అక్షరమ్ము పవిత్ర దేవాలయంబు
లక్షలాదిగ భావమ్ము లలరు నందు
అక్షరమ్మెల్ల విద్యల కాశ్ర యంబు
దానికిని సాటి కానమీధరణి యందు.
ఊహలును జీవ కోటికి ఉండునెన్నొ
మూగ జీవులే అన్నియు పుడమి నందు
ధ్వనికి రూపమ్ము నొసగును మనిషి యొకడె
వెలువరించినప్పుడె వాని విలువ గలదు.
అక్షర మొక దేవాలయ మ్మరయగాను
మనసు లందలి
కలలు,కల్పనల కెలమి
నదియె స్వాగత ద్వారము
ఆశ లెల్ల వెలుగు చూడగ,
సర్వ విద్యలకు గూడ.
జీవి మనసున కదలాడు భావములకు
స్థిరముగా నుండు పీట మేర్పరచు కొరకు
సాధనలు చేసి కను గొన్న సత్ఫలమ్ము
అదియె, రూపొంది, ఉదయించె నక్షరముగ.
భాష, "లిపి" యను అరదము పైన నెక్కి
ముదము లొప్పార సంచారములును చేసె
వసుధ యందలి కోట్లాది వాక్కులకును
"ధ్వని", "లిపు"లె మూల కారణాధారమయ్యె.
ఆశలును, అభిలాషలు, ఆశయములు
కల్పితమ్మక్షరము నందె
కావ్యములకు, గాధలకును,చరితలకు,
కథల వాస్త వముల చిత్రించు వాక్య దేవాలయమ్ము.
సవ్వడికి మారు బింబమౌ "శక్తి" నీవు
అణువు రూపిణి వయ్యారె!
అంతులేని ధరణి పరమాద్భుతమ్ముల
అక్షరమ్ము పవిత్ర దేవాలయంబు
లక్షలాదిగ భావమ్ము లలరు నందు
అక్షరమ్మెల్ల విద్యల కాశ్ర యంబు
దానికిని సాటి కానమీధరణి యందు.
ఊహలును జీవ కోటికి ఉండునెన్నొ
మూగ జీవులే అన్నియు పుడమి నందు
ధ్వనికి రూపమ్ము నొసగును మనిషి యొకడె
వెలువరించినప్పుడె వాని విలువ గలదు.
అక్షర మొక దేవాలయ మ్మరయగాను
మనసు లందలి కలలు,కల్పనల కెలమి
నదియె స్వాగత ద్వారము
ఆశ లెల్ల వెలుగు చూడగ,
సర్వ విద్యలకు గూడ.
జీవి మనసున కదలాడు భావములకు
స్థిరముగా నుండు పీట మేర్పరచు కొరకు
సాధనలు చేసి కను గొన్న సత్ఫలమ్ము
అదియె, రూపొంది, ఉదయించె నక్షరముగ.
భాష, "లిపి" యను అరదము పైన నెక్కి ముదము లొప్పార సంచారములును చేసె
వసుధ యందలి కోట్లాది వాక్కులకును "ధ్వని", "లిపు"లె మూల కారణాధారమయ్యె.
ఆశలును, అభిలాషలు, ఆశయములు కల్పితమ్మక్షరము నందె
కావ్యములకు, గాధలకును,చరితలకు,కథల వాస్త వముల చిత్రించు వాక్య దేవాలయమ్ము.
సవ్వడికి మారు బింబమౌ "శక్తి" నీవు అణువు రూపిణి
వయ్యారె! అంతులేని ధరణి పరమాద్భుతమ్ముల నెరపగలవు
అందు కొనుమమ్మ! జోతల అక్షరమ్మ!
ఓసి కలమ!నీకు మహిమ ఉన్నదెంతొ
నీవు లేకున్న తెల తెల్ల బోవు చుండు
ఎంత తెల్లని కాగిత మేని అవని .
వచ్చితివి మౌనముగ, మాదు భాగ్య మనగ .
View Comments(2) Post a Comment
నెరపగలవు అందు కొనుమమ్మ! జోతల అక్షరమ్మ! ఓసి కలమ!నీకు మహిమ ఉన్నదెంతొ నీవు లేకున్న తెల తెల్ల బోవు చుండు ఎంత తెల్లని కాగిత మేని అవని . వచ్చితివి మౌనముగ, మాదు భాగ్య మనగ .
View Comments(2) Post a Comment
1, అక్టోబర్ 2008, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి