30, డిసెంబర్ 2010, గురువారం

దోమ పల్లి రజనీష్ Berlin Debut award for వనజ

"వనజ" అనే తెలుగు సినిమా 2006లో వచ్చింది.
ఆ మంచి సినిమా అమెరికా లో వచ్చింది,
కానీ ఇప్పటి దాకా నేను
మన దేశంలో కనీసం తెలుగు ఛానెళ్ళలో కూడా చూడలేదు.
An Indian Film, Vanaja by Rajnesh Domalpalli
was awarded the Best First Feature Award 2007
in the Berlin Film Festival.
A 3 member international jury will
award the best
debut film and
the Gesellschaft zur Wahrnehmung von Film- und Fernsehrechten (GWFF),
the selected film will get a prize of 50,000 euros.
The prize is donated by
a society for safeguarding film and television rights.
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్, 50 వేలు యూరోలు విలువతో అవార్డుతో
పాటు అనేక అవార్డులు వచ్చాయి.









కొలంబియా యూనివర్సిటీ పట్టభద్రత(డిగ్రీ) కోసం దోమలపల్లి రజనీష్ నిర్మించిన
గొప్ప ప్రశంసాత్మక చలన చిత్రం.
ప్రపంచ వ్యాప్తంగా అనేక పొగడ్తలతో కూడిన సమీక్షా నేత్రాలతో
మన భారతీయులు తిలకించవలసి వస్తూన్న స్థితి!
ఔరా!!!!















ఇంతకీ ఈ వార్త ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటున్నామనగా,
గచ్చిబౌలీ స్టేడియం లోనిGanti Mohana Chndhra Balayog
i Stadium లో
"కూచిపూడి నర్తనల" గిన్నీస్ రికార్డు నమోదు ఐనది.
ఇది అంతా ఒక ఎత్తైతే,
ఆ నర్తకీ మణులు,నర్తకులు 15 దేశాల నుండి రావడం మరొక ఎత్తు.
వారు ఎన్ని శ్రమదమాదులకు ఓర్చి,
ఎంతో సహనంతో ఎన్నో వేల మైళ్ళ నుండి రావడమనే సంగతి.... మాటలా!?!!!
2800 మంది పై చిలుకు Sunday(26-12-2010) 10 నిముషాల పాటు
హిందోళ థిల్లానా ("Hindola Thillana"") ప్రదర్శించారు.
మన ఆంధ్ర ప్రదేష్ లోని ప్రతి పట్టణం నుండి నాట్య కళాకారులు పాల్గొన్నారు.
పద్మ భూషణ - గ్రహీత వెంపటి చిన సత్యం సారధ్యంలో జరిగింది.
శోభా నాయుడు, యామినీ క్రిష్ణ మూర్తి,
రాజా రెడ్డి & రాధా రెడ్డి దంపతులు కూడా
ఈ మహోన్నత సంఘటనలో భాగస్వామ్యం వహించారు.
ఆ అద్భుత సన్నివేశాన్ని ఆవిష్కరించిన కళాకారుల కృషికి కోటి నమస్సులు.
మన రాష్ట్రంలో నెలకొల్పబడుతూన్న రికార్డుల సంపుటిగా,
నాకు ఈ information ను ఇచ్చిన "అజ్ఞాత" గారికి కృతజ్ఞతలు.
విష్ణుభొట్ల లక్ష్మన్న గారి సమీక్షా వ్యాసం
(నవ తరంగం)లో "వనజ" మూవీ విపులంగా ఉన్నది.

28, డిసెంబర్ 2010, మంగళవారం

పుష్ప దళములు ( Design )














(Designs , on Cmptr screen)
కొలను అలల తంత్రులను
మీటు చుండు పువు రేకులు;
వెన్నెలపలుకరింపు
లింపు సొంపు స- రి- గ- మ- లు.

*********************************//////
నేను కంప్యూటర్ తెరపై వేసిన
కొన్ని రంగుల కలబోతల పుష్ప దళములు Design .
I think these type of DESIGNS are
nice for sarees, cloths etcetra.

27, డిసెంబర్ 2010, సోమవారం

నా సందేహాన్ని తీర్చగలరా ?

మన జాతీయ పక్షి "నెమలి" అంటే నాకు చాలా ఇష్టం.
మన గిలేష్ణలో , మయూర చిత్రాలు దొరికాయి.
ఈ బొమ్మను కాపీ రైట్సు వ్యవహారం
(> so I did not take my desk, File.)

నా చిన్న బుర్రకు అట్టే అర్ధం కానందుచేత,
ఆ బొమ్మ యొక్క లింకు ను ఇక్కడ ఇస్తున్నాను.
ఇంతకీ ఆ చక్కని చిత్రలేఖనం ఎందుకు ఇస్తున్నాను? అంటే, ......
ఈ బొమ్మ నిజ్ఝంగా అద్భుతంగా ఉంది.
సరే!
కానీ, ఆ కింద రాసిన వ్యాఖ్య , కొన్ని సందేహాలను కలిగించింది.
ఒక సౌందర్యవతి, నెమలిని పళ్ళెంలో ఎత్తి పట్టుకుని వెళ్తూన్నది.
ఆమె పక్కన రెండు శునక రాజాలు ఉన్నాయి
( బహుశా - పై ప్లేటు " కోసం కాబోలును!")

ఇంతకీ ఆ ఫొటో కింద ఇలా రాసి ఉంది.

"The christmas Dinner" Bringing in the PEACOCK"
అంటే ఏమిటి?
ఆ బుజ్జి నెమలిని ఏ కార్యం నిమిత్తం తీసుకు వెళుతూన్నట్లు???
ఇదీ నా డౌటు!
"భోజనార్ధమా??" .
ఆ చిత్ర కళలోని అంతటి సౌందర్యాన్ని, ఆ యాంగిల్ లో చూడాల్సి రావడమా?
ప్చ్! భీతితో నా గుండె ఝల్లుమన్నది.
నేను అర్ధం చేసుకున్నదాంట్లో పొరపాటు ఉంటే, నాకు అది సంతోషమే!
నా సందేహాన్ని తీర్చగలరా?

25, డిసెంబర్ 2010, శనివారం

JAGGERY गुड़ (शक्कर)














20 వ శతాబ్దం నుండి అంటే యాంత్రిక యుగానికి ముందు దాకా మానవుడు నిత్య జీవిత అవసరాలకు సంబంధించిన వస్తువులను తయారు చేసుకునే వాడు. జీవితాన్ని మరింత సుఖవంతంగా మలుచుకునేందుకు అనేక పద్ధతులను నేర్చుకునంటూ మును ముముందుకు అడుగులను వేశాడు.
అలాగ తయారు చేసే పద్ధతులలో మేలైనవి ఈ నాటికీ అనుసరించబడుతూన్నాయి.
ప్రస్తుతం చక్కెర ఉన్నది,
కానీ ప్రాచీన కాలంలో బెల్లము మాత్రమే sweets కి వాడుకలో ఉండేది.
దాని తయారీ గురించి ఇప్పుడు లోకాభిరామాయణముగా ఎందుకు చెబుతున్నానంటే,
పాశ్చాత్య దేశాలలో వేరే చెట్ల నుండి తీసే రసాలను స్వీట్ సిరప్ గా చేసేటందుకని
ఇంచుమించు ఇదే సాంప్రదాయిక రీతిగా అమలు ఔతూ వస్తున్నది. అదీ వింత!
చెరకు రసాన్ని తీసి రెడీ చేస్తారు. దీన్ని పెద్ద పెనము లాంటి బానలో పోసి, బాగా మరగబెడతారు.
వెడల్పాటి గిన్నెలో కాగేటప్పుడు, మురికి వంటిది తేలాడుతుంది.
ఇలా పైకి వచ్చే తెట్టును తీసేస్తూ ఉంటారు.
గిన్నె అంచులు దాటి, పొంగిపోతూన్నప్పుడు, నూనెను పై పైన చిలకరించాలి.
ఇందుకు వేరుసెనగ నూనె గానీ, నువుల నూనె గానీ శ్రేష్ఠమైనవి.
రసము అంతా బాగా చిక్కబడుతుంది. అడుగు నుంచీ బుడగల వలె వస్తాయి.
అట్లాగ ఔతూన్నప్పుడు, 10 నుంచి 15 నిమిషాల తర్వాత బానను పొయ్యి మీద నుంచి దించాలి.
ఆ కాగును దించగానే చిక్కని పాకాన్ని గిర గిరా బలం కొద్దీ కలియ దిప్పాలి.
అలా చేస్తే గట్టి బెల్లం సిద్ధమౌతుంది.
కొద్దిగా చల్లారిన పిమ్మట 5 minutes కదల్చకుండా ఉంచుతారు.
నాణ్యత కలిగిన బెల్లం ఐతేనే గట్టిగా పేరుకుంటుంది.
సరిగ్గా గట్టి పడనట్లైతే, కొద్దిగా సుమారు 5 కిలోలు చక్కెరను గానీ, బెల్లం పొడిని గానీ కలపాల్సి వస్తుంది.
యూరోపు దేశాలలో maple sugaring process. ఉన్నది.
India లో చెరకు గడల నుండి రసాన్ని తీసి, jaggery చేస్తారు.
పాశ్చాత్య దేశాలలో మాపిల్ సిరుప్ ను చేయాలంటే Thousands of hours వెచ్చిస్తారు.
Peter Jackson and Scott Kuhnly మున్నగు వారు
చాలా మంది మ్యాపిల్ ద్రవ పరిశ్రమలో లబ్ధ ప్రతిష్ఠులు.
ఇండియాలో తాటి కల్లును కుండలలోకి , తాటి చెట్టు నుండి తీసే పద్ధతిలో వారి traditional syrup సాధిస్తారు.
maple tree కాండం నుండి మధు రసాన్ని సేకరిస్తారు.
చెట్టు బెరడు ముక్కను/ సైఫన్/ రబ్బరు గొట్టము/ పంపులు, నల్లాలు, సన్నని వస్తువులనూ వాడుతారు.
అక్కడి జనులు పురాతన కాలం నుండీ చెట్టు నుండి తీపి జ్యూసు ను సాధించడంలో నేర్పరులు.
ఈ వ్యాసాన్ని చూసి, చదివి వెల్లడించిన వాక్కు "
మనం కూడా కనకాంబరం పూలలో పలుచని క్లాత్ పీలికను పెట్టి,
చక్కెరను చేద్దామా? సుగర్ ప్రోబ్లం సాల్వ్ ఔతుంది కదా!"
మరే!!!!
సాల్వ దేశానికి వెళ్ళి,శాస్త్రవేత్తలను సందేహాలను అడిగి చూద్దామా?

24, డిసెంబర్ 2010, శుక్రవారం

నెమలి ఘనా పాఠి!

















బర్హి పింఛము చూడ కడు ముచ్చట
సౌందర్యములపైన అదె సంతకమ్ము!

సొంపైన ప్రకృతీ నిరతాధ్యయనమున
ఓహో మయూరీ!
ఘనాపాఠివైనావు

గైకొనుము తరుణీ లలామ
వీక్షణమ్ములు
ఒసగు శతకోటి దీవెనలు!

********************

23, డిసెంబర్ 2010, గురువారం

గ్రంథ లిపి, రుద్ర పట్నం శ్యామ శాస్త్రి


అనే ఉద్గ్రంధము వెలసినది.
150 అధ్యాయముల సంకలనమే
"అర్ధ శాస్త్రము" & నీతి దర్పణము.
ప్రొఫెసర్లు , మేధో వర్గీయులు మాత్రమే కాక
ప్రజలందరూ ఈ ప్రాచీన సంపుటి గురించి ఆసక్తిగా చూసారు.
క్రీస్తు పూర్వం 4 వ శతాబ్ది నాటి ఈ రచన ఉన్న
తాళ పత్ర రేకులను భద్ర పరచి,
MYsore Orienta manuscripts Library లో
ఉద్యోగి ఐన రుద్ర పట్నం శ్యామ శాస్త్రి .



ఇలాంటి గ్రంథాలు ఆ తర్వాత వెలుగు చూసాయి.
ఈ సందర్భంలోనే ఒక నవీన విశేషం వింతగా బయల్పడినది.
అదే “గ్రంథ లిపి” . సంస్కృత భాష లోనూ,
అలాగే తమిళ భాషా శబ్దాల ఉచ్ఛారణకునూ సమమైన అక్షరాలు లేవు,
అందువలన “ గ్రంథ లిపి” / Grantha Lipi కనిపెట్ట బడింది.
తంజావూర్ పండితుడు
“ దేవనాగరి లిపి కాదు, ఇది గ్రంథ లిపిలో రాయబడినది.” అని చెప్పగా,

అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనైనారు.
పల్లవులు, చోళులు, విజయ నగర చక్రవర్తుల కాలం నుండీ
తమిళ, గ్రంథ లిపి స్వరూపాలు సమాంతరంగా అభివృద్ధి చెందాయి
started to diverge into different paths around 1300 years .
ముద్రణా యంత్రము అపరిమితంగా ఉపయోగంలోనికి వచ్చినప్పటి నుండీ
గ్రంథ లిపి యొక్క ప్రాముఖ్యతను అందరూ గుర్తించారు


rudrapatnam syama sastri గారి అద్భుత కృషి తో
చాణుక్యుని రచనలు వెలుగులోనికి రావడంతో
ఎన్నో మేలు పనులు, మేలిమి మార్పులు ప్రజానీకము ఆలోచనా సంవిధానంలో కలిగాయి.
@)ప్రాచీన వ్రాత ప్రతుల పట్ల, ప్రజలకు భక్తి, అభిమానం పెరిగాయి.
@) పాశ్చాత్యుల కన్న మన సంస్కృతీ సంపదలు
అత్యంత ప్రాచీనమైనవీ, అతి గొప్ప చతుష్షష్ఠి కళా, సాహిత్యాలు
మనకు క్రీస్తు పూర్వం 2000 ఏళ్ళ నుండీ ఉన్నాయి అనీ,
మనకు ఎంతో గర్వ కారణమౌతూన్నాయి అనీ"జనులు, ఆబాలగోపాలం గ్రహించారు.
@)citronyl oil, మున్నగు వాటి ఉపయోగాలను తెలుసుకున్నారు.
ప్రాచీన వారసత్వ సంపదను భద్ర పరచుకోవాలనే జిజ్ఞాస వృద్ధి పొందినది.

21, డిసెంబర్ 2010, మంగళవారం

తాయిలం పెట్టు అమ్మా!


ఆకాశవాణి లో బాలానందం కార్యక్రమం ప్రసారమయ్యే సమయానికి
వారం వారం పిల్లలు, ఆబాల గోపాలమూ రేడియో దగ్గర బైఠాయించేవారు.
న్యాయపతి అన్నయ్య రచనలు ఎన్నో పరిసరాలలో శ్రావ్యతను నింపేవి.
ఈ పాట "బాలాంత్రపు రజనీ కాంత రావు" రచన అనుకుంటాను.
పాడిన వారెవరో గానీ, ఆ గళము ఇప్పటికీ నా చెవుల పర్ణశాలలో ఉన్నది.

బాలానందం ;;;;
_______

ఆటలు ఆడీ, పాటలు పాడీ అలసీ వచ్చానే!
తియ్య తియ్యని తాయిలమేదో తీసి పెట్టమ్మా! ||

పిల్లి పిల్ల కళ్ళు మూసి, పీట ఎక్కింది
కుక్క పిల్ల తోకాడిస్తు గుమ్మంఎక్కింది
కడుపులోని పాకి పిల్ల గంతులు వేస్తూంది
తియ్య తియ్యని తాయిలమేదో తీసి పెట్టమ్మా! ||

గూటిలోన బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా!
చేటలోని అటుకులు చారెడు ఇవ్వమ్మా!
అటక మీది అటుకుల కుండ అమ్మా! దించమ్మా!
తియ్య తియ్యని తాయిలమేదో తీసి పెట్టమ్మా! ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

taayilaM peTTu ammaa!
__________________

aaTalu ADI, paaTalu pADI alasI vachchaanE!
tiyya tiyyani taayilamEdO tiisi peTTammaa! ||

pilli pilla kaLLu mUsi, pITa ekkiMdi
kukka pilla tOkaaDistu gummaMekkiMdi
kaDupulOni paaki pilla gaMtulu vEstUMdi
tiyya tiyyani taayilamEdO tiisi peTTammaa! ||

gUTilOna bellaM mukka koMcheM peTTammaa!
chETalOni aTukulu chaareDu ivvammaa!
aTaka mIdi aTukula kuMDa ammaa! diMchammaa!
tiyya tiyyani taayilamEdO tiisi peTTammaa! ||

19, డిసెంబర్ 2010, ఆదివారం

Baby Buddha రూపంలోని పళ్ళుపతాక శీర్షిక
















చైనాలో , హెబియా అనే గ్రామంలో గావ్ జియంఝంగ్
(Gao Xianzhang,
a Chinese farmer in Hebia, Northern China ) అనే రైతు
వింత ఆకారంలో ఉన్న పియర్స్ పళ్ళను ఉత్పత్తి చేయగలిగాడు .
అతని 6 సంవత్సరాల నిరంతర కృషి ఫలితమే
ఈ ముద్దులొలికే బుద్ధుని రూపంలోని పళ్ళు.
బాల బుద్ధుని (Baby Buddha shaped pears.) ఆకారంలో ఉన్న
ఆ ఫలములు (funky-shaped fruit)
ప్రపంచ విపణి వీధులలో, వ్యాపార, కర్షక వర్గాలలో
పతాక శీర్షికలను అలంకరించిన సంచలన వార్త ఐనది.

Baby Buddha shaped pears ;;;;;
_______________

ఈ కింది అభిప్రాయాన్ని గమనించండి,
మీ స్పందన ఏమిటి?

I understand that my comments that
the attitudes of Buddhist "converts"
to representations of the Buddha
differs significantly to attitudes of
Buddhists from traditional Buddhist
Countries generated complaints
(presumably from western converts).

I made a very valid point.
My wife is Thai and Buddhist -
She takes great exception to images of the Buddah
used in non religious / non spiritual ways.
Clearly Western "converts"
do NOT have the same values and /
or sensitivity to this and are
NOT representative of the majority of Buddhists
i.e. People from Traditional Buddhist countries...
THailand, Vietnam, Burma, etc.

I was making a valid point -
The representation of the Buddha in this way
(as a soft fruit for commercial sale)
IS offensive to millions of traditional Buddhists -
I got pilloried for that...
why not ask a Bikkhu (Buddhist monk),
or ask some Thai's, Vietnamese, what they think ?)...

Or as usual is it just Western liberal opinion that is valid ?
- Nick, London, UK, 13/9/2009 19:16

16, డిసెంబర్ 2010, గురువారం

గిలేష్ణలో కార్కు తయారీ















నా చిన్నప్పుడు, ఇప్పటికీ సీసాలకు బెండు మూతలు /cork
ముఖ్యంగా పతి గాని పతి, అదేనండీ,
హోమియోపతి సీసాల మూతలు వింతగా ఉండేవి.
మెత్తగా ఉండి నీళ్ళ పైన తేలేవి, బెండు ముక్కల్లాగా.
ఇదివరకు వైను సీసాలకూ,చాంపైన్ మూతలుగానూ,
ఎక్కువగా మందుల సీసాలకూ CORK వాడుక ఉండేది
అవి వేటితో తయారు చేసారో?, అని అనుకునేదాన్ని.
మన గిలేష్ణ లో అనుకోకుండా ఈ పాయింటు దొరికింది.
(google + = Search / అన్వేషణ = గిలేష్ణ)
మరి, ఇదిగో ఆ విపుల సారీ! క్లుప్త వ్యాసము.

















కార్కు తయారీ
-----------------
ఇవి స్పెయిన్, పోర్చుగల్ లలో అధికంగా ఉనాయి.
ఇండియాలోనూ, అమెరికా లోనూ మితంగా ఉన్నాయి.
ఓకు చెట్లు వంద సంవత్స
రాలు జీవిస్తాయి.
వీని కాండాల మందం ఒక మీటరు వరకూ ఉంటుంది.
ఓక్ చెట్లు 6 నుండి 12 మీటర్లు ఎత్తు పెరుగుతాయి.
20 ఏళ్ళ చెట్ల నుండి బెరడు లభ్యము.
బెరడు వలచినప్పటికీ, చెట్టుకు ఏ హానీ జరగదు.
ఈ బెరడు యొక్క అంతర్ పొరల నుండి కార్కులను తయారు చేస్తారు.
19 వ శతాబ్ది నుండీ కార్కుల ఉపయోగం
ప్రజలకు బాగా అందుబాటులోకి వచ్చింది.
వీని వలన అనేక ఉపయోగాలు .
@) గతంలో మందుల సీసాల బిరడాలకు వాడే మూతలకు
కార్కు లు ప్రధానమని అందరికీ తెలుసు.
@)”life savers” ను వీని నుండి చేస్తారు.
ఈత కొట్టే వారి పరికరము ఈ లైఫ్ సేవర్సు.
@)ఆటో మొబైల్ గాస్కెట్సు కొరకు కార్కు ఉపయోగించ బడుతున్నది.
@) సౌండు ప్రూఫు గదులు మోడర్న్ టైములలో విరివిగా నిర్మించ బడుతున్నాయి.
T.V. studio లలో ఇలాటి sound proof rooms ఉంటాయి.
ఇల్లాగ శబ్ద కవచంగా “కార్కు “ బహు ప్రయోజనకారి.
@) సీలు చేసే సాధనమిది.
pipes ల రంధ్రాలను మూయడాన్నికి వాడుతారు.
కార్కును చూర్ణంగా, పొడిగా చేసి దానిలో gum ను మిళితం చేస్తారు.
అలాగ జిగురుతో కలిపిన కార్కు పొడి, బెజ్జాలను సీలు చేసేందుకు వినియోగిస్తారు.
@) ఇన్సులేషన్ మెటీరియల్ గా కార్కు బహుళ దాయిని.
refridjirators లో వాడుతారు. store roomsలలో,
గిడ్డంగుల్లో కార్కును insulation material
గా వాడబడుతూన్నది.

అన్నట్టు ఈ పేరుతో మొదలైన తెలుగు సినిమాను మీరందరూ చూసే ఉంటారు,
ఆ చలన చిత్ర నామము "బెండు అప్పారావు".
అఫ్ కోర్స్! కార్కుకూ, అల్లరి నరేష్ పాత్రకూ లింకు ఏమీ లేదనుకోండి
(పై essay కూ, ఈ మూవీ sentence మేటరుకూ మల్లేనే!

14, డిసెంబర్ 2010, మంగళవారం

పెన్సిల్ సిత్రాలు


"I am God’s pencil.
A tiny bit of pencil with
which he writes what he likes.
God writes through us,
and however imperfect instruments we may be,
he writes beautifully."
_ Mother Teresa in
"My Life for the Poor"
ఈ అందమైన ప్రబోధాత్మక వాక్కులు చెప్పిన
మహనీయులు ఎవరో మీకు తెలుసా?
ఔను, ఆ స్త్రీ మూర్తి "జనని థెరీసా".
మదర్ థెరెసా గురించి పరిచయం చేయడమంటే,
సూర్యుని దివిటీ వేసి చూపడమే కదా!

And now, see and enjoy the Modern pencil sculpture.

12, డిసెంబర్ 2010, ఆదివారం

హులా హూప్స్! హైలెస్సా!


"హులా హూప్స్" ఈ పేరు మన "హైలెస్సా!హైలెస్సా!" అనే
పడవ నడిపే నావికుల ఊత పదం లాగా వినబడ్తూన్నది కదూ!
"హుల హూప్స్" అనేది ఒక ఆట వస్తువు. ఇది క్రీడగా ఆరంభమై,
నేడు ఒబెసిటీని అదుపు చేసే విన్యాసంగా ఆ బాల గోపాలాన్నీ ఆకట్టుకొంటూన్నది.
నడుము చుట్టూ చక్రాన్ని తిప్పుకొంటూండే
ఈ హులా హుప్స్ నయన పర్వం చేస్తుంది.
ఇది ఈ నాడు డాన్సు & ఎక్సర్సైజ్ గా ప్రపంచ ఆదరణ పొందుతూన్నది.
అతి ప్రాచీన కాలం నుండీ హులా హుప్ సరదా ఆటగా మానవులచే ఆచరించబడసాగినది.
మొదట (Hula hoops"willow, rattan (a flexible and strong vine),
grapevines and stiff grasses) ప్రకృతిలో లభించే లతలు,
ద్రాక్షా తీగలు, గట్టిగా పేనిన గడ్డి వెంట్లు, veduru మొదలగు వాటితో
చక్రంలాగా తయారు చేసుకునే వాళ్ళు.
నేడు తరచుగా ప్లాస్టిక్ ట్యూబులను (plastic tubing)ఉపయోగములో ఉన్నవి.
బాల బాలికలకూ వాడే హూలాలు
ఇంచుమించు 28 ఇంచ్ లు వ్యాసార్ధముతో ఉంటూన్నాయి.
పెద్దలు వాడే ప్లాస్టిక్ చక్రాలు దాదాపు పెద్దలు వాడే ప్లాస్టిక్ చక్రాలు
దాదాపు 40 inches వ్యాసము కొలత కలిగి ఉంటూన్నాయి.
( approximately 28 inches in diameter,
and those for adults around 40 inches )
"Hula hoop day ని సమాన సంఖ్యా కాల మానాన్ని ఎంచుకుని,
పండగలాగా ఔత్సాహికులు చేసుకుంటూన్నారు.
2007 వ సంవత్సరము నుండీ ఈ సంబరాలు మొదలైనాయి.
"Hula hoop day ని సమాన సంఖ్యా కాల మానాన్ని ఎంచుకుని,
పండగలాగా ఔత్సాహికులు చేసుకుంటూన్నారు
2007-07-07 నుండీ అన్ని నగరాలలోనూ, దేశాలలోనూ
ఈ ఆనవాయితీ కొనసాగుతూన్నది.
హులా హూప్స్ ను కొనలేని బీద పిల్లలకు,
donations, చందాలు వసూలు తో కొని అందజేస్తూంటారు.
.2012- 12- 12 వఱకూ వీటిని ఉచితంగా బీదసాదలకు అందించి,
అందరినీ ఉత్సాహపరిచి, మలిచే ప్రక్రియ కొనసాగాలని నిర్వాహకుల తలపు.
2006 సంవత్సరం నుండి"ప్రపంచ హూప్ దినోత్సవము" డాన్సుగానూ,
వ్యాయామముగానూ ఊపు అందుకున్నది.
ఆన్నీ ఓ' కీఫీ , ఆమె భర్త కెవిన్,
స్నేహితులు గ్రూవ్ హోప్,స్టీఫన్ పిల్డెస్
మొదలైన వాళ్ళు లాభాపేక్ష లేకుండా హులా హూప్స్ ని
ఉద్యమంగా ప్రజలకు చేరువ చేసే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టి,
(Founded by Annie O'Keeffe, husband Kevin,
and Groove Hoop friend Stefan Pildes
World Hoop Day is a sponsored project of MarinLink.) సఫలీకృతులు ఔతున్నారు.
ఇది అతి ప్రాచీన క్రీడ,1958 లో హులా హూప్సాట లోకానికి పరిచయం ఐనది.
ఆస్ట్రేలియన్ మిత్రుని ద్వారా విని, బోధ పరుచుకున్న వ్యక్తులకు ఇది నచ్చినది.
వ్హాం-ఓ కంపెనీ స్థాపకులు రిచర్డ్ నేర్, ఆర్థర్ మెలిన్ లు
"వెదురు బద్దలతో గుండ్రంగా మెలిపి చేసిన చక్ర పరికరాన్ని గురించి తెలుసుకున్నారు.
(“re-invented” by an American company
called Wham-O founded by Richard Knerr and Arthur Melin in 1958.)
kneer యొక్క కుమార్తె లోరీ గ్రెగరీ (Lori Gregory)
తన ఆర్టికల్ ( "Once the hippest toy around, Hula Hoop turns 50") లో
"My father always believed the more simple a toy was,
the better it was”. అని, వివరించింది.
Wham-Oఈ హూప్ ఆటపై paTent ను గడించలేదు గానీ,
Hula Hoop" పేరు అనుకోకుండా వారి హక్కు పేటెంట్ ఐనది.
యువత యొక్క స్వేచ్ఛకు symbol గా
హులా హూప్ ప్రాచుర్యంలోనికి వచ్చినది.
Southern California స్కూల్ ప్లే గ్రౌండ్సులోనూ,
చుట్టుపక్కల అడుగిడిన ఈ వస్తు వినిమయం
అతి శీఘ్రంగా ప్రజా జీవన కార్యక్రమాల అంతర్భాగమైనది
.Richard Johnson, author of American Fads
(Beech Tree Books, 1985) wrote
"No sensation has ever swept the country like the Hula Hoop."
మొట్ట మొదటి నాలుగు నెలల్లో 25 మిలియన్ యూనిట్సు విక్రయాలు జరిగాయి.
ఈ ఆట దేహ సౌందర్యానికీ అందుబాటులో ఉన్న సులభ సాధనము
కాబట్టే 1958 లో 100 million అమ్మకములు జరిగాయి.
a report titled "Hula Hoops Swivel Their Way to 50",
filed by AP on June 18 2008 .
పాశ్చాత్య ప్రపంచాన్ని , కెనడా ,
Europe, Australia ఖండాలలో 1960 లలో
విపరీతమన ఆదరణ పొందింది.
ఇంతగా Instant Craze ను సంపాదించిన
రికార్డు బహుశా ఈ హులా హూప్స్ ఆటదేనేమో!!
Lori Gregory, Knerr's daughter,
is quoted in an article titled
"Once the hippest toy around,
Hula Hoop turns 50" in the
"Chicago Tribune" of June 18 as saying
"My father always believed the more simple a toy was,
the better it was”.
అన్నట్టు హూల పాటలు , వీడియోలు కూడా ఉన్నాయి.
ఐతే ఓ.కే!
"హులా హూప్స్
హోలరె హోలరె హోలారే!
హుప్ హుప్ హూప్స్
హైలెస్సా! హైలెస్సా!
Hula Hup !Hula Hup!
హిప్ హిప్ హుర్రే!
హిప్ హిప్ హుర్రే!

6, డిసెంబర్ 2010, సోమవారం

అమ్మరో! యశోదమ్మా!


ఈ వెన్నెల తోటలలో విన వచ్చే ఊసులేవో?
ఈ వన్నెల వీవనగా మొయిళుల ఊహలు ఏమో?

ముద్దు గుమ్మడు బాలుడు
మురిపాల క్రిష్ణుడు
తొంగి చూచు చున్నాడే,
తల్లీ! ఓ యశోదమ్మా!

నవనీతము గోరుముద్ద
ఇంత చాలు, నీవిస్తే.....
కొన గోటను గోవర్ధన గిరిని నిలుపు
అగును తాను!
వీరాధి వీరుడే అగును తాను
!
అమ్మరో! యశోదమ్మా! ;;;;;;;

5, డిసెంబర్ 2010, ఆదివారం

pencils అమర్చిన కళా వైభవ్


ఆశ్చర్యము కదా, ఈ నైపుణ్యములు!!!
పెన్సిళ్ళను జాగ్రత్తగా అమర్చిన ప్రజ్ఞ !!!
pencils కూర్పులతో సాధించిన
ఈ ఆధునిక కళా ప్రపంచానికి సరి కొత్త జిజ్ఞాసలు, ఆసక్తులున్నూ.
ఔరా! కాదేదీ కళలకు అనర్హములు!

4, డిసెంబర్ 2010, శనివారం

2, డిసెంబర్ 2010, గురువారం

శ్రీ సీతా రాముల కళ్యాణము & Koranjiilu


















శ్రీ సీతా రాముల కళ్యాణము ;
చైత్ర మాసములో, శుక్ల పక్ష నవమి నాడు,
పునర్వసు నక్షత్రంలో శ్రీ విష్ణు మూర్తి భువిపై శ్రీ రామ చంద్రుని గా జన్మించాడు.
కనుక చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీ రాముని పూజించాలి అని అగస్త్య సంహిత చెప్పింది.
ఆ రోజు మధ్యాహ్న"కాల వ్యాపిని" గా ఉండాలని ధర్మ శాస్త్రాలలొ చెప్పారు.
చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకూ ,
తొమ్మిది రోజులు “శ్రీ రామ నవమి ఉత్సవ ములను”
భారత దేశంలో ప్రజలు జరుపుకుంటారు.
మన ఆంధ్ర దేశంలో నవమి నాడు మాత్రమే కాకుండా,
ఎప్పుడూ శ్రీ సీతా రాముల కళ్యాణమును వేడుకగా చేసుకుంటూంటారు.
భద్రా చలం లో “పాంచ రాత్రాగమము”ను అనుసరించి,
పూజాదికములను నిర్వహిస్తారు.
@) కళ్యాణానికి సంకల్పం చెప్పి, ఆరంభిస్తారు.
(ఇతర సందర్భాలలో ఐతే వినాయక స్వామి పూజను చేయుట స్మార్త పద్ధతి)
@)భద్రాద్రిలో సంకల్పం చెప్పిన తర్వాత “విశ్వక్సేన పూజను” చేస్తారు.
@) పిమ్మట కళ్యాణ కర్తలకూ, కళ్యాణ వస్తువులకూ,
ఆ ప్రదేశానికీ పవిత్రతను కల్పించుటకై “పుణ్యాహ వచనం” చేస్తారు.
@)ఉత్సవ మూర్తులను గొని వస్తారు.
@)వధువు జానకీ దేవిని వరుడు దాశరధికి ఇచ్చి పెళ్ళి చేయుటకు “సంకల్పం చెబుతారు”.
@)యోక్త్రము ను తయారు చేసి ఉంచుతారు. ఈ యోక్త్రము 24 అంగుళాల నిడివి ఉంటుంది.
24 దర్భలతో సిద్ధంచేసి ఉంచిన ఈ యోక్త్రం న్ని పూజిస్తారు.
కన్య నాభి వద్ద – ఉల్ముకుడు అనే రాక్షసుడు – ఉంటాడు,
వానిని వధించడం కోసం జరిగేదే యోక్త్ర ధారణము.
అరిష్ట నివారణం కోసం ఈ తతంగం జరుగుతుంది.
యోక్త్రమును అమ్మ వారికి ధరింప జేస్తారు.
@) ఇలాగే రక్షార్ధమై కంకణ పూజ తో పవిత్రం చేసిన
“రక్షా బంధనము ను ధరింప” జేస్తారు.
@) ఇక్కడ వరుని కార్యక్రమములు నిర్వహించవలసి ఉంటుంది.
ఉపనయనము మాత్రమే జరిగి, బ్రహ్మచర్యాశ్రము పాటిస్తూన్నాడు అబ్బాయి.
మరి అతణ్ణి గృహస్థాశ్రమానికి తయారు చేయాలి కదా!!!
ఉపనయనము మాత్రమే జరిగి ఉన్న వరునికి, మళ్ళీ జంధ్యం వేయాలి.
ద్వితీయ యజ్ఞోపవీతమును ప్రసాదించేదే గృహస్థాశ్రమ అర్హత.
గార్హస్థ్యాశ్రమ నిర్వహణకు యువకుని, మానసికంగా సిద్ధం పరచ గలిగేదే ఈ ఆచారం.
శ్రీ రాఘవునికి సువర్ణ యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు.
@ “కోరంజీలు” -> వీరు ఎనిమిది మంది బ్రాహ్మణుల గ్రూపు.
ఈ కోరంజీలకు తాంబూల, దక్షిణలను ఇస్తారు.
తర్వాత వారు కన్యా దాత వద్దకు వెళతారు.
@) మూడు సార్లు వీరు “ప్రవరలు చెబుతారు”.
అనగా, మొదట “గోత్రమును” చెబుతారు.
అటు పిదప ఆ ఇరువురి గోత్రీకుల వంశస్థులలోని
ముఖ్యుల యొక్క, ప్రముఖుల యొక్క,
పేరు పొందిన వ్యక్తుల వివరాలను వివరిస్తారు.
వధూ వరుల వంశములయొక్క వివరాలను
ఇరు వర్గాల వారికీ, అతిథులకూ తెలియ జేయడమే ఈ ఆచారంలోని ప్రముఖ ఉద్దేశ్యం.
పరస్పరమూ కొత్త – కాబట్టి ఈ పరిచయ వేదిక గా ఈ ఆచారం సమన్వయం చేస్తున్నది.
@) భద్రాచలంలో “రామ నారాయణుడు” అనీ,
“సీతా లక్ష్మి” అనీ వ్యవహరిస్తారు.
అందు చేత, ఇచ్చట మూడు తరాల ప్రముఖులనూ పేర్కొను పద్ధతి
కాస్త విభిన్నంగా ఉంటుంది.
ఆంధ్ర దేశములోని మన భద్రాచలంలో
“ శ్రీ రామ చంద్రుడు అచ్యుత గోత్రోద్భవుడు,
పర బ్రహ్మ ముని మనుమడు,
వ్యూహ నారాయణుని మనుమడు
విభవ వాసు దేవుని పుత్రుడు ......... “ అంటూ వివరణలను వక్కాణిస్తారు.
అదే రీతిగా “సీతా మహా లక్ష్మీ అమ్మ వారి వివరాలు
ప్రేక్షకులకు లభించే వినూత్న వరాలు!
“చతుర్వేదాధ్యాయిని,
సౌభాగ్య విశ్వంభరి,
సౌభాగ్య గోత్రోద్భవి,
విశ్వంభర శర్మ ముని మనుమరాలు,
రత్నాకర పౌత్రి, కీరార్ణవ శర్మ పుత్రి “
అలాగ ఒక విచిత్ర జగత్తు మనకు పరిచయం ఔతుంది.
@) ఆశీర్వచనం చేసి, పెళ్ళి కొడుకు శ్రీరామునికి పాద ప్రక్షాళన చేస్తారు.
పుష్పోదక స్నపనమునూ, ఆభరణాలంకరణనూ చేసి,
పూజలు చేస్తారు.
మధు పర్కముల కార్యక్రమము జరుగుతుంది.
(పెరుగు, నెయ్యి) దధి, మధు, ఘృత, మధుపర్క ప్రాశనము చేస్తారు.
ఇట్లు ప్రయాణ బడలికను తీర్చిన వెనుక,
తతిమ్మా కార్యక్రమాలు కొనసాగుతాయి.
@) వస్త్రములు ఇస్తారు. గో దానము చేస్తారు.
దృష్టి దోష నివారణకై కొన్ని పనులు చేస్తారు.
అన్నము చూపిస్తారు.
@ కన్యా దాన కార్యక్రమము మొదలౌతుంది.
అందుకు “మహా సంకల్పము”ను పఠిస్తారు.
@) కన్యా దాన ప్రశస్తి చెప్పిన తదుపరి ఇతర దానాలను చేసి,
“చూర్ణిక” ఎలుగెత్తి చదువుతారు.
సుముహూర్త ప్రశస్తి పరమైన పద్యం వంటి గద్య రచనయే చూర్ణిక.
@) ఇక జీలకర్ర, బెల్లం, పసుపులు కలిపిన ముద్దను
వధూ వరుల తలలపైన పెడ్తారు.
ఈ మిశ్రమాన్ని ఇరువురికీ ఉంచే నేత్ర పర్వమైన ఆచారమును
తెలుగు దేశములో భక్తులు యావన్మందీ ఎంజాయ్ చేస్తూంటారు.
ఇలాగ “హస్త మస్తక ప్రయోగ సంయోగముతో
పెళ్ళి పందిరికే జయ కళ వస్తుంది.
@) “అక్షతారోపణ” అంటే నవ వధూ వరులు
ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకొనుట
అత్యుత్సాహ భరితముగా జరుగుతుంది.
మొదట మూడు దోసిళ్ళు హరిద్రాక్షతలు పోస్తారు.
$}”యజ్ఞము వృద్ధి చెందాలని నా అభిలాష.”
అని మొదటి దోసిలిలోని అక్షింతల రాశినీ,
$}”ధర్మము సమృద్ధి పొందాలని నా కోరిక.”
అని రెండవ దోసిలివీ,
$} “పశు సంపదలు బాగా ఉన్నత స్థాయిని పొందాలని నా మనోభీష్టము.”
అనే భావనలతో మూడవ దోసిలిలోనివీ పోసుకుంటారు.
@) “బ్రహ్మ గ్రంధీ ధారణము”
“పెళ్ళి కుమార్తె, పెళ్ళి కుమారుడూ భార్యా భర్తలు అయ్యారు కదా!
కాబట్టి గృహస్థాశ్రములో అడుగిడి,
పరస్పర బద్ధ అనురాగముతో ప్రవర్తిస్తూ,
ధర్మ మార్గానుయాయులై దిన దిన ప్రవర్ధ మానముగా వర్ధిల్లాలనే
యోచనతో ఏర్పడినదీ ఈ బ్రహ్మ గ్రంధీ ధారణము.
కళ్యాణ ఆరాధనలు పూర్తి ఐన పిమ్మట, నివేదన తరువాత
భక్తులకు ప్రసాదము లభిస్తుంది.
ఆ ప్రసాదములే తెలుగువారికి నోరూరించే
వడ పప్పు, పానకములు అని ఈ పాటికే మీరు గ్రహించి ఉంటారు,

( ఆధారము ; late ananta ramayya)

1, డిసెంబర్ 2010, బుధవారం

వర్ణ భరితం తూలికలు
















అందాలకు నెలవులు,
చిన్న చిన్నరేఖలకు
అద్భుత భావాలను
అందించే సుదతీ మణుల
చిరు నవ్వులు;
కుంచెల (తూలికల)హృదయాలలో
వర్ణ భరితంగా
సాక్షాత్కరింప జేసే ప్రజ్ఞ
దరహాసాలకే సాధ్యం.

28, నవంబర్ 2010, ఆదివారం

ఆవులు ,“హయమార్” అనే మూలిక,















హైదరాబాద్ నివాసి ఫర్హతుల్లా బేగ్ నిర్మాణతలో
రూపుదిద్దుకున్న డాక్యుమెంటరీ సినిమా
"Mad Cow; Sacred Cow".
ఫర్హతుల్లా బేగ్ ఈ వెండితెర రూపకల్పన కోసం ఎంతో శ్రమించారు.
ఈ సినిమా నిర్మాణమునకు అప్పట్లో సంచలనం కలిగించిన ఒక వార్త -
పాశ్చాత్య దేశాలలో లక్షలాది ఆవులు ,
మనిషి చేసిన తప్పిదానికి బలి అయినాయి .
భారత దేశములో సంఖ్యా పరంగా ఎక్కువగా ఉన్న ఆవుల వలన
వాతావరణ కాలుష్యం జరుగుతూన్నదనే దుష్ప్రచారం జరుగుతూన్నది.
ఇందులోని సామంజస్యతను పరిశీలన చేయ వలసి ఉన్నది.
ఇది ఎంత వరకూ సబబు? అనే ప్రశ్నకు
అనేక అంశాలు అందరి అవగాహనకై ఉన్నవి.

విదేశాలలో పాడి తగ్గినప్పుడు,
ఆవులకు “ఆక్సిటోసిడ్” అనే హోర్మోన్ ను ఇస్తున్నారు.
ఇలాంటి ఇంజెక్షన్ ల వలన, గోవులకూ ,
తన్మూలమున మనుష్యులకూ ఆరోగ్య సమస్యలు ఎదురు అగుతున్నవి.
సంకర జాతి ఆవులకు అనేకములకు గంగ డోలు ఉండవు.
ఎక్కువ వేడిని తట్టుకో లేవు.
మాంసమును కలిపిన కృతిమ దాణాను
వాళ్ళు బలవంతంగా తినిపిస్తూ,
కొత్త గో జాతిని ఉత్పత్తి చేయ సాగారు;
అందువలన 'mad coe desease విపరీత పరిణామాలు
ప్రపంచానికి కలిగిన చేదు అనుభవమే!

***********************************

మన India లో దేశ వాళీ ఆవులకు “గో మాత”గా గౌరవం లభించడానికి కారణం
వాటి ద్వారా మానవ జాతికి కలుగుతూన్న ఎన్నో ఉపకారాలు కారణము.
వాటికి మూపురములు, గంగడోలులు ప్రత్యేకత.
దేశీయ ధేనువులలో మూత్రము –
నాలుగు సార్లు వాని దేహములో ఫిల్టర్ అగును,
అలా వడపోతల తర్వాత వాని మూత్రము బయటకు విడుదల చేస్తాయి.
కనుకనే “పంచ గవ్య ఔషధములలో –
గో మూత్రము సైతము వాడ బడుతూన్నది.
కారడవులలో అనేక రకాల తరువులు ఉంటాయి, కొన్ని హానికరమైనవి.
ఆవులు మాత్రమే వాటిని తిని, నిరపాయకరంగా మార్చుకుని,జీర్ణము చేసుకోగలవు.
“హయమార్” అనే మూలికను తినగానే, గుర్రము విగత జీవి అగుతుంది ,
దీన్ని మేకలు , కోతులు వంటి జంతువులు కూడా ముట్టుకోవు..
కానీ హయమర్ (గన్నేరు ;ఆంగ్లం Oleander) ని
ఆవులు భేషుగ్గా భుజిస్తాయి.

SYNONYMS -
Sansk. : Divyapushpa, satakumbha,

Asvamaraka, Hayamara.
Assam. : Diflee, Sammulhimar
Beng. : Karbbe, Karbee
Eng. : Sweet-Scented
Oleander
Guj. : Kaner
Hindi. : Kaner
Kan. : Kanagilu, Kharjahar, Kanigale, Kanagile
Kash. : --
Mal. : Kanaveeram
Mar. : Kanher
Ori. : --
Punj. : Kanir
Tam. : Sevvarali, Arali
Tel. : Kastooripatte, Errugumeru
Urdu. : Kaner
************************************************
గంగ డోళ్ళు, మూపురములు – విశిష్టతలను చేకూర్చుతున్నాయి.
ఆమ వాతానికి నిశ్చయమైన మందు:--
ఆవు శరీరంలో “ సూర్య నాడి” కలదు.
సూర్య నాడి - Sun Rays నుండి శక్తిని సేకరిస్తుంది;
ఆ సంచయనము ద్వారా – 3 రోటిడ్ – అనే ఎంజైం ఉత్పత్తి జరుగును.
ఈ లేత పసుపు రంగు పదార్ధము ఆరోగ్య ప్రదాయిని.
Anti Biotecs దుష్ప్రభావాన్ని -
గోమూత్ర ఆర్క్ 2 నుండి 80 రెట్లు తగ్గిస్తుంది.
1 స్పూన్ ఆవు నెయ్యి ,హోమం ద్వారా –
1000 సి సి ల ఆక్సిజన్ ను ప్రభవిల్ల జేస్తున్నది.
“యజ్ఞోపతి” ద్వారా జగత్తుకు కలిగే మేలు గురించి
శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తునారు.
విదర్భ లో పుసద్ అనే ఊరు ఉన్నది.
అక్కడ నివసిస్తూన్న “పండరీ పాండే”
40 సంవత్సరాల నుండి అనేక ప్రయోగాలు చేస్తూన్నాడు.
అతను – ఒక కిలో గ్రాము ఆవు పేడతో
= 40 కిలోల ఎరువు తయారౌతుందని నిరూపించాడు.
ఒకసారి పొలములో ఈ గోవు కంపోస్టును వేస్తే –
మళ్ళీ 3 ఏళ్ళు వఱకూ , ఎరువులను వేసే అవసరం ఉండదు.
అందు వలన ఎంతో రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గుతుంది.

***********************************************

మధురా పురినీ, ద్వారకనూ , ప్రజలనూ బ్రోచిన మహనీయుడు
శ్రీ కృష్ణుడు ఆల మందల నిర్వహణలో మేటి,
గోపాల బాలుని గా అందరి చేత మన్ననలు పొంది,
పూజలు అందుకుంటూన్నాడు కదా!
దిలీప చక్రవర్తి, జమదగ్ని, సత్య కామ జాబాలి ,గౌతమ ఋషి ,
మున్నగు వారు అనేక వ్యక్తులు ప్రాచీన కాలం నుండీ
మన భారత దేశంలో ధేను సంరక్షణ కు పునాదులు వేసి,
విశిష్ట ఆచారాన్ని నెలకొల్పారు.
మారిషస్, మలేషియా ఇత్యాది (ఆసియా ఖండము)
అనేక దేశాలలో గో మాతకు సమంజసమైన ప్రాధాన్యం కలదు.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...