29, మార్చి 2010, సోమవారం

ముళ్ళమూడు సాంప్రదాయము

















నవ రాత్రి కీర్తనలు :::::
______________

1.దేవి జగజ్జనని – శంకరాభరణం – ఆది
2.పాహి మాం శ్రీ వాగీశ్వరి – కల్యాణి – ఆది
3.దేవి పావనే – సావేరి – ఆది
4.భారతి మామవ – తోడి – ఆది
5.జనని మామవ – భైరవి – త్రిపుట
6.సరోరుహాసనజాయే – పంతువరాళి – ఆది
7.జనని పాహి – షుద్ధ సావేరి – త్రిపుట
8.పాహి జనని – నాటకురంజి – త్రిపుట
9.పాహి పర్వత నందిని – ఆరభి – ఆది

"ముళ్ళమూడు సాంప్రదాయము"(Mullamudu tradition) కేరళ లో నెలకొన్న అపురూప సంగీత సాంప్రదాయము. లలిత కళా పోషకులు, స్వయంగా కీర్తనలను రచించిన మహారాజా స్వాతి తిరుణాళ్ ఆస్థాన రీతిగా ఈ స్వర విధానము పరిఢవిల్లినది.

మహారాజు స్వాతి తిరునాళ్ రాజ కవి. ఆయన గొప్ప సంగీత రస పిపాసి. పద్మనాభ స్వామి కోవెల వద్ద "పాలక్కాడ్ పరమేశ్వర భాగవతార్" (Palakkad Paramesvara Bhagavatar ) భక్తి పరవశులై గానం చేస్తూన్నాడు. తిరునాళ్ ప్రభువు ఆ గళ మాధుర్యమునకు మంత్ర ముగ్ధులైనారు. తక్షణమే ఆతనికి తన రాజాస్థాన గాయక పదవిని ఇచ్చారు.

రాజమహల్ దగ్గరలోనే "ముళ్ళమూడు"లో ఆ గాయకునికి గృహం కట్టించి ఇచ్చారు.పరమేశ్వర భాగవతార్ ఆనువంశీకులు ఉత్సవములు, నవరాత్రులు పర్వ దినములలో - స్వాతి తిరుణాళ్ చక్రవర్తి కీర్తనలను పాడసాగారు. అప్పటి నుండీ వారు నెలకొల్పిన గాన ఆచారమే "ముళ్ళమూడు సాంప్రదాయము"(Mullamudu tradition ) అని పేరొందినది.

ఈనాడు అతి కొద్దిమంది, వేళ్ళపై లెక్కించేటంత మంది మాత్రమే ఈ గాన సాంప్రదాయంను అనుసరిస్తూ కొనసాగుతూన్నారు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&

స్వాతి తిరుణాళ్ కృతి ;;; పాహి పర్వతనందిని

_________________________________

పాహి పర్వత నందిని

రాగం: ఆరభి

29 ధీర శంకరాభరణం; జన్య

A: S R2 M1 P D2 S

av: S N3 D2 P M1 G3 R2 S

తాళం: ఆది

కంపోజర్: స్వాతి తిరుణాళ్ ;

భాష ; సంన్స్కృతం ;

%%%%%%%%%%%%%%%%%%%%%


(పల్లవి) ::::::::

________

పాహి పర్వత నందిని! మా మయి పార్వణేందు సమ వదనే ||పాహి ||

(అనుపల్లవి) :::::::::

వాహినీ తట నివాసిని కేసరి-వాహనే దితిజాళి వితరణే ||పాహి ||

[చరణం - 1 ];;;;;

జంభ వైరి ముఖనతే కరి-కుంభ భీవా కుశ వినతే వర-

శంభు లలాట విలోచన పావక-సంభవే సమధిక వసనే ||పాహి||

చరణం 2 ;;;;;;;;;

---------------

కంజ దళ నిభ లోచనే మధు-మంజుతర మృదు భాషణే మద-

కుంజర నాయక మృదు గతి మంజిమ-భంజనా చణ మందర గమనే ||పాహి||

(చరణం 3 ) :::::::

_______

చంచ దళి లలితాంగే తిల-కాంచిద శశి ధర కలానికే నట-

వంచినృపాలక వంశ శుభోదయ - సంచయైక కృతి సతత గుణ్నికే ||పాహి||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

svaati tiruNAL kRti ;;; paahi parvatanandini

________________________________________

paahi parvata nandini

raagam: aarabi

29 dheera SankaraabharaNam; janya

A: S R2 M1 P D2 S

av: S N3 D2 P M1 G3 R2 S #

taaLam: aadi

kaMpOjar: swaati tiruNaaL ;

bhaasha ; saMnskRtam ;

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

(pallavi) ::::::::

_____________

pAhi parvata nandini! mA mayi pArvaNEndu sama vadanE ||pAhi ||

(anupallavi) :::::::::

vAhinI taTa nivAsini kEsari-vAhanE ditijALi vitaraNE ||pAhi ||

[charaNam - 1 ];;;;;

jambha vairi mukhanatE kari-kumbha bhIvA kuSa vinatE vara-

Sambhu lalATa vilOcana pAvaka-sambhavE samadhika vasanE ||pAhi||

charaNam 2 ;;;;;;;;;

---------------

kanja daLa nibha lOcanE madhu-manjutara mRdu bhAshaNE mada-

kunjara nAyaka mRdu gati manjima-bhanjanA caNa mandara gamanE ||pAhi||

(caraNam 3 ) :::::::

_______

canca daLi lalitAngE tila-kAncida SaSi dhara kalAnikE naTa-

vancinRpAlaka vaMSa SubhOdaya - sancayaika kRti satata guNnikE ||pAhi||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Share My Feelings

ముళ్ళమూడు సాంప్రదాయము

By kadambari piduri, Mar 9 2010 6:07AM
Share

20, మార్చి 2010, శనివారం

తోమని పళ్ళాల వాడు















వేడు కుందామా
వేంకట గిరి వేంకటేశ్వరుని ||

ఆపద మ్రొక్కుల వాడే
ఆది దేవుడే వాడు
తోమని పళ్యాల వాడే
దురిత దూరుడే ||

వడ్డి కాసుల వాడే
వనజ నాభుడే
పుట్టు – గొడ్రాండ్రకు
బిడ్డలిచ్చే గోవిందుడే ||

ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు,అలమేల్మంగా వేంకటాద్రి నాథుడే ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

This is a melodious ' sankirtana '
Written by " annamacharya " )

ఈ అన్నమాచార్యుల కీర్తనలో “ తోమని పళ్ళాల వాడు ”
( తోమని పళ్యాల వాడే )అని సంబోధనను పరిశీలన చేస్తారా?

ఆచ్చ తెనుగు మాటలతో తిరుమల గిరి శ్రీనివాసునికి
కొంగ్రొత్త పేర్లను పెట్టి, వివిధ నామ ధేయాలతో
స్వామిని నోరారా పిలిచే చనువును సంపాదించుకున్నట్టి
భక్తాగ్రేసర కవి మన అన్నమయ్య అని ఘంటా పథంగా చెప్పుకో వచ్చును.

ఫ్రాచీన కాలంలో 'మట్టి పాత్రలను'
వంట చేయడానికి ప్రజలు వాడే వారు.

కురవత్తి నంబి శ్రీ తిరుమలేశుని అనురాగముతో సేవలు చేసే వాడు.
వాత్సల్య భక్తితో సేవించే కురవతి నంబి వృత్తి రీత్యా “ కుమ్మరి వాడు”.
కుంభ కారుడైవ నంబి ఆహార, భక్ష్యాదులను
కుండలలో వండి ఆ పదార్ధాలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించు కునే వాడు.

ఇదే ఆనవాయితీ
ఆ తర్వాత చాలా సంవత్సరముల పాటు కొన సాగింది.
దేవళములోని సిబ్బంది
“ మట్టి పాత్రలలో వంట చేసి తయారు చేసిన భోజన,ప్రసాదాదులను”
భక్తులకు ఇచ్చే వారు.

ఆ నైవేద్య ప్రసాదములను,
వారు ఒక పగిలిన కుండ పెంకులలో పెట్టి ఇచ్చేవారు.
నేటికీ వేంకట రమణునికి
ఇదే పద్ధతిలో తిను బండారములను అర్పిస్తూనే ఉన్నారు.

“ పాల మీగడలు , గడ్డ పెరుగులు " కల బోసి , తీయని భక్ష్యమును చేస్తారు.
ఈ మధుర పదార్ధమునకు “ మాత్ర “ అని పేరు.

ఫ్రతి రోజు “ కుల శేఖర పడి “ లో నుండి వెళ్ళి , గర్భ గుడిలో ఈ మాత్ర
పదార్ధమును నైవేద్యముగా సమర్పిస్తూన్నారు.
అలాగ మట్టి పాత్రలోనే శ్రీ నాథునికి
“ మాత్ర మధు ఆహారమును”
ఒసగుతున్నారు.
ఆ తర్వాత ఆ మృణ్మయ పాత్రలను పగల గొట్టేస్తారు.

పిమ్మట , మళ్ళీ ప్రసాదానికి
తప్పనిసరిగా కొత్త మృణ్మయ పాత్రనే వాడ వలసి వస్తుంది కదా!

అదే లోహ పళ్ళెరములు అయితే - మళ్ళీ తోమి,శుభ్ర పరచి, వాడే వారు.
మిత్తి కుండలు అవడము వలన - పగల గొట్టేస్తారు ,
కావున, శుభ్రం చేసే అవసరం లేదు కదా!
కాబట్టే, సంకీర్తనాచార్యుడు “ తోమని పళ్యాల వాడు ... '
అంటూ ముచ్చటగా పిలుస్తూ, ముచ్చటించాడు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Telusaa!

తోమని పళ్ళాల వాడు

By kadambari piduri, Mar 12 2010 8:47PM

12, మార్చి 2010, శుక్రవారం

జంధ్యాల - విప్రనారాయణ









                                    ;  చిన్న బాలుడు “విప్ర నారాయణ” సినిమాను చూసాడు.
అప్పటి నుంచీ ”నేను విప్ర నారాయణుడ్ని చూడాలి,
చూపించండి.” అంటూ ఎప్పుడూ అడగసాగాడు.

పిల్ల వాని ముచ్చట కోరికను అందరూ గుర్తుంచుకున్నారు
సమయమూ, సందర్భమూ కలిసి వచ్చాయి.

భక్తి పాత్రలకూ పెట్టింది పేరు అతడు ;
త్రాగు బోతు పాత్రలకు పర్యాయ పదమైనట్టి
" దేవ దాసు "గా అవతారమెత్తి నాగేశ్వర రావు
తెలుగు నాట అగణిత ప్రేక్షకులకు ఆరాధ్య దైవమే అయినాడు.
ఒక షూటింగు జరుగుతూన్నది "అని తెలిసింది.
ఇంకేం! అందరూ అక్కడికి హుషారుగా చేరు కున్నారు.
అక్కడ స్టూడియోలో కొన్ని సీనులను చిత్రీకరిస్తున్నారు.
ఆ సీనులలో అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్నాడు.
ఆ అబ్బాయిని అతని బంధువులు తీసుకుని వచ్చారు .

“ఇతనేరా నీ విప్ర నారాయణుడు; చూడరా చంటీ!” అన్నారు.

అప్పుడు నాగేశ్వర్రావు ప్యాంటు, షర్టు ధరించి ఉన్నారు.
ఫిల్లవాడి హృదయంలో
అలనాడు తాను చూసిన యతి రూపమే ముద్రితమై ఉన్నది.
“అరే! నామాలూ, పిలక లేవేంటీ!?” ఆశ్చర్యపడ్తూ అడిగేశాడు.

' తనను భక్తుని రూపంలో కన్నులారా చూడాలనే '
అతని తహ తహకూ, ఉత్సుకతకూ
హీరో నాగేశ్వర రావుకు ఎంతో ముచ్చట వేసింది.
వెంటనే ఎత్తుకుని, చాలా సేపు తన ఒళ్ళోనే కూర్చో బెట్టేసుకున్నారు.
“మీకు ఇబ్బందిగా ఉంటూన్నదేమో?” అని వాళ్ళు ఫీలౌతూ అన సాగారు.

“ఫర్వాలేదండీ.” అంటూ ఆ అబ్బాయిని హత్తుకుని కూర్చో బెట్టుకున్నారు ఏఎన్నార్ గారు.
........................
ఆ చిన్నవాడే “జంధ్యాల”.
తరువాతి కాలంలో జంధ్యాల “అమర జీవి” సినిమా తీసారు.
అందులో ‘విప్రనారాయణ' ఘట్టాలను అంతర్నాటికగా ఉంచి,
తన తీపి జ్ఞాపకములను సినీ ఆల్బం లో నిక్షిప్త పరుచుకో గలిగారు జంధ్యాల.

యాదృచ్ఛికంగా జరిగిన ఈ ఘటన అపురూపమైనది కదూ!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

జంధ్యాల అన్నీ తానే ఐ , తీసిన తెలుగు చిత్రము " అమర జీవి ".
ఆ సినిమాలో ఉన్న పాట ఇది. 
*************************************

( పల్లవి )

మల్లె పూల మా రాణికి బంతి పూల పారాణి
మల్లె పూల మా రాణికి బంతి పూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..
కోకిలమ్మ పాట కచేరి !

మల్లె పూల మా రాణికి బంతి పూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..
కోకిలమ్మ పాట కచేరి !

( చరణము ) ;

పొగడపూలైనా..
పొగిడే అందాలే..
మురిసే మలి సంజె వేళలో
మల్లీ మందారం ..
పిల్లకి సింగారం ..
చేసే మధు మాస వేళలో
నా రాగమే నీ ఆరాధనై..
చిరంజీవిగా జీవించనా

Happy Birthday to you !

మల్లెపూల మా రాణికి బంతి పూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..
కోకిలమ్మ పాటకచేరి !

( చరణము ) ;

రెల్లు చేలల్లో..
రేయీ వేళల్లో..
కురిసే వెన్నెల్ల నవ్వుతో

పుట్టే సూరీడు..
బొట్టే ఐనాడు.. ;
మురిసే ముత్తైదు శోభతో

నీ సౌభాగ్యమే నా సంగీతమై..
ఈ జన్మకీ జీవించనా

Happy Birthday to you!

మల్లె పూల మా రాణికి బంతి పూల పారాణి

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

ఈ గీతమును ఈ బ్లాగ్ లో చదవండి

అమరజీవి (1983 విడుదల ; )

సంగీతం: చక్రవర్తి ( rajan nagendra ??? )
సాహిత్యం: వేటూరి
గానం: బాలు

" amarajiivi " ( 1983 viDudala )
music by Rajan- Nagendran ,
Amarajeevi - is a Telugu film directed by Jandhyala.
Starring : Akkineni Nageshwara Rao , Jayapradha,
Pandhari bai.
Music composed by Rajan- Nagendra ,
Starring: Akkineni Nageshwara Rao , Jayaprada , Pandari bai
Producer:Director: Story:Screenplay:
and also Dialogues: Jandhyala
Music Director: Rajan- Nagendra

Singers: S .P . Balasubramaniam and
p. Suseela

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Chitravalokanam

జంధ్యాల-విప్రనారాయణ

By kadambari piduri, Feb 25 2010 6:52PM

**************************************************

5, మార్చి 2010, శుక్రవారం

కమ్మని స్వప్నాలకు భరోసా





















కుందేలమ్మ! కుందేలమ్మా!
నువు – బాల, పెద్దలకు ఇస్తావా?
కమ్మని కలల భరోసా!

2.వాతావరణం కాలుష్యం
ఓజోన్ పొరలకు తూటు – బిలం
ప్రకృతిలోన బీభత్సం కలుగునంటగా,ఇదేం ఖర్మం ?

3.జాబిలి ఒడిలో నువు చేరి
వెన్నెలమ్మకు ధైర్యం చెప్పు!
రవంత ధైర్యం నువు ఇస్తేను
పృధ్వికి హరితం దరహాసం!

ప్రజలందరు నిను పొగడెదరమ్మా,
“నీ చొరవతొ విశ్వము కల కాలం
కళ కళ లాడుతు మన గలుగునని!”


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


See many wonder ful moving pictures + poetry !


కమ్మని స్వప్నాలకు భరోసా

By kadambari piduri, Jan 23 2010 7:52AM

చంద్రలేఖ ( Chandra Lekha - cinema )

















1948లో విడుదలైన అద్భుత చిత్రం "చంద్రలేఖ".
S.S.Vasan నిర్వహణలో రూపొందినది ఈ చంద్రలేఖ.

నిర్మాతలు చేతికి ఎముక లేదు అన్న చందంగా,
ఖర్చుకు వెనుదీయక నిర్మించి,
భారతీయ సినీ ప్రపంచమునకు అందించినట్టి అమూల్య మకుటము ఇది.
అప్పట్లో 30 లక్షల రూపాయిలను వెచ్చించారు
అంటే నేడు 28 కోట్లతో సమానమైన విలువ అది.

ఈ సినిమాలోఎమ్.ఆర్. రాధా హీరో. (M.R. Radha )
రంజన్ ప్రతినాయకుడు. ( Ranjan , tamil actor in ' chandra lekha ' )

సామాన్య యువతి చుట్టూ తిరిగిన ప్రేమ కథను,
దేశభక్తితో మిళితం చేసి, ప్రేక్షకులకు అందించారు.

"Helen of Troy" నాటక కథలో
గుర్రము బొమ్మలలో దాగివ,చ్చి దాడి చేసిన సైనికుల సంఘటనను
ఇందులో మరోవిధంగా అనుకరించారు.

చంద్రలేఖలో "Drum dance"
సినిమా చరిత్రకు రిఫరెన్సుగా నిలిచిన మహత్తర చిత్రీకరణ !
జయభేరీలలో భటులు దాక్కుని వస్తారు.
ఈ క్లైమాక్సు సీనును చూసి తీరవలసినదే,
కానీ వర్ణించనలవి కాదనే చెప్పాలి.

609 ప్రింట్లు తో, హిందీలోనూ, ( Gemini pictures )
తమిళ భాషలోనూ జెమినీ పిక్చర్సు బ్యానరు
ఏకకాలంలో రిలీజ్ చేసిన గొప్ప సినీ రికార్డు అది.

చంద్రలేఖ చలన చిత్ర విజయముతో
కథానాయకి టి.ఆర్.రాజకుమారి అగ్ర నటి స్థాయికి చేరినది


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Chitravalokanam

చంద్రలేఖ

By kadambari piduri, Jan 4 2010 10:12PM

3, మార్చి 2010, బుధవారం

బ్రిటీషు తీరు ( 1911 lO )























Barrie “ అండమాను జైలుకు అధికారి.”
" రూలంటే రూలేమరి. ”రూల్సును స్ట్రిక్టుగా ఫాలో అయ్యె రకం మనిషి.

స్వాతంత్ర్యము కోసం పోరాటం సలిపిన వేలాది మంది
అండమాను దీవుల జైళ్ళలో మగ్గుతూ ఉండే వారు.

వీరసావర్కారు సోదరులు కూడా ఆ చెరసాలకు చేర్చ బడ్డారు.
తాత్యారావు, బాబారావులు వీరసావర్కారు యొక్క అన్న దమ్ములు.

తాత్యారావు బారిష్టరు చదువుకై ఇంగ్లండు వెళ్ళడానికి బొంబాయి హార్బరులో నిలుచున్నాడు.
అంతకు మునుపు నుండే తాత్యారావు
భారతమాత శృంఖలాలను తెగగొట్టే కార్యక్రమాలలో పాల్గొని ఉన్నాడు.
అందువలన, మాటు వేసిన బ్రిటీషు పోలీసులు ఆతనిని బంధించారు.

అలాగే బొంబాయ్ ఓడ రేవులో
1906 సంవత్సరములో ఆ సోదరులు విడిపోవాల్సి వచ్చింది.

అటు పిమ్మట 1911 సంవత్సరంలో
తాత్యారావు తన తమ్ముణ్ణి అండమాను జైలు బార్రక్సు లో చూసాడు.

ముప్పిరిగొన్న ఆనందంతో “ తాత్యా! నువ్వేనా ఇక్కడ? ఇక్కడికి ఎలా వచ్చావు?”
అన్నయ్య జవాబు ఇచ్చేలోగానే, పోలీసులు అతడిని బరబరా ఈడ్చుకుని వెళ్ళారు.

బాబారావు ఒక ఉత్తరాన్ని రహస్యంగా రాసి, అష్టకష్టాల మీద పంప గలిగాడు.
కానీ, ఆ లేఖకు సమాధానం రాసి, సోదరునికి పంప లేక పోయాడు.

*********************************************

సెల్యులరు జైలు గదులలో సకల యాతనలను అనుభవిస్తూ ఉండే వాళ్ళు.
ఆ ఖైదీలకు బయటి ప్రపంచంతో సంబంధాలు మృగ్యము.
ఒక రోజు నాల్గవ అంతస్థులోనికి ఒక పెద్ద నాగ సర్పము వచ్చింది.
అందరిలో కంగారు, ఒకటే అలజడీ.
బాబారావు (అసలు పేరు గణేష్ బాబు) ఏ మాత్రం ఆలస్యం చేయకుండా,
ఆ వాచ్ టవరును ఎక్కేశాడు. అక్కడి పామును చంపాడు.
అందరూ గణేష్ బాబును మెచ్చుకున్నారు;

“మన బాబా పామును మట్టు బెట్టాడు.” అంటూ barrie బార్రికి చెప్పారు.
‘పై అధికారి బాబా రావును మెచ్చుకుని, ఆతని జైలు శిక్షను తగ్గిస్తాడు.”
అని ఆశించారు.

కానీ విచిత్రంగా , మిష్టర్ బ్యారీకి పట్ట నలవి కానంత కోపం వచ్చింది.
“వాచ్ టవరు మీదికి, మీ గదులను విడిచి రాకూడదు;
కాబట్టి నీ పనిష్మెంటును విధిస్తున్నాను.”
అంటూ శిక్షా కాలాన్ని మరింత పెంచాడు,
యావన్మందీ విస్తుబోయేలా !!!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Share My Feelings

బ్రిటీషు తీరు ;

By kadambari piduri, Dec 28 2009 1:55PM

1, మార్చి 2010, సోమవారం

వారణాసిలో మహాత్మా గాంధి


















దేవళములను శుభ్రంగా ఉంచాలి. అలాగే భక్తులు, ఆలయ సిబ్బంది కూడా పరిశుభ్రతను పాటించాలి.
కోవెలల ధర్మకర్తలకు, అధికారులకు ఇందు నిమిత్తమై ఖచ్చితంగా ప్రత్యేక ఆసక్తి కలిగి ఉండాలి.
అక్కడి పరిసరాలు కళకళలాడుతూ ఉంటేనే, వచ్చిన వారికి మనశ్శాంతి లభ్యమౌతుంది. లేకున్నచో ప్రశాంతతను కొరకు గుడికి వచ్చిన ప్రజల హృదయాలు వికలమౌతాయి.

గాంధీజీ ఆత్మకథలో తనకు తటస్థపడిన ఇలాటి అనుభవాన్ని రాశారు. 1891 లో బొంబాయిలో బారిష్టరుగా ఉన్న రోజులలో ప్రార్ధనా సమాజ్ హాలులో "ఫిల్గ్రిమగె తొ ఖషి" అనే అంశముతో ఉపన్యసించారు. ఆ తర్వాత దైవమును దర్శించుకోవడానికై, ఒక పర్యాయం కాశీకి వెళ్ళారు. స్టేషన్ లో దిగగానే "పండాలు" (పురోహితులు) చుట్టుముట్టారు.
వారిలో శుచిగా శుభ్రంగా కనిపించిన ఒక బ్రాహ్మణునితో,
ఆతని గృహానికి గాంధీ వెళ్ళారు.
"గంగా స్నానానంతరమే నేను భోజనం చేస్తాను." అని చెప్పారు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.
"రూపాయి పావలా మాత్రమే ఇవ్వగలను; అందుకు తగ్గట్లే పూజా పునస్కారాల ఏర్పాట్లు చేయండి." అంటూ, తన స్థోమతను గూర్చి వక్కాణించారు.
" తీర్థ యాత్రికులు భాగ్యవంతులైనా, బీదవాళ్ళైనా మేము కార్యాలను ఒకేలాగ చేస్తాము. చేసే క్రతువులో భేదం ఉండదు. యాత్రికుల శక్తిని బట్టీ, బుద్ధిని బట్టీ, వాళ్ళకు తోచినంత దక్షిణ ఇస్తూంటారు. అంతే!" అన్నాడు పండా.
మధ్యాహ్నం 12 గంటల వరకూ క్రియా విధులను, ఆసాంతం చక్కగా నిర్వర్తింపజేసాడు పండా.
గంగా నది దగ్గరి నుండి కాశీ పురిలోని కాశీ అన్నపూర్ణా దేవిని, విశ్వేశ్వర స్వామి వార్లను దర్శించుకోవాలని బయలు దేరాడు గాంధీ.

సన్నటి ఇరుకు సందు, పాచి పట్టి జర్రు బుర్రుగా ఉన్న దారి!
ఈగలు ముసురుతూ, మురికి మయంగా ఉన్న వాతావరణమూ;
"జ్ఞాన వాపి"( " well of knowledge ")వద్ద అపరిశుభ్రతకు నిలయంగా ఉన్నది.
గాంధీజీకి తాను బొంబాయిలో పవిత్ర భక్తి భావనలతో ఇచ్చిన లెక్చరు గుర్తుకు వచ్చి, మనస్సు కలుక్కుమన్నది.
గాంధీ అక్కడ ఒక పైసాను వేసారు;
ఆ బావి దగ్గర ఉన్న వేరే పండాకు చాలా ఆగ్రహం వచ్చింది.
"నువ్వు లోభివి, నరకానికి పోతావు" అని అరిచాడు.

గాంధీజీ నిగ్రహంతో "మహరాజ్! నా నొసట రాసి ఉన్నదేదో అదే జరుగుతుంది. కానీ మీ వంటి సత్పురుషుల నోట రావలసిన మాటలు కావు ఇవి. కావలిస్తే తీసుకోండి, లేకుంటే ఫరవా లేదు లెండి."

"వెళ్ళు! నీ దమ్మిడీ అక్కర్లేదులే!"

గాంధీ కిందపడిన ఆ పైసాని తీసుకుని నడవసాగారు.

ఆ రోజులలో దమ్మిడీలు, కాణీలు ఎంతో ద్రవ్య విలువను కలిగి ఉన్నాయి. పండాకు విడువ బుద్ధికాక, వెనుకనే వచ్చి అన్నాడు;
"ఆ ఇటు ఇవ్వండి! నేను గ్రహించకున్నచో, మీకు పాపం చుట్టు కుంటుంది" అంటూ, పైసాను తీసుకున్నాడు.

జాతి పిత మహాత్మా గాంధీజీ తన "ఆత్మ కథ "మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ " లో తన ఫీలింగ్సును విపులముగా చెప్పారు.
"ఆ తర్వాత రెండు సార్లు కాశీకి వెళ్ళి వచ్చాను, కానీ ఆనాటికి "మహాత్ముడు"గా ప్రజలలో గుర్తింపు పొందాను. ఇక నన్ను చూడవచ్చే జనులకు దర్శనం ఇవ్వడానికే ప్రొద్దు సరిపోయేది కాదు. మహాత్మునికి కలిగే ఇబ్బందులు తతిమ్మా వారికి బోధపడతాయా?!"
అంటూ తన అనుభవాల పరంపరలను రచనలో పొందుపరిచారు జాతిపిత మహాత్మా గాంధీ.
(The Story of My Experiments with Truth (Gujarātī "સત્યના પ્રયોગો અથવા આત્મકથા") is the autobiography of Mohandas Karamchand Gandhi )

"100 Most Important Spiritual Books of the 20th Century" అని HarperCollins publishers బాపూజీ రచన ఐన " సత్యముతో నా ప్రయోగములు" ని ప్రశంసించారు

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


Share My Feelings

వారణాసిలో మహాత్మా గాంధి ;

By kadambari piduri, Feb 18 2010 9:37AM

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...