9, జనవరి 2009, శుక్రవారం

నెమలి ఈక (7)

నెమలి ఈక (7)

::::::::::::::::::


1) చిట్టి చిట్టి పాపాయికి :::

ఈక ఒకటి దొరికింది :::

చిట్టి తల్లి ఆ ఈకను :::

పట్టి ,పట్టి చూసింది


2)ఈకంటే ఈక కాదు :::

కన్నంటే "కన్ను" కాదు :::

అది , వేడుకైన నెమలి ఈక! :::

కడు వేడుకైన నెమలి కన్ను!


3) సిరి కన్నుల నింపేను :::

చిరు వన్నెలు చిందేను :::

వెన్నెలలో మెరిసేను ! :::

వెన్నెలనే మురిపించును :::

ఇంతింతని చెప్ప లేము ::

: ఔరౌరా! దీని సొగసు!!!

4)అలాంటిలాంటి ఈక ఐతే ::;

అలనాడు క్రిష్ణయ్య :::

ఎలా దీన్ని మెచ్చేనట!?!

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 5

అధ్యాయ శాఖ ;- 30 A ;-  తాటాకుల కవిలె కట్ట సేకరణ ;; ;           లేఖక్ 1 ;- ఇందాక వస్తుంటే - వీరకుడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు, ఎవరినో!?  ల...