4, డిసెంబర్ 2008, గురువారం

మేఘ బృందము

"ఆకాశంబున మేఘ బృందము ఘనంబై,సన్నమై ,దీర్ఘమై :
ఏకంబై, బహు రూపమై అణగునట్లే, దేవు గర్భంబులో :
లోక శ్రేణి జనించుచున్ మెలగుచున్ లోపించు, నా దేవు సు :
శ్రీ కాంతున్ హరి గూర్చి యాగములు సేసెన్ నాహుషుండిమ్ములన్ ."

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

(బమ్మెర పోతన రాసినట్టి "భాగవతము"లోని పద్యము ఇది. )

భావము :::::
,,,,,,,
నహుషుని తనూజుడైన "యయాతి " మహారాజు ,
శ్రీ మన్నారాయణునిపైని భక్తితో అనేక యజ్ఞములను చేసెను.
మబ్బులు అనేకానేక రూపములలో గోచరించు చుండును; సన్నముగాను ,దట్టముగాను,పలుచగాను, దీర్ఘముగాను ఏకంబుగాను,
బహు రూపముగాను భాసిల్లుచుండును;కాస్సేపు కనబడును,
కొంత సేపు మాయమగును .
ఆలాగుననే , "శ్రీ మన్నారాయణుడు" అనే "నేపథ్యము"లో నుండి
ఎన్నో లోక శ్రేణి ఉద్భవిస్తూన్నవి;
అలాంటి శ్రీ కాంతుని గురించి నాహుషుడు యాగములను చేయు చుండెను.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...