7, మే 2009, గురువారం

చెంగా బజారు నాటకములు(మద్రాసు )








Telusaa!

చెంగా బజారు నాటకముల...!!


మద్రాసు లోని 'చెంగా బజారు నాటకాల'కు ప్రేక్షకులు 
చెంగు చెంగున గంతులేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. 
"తారా శశాంకము' నాటకములో 
"తార"గా 'బాలామణి' నటించేది. 

"ఫాల భాగమున వజ్రాల పాపిట బొట్టు...తమక మెడ నంట సంపంగి తైల మంటె!.........." 
ఈ సీనులో రంగ స్థలముపైన ఒక దోమ తెర కర్టెనును వేసే వారు. 

ఆ తెర వెనుక, నటి దిగంబరముగా చంద్రుడి తలను అంటుతుంది. 
ఆమె కేవలం దిగంబరంగానే నిలబడేదో లేక బనియన్ డ్రెస్సు మీద అలాగ కనిపించేదో గానీ, 
ఏది ఏమైతేనేమి గానీ ఆ మహత్తర దృశ్యాన్ని చూడటానికే జనం వచ్చేవారు. 
పెద్ద తొక్కిసలాట అయ్యేది. 

మొదటి తరగతిలో కూర్చునేందుకు 
మదరాసులోని "ప్రముఖులు" ముందు కెగబడేవారు.

 ఆ ఘట్టం అయిపోగానే 
ఖాళీ అయిపోయిన కుర్చీలను చూస్తే చాలు!,
 ఆ మహాశయులందరూ ఏ ఆకర్షణ కోసం దయ చేశారో ఇట్టే అర్ధమౌతుంది.

'అరవ భాష తెలియక పోయినా,
అరవం అంటే రాళ్ళ డబ్బా చప్పుడు'
అని ఎగతాళి చేసినా, 
మన తెలుగు విద్యార్ధులు కూడా
 అప్పుడప్పుడు ఈ "చెంగా బజారు నాటకముల"ను 
చూడటానికి పోవడము కద్దు!
 అవును పాపం! ఇటువంటి చాన్సు 
మన దేశంలో ఎక్కడ దొరుకుతుంది గనుక?!!!

(తాపీ ధర్మా రావు గారి 'రాలూ, రప్పలూ'లోని విశేషాలు ఇవి) 
Views (95)

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...