3, డిసెంబర్ 2008, బుధవారం

తగువు తీరినది !::::::::::

తగువు తీరినది !::::::::::
,,,,,,,,,,,

"భ్రమరక మనోహరం బగుట "పద్మమ"గును :
తారకా హృద్యమగుట "సుధా నిధి " అగును :
రెంటి జగడాలు " మోమున అంటి యుంట :
"అబ్జ ముఖి " అంట లెస్స ఈ అలరు బోడి ."
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

చంద్రుడు, తామర పూవు సహజ వైరులు.
ఇరువురినీ సంతసము కలిగించుటకై
సుభద్రా దేవిని " అబ్జ ముఖి " అని పిలుచుట మేలైన పద్ధతి.
సుభద్రను 'అబ్జ ముఖి 'అనాలని పద్మమూ , ముఖి ' అని పిలవాలని చందురుడూ వాదు లాడు కుంటున్నారు.
కవి "అబ్జ ముఖి "అనే పేరిడి, వారి తగువును తీర్చాడు.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
అబ్జము=నీటిలోన జనించినది= పద్మము,జాబిలి :
జగడాలు= వైరములు,పోరు :
జగ=శ్రేష్ఠమైన ,,, డాలు= కాంతి :
భ్రమరకము =ముంగురులు / తుమ్మెదలు :::
తారకా= నక్షత్రాలు/ కంటిలోని నల్ల పాపలు (కనీనికలు )

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...