26, ఏప్రిల్ 2009, ఆదివారం

అందమెపుడు కావ్యమే !!!


అందమెపుడు కావ్యమే ఔతున్నది కదా! ;;;;;;
''''''''''''''''''''''''''''''
కొండ గాలి వీచింది
పాల పిట్ట అఱచింది 
ఎగిరే పక్షుల గుంపుకు 
మబ్బు దారి చూపినది. 

ఎటకో చెదిరే మొయిలుల,
మెరుపు దారమున చేర్చి  
వర్ష హారమును చేసిరి 
హర్షాతిరేకమున దివ్యులు.  

రేయి పల్లకీలోన  
జాబిల్లి వెడలి పోయినది. 
తొలి పొద్దు విచ్చేసెను, 
సంబరాలు వచ్చేసెను.
వానొచ్చి వెలసినది
పుడమి తడిసి,మురిసినది. 
కృతజ్ఞతా భారముతో 
వర్ష బిందు మౌక్తికముల  
నిలకు ఒసగు బహుమతులుగ
హరిత పూర్ణ వృక్ష తతి. 
కొమ్మ గూళ్ళ నుండి 
కూనలు తొంగిచూచు చున్నవి. 
తడిసిన రెక్కలు  
తప తప విదిలించు కొనును విహంగములు. 
పైరు మడుగులలొ కొంగలు 
పచ్చల హారముల 'రవ్వలూ.  

"అందమెపుడు కావ్యమగును."
హన్నన్నా! 
కాకుంటే,నా ప్రేమను 
సృష్టి కర్త ఎటుల పొందు!?!

'''''''''''''''''''''''''''''''''


వెన్నెల రథము



Baala

వెన్నెల రథము

బాల నవ్వుల ముత్తెపు సరములు
కిల కిల నగవులు నవ రత్నములు //


పాపకు చంద్రుడు బంగారు 
అందుకె ఆయెను వెన్నెల తేరు //


కారు చీకటిని నింగికి సౌరు
నువు లేకుంటే బేజారు // 


వెన్నెల రధమున ఊరేగుతు నువు
పున్నమి నాటికి రావయ్యా!!
నీ సొంతం ఇక -

             పిల్లల హోరు, హుషారూ//


Views (60)




కవితా కన్య

కవితా కన్య ;;;;
''''''''''

"నైవ వ్యాకరణజ్ఞ మేతి పితరం,న భ్రాతరం తార్కికం ;
దూరాత్ సంకుచితేవ గచ్ఛతి పునశ్శుండాలత్ ఛాందసాత్;
మీమాంసా నిపుణం నపుంసక ఇతి జ్ఞాత్వా నిరస్యాదరాత్ ;
కావ్యాలంకరణజ్ఞ మేవ కవితా కన్యా వృణీతే స్వయం."


తాత్పర్యము:::::: 
'''''''''''''

"కవిత" అనే కన్యకు వ్యాకరణ వేత్త తండ్రి వంటి వాడు;
కనుక, అతనిని ఆమె అభిలషించదు.
తార్కికుడు సోదరసమానుడు,కావున ఆతనిని అంగీకరించదు.
ఛాందసుడు(=వేదవేత్త)నుంచి,ఏనుగు నుండి వైదొలగి నట్లుగా,
తప్పుకొని పోతుంది.
మీమాంసానిపుణుడు"నపుంసకుని"బోటివాడని తెలుసుకున్నదై,
ఆతని నుండిన్నీ,అనాదరణతో,తొలగును.

"కావ్యాలంకరణ వేత్త"నుమాత్రమే 
"కవితా కన్యక" స్వయముగానే వరిస్తుంది."
'''''''''''''''''''''''''''''''''' 

ఈ శ్లోకముపైన నా అభిప్రాయము ;;;;; ''''''''''''''''''''''''''' ఇది ప్రాచీనోక్త శ్లోకము. ఈ భావముతో.......
ఈ "బ్లాగిత్రి" ఏకీభవించుట లేదు. మనము నిత్యమూ మాట్లాడే భాష ,వాక్య నిర్మాణములో అంతర్లీనముగా వ్యాకరణము ఒనగూడే ఉంటుంది. అలాగే,ఇతరులతో సంభాషించేటప్పుడు పరిస్థితులను,సమకాలీన రాజకీయ,సంఘ,ప్రజా జీవనాది అనేక అంశాలను మనకు తెలీకుండానే సమన్వయ పరచుకుంటూ,మసలుతాము;మరి తర్క మీమాంసాది అంశాలు ప్రభావితం చేస్తూన్నాయని అంగీకరించ వలసినదే కదా! ఛందో శృంఖలాలను నేటి కవిత్వం త్రెంచి,నడుస్తూన్నదా? కానే కాదు; గమనించండి,అనేకులు,ప్రాసకు,ముఖ్యంగా అంత్యానుప్రాసకూ ప్రాముఖ్యతను ఇస్తూనే ఉన్నారు:అందు మూలంగా ,అనుకోకుండానే ఒక లయ,ఒక తూగు కవితా,కావ్యాలకు కలుగుతున్నాయి. కొన్ని వేల సంవత్స్రాల సాహిత్య కృషి అనంతరమే.......... తమకు ముందు ఉన్న కావ్యాలను పరిశీలించిన మేధావులు,"పిండిత మధు సారమును" క్రోడీకరించి,"లక్షణ గ్రంధములుగానూ, అలంకార శాస్త్రాలుగానూ" వెలువరించరు. అలాగే,ఈ నాటి కవిత్వములోని అంతర్లీనముగా ఉన్న "ఛందస్సును"గురించి పరిశీలనా గ్రంధాలు అతి త్వరలోనే,సమీప భవిష్యత్తులో ,భాషా శాస్త్ర్ వేత్తల నుండీ,భాషాభిమానుల నుండీ గ్రంధరూపమున లోకానికి అందుతాయని, "నేను "నమ్ముతున్నాను.
''''''''

"జో"కుల పతి!

Pramukhula Haasyam

"జో"కుల పతిని!


నడిమింటి వురఫ్ ఉపద్రష్ట గోపాలచక్రవర్తి గారి సిక్స్టీ పూర్తి, 
అదేనండీ, షష్టి పూర్తి వేడుకలు జరుగుతున్నాయి.

 ప్రసాదరాయ కులపతి
 (ప్రొఫెసర్ ఆ తర్వాత కుర్తాళం స్వామిగా మారారు
 శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారుగా ప్రసిద్ధి గాంచారు.)వచ్చారు. 

గోపాలశాస్త్రి ఇలా చమత్కించారు

 "ఆయన కులపతి అయితే నేను "జో"కుల పతిని"

Views (132)

Kovela


కనుగొనిన కాంతి!

(పల్లవి)
శ్రీనివాస!నీ రూపము - చిద్విలాస రమణీయము!
కమనీయముగా శోభిలు - దివ్య దీప్తి తేజము //

(అను పల్లవి) 
నీ ఆధీనములో విశ్వము _ ఆనందాహ్లాద భరిత
రస మయమౌ చిత్రము! -వర్ణోత్సవ లేఖనము ! //

1) భావము ఉన్నది - గోచరమ్ము అగుచూ!
అనుభవమున్నది - ద్యోతకమ్ము అవుతూ! //
ఉండీ, ఉండీ :
నిశి వలువల _కౌస్తుభ ; 
మణి ద్యుతి జిగేలు మనును // 

2) జ్ఞానము ఉన్నది - గోచరమ్ము అవుతూ!
విజ్ఞానము పరిధి - విస్తృతమ్ము అవుతూ
ఉండీ ఉండీ 
మసక తెరలలో -అద్భుత 
కాంతిని కను గొన్నవి నయనములు! //

Views (88)





Telusaa!

ఈ లిపి మన లిపి కాదు!

మలేషియాలో వ్యవహరించబడునది "మలై భాష". 
ఈ భాషలలో ఏక వచన పదము మాత్రమే ఉన్నాయి. 
ఏకవచనముతో పాటు 
వేరేగా బహువచనమును చెప్ప వలసివస్తే 
అదే మాటను రెండు సార్లు పలుకుతారు.

ఉదాహరణగా 
అచ్చట జరిగిన ఒక చారిత్రక సంఘటనను పరిశీలిద్దాము. 
మలేషియా దేశములోని సాబా రాష్ట్ర రాజధాని పేరు "కోటకిన బాలూ". 
ఈ నగరమును అంతకు మునుపు "జెసెల్ టన్"అని పిలిచే వారు. 
జెసెల్ టన్ 1899లో నిర్మించబడెను. 
సర్ ఛార్లెస్ కెసెల్ పేరు మీదుగా కట్టబడెను. 
ఆ పట్టణం అగ్నికి ఆహుతైనది. 

అచ్చటనే కొత్త నగరం పేరు కెసెల్ టన్ కు మారు 
"లిపి లిపి"
అని వాడుకలోనికి వచ్చినది.
'లిపి'అంటే మలై భాషలో నిప్పు అని అర్థము. 
బహువచనముగా రెండు సార్లు "లిపి లిపి "అంటూ 
ప్రజలు ఆ సిటీని పిలిచారన్న మాట!

Views (72)

జమిలి సందడి


Baala

జమిలి సందడి


అల్లరి పిల్లలు అపరంజి
ఆటల పాటల జమిలి సందడి
మంచి పనులను చేదాం! రండి!
భావి భారత పౌరులమండీ!

అటు ఇటు సాగెను ఆమని 
అందున కులికెను బృందా వని
రవ్వంత ఆపి బాతాఖానీ
చేదాం మనము తోట పని

విత్తులు, నారులు నాటుదము
చిట్టి మొలకలు మొలిచేను
మొలకలు మొక్కలుగా మారి ,

జగతిని మలుచును 
కేరింతల సందడి

మొలకా!,మొక్కా! లతలూ! తరువులు!
చిగురాకులు, మొగ్గలు తొడగండీ!
కొమ్మల్లారా! పూలు పూయండి!
వనదేవత ద్వారపు తోరణమ్ములు

మీరేనంటూ,మరువకండి! మరి
తాత్సారములను వదలండీ!
Views (42)

దువ్వనా బట్టతలను!

Pramukhula Haasyam

దువ్వనా బట్టతలను!


జవహర్ లాల్ నెహ్రూ 
అమెరికాలో పర్యటిస్తూ 
మార్గ మధ్యములో 
ఒక స్కూలు వద్ద ఆగారు. 
విద్యార్ధులతో సరదాగా మాట్లాడుతున్నారు.

 ఆ బాలురిలో ఒక స్టూడెంట్ 
దిగాలుగా, డీలా పడిఉన్నట్లుగా ఉన్నాడు. 
హెడ్ మాస్టారు 
" ఆ పిల్లవాడు అంతేనండీ!
ఎప్పుడూ ,బేలగా, విచారంగా ఉంటాడు."అన్నాడు. 

నెహ్రూ రవ్వంత యోచించాడు.
 అంతే! జేబులోంచి దువ్వెనను తీసి దువ్వుకోసాగాడు.
 "బట్ట తల"ను దువ్వుకొంటూన్న ఆసామీని చూడంగానే 
ఆ కుర్రాడికి నవ్వు ఆగలేదు.
ఆ బాలుడి బెరుకుతనానికి కారణాన్ని సముదాయిస్తూ ,
అడిగి తెలుసుకున్నాడు చాచా నెహ్రూ!

అతగాని సమస్యా పరిష్కారానికి 
తగు సూచనలను H.M. కు ఇచ్చాడు భారతదేశ ప్రధాని. 
పిల్లల నవ్వులూ, కేరింతల మధ్య
 వీడ్కోలు తీసుకుని ముందుకు సాగాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ .

Views (94)

25, ఏప్రిల్ 2009, శనివారం

నారద పంచ రాత్రము


"నారద పంచ రాత్రము";;;;;;; 
'''''''''''''''''  
(మహిమాచరణుడు తెలిపినది)
"ఆరాధితో యది హరిస్తపసా తతః కిం ;  
నారాధితో యది హరిస్తపసా తతః కిం ; 
అంతర్భి ర్యది హరి స్తసా తతః కిం :  
నాంతర్బహిర్యది హరి స్తపసా తతః కిం ; 


"విరమ విరమ బ్రహ్మన్ కిం తపస్యా సువత్సా ;
వ్రజ వ్రజ ద్విజ శ్రీఘ్రం శంకరం జ్ఞాన సింధుం ;
లభ్హ లభ హరి భక్తిం వైష్ణవోక్తాం సుపక్వాం ;
భగ నిగడ నిబంధ చ్ఛేదనీం కర్తరీం చ."


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

సత్యమేవ జయతే !

సత్యము విలువ ;;;;;
''''''''''''''
"సత్యమేవ జయతే ;
సత్యేన పాంధా వితతో దేవ యానః ;
యేన క్రమాంత్యా ఋషయోహ్యాప్త కామః ;
యాతా తత్ సత్య్స్య పరమం నిధానం."


'''''''''''''''''''''''''''''''''''''''

24, ఏప్రిల్ 2009, శుక్రవారం

నందమూరు (ఉంగుటూరు) ;శోభనాద్రి;విశ్వనాథ సత్యనారాయణ

''''''''''''[ViswanathaSatyanarayana.jpg]


       నందమూరు (ఉంగుటూరు) ;   

        By kadambari piduri   

విశ్వనాథ సత్యనారాయణ తెలుగు వారికి గర్వ కారణమైన పండితుడు;
చిత్రంగా అనేక విమర్శలకు, ప్రశంసలను పొందిన మహా కవి. 
గాంధీజి ఉద్బోధించిన "సహాయ నిరాకరణోద్యమము"లో పాల్గొని ,
తన ఉద్యోగాన్ని వదులుకున్న "మాతృ దేశ స్వాతంత్ర్యాభిలాషి ఈయన"
అని చాలా మందికి తెలియదు. 

ఈయన తల్లి దండ్రులు పార్వతమ్మ, శోభనాద్రి. 
కృష్ణా జిల్లా నందమూరులో ( అనగా నేటి ఉంగుటూరు మండలము ) ,
1895లో సెప్టెంబరు 10వ తేదీన 
(మన్మథ నామ సంవత్సరములో, భాద్రపద బహుళ షష్టి రోజు)
 శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జన్మించారు. 

తండ్రి శోభానాద్రి భక్తాగ్ర గణ్యుడు.
 సాధారణముగా ,తల్లి దండ్రులు
 'తమ పిల్లలలోని పండిత్య ,లలిత కళాది ,విజ్ఞాన అంశాదులలో గల ప్రజ్ఞను
 వారి బాల్యములోనే గుర్తించ లేరు 

కానీ శోభనాద్రి,
 తన కుమరుడు 'భవిష్యత్తులో మంచి పాండిత్యమును ఆర్జిస్తాడని" గుర్తించారు. 
. కనుకనే " తన పుత్రుడు వ్రాయ బోవు వ్రాయ బోవు 
మహా కావ్య కృతిని ఈశ్వరునికే అంకితము చేసెను." 
శోభనాద్రి భవిష్యత్తును అవగాహన చేసుకోగల మహా ద్రష్ట "
అని ఈ సంఘటన వలన తేట తెల్లమగుచున్నది. 
శ్రీ మద్రామాయణ కల్ప వృక్షమును
 " తన తండ్రి కోరిక ననుసరించి" ,
"నీహార రుక్ శ్రీ మంతంబయి పొల్చు,
 మహా తేజో మూర్తి యగు విశ్వేశ్వరునకే " అంకితము చేసెను. 

శోభనాద్రి కర్మ యోగి ఐన పరమ భక్త శిఖా మణి. 
నందమూరులో పరమేశుని నిలిపి, నిష్కామముగా గడిపిన ధన్యుడు , 
మహోన్నత జీవన పథగామి శోభనాద్రి .

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత
1971లో ఆయన "రామాయణ కల్పవృక్షము"నకు,
జ్ఞానపీఠపురస్కారాన్ని అందించినపుడు
సన్మాన పత్రంలో ఇలా వ్రాయబడింది
As a Poet of classic vision and virility,
 as a novelist and play writer of 
deep insight and impact, 
as an essayist and 
literary critic of force and felicity,
 and as a stylist of rare "range"
 Mr. Satyanarayana has carved for himself 
a place of eminence
 amongst the immortals of Telugu Literature.
 His ceaseless creativity and versatility
 have kept him in the 
forefront of contemporary Telugu Literary Scene.

  సాహితీ సంపదని మనకి
  వారసత్వం గా అందించి
 1976 అక్టోబరు 18 పరమపదించారు.


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''





ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...