12, డిసెంబర్ 2008, శుక్రవారం

రెట్ట మత శాస్త్రము , వ్యవసాయము, ప్రకృతి గురించి ప్రాచీనులు

రెట్ట మత శాస్త్రము :::::
''''''''''''''''''''
వ్యవసాయము, ప్రకృతి గురించి ప్రాచీనులు
అనేక విషయములను పద్య రూపములో అమర్చి,
తమకు భవిష్యత్ తరాల వారికి అందించిన అద్భుత విజ్ఞాన కృషి సంపద ఇది.
''''''''''''''''''''''''''''''''''''''''''''''
"పరగ నశోకంబు ,బ్రహ్మ మేడియు పూచి :
కాచిన సస్యసం - ఘము ఫలించు :
కపురంపు టనటులు - కాచ నల్లవిసె పై :
రాదిగా కృష్ణ ధా-న్యములు ప్రబలు :
బాగు మీఱగ చింత- పాలయు కరి వేము :
కాచిన వ్రీహి వ-ర్గంబు మించు :
వింతగా తుమికి చె-ట్టంతయు కాచిన :
యవ నాళ సమృద్ధి - యగును మిగుల :


నెలమి ములు మోదుగలు కాయ నలరు గొఱ్ఱ :
మొల్ల పూచిన ఆవాలు మొల్ల మగును :
రావి గాచిన జనుమును, ప్రత్తి వొడము :
సత్యమింతయు వేంకట క్ష్మా తలేంద్ర."

'''''''''''''''''''''''''''''''''''''''''''''''
నేదునూరి గంగాధరం మొదలగు ఆర్ష సాహితీ జిజ్ఞాసువులు
ఈ ప్రాచీన సంపత్తిని, పాఠకులకు అందించుటకై ఎంతో కృషి చేసారు.

''''''''''''''''''''''''''''''''''''''''''''''''

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...