2, ఏప్రిల్ 2009, గురువారం

తలంబ్రాలు



తలంబ్రాలు
'''''''''
(కావ్యములలో వర్ణనలు)
'''''''''''''''''  

చిలుక పురోహితుండగుచు ,చెంగట నుండగ సిగ్గు పెందెరల్ ;;;
తొలగగ త్రోచి, బంధు గతి తోరపు కోర్కులు సందడింపగా ;  
తలపు లతాంగి కన్న మును తాన కనుంగవ దోయిలించీ చూ ;
పుల ' తలబ్రాలు పోసెన్ నృప పుత్రునిపై విరహాగ్ని సాక్షిగా. 


''''''''''''''''''''''''''''''''''''''''''''''
శ్రీ శ్రీ కృష్ణ దేవ రాయలు ఆస్థానములో,
భువన విజయము"లోని అష్ట దిగ్గజములలో ఒకడు 
మాదయ గారి మల్లన. ఈయన రాసిన "రాజ శేఖర చరిత్రము " పాండితీ ప్రకర్ష"కు నిలువెత్తు నిదర్శనము. రాజ శేఖరుని ముద్దుల చిలుక పురోహితుడు.
ఆ శుక బ్రహ్మ చెంత నిలచి పెళ్ళి కార్యక్రమాలను జరిపిస్తూన్నది.
పెళ్ళి కూతురు కాంతిమతి "విరహాగ్ని" సాక్షిగా తన చూపులనే తలంబ్రాలుగా పోసినది. '''''''''''

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...