మధ్యమ షష్టి లేదు!
| సభలో అహూతుల మధ్య ప్రసంగాలూ, చమత్కారాలూ, నవ్వుల జల్లులు కురిపిస్తూన్నాయి. వరదాచార్యులు మాట్లాడుతూ అన్నారు  'మా కృష్ణమాచార్యులు సదా  మా సభా సదులకు విధేయులే!"  అలా అంటూండగానే చటుక్కున  వరదాచార్యులు మాటలకు అడ్డు తగిలి, ఇలాగ అన్నారు "నేను ఒట్టి కృష్ణాచార్యులునే! మధ్యమ షష్టి లేదు. నేను చాలా సన్నం!" కృష్ణాచార్యులు గారి పలుకులకు వరదాచార్యులు "వీరిని కృష్ణమాచార్యులను చేసి  మా వైష్ణవులలో కలిపేసుకుందామనుకుంటే  ఆయనేమో రానంటున్నారు....." అని చమత్కరిస్తూ ఆయనను చాలా పొగిడారు. అప్పుడు కృష్ణాచార్యులు ఇట్లా సెలవిచ్చారు "వరదాచార్యులు నాపై చాలా ప్రశంసలను గుప్పించారు.  ఉన్నవి చెప్పడం కష్టం,  లేనివి చెప్పడం సులభం.  ధారాళంగా చెప్పడం వారి సహృదయతకు నిదర్శనమైన మంచి అలవాటు." సాహిత్య పరిమళ భరితమైన ఆనాటి ఆ పిచ్చాపాటీ సభికులను అలాగ అలరించింది. | 
| Views (62) | 
 
 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి