.jpg)

Telusaa!
తొండైమాను చక్రవర్తి ;
By kadambari piduri, Jan 22 2009 3:57PM
మీకు ఆకాశరాజు ఎవరో తెలుసా ?
శ్రీ వేంకటేశుని పత్ని "పద్మావతి"కి సాక్షాత్తూ కన్న తండ్రి.
శ్రీ పద్మావతీ దేవికి చిన్నాయన అనగా ఆకాశ రాజుకు తమ్ముడైన రాజు "తొండై మానుడు".
ఇతడే తొండమాన్ చక్రవర్తి అనే పేరుతో కూడా అన్నమయ్య కృతులలో వినుతి కెక్కాడు.
ద్వాపర యుగం తర్వాత కలియుగారంభం అవసాగినది.
మహా భారత యుద్ధం అనంతరం మానవ జాతి సమాజము మరల పునర్నిర్మాణము కొనసాగినది.
విక్రమార్కుడు మున్నగు ప్రభువుల తర్వాత చంద్ర వంశములో జన్మించిన.
సుధర్ముడు పూర్వ జన్మలో గొప్ప పుణ్యము చేసుకొనెను.
సుధర్మునికి;;;;;;;
ఆకాశ రాజు, తొండమానుడు అనే సుపుత్రులు ప్రభవించారు.
శ్రీ వేంకటేశునికి తన కుమార్తె పద్మావతీ దేవిని ఇచ్చి ,పెళ్ళి చేసిన పుణ్యచరితుడు ఆకాశ రాజు.
పద్మావతి పిన తండ్రి ఐన తొండైమానుడు చారిత్రక ప్రసిద్ధి కల వ్యక్తి.
శ్రీ తిరుమలేశునికి ఇతను "ఆనంద నిలయము"ను కట్టించెను.
"కపిల తీర్ధము"అనే పెద్ద చెరువును త్రవ్వించెను.
ఈ చెరువు జలములతోటే ఇదివరకు స్వామి వారికి అభిషేకములు నిర్వహించే వారు.
కపిల తీర్ధమే "తామర గుంట"గా ప్రసిద్ధి కెక్కెను.
తొండమానుడు శాతవాహనుల సైనిక దళాధిపతి.
వీరాగ్రేసరుడు, గొప్ప విజేత.
ఈయనే నారాయణ వనమునకు పాలకుడు.
శైవ భక్తుడైన తొండైమాను చక్రవర్తి పరిపాలించిన సీమకు
"తొండై మండలము" అని పేరు కలిగెను.
ఈతని రాజధాని "కోట".
తొండమానుని రాజధాని ఐన కోట;
శ్రీ కాళ హస్తికి 8కి.మీ. దూరములో ఉన్నది.
ఈ గ్రామమే ఇప్పుడు "తొండమనాడు"గా పేరు గాంచినది.
(టూరిస్టు డిపార్టుమెంటు ఈ సీమను కూడా అభివృద్ధి చేసి,
ప్రజలకు చారిత్రక అవగాహన కల్పించ వలసిన అక్కర ఉన్నది)
''''''''''''''''''''''''''''''''''''''''''''''
1 కామెంట్:
Good one.
కామెంట్‌ను పోస్ట్ చేయండి