7, మే 2009, గురువారం

ఎన్నెన్నో పిట్టలు! గుజ్జన గూడులు !


ఎన్నెన్నో పిట్టలు!










1)మామిడి కొమ్మల కోయిలమ్మ 
పాటలు పాడేను!
సంపెంగ గుత్తులలో వయ్యారి నెమలి
నాట్య మాడేను!

2)చేమంతి, మందార,
పారిజాతాలలో 'సీత కోక చిలకమ్మలు!
3)జామ చెట్లల్లోన రామ చిలకల్లు
బాదాము తరువులలో ఉడుత పిల్లల్లు
ధాన్యాల కంకులపై కిచ కిచల పిచ్చికలు
క్షేత్రాల మడుగులలొ కొంగల జపములు
4)మైనాలు, గోర్వంక , పాలపిట్టలు
గిజిగాడి గూడులు అందాల నేతలు!
బాతుల హొయలు 
హంసలకు గురువులు!

నెహ్రూ చాచాకు ఇష్టము
"శాంతి పావురములు"
పిట్టల్ని తిలకించి, కట్టారు బాలలు 
"గుజ్జన గూడులు":
చేసారు అందరూ కేరింత నాట్యాలు.
ఆబాల గోపాలమున ఇంత సందడిని
వీక్షించ "కృష్ణుడు" ఈ భువి నవతరించేను

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...