18, జనవరి 2009, ఆదివారం

మామ కాని మామ

1 జాబిలి చాలా తపములు చేసెను ;;;
--- బాల పాపల నవ్వుల కోసము ! ;;;

(2) పిల్లల నడిగెను వరములు చంద్రుడు ;;;

"మీ నగవుల సొగసులు కొంచెం ఇమ్మ"ని. ;;;
అడిగిన తడవుగ ,ఆనక తాను ;;;
"తరిపి వెన్నెలల పాలను పొందెను!" ;;;


(3) ఎల్ల జగములకు 'మామ వౌదువ 'ని ;;;
పిల్లలందరూ వరముల నొసగిరి! ;;;
నాటి నుండియే చుక్క రేడు " ;;;
"చంద మామ " అను పేరును ;;;
ఇంచక్కా పొందినాడు. ;;;


మామ కాని మా'మ కదా ,;;;
లోకాలకు ,చల చల్లని వెలుగు నొసగు ;;;
చంద మామ ! గగనాలకు మిత్రుడు!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

జయ జయ జయహో

[ బౌద్ధారామము ]  ;- వసంతసేన ;- లేఖకులు పరుగెత్తుతూ వస్తున్నారు. లేఖక్ 1 ;- అమ్మా వసంతసేనా! వైద్య సేవిక వలన కాకతాళీయంగా మాకు తెలిసింది,  ...