17, ఏప్రిల్ 2009, శుక్రవారం

చిన్ని బంగరు తోట!


స్వప్న వాటికలోన 
చిన్ని బంగరు తోట! 
చైత్రాలు పూసాయి 
ఇట; 
చిత్రాలు నవ్వాయి! 
నవ వసంతాలన్ని 
నెమ్మ నెమ్మదిగా 
కను తెరచి చూసాయి 
హేమంత కన్యకలు 
నాట్యాలు ఆడాయి 

గ్రీష్మాల వీపుపై 
భద్రంగ కూర్చుండి 
తొలకరులు వచ్చాయి 
వన దేవతలకు నేడు 
వేడుకల సందడి 

అన్ని ఋతువులలోను 
శరత్తులై వెన్నెలలు 
ఈ తోట పరుపుపై 
మెత్తగా, హాయిగా పవ్వళించినవి 
Views (44)''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 5

అధ్యాయ శాఖ ;- 30 A ;-  తాటాకుల కవిలె కట్ట సేకరణ ;; ;           లేఖక్ 1 ;- ఇందాక వస్తుంటే - వీరకుడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు, ఎవరినో!?  ల...