Telusaa!
ఈ లిపి మన లిపి కాదు!
మలేషియాలో వ్యవహరించబడునది "మలై భాష". ఈ భాషలలో ఏక వచన పదము మాత్రమే ఉన్నాయి. ఏకవచనముతో పాటు వేరేగా బహువచనమును చెప్ప వలసివస్తే అదే మాటను రెండు సార్లు పలుకుతారు. ఉదాహరణగా అచ్చట జరిగిన ఒక చారిత్రక సంఘటనను పరిశీలిద్దాము. మలేషియా దేశములోని సాబా రాష్ట్ర రాజధాని పేరు "కోటకిన బాలూ". ఈ నగరమును అంతకు మునుపు "జెసెల్ టన్"అని పిలిచే వారు. జెసెల్ టన్ 1899లో నిర్మించబడెను. సర్ ఛార్లెస్ కెసెల్ పేరు మీదుగా కట్టబడెను. ఆ పట్టణం అగ్నికి ఆహుతైనది. అచ్చటనే కొత్త నగరం పేరు కెసెల్ టన్ కు మారు "లిపి లిపి" అని వాడుకలోనికి వచ్చినది. 'లిపి'అంటే మలై భాషలో నిప్పు అని అర్థము. బహువచనముగా రెండు సార్లు "లిపి లిపి "అంటూ ప్రజలు ఆ సిటీని పిలిచారన్న మాట! |
Views (72) |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి