Telusaa!
"ఓం"
"అ", "ఉ","మ"కారముల కలయికయే"ఓం"కారము. "అ"కారము రంగు ఎరుపు."ఉ"కారము రంగు నలుపు."మ"కారము రంగు తెలుపు. ఈ మూడింటికిగల "శక్తి"స్వరూపాలు "అ"కు" పీత శక్తి", అంటే బంగారు వర్ణము, ఈ శబ్దమునకు అధిదేవత బ్రహ్మదేవుడు. "ఉ"కు నలుపు రంగు, శ్రీ విష్ణు మూర్తి అధి దేవత, శక్తి"విద్యున్మతి అనగా ఇది మెరుపు తీగలాగా ప్రకాశించు చున్నది. "మ" తెలుపు వన్నె, శక్తి "శుభాభ", ధవళ కాంతితో భాసించుచుండును.అధి దేవత "రుద్రుడు" 1028సార్లుఋగ్వేదములో"ఓం"శబ్దము ప్రయోగించబడినది. అష్టోత్తరములు, సహస్ర నామావళి, సమస్త పూజా కార్యక్రమములలో "ఓం" అనే "ప్రణవ నాదము"తప్పని సరిగా ఉపయుక్తము అగుచున్నది. కోట్లాది కోవెలలలోనూ, వివాహాది శుభ కార్యములలోనూ, పండుగలు, నోములు, వ్రతాదులలోను క్రీస్తు పూర్వము నుండీ ఈ ఓంకార నాదం అసిధారావ్రతము వోలె, అవిరళముగా వాడుకలో ఉన్నది. వేదపాఠశాలలలో నిరంతరమూ శ్రవణానందంగా వినిపిస్తూనే ఉంటూన్నది, ఈ పవిత్ర "ఓం"నాదము. ఈ లెక్కన ప్రపంచంలో కోటి కోటి కోట్లాదిమార్లు ఉచ్చారణలోఉపయుక్తమై ఉన్నది కదా! "గిన్నీస్ బుక్'"రికార్డులలోనికి ఎక్కవలసిన విశేషము అనేఅంశము నిర్వివాదంశమే కదా!. |
Views (67) |
1 కామెంట్:
gunnis book raka mundu , adi uniki lo lekapoina tarvata omkaaram untadi..gunnis book enduku daniki?
కామెంట్‌ను పోస్ట్ చేయండి