋషుల మూలములను స్వీకరించి, జనులు – ఆయా గోత్రములవారు ఐనారు. ఈ పద్ధతిలో- “వరతంతు గోత్రీకులు” ప్రవర, ఋషిమూలములు ఏర్పడినవి. ఈ సంప్రదాయము ఆయా వ్యక్తుల ప్రాచీనతకు పునాదులు. ఇందుచే శాస్త్రజ్ఞులకు- మనుష్య జాతి జీన్సు, పరిణామములు – మున్నగు అనేక అంశముల గూర్చి సులభముగా రీసెర్చ్ చేయడానికి అనువైన వాతావరణము ఏర్పడింది.) 

User Rating:  / 1 
PoorBest 

8, నవంబర్ 2013, శుక్రవారం

ఎలిఫెంట్ ఆపిల్ అనబడే నేరేడు కథ

“गजाननं भूतगणादिसेवितं कपित्थ जम्बू फल चारु भक्षणम्।।
उमा सुतं शोक विनाश कारकं नमामि विध्नेश्वर पादपकंजम्।।“

గజాననం భూతగణాది సేవితం కపిత్థం జంబూఫల చారు భక్షణం
ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంజం

"సకల జీవకోటి చేత సేవలూ, పూజలు అందుకుంటున్న గజవదనునికి, వెలగపండును, నేరేళ్ళు (Elephant apple (Kaith) and Jambolana (Jamun)మున్నగునవి భుజించేటటువంటి, 
ఉమాపుత్రుడు, వేదనలను బాపు వాడైన స్వామి గణేశుని చరణారవిందములకు నమస్కరించుచున్నాను."

ఈ ప్రార్థన అనాది కాలం నుండి భారతదేశములో ప్రచలితమైయున్నది.

"కరి మింగిన వెలగ పండు: అని సుమతీ శతకకారుడు నుడివిన మాటలు 
గొప్ప జాతీయముగా చెలామణి కాబడుతోంది.

గజాననునికి ఇష్టమైన పదార్ధాలలో వెలగపండ్లు మాత్రమే కాక 
నేరేడు పళ్ళు (Indian black plum), ఆకులు కూడా ఉన్నవి. నేరేడు చెట్టు, నేరేడు ఫలం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నవి. నేరేడు చెట్టు పళ్ళే కాదు, కాండపు బెరడుతో సహా ఆయుర్వేద ఔషధాల తయారీకి ఉపయోగితమౌతూన్నవి.

జంబూ ఫలము- అని నేరేడుకు కల సంస్కృత నామధేయం. 
మన దేశానికి ప్రాచీన నామము “జంబూ ద్వీపము” అని నేరేడు తరువులు విరివిగా ఉండుటచేతనే అని పరిశోధకుల అభిప్రాయాలు. 
{ నేరేడు:-(Syzigium cumunii) ; naval fruit ,Indian black berry}

ఋతుపవన సీమలలో పెరుగుతుంది ఈ సతత హరిత తరువు. ఆరోగ్య సంవర్ధని ఐన నేరేడు పండుకు పండగల రోజులలో తినవలెనని నియమ సిద్ధాంతాలను ఏర్పరచుటచే, అడపాదడపా నేరేడు పండును భారతీయుల ఫలహార, పదార్ధముగా వినియోగంలోనికి వస్తూనే ఉన్నది. 
ఇట్టి సూత్రములు ఉండకున్నచో, ప్రజలకు పరిచయానికి దూరంగా ఒక అడవి చెట్టుగానే మిగిలిపోయేది.

పండుగల వేళలలో వింత ఐన వగరు రుచిని ఆస్వాదించే అవకాశాన్ని కలిగిస్తూన్న 
ఈ పండు కథా కమామిషూలను కొంచెం పరిశీలిద్దామా?

॑॑॑॑॑॑॑॑

బాలక్రిష్ణమూర్తి ఫ్యాన్సీ డ్రస్సులు, బాల బాలికల విచిత్ర వేషధారణల పోటీలు, ఈ హంగామాలూ, 
"శ్రీ క్రిష్ణాష్టమి" నాడు, మన ఆంధ్రప్రదేశ్ లో శ్రావణ, భాద్రపద మాసాలలో, పండుగ నెలలలో నేరేడుపండును ఒకటైనా తినాలంటారు. ఆహార విషయాది నియమాలలో - పొరపాటున జరిగే జీవ హింసఅనే పాపమును నివృత్తి చేసేటందుకని- ఈ నేరేడు పండును తినాలని ఒక సరదా సాంప్రదాయాన్ని పెద్దలు ఏర్పరిచారు. 
నేరేడుపండు మేను ఛాయ శ్రీ కృష్ణమూర్తిది.

॒॒॒॒॒॒॒॒

గుజరాతీ భాషలో "లంబూ జీవతి ఛే| తో జంబూ ఖావు ఛే||" 
అనే సామెత ఉన్నది. 
అంటే నేరేడును తింటే చక్కెరవ్యాధి పరారు  అని అర్థం

నేరేడు చెట్టు (Jamun) బహుళ ప్రయోజనకారి. రైల్వే స్లీపర్లు, పొలాల్లో మోటారు పంపు సెట్లకు ఆధారముగా, పెట్టెలు వగైరా వస్తు తయారీ- ఇత్యాదులలో చెట్టుపట్ట (బెరడు) ఉపయోగంలో ఉన్నది. నేరేడు పండు. నేరేడు చెట్టు 100 సంవత్సరాలు ఉండే ఘన మహా వృక్షము.

॑॑॑॑॑॑॑॑
;
strange fruit, Jamun 

;




















"జంబూ ద్వీపము"; శ్రీకృష్ణమూర్తి దేహఛాయకు ప్రతిబింబము కాబట్టి, గుజరాత్ మున్నగు రాష్ట్రాలలో జంబూ తరువును పవిత్ర పాదపముగా గౌరవిస్తారు. కార్తీక మాసము "పిక్ నిక్" లూ, వనభోజనాల సందడి- ముఖ్యంగా నేరేడు, ఉసిరిక చెట్లు ఉన్న తోటలను వనభోజనాలు చేసేటందుకు ఎన్నిక చేస్తారు. *

॑॑॑॑॑॑॑॑

ఈ మహావృక్షము పేరు ఆఫ్రికా దేశాలలో ఉన్నది. 
ఇంతకీ సంస్కృత పదమైన "జంబూ" అనే మాట"జంబులా ట్రీ" గా ఆఫ్రికా ఖండానికి ఎలాగ చేరింది?

పోర్చుగీసులు వాళ్ళు వలస సామ్రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నములో భారతదేశానికి వచ్చారు. అప్పుడు అలాగ అప్పట్లో కేవలము ధనము మాత్రమే కాక ప్రకృతి దినుసులు కూడా ఆదానప్రదానములలో విదేశాలకు తీసుకుపోబడినవి. పోర్చుగీసులు 16 వ శతాబ్దిలో ఇండియాకు వచ్చారు. (పోర్చుగీసులను "బుడతకీచులు" అని కూడా పిలిచేవారు). కొందరు పోర్చుగీసులు ఈ విత్తనాలను విదేశాలకు చేర్చారు. వాళ్ళు అప్పట్లో బ్రెజిల్ దేశానికి వెళ్ళారు. అట్లా వారు కాలూనిన బ్రెజిల్ సీమలలో జంబూబీజములను చల్లారు. బ్రెజిల్ వాతావరణము అనుకూలత చేత నేరేళ్ళూ అక్కడ నలుమూలలా విపరీతంగా అభివృద్ధి గాంచినవి.

బ్రెజిల్ దేశములోని వాతావరణము ఇటువంటి వృక్షాలు పెరగడానికి అనువుగా ఉండడంతో ఆ వాతావరణములో జంబూపాదపములు ఏపుగా పెరిగినవి. ఇబ్బడిముబ్బడిగా పెరిగి, ఆ దేశమంతటా చిటికెలో వ్యాపించినవి. అచ్చటి ప్రజలు "Jambula tree"అంటూ ఈ చెట్లను పిలుస్తారు.

॑॑॑॑॑॑॑॑

మొత్తానికి ఈ పేరును మూల ధాతువుగా ఉన్న పాశ్చాత్యదేశాలలోని నామావళిని పరిశీలిద్దాము.

మాల్ దీవులలో - "ధంబూ" : jawanise - "juwet", "dhuwet" 
పోర్చుగీస్:- Jamelaw, jambOlaw, jalat

॑॑॑॑॑॑॑ఇలాగ జంబూ ధ్వని ప్రధానముగా అనేక భాషలలో కాస్త స్థానిక భాషల యాసల మార్పులు చేర్పులతో జంబూ ఫలము, జంబూ చెట్టు వన్నె వాసికెక్కింది. మన దేశాలలో కన్నా, పశ్చిమ ఖండాలలో ఈ పళ్ళ రసాలను, కలర్సు తయారీ, హెల్త్ డ్రింక్స్, ఖాద్య పదార్ధాలకు మంచి రంగునూ, అదనపు రుచినీ కలుగ జేసే అనుపానంగానూ బహుళ స్థాయిలో వాడుతున్నారు.విదేశీ లిటరేచర్ లోనూ ఈ జమ్బూ వృక్షమునకు చోటు కలిగినది కూడా!

"Strange Fruit" అనే పాట హిట్ ఐనది.

"""""""""""""""""""""""""""""""""""""""""""""""""",



User Rating:  / 0 
PoorBest 

5, నవంబర్ 2013, మంగళవారం

కుమారీ పూజ


కుమారీ పూజ - శ్రీ దేవీ నవరాత్రోత్సవములలో - జరిగే ఆచారము. 
ఉత్తరాదిన నేపాల్, మహారాష్ట్ర ఇత్యాది కొన్ని రాష్ట్రములలో అనుసరిస్తున్నారు ప్రజలు. 
దుర్గా మాతను నేపాల్ దేశములో “తలేజు” అని పిలుస్తారు.

కౌమారి- అనగా బాల్యాన్ని అనుసరించే దశ. 
కుమారీ దశను దాటగనే అంకురించేదే యవ్వనము. 
ఈ లేత ప్రాయము సౌకుమార్య సౌందర్యానికి ప్రతిబింబము. 
కనుకనే ఈ కుమారీ దశను ఎన్నుకుని అలాటి బాలికలను మందిరములో ఆసీనలు గావిస్తారు. 
ఇందువలన. గుడి ప్రాంగణము కళకళ లాడ్తూంటుంది.

******

కుమారీ గృహము:-























నేపాల్ లో అలా పూజించవలసిన బాలికను ముందు ఎన్నిక చేస్తారు. 
శాక్య, బజరాచార్య (=వజరాచార్య) మున్నగు వంశ బాలికలను ఈ పీఠములో ఆసీనులను చేస్తారు.

రాయల్ కుమారీ/ రాజ కుమారి- అని ఈ అర్చిత బాలిక-ను పిలుస్తారు. “సజీవ దేవత" గా అర్చనలు చేస్తారు.ఆమె "కుమారీ గృహము” (Royal Kumari of Kathmandu- Kumari ghar) లో ఆమెను ఉంచి, షోడశోపచారములు చేస్తూంటారు. పవిత్రభావముతో కొలుస్తారు. కౌమారీ దశ వఱకు మాత్రమే ఆమెను- చూస్తారు. కౌమారదశ పూర్తి అయి, యవ్వనములోకి అడుగు పెట్టిన కన్యకను లౌకిక జీవితములోనికి ప్రవేశించినదని - భావము. అటు తర్వాత ఆ అమ్మాయి సంఘములో సాధారణ జీవితమునకు సంబంధించిన జవ్వని- గా గౌరవింపబడుతుంది.

2008 అక్టోబర్ లో మతీనా శాంఖ్య - అనే చిన్నారి రాజకుమారి "కుమారీ దేవత" ఐ, 
పూజలను అందుకొన్నది. (Royal Kumari of Kathmandu : Kumari Ghar)
;
















******

కుమారీ పూజలు- ఉత్తరాదిలో- బెంగాల్ ఇత్యాది రాష్ట్రాలలో ఆచరణలో ఉన్నవి.
ఐతే ఆయా రాష్ట్రములలో వివిధ పద్ధతులు ఉన్నవి. కొన్ని సీమలలో అలంకృత బాలికను- ఒకరోజు మాత్రమే పూజిస్తారు.

కుమారి:- శిశువుల ఆరోగ్యానికి, కేరింతలు కోసమై:
త్రిమూర్తి:- దీర్ఘాయుస్సు, ఆరోగ్య భాగ్యాల కోసము:
కళ్యాణి:- విద్యాభివృద్ధి, మంచి స్నేహశీలి, మంచి మైత్రిని సంపాదించుట కోసము:
రోహిణి:- స్థిమిత బల సంపన్నత : 
చండిక:- సిరి సంపదలు అనుగ్రహించుట|
శాంభవి:- ధైర్యశక్తి|
దుర్గ:- అసాధ్య పనులను సైతమూ చేసే కార్య సాధకులు అగుట|
సభద:- అభీష్టఫలదాయిని

ఈ రీతిగా వయసులవారీగా సకల ఈప్సితములు నెరవేర్చగలిగే 
9 శక్తిస్వరూపిణులుగా కుమారీలకు అర్చనలు చేస్తూంటారు. 

*********** 

User Rating:  / 1 
PoorBest 

***********
My blog: akhilavanitha (Link);
Tuesday, December 25, 2012
గుజరాత్ లో పార్శీల కోవెల (Link)
వారి అర్చనా స్థలము ఈ "అగ్ని ఆలయము".
పార్శీల మతము జొరాష్ట్రియన్.

4, నవంబర్ 2013, సోమవారం

ఆ జాతిపిత గాంధీజీ బొమ్మ (లినోకట్ )


Gadhi - By Nandan Lal Bose లినోకట్ విధానం ద్వారా ప్రసిద్ధికెక్కిన ప్రముఖుల బొమ్మలలో ఒకటి 
జాతిపిత గాంధీజీది. 
ఈ బొమ్మను వేసిన ఆ కళాకారుడు ఎవరు?
అతని పేరు నందలాల్ బోస్.

నందలాల్ బోస్ గురించి ప్రస్తావించే సందర్భంలో అతని గురించి కొన్ని వివరములు:-

శాంతినికేతన్  గురించి తెలియని వారు అరుదు. 
రవీంద్రనాధ్ టాగూర్ మహదాశయాలకు ప్రతిబింబము అది. 
ప్రకృతిలోని స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ, మనిషిలో తనలోని కళలకు రూపమును ఇచ్చే ఆశయము నేపధ్యాలతో - స్థాపించిన పాఠశాల శాంతినికేతన్. నందలాల్ బోస్(1882-1966)- (బెంగాలీ ఉచ్ఛారణ ప్రకారము 'నందోలాల్ బోషు') చిత్రకళా శైలిలో భారతీయత ఉట్టి పడుతూంటుంది. 
లలిత కళలపట్ల నందలాల్ కు గల అభిరుచి, అవగాహనలు ఆతనిని వర్ణ కృషీవలుని చేసినవి. అందుచేతనే ఆతనికి రబీంద్ర నాధ్ టాగోర్, అవనీంద్ర నాధ్ మున్నగు వారి ప్రశంసలను లభించినవి. తత్ఫలితంగా ఉన్నత పదవిని పొందగలిగాడు.  
నందలాల్ బోస్ 1922లో శాంతినికేతన్ -లోని అంతర్విభాగమైన "కళాభవన్ కు ప్రిన్సిపాల్ ఐనాడు. 

******

రవీంద్రనాధ్ టాగూర్ కుటుంబీకుల ఆదర్శాలు నందలాల్ బోస్ కు మార్గదర్శినిలు ఐనవి. అలాగే అజంతా గుహలలోని మురల్స్ స్ఫూర్తిని ఇచ్చినవి. ఖద్దరు, రాట్నచక్రము- అహింసావిధానము ద్వారా స్వాతంత్రోద్యమాలలో పాల్గొని దేశం మొత్తమూ గాంధీజీ ఆనతిని ఔదల దాల్చింది. ఆనాడు దేశం యావత్తూ మహాత్మా గాంధీ అడుగుజాడలను అనుసరించింది. నందలాల్ బోస్ భాగ్యవశాత్తూ నాటి స్వాతంత్ర్య సమరయోధులతోనూ, నేతలతోనూ ప్రత్యక్ష పరిచయ భాగ్యాలు కలిగినవి. దండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ నాయకునిగా- సమస్త ప్రజానీకాన్ని ముందుకు నడిపిస్తూన్న చైతన్యమూర్తి ఐన బాపూజీని చూసిన మహత్తరదృశ్యాలను నేత్రద్వయాల నింపుకున్న అదృష్టాన్ని పొందిన వారిలో ఒకడు నందలాల్ బోస్. స్వయంగా చేయి తిరిగిన ఆర్టిస్టు ఐన నందలాల్ బోస్ కుంచెలో నుండి బొమ్మ పురుడుపోసుకున్నది.

******

"కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్" అని కదా సముద్రాల సూపర్ హిట్ సాంగ్ లోని ప్రధమ వాక్యాలు! సరే! ఇంతకీ లినోకట్ టెక్నిక్ అంటే?

లినోకట్ - కొంచెం క్లిష్టత కలిగిన మెథడ్ కోవలోనిది. సాధారణ చిత్రలేఖనములకు విభిన్నమైనది. లినోకట్ – మార్కెట్ లో ఉంటూన్న Murals కనువిందు చేస్తూన్నవి కదా! "మురల్స్ బొమ్మలు జనాలకు నచ్చుతున్నవి. లినోకట్ ఇంచుమించు మురల్స్ లాంటిదే అనవచ్చు. లినోనియన్ లోహపు షీటు మీద లినోకట్ - Imageచేస్తారు. కొన్నిసార్లు చెక్కబ్లాకు పైన చేస్తారు. డిజైనులను ఆ ఉపరితలాలపై చెక్కినట్లుగచేస్తారు. ఇందుకు కొన్ని పరికరాలను వడుతారు. "V" షేపు కొసల చాకును గానీ, chiselని గానీ gouge ని గానీ ఉపయోగిస్తూతూ బొమ్మను చెక్కుతారు. ఇది ఉబ్బెత్తుగా ఎత్తుపల్లాలు కొంచెం ఉబికినట్లుగా అగుపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే - 3D చిత్ర పటము- అన్నమాట!

******

సరే! వీనికీ, ఇతర పెయింటింగు విధానాలకూ - ఒక వింత వ్యత్యాసం ఉన్నది, అదేమిటంటే అద్దములో మనము చూసే దృశ్యములు ఎలాగ కనిపిస్తూంటాయి?

Linocut లను చేతితో అదే రీతిగా చేస్తారు. 
రివర్స్ గా సిద్ధం చేసిన ఇట్టి చిత్ర/ శిల్పము- ను పేపరు మీద, ఫాబ్రిక్, వస్త్రం మీద అచ్చు వేస్తారు. 
ఇందుకు రోలర్, బ్రెయర్ (rooller, brayer) మాదిరి అదనపు సాధనములు ఉపకరిస్తారు. 
అలాగ నందలాల్ బోస్, లినోకట్ - స్టైల్ ద్వారా వేసిన బొమ్మ- 
నేటికీ అనేక సందర్భాలలో పునఃపునః ప్రాదుర్భవిస్తూనే ఉన్నది. 
రోడ్డు కూడలిలో నిలిపే మన జాతిపిత బాపుజీ విగ్రహములకు – 
అలనాడు బోస్ గీసిన నాటి లినోకట్ చిత్రమే మూలస్తంభము. 
1930 ల్లో వేసిన ఆ నాటి ఆ Dandi March చిత్రము ఇందరి మన్ననలనూ, ఆమోదముద్రను పొంది, చరిత్రాత్మకతను గడించి, సార్ధకమైనది.

*******************************************;

ఆ బాపుజీ బొమ్మ  (Link: newAwa, mag)
 Email User Rating:  / 1 
Member Categories - తెలుసా!
Written by kusuma
Tuesday, 29 October 2013 08:00
Hits: 68 

*******************************************;
My song/ poem:
akhila vanita blog  (link)
Sunday, August 14, 2011
మువ్వన్నెల జెండాకు దండాలు!

తూర్పు దిక్కు సూరీడుకు మెలకువ తెప్పించే _ 

మన,మువ్వన్నెల జెండాకు - దండాలు! దండాలు!       ||

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...