7, మే 2009, గురువారం

అది నీలి కలువేనా ?!!!

Kovela

అది నీలి కలువేనా (కవితా రూపకము)


వింత ఇది ఏమమ్మా!!
రండి! చెలియల్లార!
రారండి! వేగమే! 

తన కుంచె విదిలించి,విదిలించి
ఇది, నిజమొ? భ్రాంతియొ 
కాక పొరపాటో అనుచు
బ్రహ్మ విస్మయమంది
తిలకించు, నేత్రములు
నులుముకుని, నులుముకుని 

ఆ అబ్బురము గనుచు 
"అబ్బోసి!" అనుకొనుచు
శ్రీ వాణి నగవులను 
ఒలికించ సాగెను

మరి మరీ చూచుకొను 
తన సృష్టి వైచిత్రి
నలు మోములను బ్రహ్మ

రండి!! సఖియల్లార!!
రా రండి!వేగమే! 

ఈ రేయి కొలనులో 
కలువ విప్పారెనో?!
కలువ దళముల
నిండు చెలువంపు మిసమిసలు!
తెలి కలువ కాదది!
నీలాల కలువయే!
నీలి కువలయమునూ
కాదోయి సుమ్మీ!

ఆమె:
"నీలి కలువని కలికి 
భ్రమసేవు, చాలులే!

ఆమె:2
"కలువ కాకున్న మరి ఏమది?
కువలయమ్మును నీవు చిన్నబుచ్చుదువేల?"

జవాబు:
వింత తెలిసెను నేడు,
వంశి మ్రోగిన జాడ
నీలి కలువల శోభ 
నిలిచి ఎదుటను నవ్వె
దిగివచ్చిన నింగి
వాడె కద, కన్నయ్య 

కోరస్:
తెలిసె వింతల సౌరు!
కులుకు ప్రకృతి కులుకు!


''''''''''

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...