Chitra Varta
వి.ఐ .పి. అంటే !!
తెలుగు సినీ ప్రపంచానికి తన అద్భుత హాస్య నటనతో నవ్వులను పంచి ఇచ్చిన నటుడు కీర్తిశేషుడు రాజబాబు ఇష్టా గోష్టిలో తమ పాత జ్ఞాపకములను నెమరు వేసుకునే వారు. VIP అనే పదానికి పొందికగా అందించిన సరదా సరదా నిర్వచనం ఇది. "వి.ఐ .పి. అంటే 'వి' అనగా వడ, 'ఐ' ఇడ్లీ, 'పి'అన్నచో పొంగల్." మద్రాసులోని (నేటి 'చెన్నై') పాండీ బజారులో చిన్నా చితకా వేషాల కోసం స్టూడియోల చుట్టూ ప్రదక్షిణాలను చేసిన రోజులలో, హోటళ్ళలో ఈ విఐపిలతోనే కడుపులను నింపుకుని, పార్కులోని చెట్ల క్రింద కాలక్షేపం చేసే వారు సత్యనారాయణ, వంగర, కాకరాల మున్నగువారు. అలాగే ఆ లిస్టులో రాజబాబు కూడా ఉన్నాడు. అదృష్టవశాత్తూ చాలా లేటుగానైనా సినిమాలలో మంచి పాత్రలు లభించి, తమ నటనతో ప్రేక్షకుల చేత నీరాజనాలందుకున్న నటులలో రాజబాబు ఒకరు. |
'''''''''''
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి