12, జనవరి 2009, సోమవారం

ఆడేద్దాము అల్లీ బిల్లీ!

ఆడేద్దాము అల్లీ బిల్లీ!

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

1)నాతో పాటు పాటలు పాడును ;;;

కుహు కుహు కోయిల నానేస్తం! ;;;

పని పాటులతో మునిగి తేలేటి ;;;

తేనెటీగయే నా కాదర్శం! ;;;

2)పోటీ పడుతూ - నాతో ఆడును ;;;

రంగు రంగుల సీతా కోక ;;;

మాటల పట్నంలోన - చిలకలు

మైనాలకు నే కథలను చెబుతా! ;;;

3)పరుగుల జింకలు - కిల కిల పిట్టలు ;;;

అమ్మా!నాన్నా! - పిన్నలు,పెద్దలు! ;;;

అందరు రండీ! - ప్రకృతి తోటీ ;;;

కలివిడిగానూ ఆడేద్దాము ;;; అల్లీ బిల్లీ!

4) చెమ్మ చెక్క - చేరెడు మొగ్గలు ;;;

అల్లీ బిల్లీ - గిల్లా దండ ;;;

దాగుడు మూతలు - దండా కోర్ !

అటుకులు చిటుకులు - కలిపిన చిటుకులు ;;;

5) అన్న దమ్ములను కలిపే ఆటలు ;;;

పొర పొచ్చాలను మరిపించే క్రీడలు ;;;

ఎల్ల లోకముల -నొక్క ఇల్లుగా-

చిటికెలొ మార్చే చక్కని ఆటలు ;;;

రండీ! రండీ! ఆడుదము!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...