
హంసల దీవి ;;;;;;;
'''''''''''''
పిల్లలూ!చారిత్రక ,భౌగోళిక ప్రాధాన్యము కలిగిన అనేక ప్రదేశములు మన దేశములో ఉన్నాయి . ఆ యా ప్రంతాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసు కుందామా!!!!!
"హంసల దీవి"::::::కృష్ణా నది ,సముద్రములో కలియు చోట ఉన్న పుణ్య క్షేత్రము.
గంగా నది లో అనేక కలుషములు ఏర్పడ సాగెను. ప్రజల పాపములను స్వీకరిస్తూన్న ,"గంగా మాత ",పాప ప్రక్షాళనము చేసుకొనుటకై పక్షి రూపము ధరించెను .
"గంగా దేవి " , కృష్ణా సాగర సంగమము ఉన్న సీమలో ,,,కాకి రూపములోవచ్చి ,స్నానము చేసేది.(గురుడు కన్యా రాశిలో ప్రవేశించే శుభ ఘడియలలో ,వాయస రూపిణి ఐన గంగమ్మ ,ఓలలాడేది.)కాకి రూపంలో వచ్చిన ఆమె ," హంస"గా మారి పోయేది .
అందు వలననే ,ఆ సీమకు "హంసల దీవీ " అనే నామ ధేయము కలిగినది .
'శ్రీ వేణు గోపాల క్షేత్రము ' ,సంగమేశ్వర ఆలయము ' ఇచట ఉన్నవి .శ్రీ విష్ణు మూర్తి , పరమేశుడు, ఒకేచోట కొలువై ఉండుట ,ఇక్కడి ప్రత్యేకత .
హంసలదీవి , విజయ వాడకు 90 కీ మీ' దూరములో ఉన్నది .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి