8, మే 2009, శుక్రవారం

ప్రమిద_ప్రమద


'''''''''''''''''''''


ప్రమిద_ప్రమద ;;;;;;;;;
'''''''''''

దోసిలిలో ఈ ప్రమిద,
శశి బింబము వెదజల్లే
కిరణాల కలములతో
"వెలుగు పద్యము"లను రాస్తుంది.

జాగృతికి
తానే కృతి కర్తయై భాసిస్తుంది.
ఆశలకు నిఘంటువై,
ఆశయాలకు భాష్య కర్త్రియై,
హసిస్తుంది.

ఆలోచనలకు తాత్పర్యమై,
ఆదర్శాలకు సారాంశమై
వివృతమౌతూన్న
వెలుగు వెలుతురుల
వెన్నెలల చల్ల దనాలను
ఉదయ రాగాలకు
ప్రసాదంగా ఒసగుతుంది.


''''''''''''''''''''''''''''''''''''''''''''