లిపి -కోవెల ;;;;;;
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
1) బడిలోకి ,
అక్షరాల గుడిలోనికి ;;;
పలకలతో వచ్చాము :;;
చిన్నారి పిల్లలము !
చివు నవ్వు పూతలము ! //
రండి ! నేస్తాల్లారా !
ఒక్క ఉదటున రండి !
2) ఆటలూ ఆడేము !
పాటలూ నేర్చేము !
ఆట పాటల తోటి
చదువులే చదివేము ! //
3) అలకలన్నీ మాని
అక్క తమ్ముళ్ళార!
అత్త మామల్లార !
రారండి! రా రండి! //
4) విద్యలలోసారమంత
కొదవ లేకుండానే
ఆది మూలం నుండి
చేయుదము అధ్యయనము //
5) పెద్దలూ, పిన్నలూ అందరూ రండి !
"విద్యలకు తల్లిని" పూజించుదాము ! //
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి