బుంగ మూతి ;;;;
''''''''''''''''''''''''''''''''''''''
''''''''''''''''''''''''''''''''''''''
1) పలక , బలపం పట్టి ;;;
పరుగు పరుగున బడికి
వచ్చింది చిన్నారి! గారాల పట్టి !
బంగారు కూన మా చిట్టి పాపాయి !
2) పులుకు పులుకున తాను
ఏవేవొ రాస్తుంది
ఉలుకు ఉలుకున చూసి
ఫోజులే కొడుతుంది
గొప్ప ఫోజులే కొడుతుంది //
3) తళుకు తళుకున నవ్వి
" శ్రీలు " చుట్టేస్తుంది;
"పిచ్చి గీతలు"అంటు
ఉత్తుత్తిగాను మేమంటేను
అలిగి కూర్చుంటుంది ,
"బుంగ మూతి"ని పెట్టి !
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి