23, ఏప్రిల్ 2009, గురువారం

ఆకాంక్షఆకాంక్ష

By kadambari piduri, Aug 3 2008 2:09AM

శృతి మురిసిన, ధృతి పెరిగిన 
హృది తనిసిన కావ్యంబై 
భువి పాడిన, దివి చూచిన 
రవి తలచిన రాగంబై 

ఝరి పొంగిన, విరి విరిసిన 
ఫణి ఊగిన నాట్యంబై 
ధర తెరచిన అధర పదమై 
ద్యుతి కొలిచిన క్రాంతి పథమై 
దిశ కొలిచిన భావ హృదియై 

తెలి కిరణము విసరునట్టి హరి విల్లై 
కవి కజ్జల బిందు నృత్యమీ పగిదిని 
పుడమి యందు పులకలెత్త 
నవరస (స్యందిత) రంగ వేదికల పయిన 
అనవరతము"కవి మౌనీంద్రు"ని 
ధ్యానాంతరాళములయందున నర్తనమై 
తాండవమై నట్టువాంగ శృంగోత్తుంగమ్మై 
నీలాంబర పర్యంతము, ఎగసి ఉప్పొంగవలెను! 

మరల మర
ల వర్షితమై 
కళా
ప్రకృతిగా ఇలాతలము 
హర్ష మంద 
హాసమ్ముల ప్రతికృతిగా 
రసజ్ఞుల హృదయ స్వర్ణ మందిరముల 
 సాక్షాత్కరించి, 
                     తేజరిల్ల వలెను


'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''