
Baala
జమిలి సందడి
అల్లరి పిల్లలు అపరంజి ఆటల పాటల జమిలి సందడి మంచి పనులను చేదాం! రండి! భావి భారత పౌరులమండీ! అటు ఇటు సాగెను ఆమని అందున కులికెను బృందా వని రవ్వంత ఆపి బాతాఖానీ చేదాం మనము తోట పని విత్తులు, నారులు నాటుదము చిట్టి మొలకలు మొలిచేను మొలకలు మొక్కలుగా మారి , జగతిని మలుచును కేరింతల సందడి మొలకా!,మొక్కా! లతలూ! తరువులు! చిగురాకులు, మొగ్గలు తొడగండీ! కొమ్మల్లారా! పూలు పూయండి! వనదేవత ద్వారపు తోరణమ్ములు మీరేనంటూ,మరువకండి! మరి తాత్సారములను వదలండీ! |
Views (42) |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి