17, మే 2009, ఆదివారం

లూజేంగే! శ్రీ రాజీవ్ గాంధీ


Pramukhula Haasyam

లూజేంగే!

By kadambari piduri,

కీర్తి శేషుడు శ్రీ రాజీవ్ గాంధీ ఆనాడు అలుపూ సొలుపూ లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బాల్యం నుండీ ఇంగ్లీషులోనే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. అందుచేత మాతృభాష ఐన హిందీతో పాటుగా ఆంగ్ల భాషకూడా మిళితమై పోయేది. ఎంతగా మిశ్రమం ఐపోయేదీ అంటే శ్రోతలకు తాము వింటూన్నవి హిందీ పదములే అని భావిస్తూండేంతగా!

రాజీవ్ గాంధీ ఒక చోట ఇస్తూన్న స్పీచ్ లో ప్రసంగ వశాత్తూ దొర్లిన మాటలు "...జీతేంగే యా లూజేంగే..." .

చటుక్కున త్రుళ్ళిపడి వాడిన పదమూ, దొర్లిన భాషా దోషాన్నివెంటనే గ్రహించారు రాజీవ్ గాంధీ. వెనువెంటనే తన పొరబాటును సరిదిద్దుకుంటూ, ఆయన ఉపన్యాసమును కొనసాగించారు."....జీతేంగే యా హారేంగే...."

ఇలాంటి వింత భాషా స్ఖాలిత్యాలు ఆనక నవ్వులను విరబూయిస్తాయి కదూ!
'''''''''''