19, జనవరి 2009, సోమవారం

విన్నపములు 3

1) లాహిరి ! లాహిరి! వీల పాటలను
వెదురు గడలకు నేర్పు నేర్పరి ;;;
పోకిరి వీడే "గీత "కు ఆమని !
మురళీ సుధలను ప్రజ లందరికీ
పంచి ఇచ్చిన జగన్మోహనుడు!
మన బాల కృష్ణుడు! //


2) గుడు గుడు గుంచపు గొల్ల పిల్లడే!
"పచ్చి కొట్టి , వ్రేపల్లెను విడిచి ,మరి ,
అల్లరి కన్నయ ద్వారక చేరెను !


మధురా నగరిని విడిచేనో?!
రాధిక నొంటరి చేసేనో?!
యశోద నొంటరి చేసేనో?! //


3) మోహన కృష్ణా!
పలికించుమయా !నీ వంశిని ఒక పరి!

ఆ యమున తరగలు నీ ఊసులను
మాకందించీ, మము సేద దీర్చునయ!



;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...