7, జనవరి 2009, బుధవారం

అమ్మా!ఇపుడే వస్తా !

అమ్మా!ఇపుడే వస్తా !
'''''''''''''''

1)పిల్ల గాలి ఊసులన్ని
చిన్ని పూల బాసలన్ని
మనసు విప్పి చెబుతుంటే

ఇపుడే వస్తానమ్మా!
కొంచెం సేపు ఆగమ్మా! //

2) వన్నె వన్నె ఈకలను
చిన్ని రాళ్ళు,గవ్వలనూ
పోగు చేసుకుని నేను
ఇపుడే వస్తానుండమ్మా! //

3)గడ్డి పూల సొగసులన్ని
వెన్నెల కందిస్తాను
అలల నురుగు చిన్నెలను
ఇంద్ర ధనువులకు ఇపుడే
పరిచయాలు చేసొస్తా!
ఇపుడే వస్తాను !ఆగమ్మా! //

4) అందమైన ప్రకృతికి
బాల సారె పేరు పెట్టి
ఆనందపుఋతువులకు
ఆ-ఆ -లను దిద్దించి
అమ్మా! నే వస్తాగా!
తొందర చేస్తావేమి !?! //

5) బుల్లి బుల్లి పిట్టలకు
మాటలు నేర్పిస్తాను
చిరు జల్లుల వానలను
ఆటలు ఆడిస్తాను
అమ్మా!ఇపుడే వస్తా!
హడావుడి చేయొద్దు! //


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...