16, జనవరి 2009, శుక్రవారం

-సిరి వెన్నెల

(పల్లవి)
ఏడు కొండల స్వామి వెంకన్న!వెంకన్న! (అను పల్లవి) ఏడు గడ రక్ష రేకు - నీకు,నాకు,మనకున్నూ! ఈ మాట నిజమన్నా! ఔనన్నా! ఒట్టన్నా! // 1)కొండ కొమ్మున నెలవు -సిరి నాధుని కొలువు 'లంఘనమే' 'నడకాగా,-కాలి;నడకలే పరుగులుగా' లంఘనములై,పరుగులయీ- పద!పద!పద!బిరాన! అప్పుడు ... (కోరస్) -సిరి వెన్నెల మన-పదాల మెత్తలేగద!ఔనన్నా! //
2)తిరుమల కోవెల దాకా-నెలకొన్న పూల చెండ్లు శ్రీ కన్నయ్య అడుగులే! -స్వామి అడుగు జాడల సిరి "వెన్నెల 'లే" జల్లుల ' - పూతలే మెత్తలగును పద,పద,పద! బిరాన! // (కోరస్) ::: పల్లె జాన పదాల -నెత్తావులు పరచేను! తద్ధిమి ధిమి ,తద్ధిమి ధిమి!- కోలాటాలాడుతూ చిందులనే వేయుచూ - తిరుమల వాసుని కొలువుకు పద,పద,పద!బిరాన! //

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...