నటనల లీలలు
పద గతి ఇది-స్వర లయ మది ముదమతి గొని, వరమీయమనీ నీ చరణ శృతి చప్పుడు విని గప్ చుప్ గా దాగేనని ఎటనో అని "మా మురిపాల బాల కన్నయ్యదే కదకఈ ఉనికి"అనీ సవ్వడి తరి 'ఇవ్విరి వని' విచ్చేసిన అగణితమౌ వనితలదీ బహు సందడి దడబిడగా గడ బిడ ఇది! లే జవ్వని మువ్వల జడి-గువ్వల సడి చిలకల,శుక 'కిళి కిళి'- చివురుల ఒడి కిల కిల మని మరి మరి మరి ఒలికిన తఱి నిన్నటి దాకా -మౌనాంకిత బృందా వని! నే్డేమో నిలువెల్లా సౌదామిని ఇలాగిలాగీలాగున గిలిగింతలు ఈ ఇలకు! అహహాహాహా! ఆహాహాహా ! అది కని,కని చకితంబై-యామినిలో యమునా నది తరగలపై 'వెన్నెల చలి కిరణమ్ముల కలముల'తో వ్రాసెనులే నీలి నింగి నవ్య లాస్య విలాస లాస హావ భావ నాట్య చలన నర్తన లయ ఝళం ఝళన ఘటిత ఘటన నట వేదము! శ్రీ బాల కృష్ణ!నీ క్రీడా సంరంభము మాకందిన పారిజాత మకరందము ఇల, భక్త కోటి కొసగినట్టి సాహితీ కల్ప తరుల సౌరభములు! ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; (చేతన -సెప్టెంబరు 2007 ప్రచురణ) |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి