25, జనవరి 2009, ఆదివారం

శ్రీ వేంకటేశుడు ,కోవెల (కసం)

మంగమ్మ చూపులే రంగారు బంగారు

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''


మంగమ్మ చూపులే రంగారు బంగారు ;;;;;
"""""""""""""""""""""""""
("సప్తగిరి "
పత్రిక )
(జనవరి ,2009 పత్రిక లో ప్రచురణ)

1) హంగు మీరగ రంగ వల్లికలు వేలాదిగా ;
వలయాలు,వలయాలుగా ,వెలయు చున్నాయి ;
తెల్ల తామరల పూల కళ్ళున్న" అలమేలు ;
మంగమ్మ " చూపులే ముగ్గులై విరిసాయి ; //


2)ఏడు కొండలె నిండు బంగారు చుక్కలు ;
ఆమె క్రీ గంటి చూపులె వల్లికల అల్లికలు ;
సతి వాలు చూపుల సొంపారు ముగ్గులే ;
ఏడు కొండల స్వామి ఎద తీపి గురుతులు ; //


3)కొండలకు దిగువన ఆమె కొలువున్నాది ;
శిఖరాల పైనేమొ స్వామి కొలువున్నాడు ;
ఈ ముగ్గుల "లో గుట్టు ",తన మనసులో "గుట్టు" ;
అమ్మనే అడుగుదాం! అంగనలారా! రండి! //


::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: ;;;;;
""""""""""""""""""""""""""


1) హంగు మీరగ రంగ వల్లికలు వేలాదిగా ;
వలయాలు,వలయాలుగా ,వెలయు చున్నాయి ;
తెల్ల తామరల పూల కళ్ళున్న" అలమేలు ;
మంగమ్మ " చూపులే ముగ్గులై విరిసాయి ; //


2)ఏడు కొండలె నిండు బంగారు చుక్కలు ;
ఆమె క్రీ గంటి చూపులె వల్లికల అల్లికలు ;
సతి వాలు చూపుల సొంపారు ముగ్గులే ;
ఏడు కొండల స్వామి ఎద తీపి గురుతులు ; //


3)కొండలకు దిగువన ఆమె కొలువున్నాది ;
శిఖరాల పైనేమొ స్వామి కొలువున్నాడు ;
ఈ ముగ్గుల "లో గుట్టు ",తన మనసులో "గుట్టు" ;
అమ్మనే అడుగుదాం! అంగనలారా! రండి! //


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

గాంధీ 1

బాపూజీ

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''




బాపూజీ ;;;
"""""

1)బోసి నవ్వుల బాపు ;;;
నోటి: నుండి వచ్చినదె వాక్కు ;
తాను:పలికిన పలుకు ;
జవ దాటనట్టి ;
అపర ఋత్విక్కు ; //

2)పట్టినాడు రాట్న చక్రము ;
వెను:త్రిప్పినాడు 'తెల్ల దొరల
పాలనా జాతక చక్రము " //

3) కట్టినాడు కొల్లాయి గుడ్డను ;
పట్టెడన్నము లేని 'బీదల ;
లోన కడుం గడు బీద వాడు ' //

4)అర్ధ లోభము నొల్లని వాడు ;
అర్ధ హీనపు బ్రతుకు నొల్లడు ;
గాంధి గడిపిన జీవితమ్మే ;
ధన్య చరితకు పలుకు "నాంది" //



''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

అడవి

వెన్నెల రేడా!

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;



వెన్నెల రేడా! ;;

''''''''''


ఉయ్యాలోయ్! ఉయ్యాల!
అట్ల తద్దెకూ ఉయ్యాల!
కొమ్మల కట్టెను మా మామయ్య //

2)పిల్లల మెల్లా ఊగెదము
మెల్ల మెల్లగా , నెమ్మదిగా!
ఆనక అటుపై - జోరు జోరుగా , మహా జోరుగా //


3)"అట్ల తద్దెకీ "ఆరట్లు"
ఆరూ ,ఏడు చట్నీ వేయి!
రుచి పసందు! మెసవెదము!" //

4) మర్రి ఊడలలొ - కూర్చో! జాబిలి!
నిన్నూపెదము ,మేమంతా!

నీ నవ్వుల పున్నమి డోలలలోన ;
నిఖిల విశ్వమును ఊగించుమయా!
ఆ డ్యూటీ నీదే! వెన్నెల రేడా!
ఓ చందురుడా! //





;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ఇంద్రధనుస్సు

అమ్మలు నవ్వులు

""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

అమ్మలు నవ్వులు ;;;
'''''''''''


1)కెంపులు,రవ్వలు,రతనాలు - కొత్త మెరుపులు ,మిరుమిట్లు ;;;
మణులు,మాణిక్యము - పగడాలు,ప్రవాళ అందాలు ;



2) వజ్ర ,వైఢూర్యాల్ , ఇంద్ర నీలాలు ;
మరకతముల మిసి మేలిమి రళ తళల్ ;
భళీ! భళీ! -మహ బాగు!! బాపురే! ;



3)ఆణి ముత్యములు ఇవిగివిగో! ;
ఆహ్లాదములకు నెలవు లివి!



4)అన్నిటి తళుకులు, ధగ ధగలను-పొదువు కున్నట్టి ;
బాల, బాలికల చిరు చిరు నవ్వులు ;
ఇవిగివిగో! కేరింతలు ఇవిగో! ;


"అహ్హహ్హా!హ్హహ్హహ్హా!............"
(అందరూ నవ్వుతారు.)





;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

24, జనవరి 2009, శనివారం

ఉషస్సు

"భూమి పుస్తకము"

''''''''''''



" భూమి పుస్తకము" ;;;
'''''''''''''




1)పాప నవ్వులను చూచిన మబ్బులు ;
వానల ధారల పద్యములైనవి ;
ధరణి సమస్తం
"సంతోషాల గ్రంధమైనది" ;
పృధ్వీ తలమున పులకరింతలు //

2)తొలి తెలి దినమణి కాంతులు ;
ఈ, ఇలా తలానికి కొంగు బంగారు
కొలను నీలాల పళ్ళెములందున ;
వేకువ కిరణపు హారతులు ;
వసుధ మాతకు పులకరింతలు //


2) చేనుల , పైరులు కళ కళ లాడే ;
పచ్చని వలువలు నేశాయి ;
పాడి పంటలతొ తుల తూగేటీ ;;;
ప్రకృతి మాతకు ఆహ్లాదం ! //
వసుంధరకు పులకరింతలు


4)ఆ,కళ కళ క్రీడలు, కిల కిల నవ్వులు ;
వినగా వినగా వీనుల విందులు ;
కనగా కనగా కన్నుల పంటలు
వసుధ మాతకు పులకరింతలు //



;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

23, జనవరి 2009, శుక్రవారం

ముగ్గు

హరి విల్లు బహుమతి

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;



హరి విల్లు బహుమతి ;;;;;
''''''''''''''''''''''


1)బాల బాలికలు రావాలి!
ఆటలు పాటలు విర బూయాలి !
మూతీ ముక్కూ విరుపులు మాని
ప్రకృతి గీతికి "పల్లవుల"వాలి! ;;; //


2) అమ్మాయ్ ,అబ్బాయ్ బొమ్మల కొలువులు ;;;
ఇంపు సొంపుల క్రీడలు చూచీ ;
అల్లరి చిల్లరి చిరు మేఘాలు ;;;
అలకలు మరచీ నవ్వేసాయి! ; //


3) నీలి నింగిలో "ఇంద్ర ధనుస్సు"లను ;
వంగి, పుడమికి ఇచ్చెను మబ్బులు
"వసుంధరకు వేల వందనమ"న్నవి ;;; //


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

a trios (ksm)

22, జనవరి 2009, గురువారం

వెన్నెలా!వెన్నెలా!

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;




వెన్నెలా!వెన్నెలా! ;;;
''''''''''''''''''''


1)వెన్నెలా! వెన్నెలా! - మిన్నుల్లొ వెన్నెల ;
కన్నుల్లొ కురియగా - కాణాచి వెన్నెల ; //


2)గగనాల వెన్నెల ;-చిరు నవ్వుల్లో వెన్నెల ;
కలలల్లే వెన్నెల - మమతల కలలను" ఏలేటి వెన్నెల ;
అల్లికల వెన్నెల - అల్లిబిల్లి వెన్నెల ; //


3)బులిపించే వెన్నెల - బులి బుచ్చకముల వెన్నెల ;
చిన్నారి కలువ రేకు(ల) కన్నులలో - ఉత్సాహం వెల్లువంత
నీలి నింగిగా మారి - ఆట పట్టు అయ్యింది
!ఆహాహా!! వెన్నెలకు ; //


4) వెన్నెలా! వెన్నెలా! -గోముగా,గారాంగా ;
బాలల దర హాసముల - ఊగవే ఉయ్యాల!
ఊగవే! ఊగవే! - ఉయ్యాల! జంపాల! //



;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;






పి

sAdRsya (ksm ,a

మరకత మణులు

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''


మరకత మణులు :::
'''''''''''''


1) కిల కిల నవ్వులు , సందడులు ;;;
పిల్లలు, పాపలు
పుడమిని ముదముల సార్వ భౌములు! //


2)చిటి చిటి పలుకుల సిరి ముత్యం ;
ఆట పాటల ఆణి ముత్యము ;
పలుకుల వజ్రం,వైఢూర్యములు ;
కబురుల తొణుకును ,కెంపు నీలమ్ములు //

3)ముచ్చటలన్నీ మాణిక్యములు ;
బొమ్మలాటలలొ మరకత రాసులు ;

అల్లిన కథలు ,పచ్చలు,పగడాల్
చిలిపి చూపులే మెరిసే మణులు //

4) మా పాపాయి నడకలె నాట్యాలు ;
ఇలలో కౌస్తుభ , చూడా మణులు ;
కనుకనె కృష్ణుడు దిగి వచ్చాడు ;
క్రీడా మయమగు నీ భువి సర్వం! //





;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

జాతీయ పక్షి

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''



జాతీయ పక్షి ;;;;;
''''''''''''''''''

1)కన్ను కన్ను నెమలి కన్ను ;;;
నెమలి కన్నుల సొగసులు చూడు!
పింఛము వందల చంద్ర చూడములు
హుషారు మయూరి "పురి"ని విప్పినది! //

2)నాట్య సొగసుల "విహంగ రాణి"
కనుకనె ఆయెను ,
"సొగసు కానుక" గ
భారత దేశపు "జాతీయ పక్షి" !
మన కందరికీ గర్వ కారణము! //


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

21, జనవరి 2009, బుధవారం

ఒక బ్లాగును చదివాను!

http;//sirichandana.blog

అనే బ్లాగును చూసాను.
శిరీష ,హైదరాబాద్ ,ఉద్యొగిని ,బ్లాగులో తన భర్త,కుటుంబ ,బంధువుల వివరాలను పొందు పరిచారు. వీణాధారిణి ఐన "పార్వతీ దేవి ఫొటో కింద ,బ్లాగ్రచనల పట్టికను ఇచ్చారు.
ఎన్నో అందమైన ప్రకృతి ఫొటోలు ,ఆమె సున్నితమైన అభిరుచికి తార్కాణాలు.
ఎన్నో సామెతలను, ఆహార పదార్ధాలు, వగరా వివరాలన్ని ఫొటో సహితంగా కన్నుల పండువుగా ఉన్నాయి. ఆమెకు ఇష్టమైన బ్లాగులు


"""""""""""""""""""""""""""""'''
అనేక తెలుగు సామెతలు మనలను అలరిస్తాయి.
మల్లిక్ కార్టూనులు,వగైరాలతో నేత్ర పర్వం చేసే బ్లాగు ఇది.


ముగ్గులు,మెహిందీ బొమ్మలు కొన్నిటిని ఇందులో ఉంచడము ప్రత్యేకత.
ఐతే ఈ బ్లాగులో "తెలుగు"ను, ఇంగ్లీషు లిపిలో ఉంచారు.




ఒక బ్లాగును చదివాను!

aa beauty 2 (ksm)

మల్లికా, మల్లికా

''''''''''''''''''''

మల్లికా! మల్లికా! ;;;;
''''''''''''

1) మల్లికా! మల్లికా!
ఈ పూ దోటకు కానుకా! //

2) బాలల చిరు నవ్వుల దొంతరలకు
నీ పరిమళముల అబ్బేనో!!!
చిన్నారుల పలుకులకు
మా ఎద తేనెలు కురిసేనే!!! //

3)కరుడు కట్టినత్తి మనిషి
నీ చెలిమిని కరిగేను
జాలువారు ఊహలన్ని
మేనాలుగ మారెను! //

4)శాంతి,సౌహార్ద్రాలు
మానవత్వము,చెలిమిని
నింప గలుగు
నీ వన్నియ "తెలుపు"కదా!

తేట తెల్లమౌ "తెలుపు"
తెల తెల్లని "తెలుపు"
ఆహ్లాదములను తెలిపే
కొత్త జగతి ఆన వాలు! //



;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

chitrvarnam.blog (aa nelatha,ksm)

సీతాకోక చిలకలు

;;;;; '''''''''''''''''



సీతా కోక చిలకమ్మలు :::::::;
'''''''''''''''''''''

1) సీతా కోక చిలకమ్మలు
వచ్చేసాయి! వచ్చేసాయి! //


2)అడవిలొ , సీతకు ఇచ్చిన కోకలు
ఇవే! ఇవే! " అని చూపిస్తూన్నవి
తమ రంగుల రెక్కలు ! //



3) "సభలో ద్రౌపది కొసగుట కొరకై
శ్రీ కృష్ణుడు మమ్మే పిలిచేనంటూ "
వన్నెల రెక్కల వయ్యరముల
గీర పోవుచూ, ఎగురు చున్నవి!
సింగారాల సీతా కోకలు:
నయగారాల సీతా కోక చిలకమ్మలు! //


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

a tri tris (ksm)

వెన్నపూసల దండలు

వెన్న పూసల దండలు ;;;;;
'''''''''''''''

(పల్లవి);;;
''''''

1)ఉట్టి మీద చట్టిలోన
వెన్న ఏమయ్యింది???
వేణు గాన లోలుడు,బాల కృష్ణుడు
"నక్కి ,నక్కి వచ్చాడు ;
నవనీతం మాయం!మాయం!


1) కుండలోని వెన్న కాస్త
మాయ మాయెనండీ!
ఇది,
మా చిలిపి" కన్న" గారడీ! //


2)గప్ చుప్ గా మటు మాయం !
కుంభంలో నవనీతం!
క్రిష్ణయ్య మేని నిండా వెలసినాయి
పూసలు -వెన్న పూసలు //

3)దారమేది లేకుండా
వైనంగా హారాలు
గుండ్రం "పూసల దండలు!"
వెన్న పూస దండలు
హైలెస్సా! ఓ లెస్సా! //

4)నవ రత్నాల్ ,మణి దండల
కాంతులనే: మించి మెరయు చున్నవీ!
నవ్యమైన మాలికలివి!
నవనీతపు: మిసి హారమ్ములు
గుండ్రంగా గుండ్రం గుండ్రంగా!


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

19, జనవరి 2009, సోమవారం

ay angliis (ksm)

విన్నపములు 3

1) లాహిరి ! లాహిరి! వీల పాటలను
వెదురు గడలకు నేర్పు నేర్పరి ;;;
పోకిరి వీడే "గీత "కు ఆమని !
మురళీ సుధలను ప్రజ లందరికీ
పంచి ఇచ్చిన జగన్మోహనుడు!
మన బాల కృష్ణుడు! //


2) గుడు గుడు గుంచపు గొల్ల పిల్లడే!
"పచ్చి కొట్టి , వ్రేపల్లెను విడిచి ,మరి ,
అల్లరి కన్నయ ద్వారక చేరెను !


మధురా నగరిని విడిచేనో?!
రాధిక నొంటరి చేసేనో?!
యశోద నొంటరి చేసేనో?! //


3) మోహన కృష్ణా!
పలికించుమయా !నీ వంశిని ఒక పరి!

ఆ యమున తరగలు నీ ఊసులను
మాకందించీ, మము సేద దీర్చునయ!



;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

విన్నపములు 2

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


విన్నపములు ---2 ;;;
''''''''''


1) అల్లరి పిల్లడు , ముద్దు గుమ్మడు ;;;
వ్రేపల్లియకు 'అల్లారు ముద్దు కదే!
గుజ్జన గూడుల ఆటల జోడీ!
వీడేనమ్మా! చిన్ని కృష్ణుడు ! //


2)పొడుపు కథలలో "ప్రశ్నార్థకమే!"
విడుపు కథలలో "సమాధానమే!"
కోలాటాల క్రీడల సందడి!
వీడేనమ్మా! చిన్ని కృష్ణుడు ! //



;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ముగ్గు

విన్నపములు 1

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

"ఆట పట్టు " (విన్నపములు) ;;;;;
'''''''''''''''''''''''''


మూటలు - కట్టును మాటలు ;;;
వీనుల కింపగు చిన్నారి పాటలు ;;;
కొంగున కట్టును కిల కిలలు!;;;
చెంగున ఎగురును ;;;
అమ్మ, కొంగును పట్టును ;;;
మా "కొంగు బంగారం " వీడేనమ్మా! ;;; //


(2) తేనెల పట్టుల తుమ్మెద వీడే! ;;;
ఆట పాటల పరుగుల లేడి! ;;;
ఆనందాలకు " ఆట పట్టు" కద! ;;; //


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ఆటపట్టు

1) ముద్దుల మూటలు - కట్టును మాటలు ;;;
వీనుల కింపగు చిన్నారి పాటలు ;;;
కొంగున కట్టును కిల కిలలు!;;;
చెంగున ఎగురును ;;
;అమ్మ, కొంగును పట్టును ;;;
మా "కొంగు బంగారం " వీడేనమ్మా! ;;; //


2) తేనెల పట్టుల తుమ్మెద వీడే! ;;;
ఆట పాటల పరుగుల లేడి! ;;;
ఆనందాలకు " ఆట పట్టు" కద! ;;; //

వనిత

18, జనవరి 2009, ఆదివారం

మామ కాని మామ

1 జాబిలి చాలా తపములు చేసెను ;;;
--- బాల పాపల నవ్వుల కోసము ! ;;;

(2) పిల్లల నడిగెను వరములు చంద్రుడు ;;;

"మీ నగవుల సొగసులు కొంచెం ఇమ్మ"ని. ;;;
అడిగిన తడవుగ ,ఆనక తాను ;;;
"తరిపి వెన్నెలల పాలను పొందెను!" ;;;


(3) ఎల్ల జగములకు 'మామ వౌదువ 'ని ;;;
పిల్లలందరూ వరముల నొసగిరి! ;;;
నాటి నుండియే చుక్క రేడు " ;;;
"చంద మామ " అను పేరును ;;;
ఇంచక్కా పొందినాడు. ;;;


మామ కాని మా'మ కదా ,;;;
లోకాలకు ,చల చల్లని వెలుగు నొసగు ;;;
చంద మామ ! గగనాలకు మిత్రుడు!




;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

పువ్వు

కరచాలనము

చుక్కలతో స్నేహము ;;;
''''''''''''''

!) తళుకు తళుకు చుక్కలు ;;;
- మిణుకు మిణుకు చుక్కలు ;;;
- మబ్బు గొడుగు లేసుకుని ;;;
= గొబ్బున ఇటు వచ్చినవి // -


2)చిటుకు చిటుకు చినుకులు ;;;
- చిటికెలేస్తు పిలిచాయి ;;;
- ఇంద్రధనుసు ఊయెలలు ;;;
- ఊగి ; దివికి వచ్చినవి ! //


- 3)మిణుగురులు వచ్చినవి ;;;
- ఆకు దొన్నెలను చేరెను ;;;
- పులుకు పులుకు పిట్టలన్ని ;;; - ----  
చేరినవి ;;; //



- 4) కిల కిల మను పాపాయి ;;; - -  
మిల మిలల కన్నులలో ;;;
-  
ఒదిగి పోయినవి ;;;; - - ---

కాలములకు మోదములను ;;; - - అలది,: "జగతి"కొసగినవి! ;;; - - - అందాలతొ ప్రకృతికి
నేస్తములను చేసినవి!


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

-
>>>>>>>>>>>>>

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>><<<<<<<<<<<< ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;'''''''''''' ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::////////////

మామిడి పిందెలు

నవ్వుల ముగ్గులు

;;;;;
రాస లీలల రాజ సభ ;;;;;; '''''''''''''''  
(పల్లవి) ;;;
''''''

ముగ్గులు వేసిన గుమ్మములోన ;;; [ [  
చిందులు వేయును ముద్దుల గుమ్మడు // -  

)"కన్నయ్యా! ఈ అల్లరి ఏలర? - 
- వల్ల మాలిన రభసలు చేతువు, ఎలాగ? - - అడ్డూ ఆపూ లేని తుంటరివి!" - 
అన్న యశోదకు బదులుగ కన్నయ 
, "నా - చిరు నగవులతో ,కొత్త ముగ్గులను - - తీగ పూవుల 'రంగ వల్లిక 'లు ;;; - తీర్చి దిద్దుతా నో అమ్మా!" -  
- అంటూ ,కృష్ణుడు  

"రభస"ను కాస్తా - "రాస లీల"ల "రా సభ" గాను తృటి కాలములో మార్చెను,ఔరా! - తరుణుల్లారా! తిలకించండి! - ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

నవ్వుల ముగ్గులు

;;;;; రాస లీలల రాజ సభ ;;;;;; ''''''''''''''' (పల్లవి) ;;; '''''' ముగ్గులు వేసిన గుమ్మములోన ;;; [ [ చిందులు వేయును ముద్దుల గుమ్మడు // - 1)"కన్నయ్యా! ఈ అల్లరి ఏలర? - - వల్ల మాలిన రభసలు చేతువు, ఎలాగ? - - అడ్డూ ఆపూ లేని తుంటరివి!" - - అన్న యశోదకు బదులుగ కన్నయ , "నా - చిరు నగవులతో ,కొత్త ముగ్గులను - - తీగ పూవుల 'రంగ వల్లిక 'లు ;;; - తీర్చి దిద్దుతా నో అమ్మా!" - - అంటూ ,కృష్ణుడు "రభస"ను కాస్తా - "రాస లీల"ల "రా సభ" గాను తృటి కాలములో మార్చెను,ఔరా! - తరుణుల్లారా! తిలకించండి! - ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

కుంకుమ భరిణలు




సంకురుమయ్యకు స్వాగతము ''''''''''''''''''''' 1)మలబరి చెట్లు,చీనాంబరములు::: పట్టు చీరల పట్టపు రాణులు::: హంగు,రంగుల ఆర్భాటములతొ ::: పేరంటాళ్ళు బయలు దేరిరి ::: 2)(అను పల్లవి);;; ''''''''''''''' స్వాతి చిప్పల కుంకుమ భరిణల ;;; పసుపు,కుంకుమలు నింపుదుమమ్మా!::: // 3) గొబ్బెమ్మలలో ముత్తెపు పువ్వులు ;;; సంకురుమయ్యకు స్వాగతము ! ;;; మకర సంక్రమణ శుభ వేళలలో వెల్లి విరిసినవి ఆనందములు! ;;; // 4) నింగిని తాకే సంతోషాలు వెల్లి విరిసిన సంబరమ్ములు ;;; ప్రతి హృదయానికి పులకిత హర్షం ;;; పండుగ వేడుక , మన వాడుకలు ;;; //

భరిణలు

సంకురుమయ్యకు స్వాగతము '''''''''''''''''''
1)మలబరి చెట్లు,చీనాంబరములు::: పట్టు చీరల పట్టపు రాణులు::: హంగు,రంగుల ఆర్భాటములతొ ::: పేరంటాళ్ళు బయలు దేరిరి ::: // 2)(అను పల్లవి);;; ''''''''''''''' స్వాతి చిప్పల కుంకుమ భరిణల ;;; పసుపు,కుంకుమలు నింపుదుమమ్మా!::: // 3) గొబ్బెమ్మలలో ముత్తెపు పువ్వులు ;;; సంకురుమయ్యకు స్వాగతము ! ;;; మకర సంక్రమణ శుభ వేళలలో వెల్లి విరిసినవి ఆనందములు! ;;; // 4) నింగిని తాకే సంతోషాలు వెల్లి విరిసిన సంబరమ్ములు ;;; ప్రతి హృదయానికి పులకిత హర్షం ;;; పండుగ వేడుక , మన వాడుకలు ;;; //

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

సుస్వాగతము




''''''''''''''''''''''''''''''' 1)మలబరి చెట్లు,చీనాంబరములు::: పట్టు చీరల పట్టపు రాణులు::: హంగు,రంగుల ఆర్భాటములతొ ::: పేరంటాళ్ళు బయలు దేరిరి ::: // 2)(అను పల్లవి);;; ''''''''''''''' స్వాతి చిప్పల కుంకుమ భరిణల ;;; పసుపు,కుంకుమలు నింపుదుమమ్మా!::: //

3) గొబ్బెమ్మలలో ముత్తెపు పువ్వులు ;;; సంకురుమయ్యకు స్వాగతము ! ;;; మకర సంక్రమణ శుభ వేళలలో వెల్లి విరిసినవి ఆనందములు! ;;; //

4) నింగిని తాకే సంతోషాలు వెల్లి విరిసిన సంబరమ్ములు ;;; ప్రతి హృదయానికి పులకిత హర్షం ;;; పండుగ వేడుక , మన వాడుకలు ;;; //

a trios invr (ksm)

వెన్నెల రథము

1)బాల నవ్వుల ముత్తెపు సరములు ;;;
కిల కిల నవ్వులు - నవ రత్నములు ;;;

2)పాపకు చంద్రుడు బంగారు!
అందుకె ఆయెను వెన్నెల తేరు ;;; //

3) కారు చీకటిని నింగిని సౌరు ;;;
నువు లేకుంటే జగతి బేజారు! ;;;

4) వెన్నెల రథమున ఊరేగుతు ,నువు
పున్నమి నాటికి రవయ్యా! ;;;

నీ స్వంతం గద! ఇక
పిల్లల కేరింతల హోరు,హుషారు! //


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

హంస

నాట్యము చేసీ నటరాజ

నాట్యము చేసే నటరాజా! ;;;
""""""""''''''''''''''''''''
1)వెండి కొండపై ఆది దంపతులు ;;;
బంగరు జగతికి తల్లి దండ్రులు ;;;
నంది చేతిలో రాగి దండము ;;;
ప్రమధ గణములు వాయించేరు ;;; //


2) ఇత్తడి ,సీసము -మురజలు ,చిడుతలు ;;;
శ్రీ శారదాంబ "కచ్ఛపి "వీణియ ;;;
నారద మౌనీ"మహతీ వీణ" ;;;
తుంబుర గానము సువర్ణ గీతము ;;; //

3) కోవెలలోన కంచు గంటలు ;;;
కాలి మువ్వల ,కడియము ,గాజుల ;;;
నవ రత్నములు ఘల్ ఘల్ మనగా ;;;
నాట్యము చేసే నట రాజా!
మా శత కోటి నమస్సులు
వందనములను స్వీకరించుమా! // ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

సంకురుమయ్యకు స్వాగతము

సంకురుమయ్యకు స్వాగతము '''''''''''''''''''


1)మలబరి చెట్లు,చీనాంబరములు::: పట్టు చీరల పట్టపు రాణులు::: హంగు,రంగుల ఆర్భాటములతొ ::: పేరంటాళ్ళు బయలు దేరిరి :::  
2)(అను పల్లవి);;; '''''''''''''''
స్వాతి చిప్పల కుంకుమ భరిణల ;;; పసుపు,కుంకుమలు నింపుదుమమ్మా! // 
3) గొబ్బెమ్మలలో ముత్తెపు పువ్వులు ;;; సంకురుమయ్యకు స్వాగతము ! ;;;  
మకర సంక్రమణ శుభ వేళలలో వెల్లి విరిసినవి ఆనందములు! ;;; //  
4)నింగిని తాకే సంతోషాలు వెల్లి విరిసిన సంబరమ్ములు ;;; ప్రతి హృదయానికి పులకిత హర్షం ;;;
పండుగ వేడుక,మన వాడుకలు ;;; //

17, జనవరి 2009, శనివారం

పండుగ! సంక్రాంతి పండుగ!

    పండుగ! సంక్రాంతి పండుగ! ''''''''''''''''''
(పల్లవి)'''''''' '''''' 1 పండుగ! పండుగ! సంకురాత్తిరి! ;;;
పసిడి పాత్రలు ఇవిగోనమ్మా! ;;;
పంచ భక్ష్య పరమాన్నములను ;;;
పులిహోరలను వండమ్మా! ;;; //  

2)కుంపటి పయిన గిన్నెను పెట్టి ;;;
బొగ్గుల కోసం భూమిని తవ్వగా ;;;
రత్నాల్ దొరికెను, రవ్వల మొగ్గా! ;;;  

3)గారెలు,బూరెలు,పిండి వంటలు ;;;
అమ్మ చేతిల్) గోరు ముద్దలు ;;;
సిసింద్రీల చిరు చిరు నవ్వులు ;;;
ముత్తెపు జల్లులు ,ఓ లమ్మీ! //

16, జనవరి 2009, శుక్రవారం

స్త్రీ

-సిరి వెన్నెల

(పల్లవి)
ఏడు కొండల స్వామి వెంకన్న!వెంకన్న! (అను పల్లవి) ఏడు గడ రక్ష రేకు - నీకు,నాకు,మనకున్నూ! ఈ మాట నిజమన్నా! ఔనన్నా! ఒట్టన్నా! // 1)కొండ కొమ్మున నెలవు -సిరి నాధుని కొలువు 'లంఘనమే' 'నడకాగా,-కాలి;నడకలే పరుగులుగా' లంఘనములై,పరుగులయీ- పద!పద!పద!బిరాన! అప్పుడు ... (కోరస్) -సిరి వెన్నెల మన-పదాల మెత్తలేగద!ఔనన్నా! //
2)తిరుమల కోవెల దాకా-నెలకొన్న పూల చెండ్లు శ్రీ కన్నయ్య అడుగులే! -స్వామి అడుగు జాడల సిరి "వెన్నెల 'లే" జల్లుల ' - పూతలే మెత్తలగును పద,పద,పద! బిరాన! // (కోరస్) ::: పల్లె జాన పదాల -నెత్తావులు పరచేను! తద్ధిమి ధిమి ,తద్ధిమి ధిమి!- కోలాటాలాడుతూ చిందులనే వేయుచూ - తిరుమల వాసుని కొలువుకు పద,పద,పద!బిరాన! //

13, జనవరి 2009, మంగళవారం

ముగ్గు


వెన్నెల గిన్నె

వెన్నెల గిన్నె ;;;

'''''''''''''''''''''''''''

१) నింగిని పున్నమి జాబిల్లి! ;;;

దిగిరా! దిగి రా! ;;;

నా చేతి అద్దాన ;;;

ఇంచక్క ఇముడూ! ;;;

2)బాల బాలికల నవ్వుల కాంతులు ;;;

తాయిలాలుగా దక్కును నీకే! ;;;

పాల వెన్నెలల సౌరుల జాబిలి! ;;;

నీదు వెన్నెలల "వెండి గిన్నెలో ;;;

పాపల కిల కిల ;;;

పరమాన్నాలు నింపుదమోయీ! ;;;

ఇటు ఈయవోయీ! ;;; వెన్నెల పాత్రను!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

12, జనవరి 2009, సోమవారం

हरिणक्शि (च म ,कसम)


ఇది ఏమి వింత!

ఇది ఏమి వింత!

;;;;;;;;;;;;;;

1) పుప్పొడులు చల్లుతూ - పచ్చికల దొర్లుతూ ;;;

గోపాలకులతో కూడి - గోవిందుడిటు వచ్చి ;;;

పిల్లం గ్రో వూదుతూ - అందరితొ ఆడేను ;;;

ఇది ఏమి వింత! ;;; 2

2)పద్మ నాభుడు తాను - పూల ;;;తనివార ఆడేను - బృందా వనములోన ;;;

ఇది ఏమి వింత! ;;;2

3) భూదేవి పతి యయ్యు - మన్ను తిని మై నలది ;;;

పచ్చికల దొర్లాడు - నిది ఏమి వింత! ;;;

4) సాందీపనీ ముని వర్యునీ - వద్ద బుద్ధిగా పాఠాలు ;;;

భట్టియము వేయు - నిది ఏమి వింత!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

अतिवा (कसम )


ఆడేద్దాము అల్లీ బిల్లీ!

ఆడేద్దాము అల్లీ బిల్లీ!

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

1)నాతో పాటు పాటలు పాడును ;;;

కుహు కుహు కోయిల నానేస్తం! ;;;

పని పాటులతో మునిగి తేలేటి ;;;

తేనెటీగయే నా కాదర్శం! ;;;

2)పోటీ పడుతూ - నాతో ఆడును ;;;

రంగు రంగుల సీతా కోక ;;;

మాటల పట్నంలోన - చిలకలు

మైనాలకు నే కథలను చెబుతా! ;;;

3)పరుగుల జింకలు - కిల కిల పిట్టలు ;;;

అమ్మా!నాన్నా! - పిన్నలు,పెద్దలు! ;;;

అందరు రండీ! - ప్రకృతి తోటీ ;;;

కలివిడిగానూ ఆడేద్దాము ;;; అల్లీ బిల్లీ!

4) చెమ్మ చెక్క - చేరెడు మొగ్గలు ;;;

అల్లీ బిల్లీ - గిల్లా దండ ;;;

దాగుడు మూతలు - దండా కోర్ !

అటుకులు చిటుకులు - కలిపిన చిటుకులు ;;;

5) అన్న దమ్ములను కలిపే ఆటలు ;;;

పొర పొచ్చాలను మరిపించే క్రీడలు ;;;

ఎల్ల లోకముల -నొక్క ఇల్లుగా-

చిటికెలొ మార్చే చక్కని ఆటలు ;;;

రండీ! రండీ! ఆడుదము!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

11, జనవరి 2009, ఆదివారం

aa,hari haaramu (ksm)

ఆహ్వానం

ఆహ్వానం  
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; 


1) కోకిల పాట ,కోమల గానం - కోటీ చైత్రాలకు ఆహ్వానం!
     మిణుగురు తళుకు - చుక్కల బెళుకు
             మిన్న్ను వెన్నెలకు ఆహ్వానం !  


2)పాపల పలుకులు - బాల హుషారు 
               కిల కిల జగతి - చాల హుషారు


3) తూర్పు ప్రభాతం - తొలి తొలి వేకువ
               ఎల్ల జనులకు - చైతన్యాలకు 
                    ఎల్లలు ఎరుగని నిండు హుషారు ,,,
                         మెలకువలకు - ఇదె ఆహ్వానం!


  "పారా హుషార్! పారా హుషార్ 
               పారా హుషార్! తాషా మరప్పా! " 

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; 

గోరింట

గోరింట
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;   

1)తపమెంతొ చేసినది గోరింట !
     తెలిసింది ఎల్లరికి
          సర్వదా "గోరింట"
                 బహు గొప్ప ఆరిందా!

2) పాపాయి "అఱ చేయి పూ దోట"లోన
         "ఎర్ర"గా పూసింది "పచ్చనీ" గోరింట !
  
3) పట్టులాంటి ఆకు 
          ( లకు )నిలువెల్ల పులకింత !
                పట్టుకుంటే చాలు!  చేతికీ గిలిగింత !
4) ఆ నాటి నుండిన్ని 
        అఱ చేతుల ; పొదరిళ్ళలోన 
                గోరింట రాగాలు
                    వైన వైనాలుగా
        వన్నె వన్నెలు తీర్చి, కొలువు చేసాయి !
   
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; 

బుంగ మూతి

బుంగ మూతి ;;;;
''''''''''''''''''''''''''''''''''''''
'''''''''''''''''''''''''''''''''''''' 
1) పలక , బలపం పట్టి ;;;
                  పరుగు పరుగున బడికి
                       వచ్చింది చిన్నారి! గారాల పట్టి !
                            బంగారు కూన మా చిట్టి పాపాయి !

2) పులుకు పులుకున తాను
              ఏవేవొ రాస్తుంది
                     ఉలుకు ఉలుకున చూసి
                             ఫోజులే కొడుతుంది 
                                    గొప్ప ఫోజులే కొడుతుంది                   //

3) తళుకు తళుకున నవ్వి
                 " శ్రీలు " చుట్టేస్తుంది;
                        "పిచ్చి గీతలు"అంటు
                 ఉత్తుత్తిగాను  మేమంటేను
                       అలిగి కూర్చుంటుంది ,
                                "బుంగ మూతి"ని పెట్టి !   

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;   

10, జనవరి 2009, శనివారం

aaTriMgs (ksm)

దిగి రావోయీ! జాబిల్లీ!

దిగి రావోయీ! జాబిల్లీ!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; 

1) చంద మామ ! చందమామ ! చంద మామా!
  ఎందు దాగి ఉన్నావు? చందమామా!

2) చిన్ని పాప మారాము చేసెనోయీ !
   అన్నమింత ముట్ట లేదు , చంద మామా!                 //


3)కారు మబ్బు దాగున్న చంద మామా!
  మా  పాపకు :::
          గోరు ముద్ద తినిపించగ వేగ రావోయీ !             //

4) ఆట బొమ్మ లంటేను వెగటేసేను
    నే  పాట పాడ :
          " విన"నంటూ హఠము చేసెను                      //

5)  అమా వాస్య మఠము" నుంది చంద మామా! 
    మా అమ్మాయి కొఱకు రావయ్యా! , హఠమును మాని!    //


::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

వెలుగుల నవ్వులు

వెలుగుల నవ్వులు ;;;;
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; 

1) బాల బాలికల 
             కిల కిల నవ్వులు
   ఆటల పాటల 
                  సందడి  హేలలు         //
2) ఆహ్లాదాల కావ్య హేలలు
                    తేనెల జల్లులు 
  ప్రకృతి అంతా నవ రస భరితం                       //



3) పిల్లల అల్లరి
               ఒసగిన వరములు
  పాల పుంతలు
           కొలిచిన   వరములు  

                        తొణికిస లాడిన దారులందున
                        మిల మిల తారలు నడిచినవి !           // 




'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''   

ఆకులు, పూవులు

 ఆకులు, పూవులు ;;;;
''''''''''''''''''''''''''''''''''''''''''''''
1)పలక మీద అచ్చులు
             పైడి మెరుపు పూవులు
వాన చినుకు హల్లులు
                     పుటల కొలను లందున 
పదములు, కావ్యమ్ముల
                     మిసిమి మిసిమి కలువలు     //


2) చదువు నేర్చు కుంటేను
                  చురుకు దనం కలుగుతుంది 
    అంధ విశ్వాసాలకు 
                  అడ్డు కట్ట పడుతుంది
  మూధ నమ్మకములకు 
                  ఇక మీదట ఆట కట్టు!              //  


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''   

లిపి -కోవెల

లిపి -కోవెల  ;;;;;;
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

1) బడిలోకి ,  
   అక్షరాల గుడిలోనికి  ;;;
 పలకలతో వచ్చాము :;;
                  చిన్నారి పిల్లలము !
                        చివు నవ్వు పూతలము !       // 
     రండి ! నేస్తాల్లారా !
                ఒక్క ఉదటున రండి !

2) ఆటలూ ఆడేము ! 
               పాటలూ నేర్చేము !
ఆట పాటల తోటి
         చదువులే చదివేము !                        //

3) అలకలన్నీ మాని
                    అక్క తమ్ముళ్ళార!
అత్త మామల్లార !
                       రారండి! రా రండి!               //

4) విద్యలలోసారమంత 
                     కొదవ లేకుండానే 
   ఆది మూలం నుండి 
                      చేయుదము అధ్యయనము          //


5) పెద్దలూ, పిన్నలూ అందరూ రండి !


                    "విద్యలకు తల్లిని" పూజించుదాము !                     //




;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;




 

వెన్నెల నాట్యాలు

వెన్నెల నాట్యాలు ;;;;;;;;;;;;;;
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

1)  చిగురాకులలో వెన్నెల విందులు ;;; 
    ఆటల పాటల అలజడి,సందడి  ;;;
ఆహా! ఓహో! ఆహాహా !  ;;;
నేడే ! నేడే ! నేడే                          //

2)విశాల నీడలు ,రంగ వేదికలు  ;;;          
వెన్నెల జాడల  నాట్య హేలలు ! ;;;
అవిగో! అవిగో! అవిగో !                          //

3)తరు ,పైరులతో , చరా చరములతో ;;;
వెన్నెల  అభినయ హంగామాలు;;;
కని ,కన్ని మురిసెను సర్వ ప్రకృతి;;;
ఇదిగో ! ఇదిగో ! ఇదిగో !                          // 

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

snail,plants (ksm)

అచ్చట,ముచ్చట (10)

అచ్చట,ముచ్చట (10)

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
1)విద్య అందరి సొత్తు ;;;

అందుకే చేయాలి ;;;

అక్షరాలతొ పొత్తు ;;;

అవనిలో అందరము! ;;; //


2)అలసటన్నది లేక,;;;

అక్షరాలను ;;;

" భావ , శిల్పాలు" చేద్దాము ;;;

కను విందు చేద్దాము //

3) అచ్చులన్నీ కాంతి రేఖలుగ మారాలి ;;;

హల్లులన్నీ 'శాంతి లేఖలు 'గ నవ్వాలి ;;;

విద్య మేఘము పైన ;;;

విజ్ఞాన వల్లరి :మెరిసేటి మెరుపులు //

9, జనవరి 2009, శుక్రవారం

చదువు ముందు ( 9 )

చదువు ముందు ( 9 )

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
1)నుడులకు బడలిక తగ్గాలి ;;;

"బరులకు" మత్తులు వీడాలి ;;;

అచ్చుల, హల్లుల జంట నడకలో ;;;

కథలకు కదలిక పుట్టాలి ! ;;;


2) ఏ - బీ-సీ -లను భట్టీ పట్టీ ;;;

గణితం ముక్కును పిండాలి ;;;

సైన్సుకు ఒద్దిక నేర్పాలి ;;;

శాస్త్రాలను దారికి తేవాలి ;;;
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

కస్తూరి నామములే వరములు ( 8 )

కస్తూరి నామములే వరములు ( 8 ) ;;;;;;;;;;;;;;;;;;;;;;;;
1)జంగిల్ లో ,పల్లెల్లో :::
అంత పెద్ద చెట్టు లెక్కి ;;;
నిక్కి,నిక్కి చూస్తావేం!?
ఉడుతా! చిరు ఉడుతా!//

2)బాదం చెట్టెక్కేసి,;;;
కొట్ట కొన కొమ్మల్లో ;;;
నక్కి,నక్కి ; నిక్కి,నిక్కి చూసేవు:
ఓ ఉడతా! :::
మిల మిల నీ చూపులను ;;;
మేం "చుక్కల"నుచు భ్రమిసేము!

3)నీ మూపునందు ముచ్చటైన ;;;
మూడు సొంపు గీతలు ;;;
శ్రీ రాములు ప్రేమ తోటి ;;;
వీపు నిమిరి, నీ కొసగిన ;;;
కస్తూరి నామ వరాలు అవి!

4)"మూడు చారలా?" ;;;
"కావ"వి!!! ;;;
నిష్కల్మష భక్తికి ;;;
"రామ రాజ్య రహ దారులు"!!! :::
బంగారు మల్లె పూ బాటలు!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

నెమలి ఈక (7)

నెమలి ఈక (7)

::::::::::::::::::


1) చిట్టి చిట్టి పాపాయికి :::

ఈక ఒకటి దొరికింది :::

చిట్టి తల్లి ఆ ఈకను :::

పట్టి ,పట్టి చూసింది


2)ఈకంటే ఈక కాదు :::

కన్నంటే "కన్ను" కాదు :::

అది , వేడుకైన నెమలి ఈక! :::

కడు వేడుకైన నెమలి కన్ను!


3) సిరి కన్నుల నింపేను :::

చిరు వన్నెలు చిందేను :::

వెన్నెలలో మెరిసేను ! :::

వెన్నెలనే మురిపించును :::

ఇంతింతని చెప్ప లేము ::

: ఔరౌరా! దీని సొగసు!!!

4)అలాంటిలాంటి ఈక ఐతే ::;

అలనాడు క్రిష్ణయ్య :::

ఎలా దీన్ని మెచ్చేనట!?!

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

జేజేలు

జేజేలు

'''''''''''''''''
1)బడి గంట మ్రోగింది

"బడి-గుడి" గంట మోగింది

పెను మత్తు దిగ దుడిచి

పరుగో! పరుగు!


2)పలక, బలపం పట్టి

మా గారాల పట్టి

విద్యల కోవెల వద్దకు

పరుగో! పరుగు!


3)'చెడును 'విస్మరించి:::

"మంచి" విస్తరించి :::

కృషితొ చేతులు కలిపి

ఎల్ల బాల , బాలికలు ;;;

మును ముందుకు సాగి పోవాలి!


4) "చదువుల తల్లి"కి సతతము :::

పిన్నలము,పెద్దలము

జేజేలను పలకాలి! :::

జోతలనొసంగాలి!
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

అమ్మ మెచ్చుకున్నది

అమ్మ మెచ్చుకున్నది !

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''
1)పసిడి అక్షరములకు

గుడులు,దీర్ఘాలిచ్చి

పదము బొమ్మల కొలువు

చేద్దాము,చేద్దాము।


2)మిసిమి భావాలన్ని

మాలగా కూర్చేసి

వరుస, వరుసగ రాసి

చదివేము!వ్రాసేము!
3)"ఇంత చదివేసేను!

మా చిన్ని బాబు! "అని

అమ్మ నన్నెంతెంతొ

మెచ్చుకుని ,తీరాలి!
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

7, జనవరి 2009, బుధవారం

new year 2009

మొగలి రేకులు

మొగలి రేకులు
'''''''''
1)తేట తేట తెలుగులోన
                      పాట పాడరే!
  పాట,పదములందు
           "పాప నవ్వు"మువ్వలే                                                         //


2)మొగలి రేకు మాటలన్ని - వెన్నెలల జాడలే!
             వరుసలు, వరుసలుగాను- పేర్చి కుట్టి
               దిష్టి తీయరే! - మెటిక లిరవరే!                                            //


3) భాష తోటలోన - వ్యాప్తి - రమ్య సుగంధం
           మల్లె,జాజి,గులాబీ - గీతికలై గుబాళించెను
                     మనసుల లోగిళ్ళన్నీ - ఘుమ ఘుమ లాడేను            //


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

అమ్మా!ఇపుడే వస్తా !

అమ్మా!ఇపుడే వస్తా !
'''''''''''''''

1)పిల్ల గాలి ఊసులన్ని
చిన్ని పూల బాసలన్ని
మనసు విప్పి చెబుతుంటే

ఇపుడే వస్తానమ్మా!
కొంచెం సేపు ఆగమ్మా! //

2) వన్నె వన్నె ఈకలను
చిన్ని రాళ్ళు,గవ్వలనూ
పోగు చేసుకుని నేను
ఇపుడే వస్తానుండమ్మా! //

3)గడ్డి పూల సొగసులన్ని
వెన్నెల కందిస్తాను
అలల నురుగు చిన్నెలను
ఇంద్ర ధనువులకు ఇపుడే
పరిచయాలు చేసొస్తా!
ఇపుడే వస్తాను !ఆగమ్మా! //

4) అందమైన ప్రకృతికి
బాల సారె పేరు పెట్టి
ఆనందపుఋతువులకు
ఆ-ఆ -లను దిద్దించి
అమ్మా! నే వస్తాగా!
తొందర చేస్తావేమి !?! //

5) బుల్లి బుల్లి పిట్టలకు
మాటలు నేర్పిస్తాను
చిరు జల్లుల వానలను
ఆటలు ఆడిస్తాను
అమ్మా!ఇపుడే వస్తా!
హడావుడి చేయొద్దు! //


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

అచ్చులు, హల్లులు నేస్తములు

అచ్చులు, హల్లులు నేస్తములు
''''''''''''''''''''''
1)అచ్చుల పందిరి గుంజలకు
హల్లుల పందిరి అల్లాము
చలువ:
పదముల పందిరి అల్లాము

2)హల్లులు, పొల్లులు
"హలో! హలో!"అని
పరస్పరమ్ము
పలకరించుకొనె ఆప్యాయముగా!

3)అచ్చుల అచ్చపు అందాలు
హల్లులు, పొల్లులు నేస్తాలైతే
హరి విల్లుల మాలలు అల్లేస్తాము
భావ సాహితికి సింగారములవి!


'''''''''''''''''''''''''''''''''''''

పాటల బాటలు

పాటల బాటలు
'''''''''''



అక్షరములు పాపాయితొ
ఆడాలి సరాగములు
రాగముల మురిపెముల
పాటలనే పాడాలి

పాట బాటలందున
వెలుగు గ్రుమ్మరించాలి
మన అడుగు జాడలకు
వెలుగులు 'నేస్తాలుగ మారాలి



******************************************

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...