21, జనవరి 2009, బుధవారం

వెన్నపూసల దండలు

వెన్న పూసల దండలు ;;;;;
'''''''''''''''

(పల్లవి);;;
''''''

1)ఉట్టి మీద చట్టిలోన
వెన్న ఏమయ్యింది???
వేణు గాన లోలుడు,బాల కృష్ణుడు
"నక్కి ,నక్కి వచ్చాడు ;
నవనీతం మాయం!మాయం!


1) కుండలోని వెన్న కాస్త
మాయ మాయెనండీ!
ఇది,
మా చిలిపి" కన్న" గారడీ! //


2)గప్ చుప్ గా మటు మాయం !
కుంభంలో నవనీతం!
క్రిష్ణయ్య మేని నిండా వెలసినాయి
పూసలు -వెన్న పూసలు //

3)దారమేది లేకుండా
వైనంగా హారాలు
గుండ్రం "పూసల దండలు!"
వెన్న పూస దండలు
హైలెస్సా! ఓ లెస్సా! //

4)నవ రత్నాల్ ,మణి దండల
కాంతులనే: మించి మెరయు చున్నవీ!
నవ్యమైన మాలికలివి!
నవనీతపు: మిసి హారమ్ములు
గుండ్రంగా గుండ్రం గుండ్రంగా!


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 5

అధ్యాయ శాఖ ;- 30 A ;-  తాటాకుల కవిలె కట్ట సేకరణ ;; ;           లేఖక్ 1 ;- ఇందాక వస్తుంటే - వీరకుడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు, ఎవరినో!?  ల...