21, ఏప్రిల్ 2009, మంగళవారం

గ్రూపు ఫోటో

Baala

గ్రూపు ఫోటో


అక్కలార! అమ్మలార! 
బొమ్మరిల్లు మాఇంట! 
వడి వడి జడి సందడితో 
రారండీ! వేడుకగా 
ఫొటో దిగుదా మించక్కా! 

బంగరు సింహాసనాలు రెండు 
మొదటి వరుసలోన ఆసీనులైరి 
అమ్మ, నాన్న 
సంతోషపు సిరి! సిరి! 

వెండి కుర్చీలను వేసి ఉంచామండీ! 
అక్క, చెల్లెళ్ళార! 
అన్నదమ్ములార! 
కూర్చోండీ! బుడి బుడి! 

ఇది కీలు గుర్రము ! 
ఛల్ ఛల్ ఛల్ 
చలాకీగా ,లోకమంత 
చుట్టొస్తా చిటికెలోన! 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...