ఆమనికే ఉల్లాసం
కుందన బొమ్మలు బాల బాలికలు వచ్చేశారని సరగున వచ్చెను ఈ వని ఆమని కొమ్మలు ,రెమ్మలు ఆయెను నేడు పూవుల, ఫలముల రంగుల డోలలు ! పుప్పొడి సొగసుల తోటి వెన్నెల దోస్తీ కట్టినది చేయి కలిపినది ఉదయపు కాంతి పచ్చ పచ్చనీ తరువుల్లారా! వింటారా? మా విన్నపములను! వెలవెలబోయే వెదురు కరలు మీ పూవుల తావిని కోరేను అవి గాలి ఊసులకు రాగం నేర్పే వేణువులై విలసిల్లేను |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి