
మీసాల నాగమ్మ
By kadambari piduri,
N.T.రామారావు ఆంధ్రుల అభిమాన నటుడే కాక
తెలుగుదేశం పార్టీ స్థాపనతో ప్రపంచానికి
తెలుగు వెలుగును చాటిన మేటి నాయకుడు కూడా.
అందువలననే,
ఆయన ప్రతి చర్యా ఆంధ్రుల హృదయ గ్రంధాలలో నిక్షిప్తమౌతూనే ఉంటుంది.
రామారావు బాల్యం నిమ్మకూరులో గడిచింది.
విజయవాడలో S.R.R.C.V.R. College లో ఇంటర్మిడియెట్ లో చేరారు.
ఆ కాలేజులో తెలుగు శాఖ అధిపతిగా శ్రీ విశ్వనాధ సత్యనారాయణ ఉండేవారు.
విశ్వనాధ "రాచమల్లు దౌత్యము" అనే నాటకాన్ని విద్యార్ధుల చేత ప్రదర్శింపజేశారు.
అందులో నాగమ్మ పాత్రను తారక రామారావును ధరించమన్నారు.
రామారావు అందుకు అంగీకరించారు.
ఐతే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది.
నాగమ్మ పాత్ర కోసమని మీసాలు తీసేయమన్నారు గురువు గారు.
నూనూగు మీసాల నూత్న యవ్వనంలో అడుగిడుతూన్న రామారావు
అందుకు ఒప్పుకోలేదు.
చివరికి చేసేది లేక "అలాగే!నీ ఇష్ట ప్రకారమే చేయి" అన్నారు.
అలాగే మీసాలతోనే స్టేజీ మీద నటించి, ప్రైజు కూడా కొట్టేసాడు మన హీరో.
ఆ కాలేజీలో "మీసాల నాగమ్మ" అనే నిక్ నేమ్ ను కూడా సంపాదించాడు
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
ఆశ్చర్యకరంగా సినీ హీరోగా స్థిరపడిన తరువాత
పల్నాటి యుద్ధం సినిమాలో నాగమ్మku
ప్రతిద్వంద్వి ఐన బ్రహ్మన్న పాత్రను అద్భుతంగా పోషించారు రామారావు.
''''''''''''
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి