29, జూన్ 2015, సోమవారం

అదిగో ద్వారక! ఆలమందలవిగో!

తిరుపతి వేంకటకవులు"అష్టావధానప్రక్రియ”కు ఆంధ్ర సారస్వత ఆస్థానమునందు రత్న పీఠమును నిర్మించి 
అందు ఆసీనను గావించిన పుంభావ సరస్వతులు.
చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వీరినిద్దరినీ “జతగా చేరి, జంటగా కవితా జననికి ఫాలమున కస్తూరి తిలకమును దిద్దించుటను” ప్రోత్సహించారు. 
చిత్రమేమిటంటే ఆ ఇద్దరు ఒకే ఊరివారు కారు. ఒకరిది ఆ నాడు ఫ్రెంచివారి ఆధీనంలో ఉన్న యానాం
ఇంకొకరిది భీమవరం వద్ద ఎండగండి అనే కుగ్రామము. 
ఈ కవిద్వయం ఆశుపద్యోక్తులలో అద్వితీయ ఛందోవిన్యాసాలను చేసారు, హాస్య దామినీ ఝటిత్ చమక్కులను మెరిపించారు. నాటకములకు వీరి పద్యములు ఆచంద్రతారార్కం నిలిచే ‘కొటేషన్ లుగా స్థిరపడినవి అంటే అతిశయోక్తి కాదు. 
దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి- తెనుగు అక్షర గోదావరీ దరిని విహరించే రీతిగా దోహదము చేసిన వ్యక్తి చర్లబ్రహ్మయ్యశాస్త్రి. ఆ కవిద్వయానికి కోమలమైన కవితల అల్లికలను నేర్పారు. 
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తొలుత “పద్య రచన, గోణము కట్టుట, పద్యాలను” చెప్పగలిగారు.
అటు తర్వాత చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తనకు కవితాప్రయాణములో జంటగా ఉండగలిగిన దివాకర్ల తిరుపతి శాస్త్రికి ఛందోబద్ధ పద్య, కావ్య రచనలను సాధన చేయించారు. 
కనుకనే “చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి నాకు గురుతుల్యులు” అని పేర్కొని, దివాకర్ల తిరుపతి శాస్త్రి, తన గురుస్థానములో చెళ్ళపిళ్ళ గారిని ఉంచుకుని, ఆరాధనా భావంతో మెలిగారు.
- - - - -

పౌరాణిక నాటకముల ప్రదర్శనలకై అనేక నాటకసంఘములూ, థియేటర్లు వెలిసినవి అంటే అప్పట్లో పౌరాణిక నాటకములు పట్టిన రాజ యోగము ఎంతటి శిఖరాగ్రాలను అధిరోహించినవో- వేరే చెప్పనవసరం లేదు.
అప్పుడే మూకీలు, తర్వాత టాకీలూ వచ్చినవి. ప్రదర్శనారంగములు సాహితీ అక్షయపాత్రలనుండి పౌరాణిక నాటకములు, ప్రాచీన ఇతిహాస, జానపద కథలు- సునాయాసంగా గైకొన్నవి.
- - - - -
“పాండవోద్యోగ విజయాలు” ప్రభావం సంఘంలో సహస్రకిరణతేజములైనవి. అప్పటిదాకా పండితుల జ్ఞానశాలలకు మాత్రమే పరిమితమైన పద్య, సంస్కృత భాషాపదసుధా వర్షధారలు విద్యాగంధం లేని పామరుల దోసిళ్ళలో కురిసింది. నిత్యజీవితంలో- వాడుకునే జాతీయాల ఓలె వీరి పద్దెములు మారినవి.
“అదిగో ద్వారక! ఆలమందలవిగో…”
“వచ్చినవాడు అర్జునుడు, అవశ్యము గెల్తుమనంగరాదు..”
“బావా! ఎప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ …………"
"బావా! ఎక్కడనుండి రాక ఇటకు? ఎల్లరున్ సుఖులే కదా?........."
“జెండాపై కపిరాజు ……”
“అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు……”
“అన్నమాట జవదాటని……”
ఇలాగ, ఒకటేమిటి? వీరి “శ్రీకృష్ణ రాయబార (పాండవోద్యోగ విజయములు; – పడక సీను)  ఒక్కమాటలో చెప్పాలంటే "సినిమాలకు లభించిన ఆదిబిక్ష వీరి నాటకరచనలు. 
సినిమాలకు మొదటి నటీనటులు, విదూషకులు సంభాషణలకూ, పాటలకూ, పద్య గాన, సంగీతబాణీలకూ 
శ్రీకారం చుట్టినవానిలో తిరుపతి వేంకట కవుల రచనలకు ప్రధమ తాంబూలం దక్కుతుంది.

"జంటకవులు" అనే పదానికి నిఘంటువులో చేర్చవలసిన పదమౌక్తికముగా మార్చినవారు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి. 
చర్ల బ్రహ్మయ్యశాస్త్రి శిష్యులైన తిరుపతి వేంకట కవులు రాయబారమునకు వెళ్ళిన కృష్ణుని సంభాషణలు ఇలాగే ఉంటాయి- అనిపించేలా వెదజల్లిన పన్నీటిఅత్తరు అక్షరముల గురుమూర్తులు.

- - - - -

తమ రచనలలో చిరంజీవులైన తిరుపతి వేంకటకవులు ఆశువుగా అనేక కవితలు చెప్పారు. అనేక అష్టావధానములు, శతావధానములు జరిగినవి. వీరి ప్రతి ప్రదర్శనా సభికులకు పదేపదే చెప్పుకునే మంచి సంఘటనలుగా మారుతూండేవి. ఒకసారి ఒక సాహితీ సభలో తటస్థ పడిన విశేషం ఇది!

- - - - -

కిమ్ కవీంద్ర ఘటా పంచానన:

తిరుపతి వేంకట కవులకి “కిమ్ కవీంద్ర ఘటా పంచానన “ అనే బిరుదు ఉన్నది. ఒక సమావేశములో అష్టావధానముప్రదర్శనలో ఒకతను వింత ప్రశ్నను, జవాబునూ సృజించాడు.
ప్రక్రియ:  దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం, అప్రస్తుతప్రసంగము (అడిగే వాడికి చెప్పే వాడు లోకువ- ఇక్కడ పృచ్ఛకుడు తమాషాప్రశ్నలు వేసి, అవధానీ ఖంగు తినిపించాలని ప్రయత్నిస్తూంటాడు), గంటల లెక్కను విని చెప్పుట, వ్యస్త అక్షరి, అనే 8 విభాగములు ఒండే సాహితీ క్రీడ. ఎనిమిది అంశములు కాస్త భేదములతో ఉంచి నిర్వహిస్తారు.

పృచ్ఛకుడు, రవంత గేలిచేస్తూ “కిమ్ కవీంద్ర ఘటా పంచానన”- అంటే. “ అంటూ అక్షరాక్షరాన్నీ విడగొట్టి, భావాన్ని చించేసి- ఒక కొత్త అర్ధాన్ని నిర్వచించాడు.

“కిమ్ కవీంద్ర= జల విహంగాలలో గొప్పవి ఐనట్టి: ఘటా = పెద్ద గుంపు; పంచ =బాగా వెడల్పు ఐన; అవననము = ముఖము కలిగిన: అనగా ఈ బిరుదార్ధమును “పెద్ద కొంగలు” అని వివరణను చెప్పుకోగలము.

“కిమ్ కవీంద్ర= జల విహంగాలలో గొప్పవి ఐనట్టి: ఘటా = పెద్ద గుంపు; పంచ =బాగా వెడల్పు ఐన; అవననము = వదనము (ఫచె) కలిగిన: అనగా ఈ బిరుదార్ధమును “పెద్ద కొంగలు” అని వివరణను చెప్పుకోగలము.” కాశీనాధుని వక్రభాష్యం విని సభికులు అవాక్కయ్యారు.

చెళ్ళపిళ్ళ చటుక్కున ఇలాగ అన్నారు “ యదార్ధవాక్కులు వీరివి. కాశీనాధులు గారు సెలవిచ్చినట్లు మా బిరుదుకు అర్ధం ‘ఘన బకములే!’ ఇక మరో అంశం సైతం మన నుడువులలో చోటు చేసుకోవడం సముచితము. అదేమిటనగా-కాశీనాధ నామధేయానికి కూడా విలక్షణత ఉన్నది. “కా” = నీళ్ళు; “అశి”= తిరుగాడునట: పదార్ధము ఏమనగా- ‘ పెద్ద చేపలు ’. అందుచేత ప్రస్తుత ప్రసంగమున వారి పాలిట పెద్ద కొంగలం మేమే!”

కిమ్ మత్స్యం గప్ చుప్! ఇక కాశీనాధులు కిమిన్నాస్తి.

- - - - -

{ఆచార్యులు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి - సెప్టెంబర్ 5 వ తేదీ 2013 న “టీచర్స్ డే” – ని పురస్కరింఛి )

***********************************************;

కిమ్ కవీంద్ర ఘటా పంచానన - కాశీనాధులు కిమిన్నాస్తి 
newaavakaaya  {LINK web patrika} :- 
 User Rating:  / 4 
Member Categories - ప్రముఖుల హాస్యం
Written by kusuma kumari
Monday, 23 September 2013 15:22
Hits: 652
***********************************************;

అఖిలవనిత
Pageview chart 31718 pageviews - 788 posts, last published on Jun 28, 2015

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 59169 pageviews - 1018 posts, last published on Jun 24, 2015 - 7 followers

Telugu Ratna Malika
Pageview chart 4430 pageviews - 127 posts, last published on Jun 22, 2015

24, జూన్ 2015, బుధవారం

వెయ్యినూటపదహార్లు

నా మానసపుత్రిక కోణమానిని బ్లాగు
పోస్టులు 1016 పూర్తి ఐనవి.
అక్షరాలా వెయ్యిన్నూటపదహార్లు ; 
నా మాతృభాష తెలుగు పట్ల ఆపేక్ష, 
నా వ్యాస, గీతాది రచనలతో 
ఈ సాహితీ లతలను ఎగబ్రాకేలా చేసినవి.

గూగుల్ వంటి ఇంటర్ నెట్ వారు కల్పించిన సదుపాయాలు, 
లేఖిని వంటి  ఉపకరణాలు, ఇందుకు ప్రోద్బలములైనవి. 
కూడలి, బ్లాగిల్లు, జల్లెడ, మాలిక ;  
నా రచనలను ప్రచురించి, ప్రోత్సహిస్తున్న వెబ్ పత్రికలు-
న్యూఆవకాయ, పుస్తకం. నెట్, జాబిల్లి, కిడ్స్ ఫర్ కిడ్స్.ఇన్ 

మున్నగు పత్రికలకు కృతజ్ఞతా పుష్పాంజలి. 

ఇక చాలని అనుకోకుండా, ఇకపై చాలించాలని చతికిలపడకుండా - 
వీలైతే మళ్ళీ కొత్త బ్లాగు ద్వారా 
ఈ సాహితీ ఆరాధనను కొనసాగించాలని నా తలపు. 

అంతర్జాల ఆంధ్రభాష పరిపుష్ఠి గాంచుటకు వెబ్ పత్రికలు,   
అగ్రెగేటర్లు, విజ్ఞాన సంధాయినులు ఎందరి నిష్కామకృషి ఉన్నదో కదా!
చదువరులకు, సాహితీ అభిమానులకు, యావత్ సారస్వత బంధు మిత్రులకు, 
నన్ను అడుగడుగునా ప్రోత్సహిస్తూన్న నా కుటుంబసభ్యులకు ధన్యవాదాలతో - 
ఏప్రిల్ 2015 చైత్రమాసం, -  
                 కాదంబరి / కుసుమాంబ (1955) 

===================================












naa maanasaputrika kONamaanini blaagu
pOsTulu 1016 puurti ainawi.
aksharaalaa weyyinnuuTapadahaarlu ; 
naa maatRBAsha telugu paTla aapEksha, 
naa wyaasa, giitaadi rachanalatO 
naa saahitii latalanu egabraakElaa chEsinawi.
guugul wamTi imTar neT waaru kalpimchina sadupaayaalu, 
lEKini wamTi  upakaraNAlu, imduku prOdbalamulainawi. 

kuuDali, blaagillu, jalleDa, maalika ;  
naa rachanalanu prachurimchi, prOtsahistunna web patrikalu-

nyuuaawakaaya, pustakam. neT, jaabilli, kiDs phar kiDs.in munnagu   patrikalaku kRtaj~natA pushpaamjali.

ika chaalani anukOkumDA, ikapai chaalimchaalani chatikilapaDakumDA - wiilaitE maLLI kotta blaagu dwaaraa ii saahitii aaraadhananu konasaagimchaalani naa talapu. 
amtarjaala aamdhrabhaasha paripushThi gaamchuTaku web patrikalu,   agregETarlu, wij~naana samdhaayinulu emdari nishkaamakRshi unnadO kadaa!
chaduwarulaku, saahitii abhimaanulaku, 
yaawat saaraswata bamdhu mitrulaku, nannu aDugaDugunaa prOtsahistuunna naa kuTumbasabhyulaku dhanyawaadaalatO - 
Epril 2015 chaitramaasam, - 
             kaadambari / kusumaamba (1955) 

ఈశ్వర లింగములు ఎన్ని రీతులు?


శివ లింగములు 32 రకములు :- 
1. గంధ లింగము =  four parts of sandal paste, three parts of kumkumam and two parts of musk ; 
2. పుష్ప లింగము ; 
3. గోశక్రు లింగము = గోధుమ రంగు ఆవు/ 
కపిల ధేనువు యొక్క   పేడతో చేసిన లింగము :
4. వాలుకా లింగము :- మెత్తని ఇసుక/; 
             విద్యాధరులు పూజించు గొప్ప ఉనికి; 
5. యవ గోధుమ శాలిజ లింగము ; 
6. శిత ఖండ లింగము = శర్కర / చక్కెర;
7. లవణ లింగము = (salt mixed with the powder of Hartal -  and Trikatukala); 
8. తిలపిష్ఠ లింగము ; 
9. భస్మ లింగము ; 
10. గుడా లింగము = బెల్లం / శర్కర ; 
11. వంశాంకుర లింగము = వెదురు ఆకులు ; 
12. పిష్ఠ లింగము = బియ్యప్పిండి
13. దధి దుగ్ధ లింగము = 
       నీళ్ళు వడకట్టిన పెరుగు,పెరుగు, పాలు ; 
14. ఫల లింగము =  పండ్లు ; 
15.ధాత్రీ లింగము = రాచ ఉసిరిక ; 
      (acid fruit – phyllanthus Emblica and bestows liberation) 
16. నవనీత లింగము = వెన్న ; 
17. దూర్వాకదజ లింగము / గరిక లింగము = 
(kind of grass – agrostis linaries) ; 
18.  కర్పూర లింగము ; 
19. అయస్కాంత లింగము ; 
20. మౌక్తిక లింగము ; 
21. సువర్ణ లింగము ;  
22. రజత లింగము ; 
23. పిట్ఠల లింగము/ కాంస్య లింగము = 
(an alloy of brass and bell metal ) 
24. త్రపు లింగము (తగరము లింగము) ; 
25. ఆయస లింగము = మైలతుత్తం/ (vitroil of sulphate); 
26. సీస లింగము = lead ; 
27. అష్టధాతు లింగము = minerals 
28. అష్టలోహ లింగము = metals 
29. స్ఫటిక లింగము = crystal 
30. పాదర లింగము (పాదరము = mercury) ; 
31. వైఢూర్య లింగము = lapis ;    
32. ధాన్య లింగము ; 
ఇవీ మహాదేవుని 32 విధములైన లింగములు 
 ===============================================

Siwa limgamulu 32 rakamulu :- 

1. gamdha limgamu ; 2. pushpa limgamu ; 3. gOSakru limgamu ;
4. vaalukaa limgamu ; 5. yawa gOdhuma SAlija limgamu ; 6. Sita khamDa limgamu ;
7. lawaNa limgamu ; 8. tilaka pishTha limgamu ; 9 bhasma limgamu ; 10. guDA limgamu ; 11. wamSAmkura limgamu ; 12. pishTha 
limgamu ; 
13. dadhi dugdha limgamu ;  14. phala limgamu ; 15.dhaatrii limgamu ; 16. nawaniita limgamu ; 17.
duurwaakadaja limgamu / garika limgamu ; 18.  karpuura limgamu ; 
19. ayaskaamta limgamu ; 20. mauktika limgamu ; 21. suwarNa 
limgamu ;  
22. rajata limgamu ; 23. piTThala limgamu/ kaamsya limgamu ; 24. trapu limgamu 
 25. aayasa limgamu  ; 26. siisa 
limgamu ; 27. ashTadhAtu limgamu ; 
28. ashTalOha limgamu ; 29. phaTika limgamu ; 
30. paadara limgamu ; 31. 
dhaanya limgamu ; 32. 
dhaat
r
i ;  
         iwii mahaadEwuni 32 widhamulaina limgamulu :- 

 ****************************,

అఖిలవనిత
Pageview chart 31567 pageviews - 786 posts, last published on Jun 16, 2015

కోణమానిని తెలుగు ప్రపంచం ;  59275 
Pageview chart 58930 pageviews - 1017 posts, last published on May 2, 2015 - 7 followers 

Telugu Ratna Malika
Pageview chart 4414 pageviews - 127 posts, last published on Jun 22, 2015


ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...