28, నవంబర్ 2010, ఆదివారం

ఆవులు ,“హయమార్” అనే మూలిక,















హైదరాబాద్ నివాసి ఫర్హతుల్లా బేగ్ నిర్మాణతలో
రూపుదిద్దుకున్న డాక్యుమెంటరీ సినిమా
"Mad Cow; Sacred Cow".
ఫర్హతుల్లా బేగ్ ఈ వెండితెర రూపకల్పన కోసం ఎంతో శ్రమించారు.
ఈ సినిమా నిర్మాణమునకు అప్పట్లో సంచలనం కలిగించిన ఒక వార్త -
పాశ్చాత్య దేశాలలో లక్షలాది ఆవులు ,
మనిషి చేసిన తప్పిదానికి బలి అయినాయి .
భారత దేశములో సంఖ్యా పరంగా ఎక్కువగా ఉన్న ఆవుల వలన
వాతావరణ కాలుష్యం జరుగుతూన్నదనే దుష్ప్రచారం జరుగుతూన్నది.
ఇందులోని సామంజస్యతను పరిశీలన చేయ వలసి ఉన్నది.
ఇది ఎంత వరకూ సబబు? అనే ప్రశ్నకు
అనేక అంశాలు అందరి అవగాహనకై ఉన్నవి.

విదేశాలలో పాడి తగ్గినప్పుడు,
ఆవులకు “ఆక్సిటోసిడ్” అనే హోర్మోన్ ను ఇస్తున్నారు.
ఇలాంటి ఇంజెక్షన్ ల వలన, గోవులకూ ,
తన్మూలమున మనుష్యులకూ ఆరోగ్య సమస్యలు ఎదురు అగుతున్నవి.
సంకర జాతి ఆవులకు అనేకములకు గంగ డోలు ఉండవు.
ఎక్కువ వేడిని తట్టుకో లేవు.
మాంసమును కలిపిన కృతిమ దాణాను
వాళ్ళు బలవంతంగా తినిపిస్తూ,
కొత్త గో జాతిని ఉత్పత్తి చేయ సాగారు;
అందువలన 'mad coe desease విపరీత పరిణామాలు
ప్రపంచానికి కలిగిన చేదు అనుభవమే!

***********************************

మన India లో దేశ వాళీ ఆవులకు “గో మాత”గా గౌరవం లభించడానికి కారణం
వాటి ద్వారా మానవ జాతికి కలుగుతూన్న ఎన్నో ఉపకారాలు కారణము.
వాటికి మూపురములు, గంగడోలులు ప్రత్యేకత.
దేశీయ ధేనువులలో మూత్రము –
నాలుగు సార్లు వాని దేహములో ఫిల్టర్ అగును,
అలా వడపోతల తర్వాత వాని మూత్రము బయటకు విడుదల చేస్తాయి.
కనుకనే “పంచ గవ్య ఔషధములలో –
గో మూత్రము సైతము వాడ బడుతూన్నది.
కారడవులలో అనేక రకాల తరువులు ఉంటాయి, కొన్ని హానికరమైనవి.
ఆవులు మాత్రమే వాటిని తిని, నిరపాయకరంగా మార్చుకుని,జీర్ణము చేసుకోగలవు.
“హయమార్” అనే మూలికను తినగానే, గుర్రము విగత జీవి అగుతుంది ,
దీన్ని మేకలు , కోతులు వంటి జంతువులు కూడా ముట్టుకోవు..
కానీ హయమర్ (గన్నేరు ;ఆంగ్లం Oleander) ని
ఆవులు భేషుగ్గా భుజిస్తాయి.

SYNONYMS -
Sansk. : Divyapushpa, satakumbha,

Asvamaraka, Hayamara.
Assam. : Diflee, Sammulhimar
Beng. : Karbbe, Karbee
Eng. : Sweet-Scented
Oleander
Guj. : Kaner
Hindi. : Kaner
Kan. : Kanagilu, Kharjahar, Kanigale, Kanagile
Kash. : --
Mal. : Kanaveeram
Mar. : Kanher
Ori. : --
Punj. : Kanir
Tam. : Sevvarali, Arali
Tel. : Kastooripatte, Errugumeru
Urdu. : Kaner
************************************************
గంగ డోళ్ళు, మూపురములు – విశిష్టతలను చేకూర్చుతున్నాయి.
ఆమ వాతానికి నిశ్చయమైన మందు:--
ఆవు శరీరంలో “ సూర్య నాడి” కలదు.
సూర్య నాడి - Sun Rays నుండి శక్తిని సేకరిస్తుంది;
ఆ సంచయనము ద్వారా – 3 రోటిడ్ – అనే ఎంజైం ఉత్పత్తి జరుగును.
ఈ లేత పసుపు రంగు పదార్ధము ఆరోగ్య ప్రదాయిని.
Anti Biotecs దుష్ప్రభావాన్ని -
గోమూత్ర ఆర్క్ 2 నుండి 80 రెట్లు తగ్గిస్తుంది.
1 స్పూన్ ఆవు నెయ్యి ,హోమం ద్వారా –
1000 సి సి ల ఆక్సిజన్ ను ప్రభవిల్ల జేస్తున్నది.
“యజ్ఞోపతి” ద్వారా జగత్తుకు కలిగే మేలు గురించి
శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తునారు.
విదర్భ లో పుసద్ అనే ఊరు ఉన్నది.
అక్కడ నివసిస్తూన్న “పండరీ పాండే”
40 సంవత్సరాల నుండి అనేక ప్రయోగాలు చేస్తూన్నాడు.
అతను – ఒక కిలో గ్రాము ఆవు పేడతో
= 40 కిలోల ఎరువు తయారౌతుందని నిరూపించాడు.
ఒకసారి పొలములో ఈ గోవు కంపోస్టును వేస్తే –
మళ్ళీ 3 ఏళ్ళు వఱకూ , ఎరువులను వేసే అవసరం ఉండదు.
అందు వలన ఎంతో రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గుతుంది.

***********************************************

మధురా పురినీ, ద్వారకనూ , ప్రజలనూ బ్రోచిన మహనీయుడు
శ్రీ కృష్ణుడు ఆల మందల నిర్వహణలో మేటి,
గోపాల బాలుని గా అందరి చేత మన్ననలు పొంది,
పూజలు అందుకుంటూన్నాడు కదా!
దిలీప చక్రవర్తి, జమదగ్ని, సత్య కామ జాబాలి ,గౌతమ ఋషి ,
మున్నగు వారు అనేక వ్యక్తులు ప్రాచీన కాలం నుండీ
మన భారత దేశంలో ధేను సంరక్షణ కు పునాదులు వేసి,
విశిష్ట ఆచారాన్ని నెలకొల్పారు.
మారిషస్, మలేషియా ఇత్యాది (ఆసియా ఖండము)
అనేక దేశాలలో గో మాతకు సమంజసమైన ప్రాధాన్యం కలదు.

27, నవంబర్ 2010, శనివారం

చంద్రముఖి/ నాగ వల్లి


























ఈ మధ్య నేను టెలివిజన్ లో ఒక సినిమాను చూశాను.
కాస్సేపటికి అర్ధమైంది :
శోభన కథా నాయికగా ఉన్న ఆ మళయాళ మూవీ "చంద్ర ముఖి" కి మూల కథ - అని.
సరే! మళ్ళీ ఈ నడుమ - "నాగ ల్లి" సినీ నిర్మాణం,
హీరో వెంకటేశ్ యొక్క ఊత పదము,
రజనీ కాంత్ "లక లకలూ" - హడావుడీ చేస్తూంటే.......
ఇదిగో ఇలాగ నా భావాలను వ్యాస రూపంలో
చదువరులకు విన్నవించుకుంటున్నా నన్న మాట!

“Innekku Durgashtami...unne naan konnu...”అనే డైలాగు హిట్.
” Vidamatte??” అంటూ రంకెలు వేసే శోభన నటన
– నేషనల్ అవార్డును సాధించింది.

1993 లో మలయాళ భాషలో వచ్చింది “మణి చిత్ర థాజు” చిత్రం .
"Tharavadu" mansionఅనగా – ప్రాచీన భవంతి.
(Tharavadu (means ancestoral house) లో
అడుగిడిన వారి అనుభవాల మాలికయే ఈ సినిమా.
కేరళలో విజయ భేరీ మోగించి, వరుసగా దక్షిణ భారతీయ భాషలలో నిర్మితమైనది.
బెంగాలీ, హిందీ లాంగ్వేజీలలో కూడా సినీ నిర్మాణం జరిగినదీ –
అంటే ఈ story అందరినీ ఎంతగా ఆకర్షించిందో బోధ పడుతూంది.
కన్నడంలో “ఆప్త మిత్ర”లో సౌందర్య నటన ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నది.
12 కోట్లు గడించిన కలెక్షన్ రికార్డులు – కన్నడ భాషా చిత్రం _ “ఆప్త మిత్ర”.
ఇందులో సౌందర్య, విష్ణు వర్ధన్ ల నటన చిర స్థాయిగా నిలిచింది.

naga valli (telugu movie,venkatesh
apta mitra( kannada film) ಆಪ್ತಮಿತ್ರ
- saundarya, vishnu vardhan
mani chitra tal(malayala cinema) - shobhana, mohan lal
'Manichitrathazhu' മണിച്ചിത്രത്താഴ് (The Ornate Lock)
The award winning 'Manichitrathazhu' (1993) by Fazil.
2005 beMgaalI chalana chitramu ; raaj mohal
Prasenjit Chatterjee, Abhishek Chatterjee
Bhool Bhulaiyaa (Hindi: भूल भुलैया, 2007] - vidyabalan, akshaya kumar

26, నవంబర్ 2010, శుక్రవారం

వనితలు (1)
















గిరిజన కళ లాగా వేద్దామని ప్రయత్నించాను.
(నేను కంప్యూటర్ తెర పై వేసిన బొమ్మలు - 1 )

( వనితలు (1) )

25, నవంబర్ 2010, గురువారం

అబ్రకదబ్ర abrakadabra అబ్రకదబ్ర















అబ్రక దబ్ర అనే పదం magic world లో
ఊత పదంగా అమిత ప్రచారంలోనికి వచ్చినది.
2004 లో abraka dabra అనే హిందీ సినిమా వచ్చింది.
ఇందులో దేశ ముదురు - ఇత్యాది మూవీలలో
హీరోయిన్ ఐన "హంసిక" - బాల నటిగా ఉన్నది. ప్రభు దేవా కూడా అబ్రక దబ్ర .
La bola cristal ........ (alaska ) ఇత్యాది vedio albums కూడా
శ్రోతలు కం- ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇంగ్లీష్ లో ఈ పదాన్ని ఫొటొలో చూపినట్లుగా - అక్షరాన్ని వదుల్తూ,
వరుసగా రాసి చదివి చూడండి.అనేక తమాషాలు సాక్షాత్కరిస్తున్నాయి కదూ!
(ఈ మాటని త్రికోణాకారంలో వచ్చే పద్ధతిలో రాసిన రేకును
మెడలో తాయెత్తు లాగా వేస్తే ఆరోగ్యదాయకం - అని
ప్రాచీన కాలంలో యూరోపు దేశాలలో ప్రజలు నమ్మేవారు.)
See the photo!
కుడి వైపు - అంటే పచ్చ రంగులో) భాగాన్ని పరిశీలించండి.
క్రింద నుండీ -
నిలువుగా -
అడ్డంగా -
ఇలాగ అన్ని కోణాలలో చదివి చూడండి- తమాషా మీకే అర్థం ఔతుంది.

ఇంకో మాజిక్ ఏమిటంటే ఈ maagic Word ని
కంప్యూటర్ పరి భాష - key board మీద TYPE చేస్తున్నాము కదా;
అటు ENGLISH Language లోనూ, ఇటు తెలుగు లోనూ ఒకే టైపు తో ....
ఒకే రీతిగా స్క్రీన్ మీద అవతారం దాల్చాయి
abrakadabra -> అబ్రకదబ్ర

23, నవంబర్ 2010, మంగళవారం

ఎక్కిరాల వేద వ్యాస experiments "Ramala sastra"
















“భయ భంజన శర్మ” విరచితమైన
“రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట
వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది.

ఈ ప్రాచీన జ్యోతిష్య,ప్రశ్న శాస్త్రమును చదివి,
వానిని నమ్మక, - “యవ్వన గర్వముతో” ప్రయోగములు చేయుచున్న దశలో,
తనకు జీవితంలో ఎదురైన సంఘటనలను చెప్పారు.

1. “ప్రశ్న అడిగే వాడే ప్రశ్న ఫలితమును చెప్ప రాదు.”
కనుక వీరు ఒక ఏర్పాటును చేసుకొనిరి.
వేద వ్యాస అన్నయ్య “ఎక్కిరాల కృష్ణమాచార్య”తో
సంయుక్తంగా పరిశీలన చేయ పూనుకున్నారు.

2.ఇందు మూలముగా వారిరువురు చేసుకున్న ఏర్పాటు ఇది;
వేద వ్యాస తాను అనుకున్న ప్రశ్నను,
గ్రంధంలో వర్ణించ బడిన విధముగా గవ్వలను వేశారు:
తన అన్న కృష్ణకు కూడ చెప్పరాదు;
సహోదరుడు ఆ గవ్వలను లెక్కించి,
పరిశీలించి, (పేజీ 250) ఆ పుస్తకములో తెలిపిన ఫలితాన్ని చదివి చెప్పాలి.”
ఇదీ వారి ప్రణాళిక.

మక్ఖేశ్వరుడు ఐన పరమేశుని భక్తితో ధ్యానించి,"
16 గవ్వలను (sixteen) గల గలలాడించి ,
కలిపి, ఒక్కసారి కింద వదిలి పెట్టాలి.
“ప్రశ్నించిన వ్యక్తి నడి యవ్వన వయసులో ఉన్న
విద్యా వంతుడు, విద్యా బోధకుడు( lecturer)
22 లోపు వయస్సు, లలిత కళలలో ప్రవీణ్యత కలిగిన వాడు.....”
అంటూ ఉన్న : అనేక అంశములూ ,
విపులీకరించిన సర్వ లక్షణాలూ సరిగ్గా సరిపోయినాయి.

వేద వ్యాస “ ఏకాగ్రతతో ప్రశ్నను సంకల్పించి,
దోసిటిని నుదుటికి ఆనించాడు.
గవ్వలను ఒకేసారి కింద వెదజల్లాడు!!!
సోదరుడు క్రిష్ణ ఆ గవ్వలను లెక్కించాడు.
ఆ ఫలితాన్ని లెక్కించి, దాని ఫల భాగాన్ని (risult)ను సూచించే
ఒక గుర్తు( symbol) తీసాడు;
దానికి ఎదురుగా ఉన్న పుటలోని ఫలితాంశాన్ని తీసి, ఇలా చదివాడు.
3.దోసిట్లో గవ్వలను ఉంచుకోవాలి.
మదిలోని Question ను పైకి చెప్పకుండానే,
”నా మదిలోని సందేహానికి ఏం జరుగుతుంది?”
అనుకుంటూనే, ధ్యానము చేయాలి ;

“ మక్ఖేశ్వరుడు ఐన పరమేశుని భక్తితో ధ్యానించి,
16 గవ్వలను (sixteen) గల గలలాడించి
కలిపి, ఒక్కసారి కింద వదిలి పెట్టాలి.
“ఈ ప్రశ్నకు “గురు శుక్రులు” ప్రశ్నాధిపతులుగా వచ్చినారు.
ఫలితాంశము ఈ విధంగా ఉన్నది _
వివాహము మూడు వారములలోగా జరుగును.
గురువారము నాడు పెండ్లి జరుగును.
పెళ్ళి కుమార్తె స్వగ్రామము ఒక నదీ తీరము;
పిల్ల తండ్రి విద్యతో జీవనము చేసి, ముసలి వాడై,
ఉద్యోగ విరామం చేసిన వ్యక్తిగా ఉంటాడు పిల్ల తండ్రి!
పెద్ద ముక్కు, బట్ట తల, బొంగురుగా అరుస్తున్నట్లు
మాట్లాడే కంఠ స్వరము!
ఇంటి వెనుకనే నదీ ప్రవాహము _ సమీపంలో మసీదు . ..........
ఆ గృహస్థుకు ..... రెండవ భార్యకు కలిగిన సంతానము ఈ వధువు .
ఆ వంశములో ఎవరికీ ఇంత వరకూ వివాహము కాలేదు!
ఇదే ఆ ఇంటిలోని మొదటి వివాహము!”
భార్య (= పెళ్ళి కుమార్తె) సంగీత విద్యాభిరుచి కలది,
క్షణ కోపము, మాట తొందర, మంచి మనసు సుందర రూపము కలది;
వివాహము శుక్ర వారము జరుగును. ఇది ప్రశ్న ఫలితము!”
అప్పటి దాకా వ్యాసకు 52 సంబంధాలు చూసారు.”
ఇది ఒక - నాడీ గ్రంధమా? లేక ప్రశ్న శాస్త్రమా?”
అన్నంతగా చెప్పలేనంత ఆశ్చర్యం ఆ ఇద్దరికీ !!
ఇందులోని ఫలితాలు గనుక నిజంగా _
ఈ ప్రకారమే జరిగితే -
“ ఇది ఒక అద్భుతమైన భగవత్ శక్తి గల శాస్త్రము అన్న మాట!!!!!
సరే!అప్పుడు నమ్మ వచ్చును." అనుకుని.................
ఎగతాళిగా మాట్లాడుతూ నవ్వుకున్నారు.........
ఆసక్తితో ఎదురు చూడ సాగారు...........
ఆ తరువాయి అనేక సంఘటనల సంపుటిగా
వ్యాస ఆత్మ కథ నిర్మితమైనది.
1955 May దూరపు బంధువైన (తణుకు నివాసి) నండూరి పార్ధ సారధి
ఒక సంబంధం తెచ్చాడు. మూడు రోజుల తర్వాత “పెళ్ళి చూపులకు ఏర్పాట్లు ”
“అప్పుడే గవ్వలను వేసి, తీసిన ప్రశ్న ఫలితం ప్రారంభించినట్లున్నదే!”
అనుకుంటూ నవ్వుకున్నారు ఆ అన్న దమ్ములు.
అన్ని వివరాలూ మక్కికి మక్కీగా సరి పోలినవి.
కానీ........ “ రమల శాస్త్ర రహస్య vidita శాస్త్ర కారుడు
ఒక చోట – గురు వారము – పరిణయము జరుగుతుంది ’అని రాసాడు;
మరి అదే ప్రశ్నకు answer గా –
రెండవ భాగంలో వివరాల తరువాత –
‘ శుక్ర వారము జరుగును ‘ అని ఉన్నది – ఇది ఎలాగ??????????
“రమల శాస్త్ర కారుడు గట్టి చిక్కులోనే ఇరుక్కున్నాడు !”
అనుకుంటూ, కృష్ణ, వేద వ్యాస వినోదంగా నవ్వుకున్నారు.

1. ఇంటి వెనుక గోస్తనీ నది...... ఇతర వివరాలూ డిటోగా సరిపోతున్నాయి.
2.తీరా, మధ్య వర్తులున్నూ, బంధువులున్నూ
"వడ్ల గింజలో బియ్యపు గింజ”
మాటా మాటా పెరిగి ,marriage [మర్రీగె :->) ]వ్యవహారం
కాస్తా ఫెడీల్ మని చెడి పోయింది.
బేర సారాలు, ఇరు పక్షాల వారూ రద్దు చేసుకున్నారు; మానుకున్నారు.
‘మనకి మళ్ళీ హాయిగా మామూలుగా విశ్రాంతి లభించింది.’
అనుకుంటూసోదర ద్వయం
మళ్ళీ ప్రశ్న శాస్త్ర ఫలితాలను నెమరు వేసుకున్నారు.
బెజ వాడలోని నాగేశ్వర రావు నాయుడు గారి మేడ పైన కూర్చుని చర్చించుకున్నారు,
అన్నీ సరి పోయాయి కానీ ఇలాగ జరిగిందేమిటి ??????”

“ఈ రోజులలో ప్రశ్నలు జరగడ మేమిటి?
మన భయ భంజన శర్మ గారి –
రమల రహస్య గ్రంధాన్ని – కట్ట కట్టి
అటక పైన పాత సామానులులో భద్ర పరచాలి.”
అంటూ వేళాకోళం చేసాడు వ్యాస.
“ అన్నీ సరి పోయినా ఫలితం గుడ్డు షున్నా.
ఇంకెందుకు? మూట కట్టెయ్యి ఈ శాస్త్రాన్ని!” అన్నాడు వ్యాస.
వారం తిరిగే లోగా మెనీ ఇన్సిడెంట్సు వరసాగ్గా సాగాయి.
అర్ధ రాత్రి వచ్చి, తండ్రి అనంతాచార్యులు
” నీకీ సంబంధం నచ్చిందా?” ఉరిమినట్టు అడిగారు .
నిద్ర కళ్ళతో “ ఏ సంబంధం?”
“ మొన్న చూసినదే”
“యాభై సంబంధాలు చూపిస్తిరి,ఏదో ఎలా గుర్తు ఉంటుంది?
రేప్పొద్దున మాట్లాడుకుందాములే నాన్నా!”
చిరాకుతో ఆ జనకుడు
“ వెధవ మారా ముళ్ళ ప్రశ్నలూ, నువ్వూనూ! నీకెందుకోయీ ?
అడిగిన దానికి సమాధానం చెప్పు”
ఆ వెనుక “ June 2 నే పెళ్ళి ముహూర్తము -
వేగంగా ఏర్పాట్లు జరిగాయి.
“ గురు , శుక్ర వారముల మీమాంస” తో
వ్యాస పెళ్ళి సంబరాలని చిత్రంగా వీక్షిస్తూనే ఉన్నారు.
“ మంగళ వారం స్నానం చేయించి, “ స్నాతకము” చేసి,
పెళ్ళి పీటల మీద కూర్చో బెట్టారు ముత్తైదువులు.
ఏక బిగిన హోమాది కార్యక్రమాలలో పాల్గొని,
వివాహ క్రతువు, తంతు వలన చాలా బడలిక, అలసట కలిగాయి.
వధూ వరుల కొంగు ముడి - ఉన్నదని కూడా ఆట్టే గమనించకుండా,
వ్యాస అలాగే మంచంపై వాల బోతూన్నాడు;
========================;
తూర్పున తెల తెలవారుతూన్నది.
ఉదయాన్నే మూడున్నర, నాలుగు గంటల మధ్య కాలం!
తీరా చూస్తే తారీఖు మారి జూన్ మూడవ తేదీ వచ్చేసింది. (page 269)
ఆశ్చర్యం! అంటే శుక్ర వారం వచ్చేసింది అన్న మాట!
పరమాశ్చర్యంగా అక్షరం పొల్లు పోకుండా గురు వారం ప్రారంభించి,
శుక్ర వారం నాడూ పూర్తి కావడం, ఆశ్చర్యంలో ముంచెత్తింది.
“ఈలాగ అంతటి విచిత్ర ముహూర్తం, తన కళ్యాణ ఘడియ”!
ఈ సంఘటన వలన నాటి వరకూ హేళనా మిళితమైన
తన అభిప్రాయాలలో కలిగిన మార్పులు,
వేద వ్యాస యొక్క వ్యక్తిత్వ పరంగా గొప్ప మలుపు తిరిగినది.
“మంత్ర శాస్త్రము, సైంటిఫిక్ గా,
విజ్ఞాన, హేతు బద్ధంగా నిర్మించ బడినది
మన హిందూ ధర్మంలోనే!”
అని ఎక్కిరాల వేద వ్యాస దృఢ నిశ్చయానికి వచ్చారు.
ప్రాచీన కాలం నుండీ
క్రమ క్రమంగా నిర్మించ బడిన భారతీయ ఆచారాలలోని నిర్మాణత్వాన్ని
హేతు బద్ధతలకు మంత్ర ముగ్ధులై,
ఆయా విశేషాల గురించి పరిశోధనలను కొన సాగిస్తూ,
తన బ్రతుకు బండిని ఆ మార్గంలో నడిపించారు ఎక్కిరాల వేద వ్యాస.
University ofVedic Sciences"ను నెలకొల్పారు.
" హాజీ వారిష్ ఆలీషా దివ్య చరిత్ర" మున్నగు రచనలను చేసారు.
వందలాది గ్రంధ రచనలు" చేసి,
ప్రపంచానికి జ్యోతిష్యాది విద్యల పట్ల గౌరవ భావం కలిగించే
అత్యున్నత కార్యక్రమాన్ని శ్రమ దమాదులను లెక్క చేయకుండా, కొనసాగించారు.
మహనీయ వ్యక్తిగా అందరి మన్ననలను పొందిన ఎక్కిరాల వేద వ్యాస.
({spreading this holy knowledge.

Contact details of ISADS is :
Tel.: +91 141 2520094, Mobile : +91 9414044559 +91 98290213090
Website : http://isads.hostwebs.com ,
E-mail : anupamjolly@hotmail.com} )

20, నవంబర్ 2010, శనివారం

పదహారు అలంకారాలు





















ఉత్తర భారత దేశంలో “సోలాహ్ సింగార్” అనే ఆచారం సుప్రసిద్ధమైనది.
ఈ మాట "సింగార్ సోలాహ్" ఒక జాతీయంలాగా విస్తృత వ్యాప్తిలో ఉన్నది.
అనేక జానపద, లలిత గీతాలలోనే కాక
సినిమా పాటలలోనూ ఈ పదం సాక్షాత్కరిస్తున్నది.

అసలు “సోలహ్ సింగార్” అంటే “ పదహారు అలంకారాలు” అని అర్ధం.
“షోడశ కళలు” ప్రతీకగా ఇది వాడుకలోనికి వచ్చింది.
16 సింగారాలు సాధారణ జీవనంలో కంటే,
వివాహ తరుణంలో “వధువుకు (ఓపిగ్గా) చేస్తారు అన్న మాట!!!!
సరే! అవేమిటొ ఇప్పుడు పరికిద్దామా?!!!

1.మర్దన -> పెళ్ళి కుమర్తె మేనుకు -
రోస్ వాటర్, మల్లె , గులాబీ, చందన,
గంధాది తైలములతో ( -rose, jasmine, sandal)
మర్దన/ మాలీష్ చేస్తారు.
2.మంగళ స్నానములు ->
పాలు, అత్తరు, ఇతర సుగంధ ద్రవ్యాలను కలిపిన జలములతో
చేయించే స్నానము పేరు ;
శీతా కాలంలో “ఆల్మండ్”( almond) నూనె వగైరాలనూ,
ఎండా కాలంలో ఐతే రోజా పుష్ప దళాలను,
లోధ్ర, వట్టి వేళ్ళూ, మార్వా వగైరాలనూ మిక్స్ చేసిన లేపనాలను ఉపయోగిస్తారు.
(mixed with rose petals and mixed with khus or marwah)
3. కేశ పాశ సుగంధీ కరణము ->
షీకాకాయ(= షీకాయ), నాగర్మోత్, కచ్చూరాలు కల గలిపిన పేస్టును –
ముందర తైలము పూసిన ఆమె కురులకు – అలుముతారు.
4. అంగార విలేపనం,->
ఇప్పటి వాళ్ళు “ఫౌండేషన్ క్రీము"ను పూసుకుంటున్నారు కదా!
అలాంటిదే ఇదిన్నూ!
గంధమును ముఖము, మెడ, చేతులకు పలచగా పూస్తారు.
5. కాజల్ రేఖా దీపనము;
కన్నులకు కాటుకను పెడతారు.
పెళ్ళి కూతురు సోగ కన్నులకు తీర్చి దిద్దేదే ఈ kohl/ kajal.
6. తిలక ప్రసాధనము ->
ఆమె నుదుట (లలాట భాగమున) మాంగల్య చిహ్నముగా
బిందీ-ని/ కళ్యాణ తిలకమును సున్నితంగా తీర్చి దిద్దుతారు.
గోరోచనము, హర్త తాళ్ , కుసుంభము మున్నగు
(gorochana, hartal, kusumba )మున్నగు సుగంధ ద్రవ్యములతో
ఈ తిలకములను తయారు చేస్తారు.
పూల రేకులతో కూడా ఇలాంటి కుంకుమలను తయారు చేస్తారు.
7. ముఖ ప్రసాధనము ->
మూలికలు, బంగారు, వెండి పొడులతో
నవ వధువు వదనము మిసిమి కాంతులతో ప్రకాశిస్తుంది కదా!
అటు తర్వాత బుగ్గపై వధువుతో పాటు –
వరుడికి కూడా దిష్టి చుక్కను పెడతారు. కాటుకతో/
colour pencil తో ఈ నల్లని చుక్క దృష్టి దోష నివారిణి అని విశ్వాసం;
– కానీ దీనిని ఎందు వలననో గానీ,
“ షోడశాలంకారముల పట్టిక”లోనికి అనుసంధానము చేయ బడ లేదు.
@8. కేశ పాశ రచన->
9. ఆలక్త నివేశనము -> మరేమీ కాదు లెండి,
లిప్ స్టిక్ ( lip stick) అన్న మాట.
అలనాటి రోజులలో మూలికలూ, కుసుంభ పుష్ప దళాదులు మిళాయించి
సిద్ధ పరచిన లేపనాలతో వధూ వరుల అధరాలను సున్నితంగా సింగారించే వారు.
ఈ రోజులలో అమ్మలక్కలకు అంత శ్రమ లేకుండా లిప్ స్టిక్ లను
అందుబాటులో ఉంటూన్నాయి కదా!
ఇంచక్కా bride, bride grooms
స్వయంగా తమ పెదవులను వర్ణ భరితం చేసుకో గలుగుతున్నారు కదా!!!!!!!!
10. హస్త సుశోభితము -> చేతులకు అలంకారములు;
11.పాద సుశోభితము ; అర్ధమైంది కదండీ!!!!
చరణ ద్వయముకు = పాదాలకు పారాణి – ఉత్తరాది వారు,
బెంగాలీలు మున్నగు రాష్ట్ర ప్రజలు altah వగైరాలతో –
పద ద్వయికి చుట్టూతా గీతలు, లైన్లు వేసి ముచ్చట కొద్దీ డిజైన్లు చిత్రీస్తారు.
12. మహా వస్త్ర ప్రదానము -> పట్టు, సిల్కు వంటి దుస్తులను ఎంపిక చేస్తారు.
పెళ్ళి పీటలపై కూర్చున్న ఆ జంట ,
హూతులకు నేత్ర పర్వం చేసే రీతిలో వస్త్ర ధారణ ఉంటుంది.
( సాంప్రదాయక పద్ధతులలో – గోచీ – కుచ్చులు – పోసి,
వారికి కట్టడానికి చేసే అందమైన ప్రయత్నము ఇది.)
13. పుష్ప ధారణము -> నీలాల కుంతలములను పరిమళ భరితమైన ,
నయన పర్వము ఒనరించే రంగు రంగు పూవులతో అలంకరిస్తారు.
ఇలాగ పూల జడలను వేయాలని
స్త్రీలు పోటీ పడుతూ చేసే ఆ సందడే సందడి –
అది గొప్ప ముచ్చట.
14. అలంకార ధామము ->
పాపిటి బిళ్ళ, జడ బిళ్ళ, చెవి లోలాకులు/కర్ణాభరణాలు ,
హారములు/ నెక్లెసులు, దండ కడియాలు, వంకీలు;
వడ్డాణము, మణి మేఖల, కాలి పట్టీలు /అందెలు/ కాలి గజ్జెలు,
( పెళ్ళి ఐన వెను వెంట “మెట్టెలు”) ఇత్యాది ఆభరణాలతో
పెళ్ళి పీటలమీద ఆసీనులైన నవ వధూ వరులతో ,
ఆ వివాహ దృశ్యము నయనానంద కరంగా ఉంటుంది కదా!!!!!!
15. తాంబూల సేవనము ->
తాంబూల సేవనము వదనములోని కళా కాంతులకు దోహద కారి.
mouth freshener గా అత్యంత పురాతన కాలం నుండీ
మన భారత దేశములో జన బాహుళ్యము ఆమోదము పొందిన ఆచారము.
16. దర్పణ విలోకనము -
( తరువాతది ఈ “శుభ దృష్టి).
"తమ అలంకారాలను సరి చూసుకుని, సరి చేసు కోవడమే” –
ఈ దర్పణ విలోకనము –
అంటే అద్దములో తమ ముద్దు బింబమును తనివి తీరా చూసుకోవడము అన్న మాట.
దక్షిణాదిని కూడా ఇలాంటి ఆచారాలను పాటిస్తునారు;
మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవి అమలులో ఉన్నాయి;
కానైతే ఈ సాంప్రదాయ ఆచరణకు - ప్రత్యేకించి, స్పెషల్ పేరు ఉన్నట్టు అగు పడదు.

చిట్టి తల్లినీ రాణిని చేస్తాం! చిట్టి తండ్రినీ రాజును చేస్తాం!













పిల్లలకే స్వాతంత్ర్యం వస్తే?
పిల్లలకే స్వరాజ్యం ఇస్తే ?
స్తే....???

చిట్టి తల్లినీ రాణిని చేస్తాం!
చిట్టి తండ్రినీ రాజును చేస్తాం! ||

మా అమ్మే ఒక బొమ్మైతే
మా నాన్నే ఒక బొమ్మైతే
మా బొమ్మల పెళ్ళి గుమ్ముగ చేస్తాం!
కమ్మని విందులు గమ్ముగ తింటాం! ||

స్కూళ్లలో మాస్టార్లు కరువైతే...
పిల్లలమంతా పంతుళ్ళౌతాం!
పెద్దవాళ్లందరికీ బుద్ధులు చెబుతాం! ||

సూర్యుడు ఎర్రని కాగితమైతే
చంద్రుడు తెల్లని కాగితమైతే.......
గాలిపటాలుగ చేసేస్తాము;
మెరుపుల దారాలతో ఎగిరేస్తాము! ||

****************************
రేడియో అన్నయ్య రచన ;
- ఆకాశ వాణి లో వస్తూండేది.
నా చిన్నప్పుడు, రేడియోని అంటి పెట్టుకుని వినే ప్రోగ్రాం
"బాల వినోదం - పిల్లల కార్యక్రమం.
ఈ పాట ఎప్పటికీ ఆకు పచ్చని మృదు జ్ఞాపకమే!

17, నవంబర్ 2010, బుధవారం

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆభరణముల విలువ













తిరుమల తిరుపతి దేవ స్థానమునకు
ముప్పాళ్ళ రంగా రెడ్డి రెవెన్యూ ఆఫీసరు,
శ్రీ మలయాళ స్వామి వారికి భక్తులు ఐనారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ‘పచ్చలకు
గోల్కొండ వజ్రాల వ్యాపారులు
25 వేల రూపాయలుకు కొన వలెనని యత్నించారు.
ఆ రెవెన్యూ ఆఫీసరు –
తాను ఆ ధనమును మలయాళ స్వామి వారికి
ఇవ్వాలని – తలిచారు.
“ఓహో! శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ‘పచ్చలు ను మార్చి –
ఆ ధనముతో వ్యాసాశ్రమమును వృద్ధి పొందింప దలచు చున్నారా?
ఇట్లు తయారైతిరా? ఇంతకాలము ఇక్కడ నేర్చుకున్నది ఇదియేనా?´
అంటూ శ్రీ మలయాళ స్వామి మందలించారు.
స్వామీజీ –
“ తాను పెదవి చెప్పకుండానే అంతా గ్రహించారే!”అనుకుని
గురు దేవుని అసాధారణ ప్రజ్ఞకు అచ్చెరువొందుతూ,
ఆ భక్తుడు
“తాను తలపెట్టిన పనిలోని లొసుగును తెలుసుకుని,”
సిగ్గు పడి, ఆ కార్యక్రమాన్ని విరమించ్వ్హుకున్నాడు.
స్వామీజీ , భక్తులు సమర్పించే
ధనమునూ, కానుకలనూ కూడా –
అవి న్యాయ బద్ధ మార్గములోనివేనా?” అని
మనో చక్షువుతో పరిశీలన చేసే వారు.
భక్తులు ఇచ్చే చిన్న కానుకలను కూడా
స్ఫూర్తిగా గ్రహించే వారు.
వ్యాసాశ్రమమునూ, అనుబంధముగా
విద్యా వ్యవస్థలనూ, సమాజ సేవా కార్య కర్తలనూ
తీర్చి దిద్దిన ఘనత -
వ్యాసాశ్రమ స్థాపనకు మూల కారకుడైన
శ్రీ మలయాళ స్వామివారిదీ, వారి శిష్యులదీ!!

(శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆభరణముల విలువ)

15, నవంబర్ 2010, సోమవారం

స్వామి వారి ‘సో~హం’ చిట్కా















1885 March 29 వ తేదీ ఎంగండ్యూర్ లో జన్మించినారు.
"వేలప్ప" ఆయన పూర్వనామము
శ్రీ మళయాళ స్వామి సన్యాశాశ్రమమును స్వీకరించారు.
గిరి సాంప్రదాయమును అనుసరించి
“శ్రీ అసంగానందగిరి స్వామి” అని నామ కరణమును -
శ్రీ సాధు మాతాజీ నుండి – మాతృ బిక్షగా – స్వీకరించారు.
కానీ ............ ఆ నాటికే -
ఆయన “ శ్రీ మళయాళ స్వాముల వారు"గా ప్రశస్తి కెక్కి ఉండుటచే –
పేరు ఎవరికీ తెలియదు.
కేరళ ప్రాంతము వాడు, మళయాళ సీమలో జన్మించినప్పటికీ _
ప్రజలు సమర్పించిన కానుకలను తెలుగు నాట మాత్రమే వినియోగించెను;
అందు వలననే ప్రజల విశ్వాసమును ఆయన చూర గొన గలిగారు.
“స్వామి! మీకు ఏదైనా ధనాకర్షణ కలుగ జేయు మంత్రము వచ్చునా?”
ఒక వ్యక్తి అడుగగా, స్వామి వక్కాణించెను
"నేను నేర్చిన ధనాకర్షణ – జనాకర్షణ మంత్రములు రెండు అక్షరములే నాయనా!
‘సో~హం’ అను – అజపా గాయత్రీ మంత్రము – ఉన్నది.
ఆ మధుర మంత్రమును హృదయ కమలము అనే యంత్రముపై అధిష్ఠింప జేయ వలెను.
అనవరతము ‘ అర్థ భావనను’ కలిగి ఉండి,
జపించు చుండ వలెను.
అప్పుడు అచిర కాలములో ఆత్మానుభూతి సంప్రాప్తమౌతుంది.”

14, నవంబర్ 2010, ఆదివారం

పెన్సిళ్ళు - వింత కళలు












తమాషా పాయింట్లు: ;;;
1. సైన్సు లోకంలో "కెమికల్ లెడ్" వేరు.
చాలామంది పెన్సిళ్ళలో వాడేది ఇదే - నని అనుకుంటూంటారు.
2. penci Lead అనగా - గ్రాఫైట్ ; కార్బన్ కు మరొక రూపాంతరం ఇది.
3. 50 thousand Wordsను ఒక పెన్సిల్ తో రాయ వచ్చును.
4.1862 లో 100,000 డాలర్లకు పెన్సిల్ పై హక్కును అమ్ముకున్నారు.
సుప్రీం కోర్టు తీర్పులు వగైరాలు - పేటెంట్ హక్కులపై -
అనేక సంచలన పరిణామాలు జరిగినాయి
సన్నటి లోహపు కడ్డీతో రోమన్లు –
పేపరుకు పూర్వ రూపమైన ”papyrus” మీద రాసారు.
తర్వాత వాడుకలోకి వచ్చిన “స్టెలసెస్”లు సీసము(లెడ్ తో తయారైనవి.
ఈ నాడు ఇతర వస్తు పదార్ధాలతో తయారు అవుతున్నాయి,
ఐనప్పటికీ “లెడ్” అనే వ్యవహృతం ఔతున్నాయి.
నేడు 1564 లో Englandలో LED కు బదులుగా
“గ్రాఫైట్”ను మార్కర్ - గా ఉపయోగించ బడ సాగినది.
1662 నుండీ – జర్మనీలో - పెన్సిల్ – అధికంగా ఉత్పత్తి అవసాగింది.
తొలి దశలో pencil :---
అమెరికాలోని Tennissie లో రెడ్ సెడర్ చెక్కతో
పెన్సిల్ పైభాగాన్ని చేసి, తొలి రూపాన్ని జగత్తుకు అందించారు.
1900 లో Sierra Nevada పర్వతాలనుండి లభ్యమైనది.
Incese – Cedar” అని పేరు పొందింది.

***********************************

( Read here essay, more INFORMATION )

నేల/ గనులలోని గ్రాఫైట్ నూ, బంక మన్ను(= clay powder),
నీళ్ళు కలిపి పొడవైన కడ్డీలను చేసి,
వాటిని వివిధ దశలలో –
అనేక పరిణామాల అనంతరము ,
పెన్సిళ్ళలోని “ములుకు”లుగా స్వరూపం పొందుతున్నాయి.
18ఊ – 1890 లనుండీ చైనా లో ఉత్పత్తి అయ్యే గ్రాఫైట్ – కు
అత్యధిక ఆదరణ లభించినది.పసుపు కోటింగ్ కల పెన్సిళ్ళు
చైనా యొక్క విదేశీ వాణిజ్యంలో సుస్థిర స్థానాన్ని ఆర్జించినది.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...